Tuesday, October 22, 2019

ఉండిపోరాదే.. ప్రేమ నీదేలే.. పార్ట్ 3 -- తెలుగు కథలు(Telugu Kathalu) - 60

 శ్రీలత కోసం పడిగాపులు కాస్తూ ఉన్న క్లాసులు వదిలేసి పాప దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది, నాతో పాటు రాజేష్ గాడు పక్కనే ఉన్నాడు, రాజేష్ గాడు నాతో నీ ప్రేమకు నన్ను బలి ఇచ్చేలా ఉన్నావు. ఇలా చదవకుండా వెధవ వేషాలు వేస్తున్న అని మా బాబుకి తెలిసిందో నాకు బ్యాండ్ బజావో అంటూ ఉండగా వాడిని దగ్గరకు తీసుకుని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా ఆ శ్రీలత నువ్వు నాకు ఎప్పుడూ కావాలిరా అంటూ ఉండగా అందుకే నందుగా నీకోసం ఈ పాట్లు అన్నాడు.
ఏమైందో ఏమో తెలియదుగాని శ్రీలత హడావుడిగా క్లాస్ నుండి బయటకు వచ్చింది. బయటకు వస్తూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడే ఉన్న మెట్ల మీద కూర్చుని ముక్కు ఎగరేస్తూ ఏడుస్తూ ఉంది. నేను ఏమి తెలియనట్టు తన దగ్గరకు వెళ్లి నాకు ఈత రాదు ఎక్కువ ఏడవకు మళ్ళీ కొట్టుకుని పోతాను అనగానే, ఒక్కసారిగా శ్రీలత కోపంగా చూసి కొడకా ఇంకొక్కసారి నా చుట్టుపక్కల కనపడ్డావో నీ బొక్కలు ఇరుగుతాయి అని చెప్పగానే. బొక్కలు తరువాత విరగ్గొడుదువు గాని ఈ కన్నీళ్లను కారణం ఏంటో చెప్పు అన్నాను.
అందమైన మొహంతో చక్కనైన పెదాలతో నీ పేరు ఏంటి అన్నది నందు అన్నాను, నందు నన్ను ప్రేమించవద్దు అని చెప్పిన నా క్లాస్ మెట్ తేజ వచ్చి నేను క్లాస్ లోకి వెళ్ళగానే ప్రపోజ్ చేసాడు, నేను వద్దు నాకు ఈ ప్రేమ నచ్చదు అని చెప్పిన వినలేదు. నా చేయి పట్టుకుని ఒప్పుకుంటావా ఒప్పుకోవ అని గట్టిగా అడిగాడు నాకు తిక్క లేసి ఒకటి గట్టిగా కొట్టాను వాడిని, అలా కొట్టానో లేదో వాడు సొమ్మసిల్లి క్రింద పడిపోయాడు లెగడం లేదు వాడు. చచ్చిపోయాడు ఏమో నందు మళ్ళీ పోలీసులు కేసులు అని భయం వేస్తోంది అనగానే. అమ్మనా బంగారం ఏమి ఎరగనట్టు వచ్చి ఏదో బాధతో ఏడుస్తున్నావు అనుకున్నా అని పద మీ క్లాస్ కి పోదాం అనగానే నేను రాను అని శ్రీలత అంటే బలవంతంగా తీసుకుని వెళ్ళాను.
బాబు తేజ ఇక లెగు అమ్మ డ్రామాలు ఆపేసి లేదు అనుకో మళ్ళీ నేను నా గ్యాంగ్ మొదటి నుండి కొట్టడం మొదలుపెడతాం అనగానే దెబ్బకు లేచి శ్రీలత అక్క ఏమి తింటున్నావు అంత గట్టిగా తగిలింది నువ్వు కూడ జాగ్రత్త నందు దాని చేతి దెబ్బ మామూలుగా లేదు అనగానే నవ్వుకుంటూ శ్రీలతని చూస్తూ ఉన్నాను.
శ్రీలత నన్ను పోరా నందు అని అంటూ నన్ను తోసేసింది, నేను మాట్లాడే ప్రతి మాట వింటూ నువ్వు మయాలోడివి నువ్వు మా లోకంలోకి రావద్దు అని నవ్వుతూ తోసేస్తుంది. శ్రీ బంగారం ఇక నువ్వు నన్ను ఎంత గట్టిగా తోసేసిన నా నుండి నిన్ను ఎవరు విడదీయలేరు అని అక్కడ నుండి వెళ్ళిపోయాను.
