ఒక సారి పరమానందయ్యగారు శిష్యబృందంతో సహా, ఒక స్వామివారి మఠానికి వెళ్ళి వారిని దర్శించుకొని వస్తున్నారు, వారు తిరిగి వస్తున్నప్పుడు మార్గ మద్యలో ఒక గ్రామంలోని పెద్దలు వారిని చూసి కలవడానికి వచ్చారు.
పరమానందయ్యగారికి వారు నమస్కరించి “అయ్యా! తమరు మా ఊరు వచ్చి చాలా కాలమయింది. మేము మీ పురాణాలు విని చాలా ఏళ్లుయిపోయింది. మళ్ళీ మీరు మా ఊరిలో పురాణం చెప్పాలి. మేము విని ధన్యులమవ్వాలి” అని వేడుకున్నారు.
గురువుగారు వారిని కాదనలేక అక్కడ ఆగారు. కార్తీకమాసంలో పురాణం విని ధన్యులమౌతామని భక్తులు కూరుతుంటే కాదనడం తప్పుకదా? పరమానందయ్యగారు మంచి పండితులు. ఆపైన చక్కగా పురాణం చెబుతారు. అందుకే వారికి రాజుగారి అభిమానంకూడా లభించింది. ఆ ఊరి వారింతకు మునుపు వీరి పురాణం విని ఉన్నారు. అందుకే వారిని వదిలిపెట్టలేదు. గురువుగారికి మరియు శిష్యులకి బస ఏర్పాటయింది. రాత్రి దేవాలయం ఎదురుగా ఉంన్న కాళీ స్థలంలో పురాణ శ్రవణానికి అన్నీ ఏర్పాట్లు జరిగాయి.
గురువుగారికి శిష్యులంటే వల్లమాలిని వాత్సల్యమూ మరియు అంతులేని అభిమానమూ. తన శిష్యులు పదిమంది చేతా పండితులు అనిపించుకోవాలి అని మరియు గొప్ప పేరు ప్రతిష్ఠలు గడించాలని వారి కోరిక. శిష్యుల చేతిలో తను ఓడిపోవాలని, శిష్యులు తనకంటే గొప్పవారు అవ్వాలియని ఆ గురువుగారి ఆకాంక్ష. అందుచేత శిష్యులకు ఒక అవకాశం ఇవ్వదలచి, వారిని దగ్గరకు పిలిచారు.
“పురాణం నేనే చప్పాలని ఏముంది? నా పిల్లలంతటివారు మీరు. మీరు కూడా రామాయణ, భాగవత, మహాభారతాలను నేను చెప్పగా విన్నారు వాటిని చదివినారు మరియు ఎన్నో శాస్త్రాలను కూడా అభ్యసించినవారే. కనుక గ్రామస్తులు ఏది కావాలంటే అది మీరు చెప్పండి. అలా అయితేనే మీకు పదిమందిలో గుర్తింపు వస్తుంది మరియు నాకు కూడా ఆనందం కలుగుతుంది” అని అన్నారు.
“ఓ అదెంత పని గురువుగారు? మీరు చెబుతుండగా పురాణం ఎన్నోసార్లు విన్నాం. అలా చెప్పడమేకదా? సరే చెప్పేస్తాం.” అని మహా ధీమాగా చెప్పి “ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, ఆ పురాణం సంగతి మేము చూసుకుంటాము” అని అన్నారు. రాత్రి అయ్యింది గురువుగారిని తీసుకు వెళ్లడానికి గ్రామస్తులు వస్తే, “నా శిష్యులు నన్ను మించినవారు, నా కంటే చక్కాగా పురాణం చెప్పగలరు” అని చెప్పి శిష్యులను వారితోపాటు పంపారు గురువుగారు.
అంతా సిద్ధమయింది. ఎప్పుడెప్పుడు పురాణం వింటామా అని గ్రామస్తులు అందరు ఆరాటంతో ఎదురు చూస్తుంన్నారు. ఒక శిష్యుడు వేదికమీదకొచ్చాడు, జనంకెసి చూసేసరికి అతనికి కాలు వణకడం ప్రారంభం అయ్యాయి, అంతటి చలిలోనికూడా ఒంటి నిండా చమటలు పట్టాయి, నాలిక తడారిపోయింది, మెదడులో శూన్యమేర్పడిపోయింది. చదివినది కానీ విన్నదికాని ఏది గుర్తుకురావటం లేదు.
నేను ఈ రోజు చెప్పబోయే విషయమేమిటో మీకు తెలుసా?” అని అడిగాడు. సభలోనివారంత తెలియదు అని చెప్పారు. “ఐతే తెలియని వారికేం చెప్పినా ఉపయోగముండదు.” అని తక్షణమే వేదిక దిగి వెలిపోయాడు.
మర్నాడు మరో శిష్యుడు వెదికేక్కాడు. జనాన్ని చూసేసరికి షరామామూలే. గజ గాజా వణుకు. గురువుగారు చెప్పినదిగాని విన్నదికగాని చదివినదిగాని ఏమి గుర్తుకురావటం లేదు.
“నేనీ రోజు చెప్పబోయే విషయమేమిటో మీకు తెలుసా?” అని ఈ శిష్యుడు కూడా గ్రామస్తులను అడిగాడు. నిన్న తెలియదు అంటే ఆ శిష్యుడు అలా చేశాడు అని, ముందుగానే అందరు నిర్ణయించుకొని కొందరు “తెలుసు” అని మరికొందరు “తెలియదు” అని అన్నారు. అపుడు ఆ శిష్యుడు “తెలిసి తెలియనివారికి చెప్పడం ఆ బ్రహ్మ తరంకూడా కాదు. ఒక పని చేయండి, మీలో తెలియనివాడు తెలిసినవాడిని అడిగి తెలుసుకోండి మరియు తెలిసినవారు తెలియనివారికి తెలియజేప్పండి” అని ఇతగాడు కూడా వేదిక దిగిపోయాడు.
మరుసటి రోజు గ్రామస్తులు అంతా కూడగట్టుకొని గురువుగారి దగ్గరకు వచ్చి, వారి గోడు వివరించుకున్నారు. జరిగినదంతా తెలిసిన గురువుగారు, వారికి పురాణం చెప్పడం రాకపోయిన వారు తప్పించుకొనడానికి కావలసిన తెలివితేటలు ఉంన్నందుకు సంతోషించి, ఆ గ్రామస్తులకు ఈ రోజు తానే స్వయముగా వస్తాను అని చెప్పి పంపివేశారు.
No comments:
Post a Comment