Monday, September 30, 2019

గురువుగారి వనభోజనం :: -- పరమానందయ్య శిష్యుల కధలు(Paramanandaiah shishyula kathalu) - 5


పరమానందయ్యగారు ఒకసారి కార్తీకసోమవారంనాడు తన శిష్యులతో కలిసి వనభోజనానికి అడవికి బయలుదేరారు. వారిని వంటలు చేయమని చెప్పి అతను మరియు తన భార్యా కలసి అలా వెళ్లారు. శిష్యులలో పెద్దవాడు లేచి ఎవరెవరు ఏమి పనులు చేయాలో చెప్పి, పురమాయించాడు.

వంట ప్రారంభమయ్యింది. వండే శిష్యుడికి సంగీతం అంటే వల్ల మాలిన అభిమానం. పొయ్యమీద బియ్యం పెట్టి తాళం వేస్తూ కూనిరాగాలు తీయడం మొదలు పెట్టాడు. ఇంతలో అన్నం కుతకుత అని ఉడకడం ప్రారంభం అయ్యింది. “ఓహో కుండ గూడా తాళం వేస్తుందే” అని అనుకుంటూ వంట సంగతి మరిచిపోయాడు. ఆ గుడగుడ మను శబ్ధం తన తాళానికి సరిపోలేదు. కోపం వచ్చేసింది, “తాళం తప్పుతుంది” అని నెమ్మదిగా చెప్పిచూశాడు, అయిన శబ్ధం అలానే వస్తుంది. చెప్పినా తాళం తన తప్పును సరిదిద్దుకోవటలేదు అని వళ్ళు మండి, ఒక దుడ్డు కర్రను తీసుకొని కుండ మీద ఒక్కటేశాడు. యికేముంది , కుండపగిలి అందున్న బియ్యం మొత్తం అంతా బూడిదపాలు అయిపోయాయి. కర్రల పొయ్యి తడిసిపోయి మొత్తం ఆరిపోయిది. “గుడగుడ శబ్దం కుండకు నష్టం” అనుకుంటూ రాగాలు తీస్తూ పాడుకుంటా అక్కడి నుండి తప్పుకుంన్నాడు.

మరొకరు కూరగాయలు తేవడానికి పోయి “వంకాయ వాతం, బీరకాయ బలుపు, సొరకాయ జలుబు, కాకరకాయ వేడి” యిలా అన్నీ కూరగాయలను జబ్బులున్నాయని, కరక్కాయ ఒక్కటే సర్వరోగనివారిణి అని, మూడు కేజీల కరక్కాయలు కొనుక్కోచ్చాడు.

మరొకతనికి శకునాల పట్టింపు, అందుకని మామిడి ఆకులు తేవడానికి దూరంగా చెట్టు వద్దకుపోయి, ఎక్కిదిగబోయేంతలో ఎవడో వెనుక నుండి తుమ్మాడు. మరలా దిగబోతుంటే మళ్ళీ ఎవడో తుమ్మాడు. అంతే వాడు అక్కడే చెట్టు మీద ఉండిపోయాడు.

మరికొంతమంది శిష్యులు మజ్జిగ కొని రావడానికి అని ఊరిలోనికి వెళ్లారు. వారికెక్కడా మజ్జిగ దొరకలేదు. చివరికి ఒక ఇల్లాలు వారిమీద జాలిపడి “రండిబాబు మజ్జిగ నేను ఇస్తాను” అని అంది. శిష్యులందరు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె లోపలనుండి మజ్జిగ తెచ్చేంతలో వారిలో నొకడు, “యింత పొడుగు
కొమ్ములన్న గేదె చనిపోతే బయటకు తీసుకువెలటం ఎలారా? గుమ్మం పట్టొద్దు” అని, మరియొకడు “ఆ యిది చస్తే యిక్కడే గొయ్యి తీసి పూడిస్తే మంచిది” అని, మరియొకడు “కొమ్ములు కోసేస్తే చాలు” అని మాట్లాడుకుంటుంన్నారు. అంతే! ఆమెకు చిర్రెత్తు కొచ్చి “ఓరి మీ బుద్దులు ముందమొయ్య, మా గేదెలే చావాలని అంటారా?
అని చీపురుతో వారందరిని బయటకు గెంటేసింది.

రెండు గంటలు తరువాత ఆకలితో ఆనందముగా ఆరగిద్దామని గురువుగారు వచ్చారు. ఇంకేముంది! అందరు దిగాలుతో కూర్చోన్నారు. భార్యా
సమేతముగా వచ్చిన అతను, ఎందుకు యిలా ఉన్నారని అడిగాడు. ఒకొక్క శిష్యుడు ఒకొక్కటి చెప్పే సరికి ఏమిచెయ్యాలో తెలియక వారందరికి నాలుగు ఆక్షింతలు వేసి, అయోమయముగా ఆకలితో తిరిగింటికి ప్రయాణమయ్యారు.

No comments:

Post a Comment