కాలనికి ఓపిక తక్కువ అనుకుంటా వేగంగా సాగిపోతుంది, శ్రీ బంగారానికి నా మీద కూడ ఇష్టం కూడ పెరిగిపోతుంది. తనని చూడని నిమిషం గుండె మీద ఎవరో బలంగా కొట్టినట్లు అవుతుంది అని అంటూ ఉండగా రాజేష్ గాడు వచ్చి నేను కాలేజీలో చాకుల ఉండేవాడిని చాకుని కాస్త బోకులా తయారుచేశావు, ఈ కాలేజి అయ్యే లోపు నన్ను కచ్చితంగా పోరంబోకు చేస్తావు అనగానే నవ్వుతూ నేను వెళ్లి నిజాలు భలే చెప్తున్నావు అని వాడి మొహం చూస్తూ నవ్వుతూ ఉన్నాను.
ఇంతలో మెసేజ్ వచ్చింది సందీప్ దగ్గర నుండి శ్రీలతకి హెల్త్ బాలేదు ఫీవర్ అని, సందీప్ గాడి లవర్ శ్రీలత ఫ్రెండ్ అందుకే మనకి ప్రతిదీ చేరవేస్తాడు. గ్యాంగ్ మొత్తం హాస్పిటల్ కి వెళ్లిపోయాం, నేను శ్రీలత దగ్గరకు వెళ్లి ఏంటి బంగారం ఒక మాట చెప్పవచ్చు కదా ఫీవర్ వచ్చింది అనగానే అరేయ్ ఏంట్రా మీ బాధ ఇక్కడ కూడ వదలవ నన్ను సందీప్ వీడిని ఇక్కడ నుండి పొమ్మను చెప్పు అనగానే సందీప్ గాడు నన్ను అక్కడ నుండి లాక్కుని వెళ్ళిపోయాడు.
నేను సందీప్ గాడితో అరేయ్ ఏంట్రా ఇది ఒకసారి ప్రేమగా మాట్లాడతాది ఇంకోసారి కోపంగా వెళ్లిపో అంటుంది. దీనికి ఏమి అయిందిరా మన కాలేజి హాస్టల్ ఫుడ్ తిని దీనికి పిచ్చి ఎక్కినట్టు ఉంది, అది నన్ను వెళ్లిపోమన్న ప్రతిసారి గుండె తల్లడిల్లిపోతుంది. ఒక్కసారి నాతో ప్రేమగా మాట్లాడమనురా అని నవ్వుతూ ఏడుస్తూ చెప్తున్న. సందీప్ గాడు వచ్చి ఒక హగ్ ఇచ్చి పద పోదాం అని హాస్పిటల్ కి వెళ్ళాడు. అరేయ్ నువ్వు బయట ఉండు మేము మాట్లాడేది విను అని నన్ను హాస్పిటల్ లో తను ఉన్న రూమ్ బయట కూర్చోమన్నాడు.
సందీప్ గాడు శ్రీలత దగ్గరకు వెళ్లి ఎలా ఉంది శ్రీ అనగానే బాగానే ఉన్నది సందీప్ అన్న అనగానే, సందీప్ గాడు శ్రీ తో ఎందుకు నందు ని దూరం చేస్తున్నావు ప్రతిసారి, వాడు ఏమి అంత చెడ్డవాడు కాదు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు అనగానే. శ్రీలత సందీప్ గాడితో అన్న ఇక్కడికి నేను వచ్చింది చదువుకోవడానికి మా నాన్న గారికి ఇవన్నీ ఇష్టం ఉండదు అన్న. నందు చాలా మంచి వాడు నాకు అతను అంటే మంచి అభిప్రాయం ఉంది స్నేహం వరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న ప్రేమ అంటే మాత్రం నా వల్ల కాదు అన్నయ్య అని చెప్పింది.
నేను వెంటనే లోపలకి వెళ్లి నీకు ప్రేమ వద్దు కదా నేను వద్దు కదా అని బలంగా అక్కడ ఉన్న గోడను కొట్టి, ఇదిగో డజను బత్తాయి కాయలు డజను ఆపిల్ పళ్ళు తీసుకుని ఇచ్చి శ్రీలత గారు మీరు బాగా చదువుకుని మీ అయ్య పేరు నిచ్చెన వేసి మరి నిలబెట్టండి అని చెప్పి. రేయ్ సందీప్ గా దీని విషయాలు ఇక నాకు చేరవేయకు అని రాజేష్ గాడితో వెళ్ళిపోయాను అక్కడ నుండి.
దీనెమ్మ కన్నీళ్ళు ఆగడం లేదు ఏడిస్తే బాగోదు అని కవర్ చేస్తూ రాజేష్ గాడితో మామా గుండె మనసు నొప్పిగా ఉన్నాయిరా అందుకే ఈ కన్నీళ్ళు అనగానే వెధవ వేషాలు వేయకు అది నిన్ను ఛీ కొట్టింది నాకు తెలుసు కానీ ఇక ఏడుపు ఆపు అనగానే. అరేయ్ దానికి నేను అంటే ఇష్టంరా రాజేష్ కానీ అది దాస్తోంది. నేను కలిసిన ప్రతి సారి చాలా ప్రేమగా ఉండేది ఈ మధ్యన దానికి తిక్క లేచింది నీ దిష్టి తగిలేసింది నా ప్రేమకు అనగానే. హ మరి మీ ప్రేమ మరోచరిత్ర మరి తాగుబోతు వెధవ అని నన్ను అని అక్కడ నుండి రూమ్ కి వెళ్లిపోయాం.
ఇక ప్రేమ దోమ లేదు అని అనుకుని చదువు మీద దృష్టి పెట్టాను. అమ్మ దీనెమ్మ పుస్తకాలు అన్నింటినీ బయటకు తీసాను ఏదో పురావస్తుశాఖలో బయట పడిన ఖలాకండాలులాగా ఉన్నాయి దుమ్ము పట్టి. వాటి మీద ఉన్న దుమ్ము శుభ్రం చేస్తూ రాయవాల్సిన రాతలు అన్ని రాస్తూ ఉన్నాను. ఒక వారం రోజులు బయటకు వెళ్తే ఒట్టు, రాతలు చదువులులో జ్ఞానం చేస్తూ ఉన్నాను. రాజేష్ గాడికి భయం వేసి నన్ను చూసి ఏమి మాట్లాడడం లేదు. నేను పుస్తకాలు అన్నింటిని చదివేస్తూ పరీక్షలకు సిద్ధం అయిపోతున్నాను.
వారం రోజులు తరువాత కాలేజీకి పోయాను, కాలేజీలో సంతోషంగా ఉండే నేను మూగబోయాను. ఆటలు పాటలు అంటూ సాగుతూ ఉండే నా జీవితంలో మొదటి సరిగా చదువు మీద దృష్టి పెట్టాను, ఎవరితో అయిన ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. నా ఊహలు నా మాటలు నా ఆశలు అన్ని ఒక్కసారి మ్యూట్ లోకి వెళ్లిపోయాయి. అలా నేను రాజేష్ గాడు క్యాంటీన్ లోకి వెళ్తూ ఉండగా శ్రీలత అక్కడే ఉండి అలానే చూస్తూ ఉన్నది. కాలం కలిసి రావడం లేదు అని నాలో నేను అనుకుని నా లంచ్ తినేసి క్లాసుకి పోయాను. దీనెమ్మ ప్రేమ దీనెమ్మ జీవితం అనుకుని పూర్తి సమయం చదువు మీద పెట్టాను.
అలా కాలం సాగుతూ ఉన్నది శ్రీలత మొహంలో నవ్వు మాయం అవుతుంది, ఎందుకు ఏమి అయింది అని అడగాలని ఉంది కాని మనసు మాత్రం వద్దులేర అని అంటూ నాకు నేను సర్ది చెప్పుకుని వెళ్ళిపోయాను. అదే రోజు ఒక మెసేజ్ వచ్చింది నా ఫోన్ కి మిస్ యూ అని, ఎవరు అన్నాను నా నెంబర్ లేదా నీ దగ్గర అన్నది. లేదు అండి ఎవరో చెప్పండి అనగానే పోరా మయాలోడ అన్నది. శ్రీ అనగానే అవును అన్నది ఎందుకు నువ్వు అలా అయిపోయావు పిచోడిలా మాసిన గడ్డం వేసుకుని మొహంలో నవ్వు లేకుండా అనగానే. నేను ఏమన్నా అసలు పోరా అన్నావు నన్ను పోయాను అందుకే అన్నాను. ఇక నన్ను వదిలి వెళ్లకురా అని అన్నది, నా మొహం పేరుకు ఇలా అజ్ఞానిలా ఉన్న నా ఆలోచనలు నీ దగ్గరే ఆగిపోయాయి నా మనసు నీ నీడలో తిరుగుతూ ఉన్నది. ఇప్పటికి అయిన కరుణించావు నన్ను అనగానే.రేపు ఇద్దరం కలుద్దాం అనగానే నేను ఆ మాట కోసమే చూస్తూ ఉన్నాను అనగానే, కలుద్దాం అని చెప్పి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను.
ఇద్దరం కలిసిన వెంటనే నన్ను శ్రీలత ఏరా నందు చదువు ఎక్కువ చదివేసినట్టు ఉన్నావు ఇలా బక్క చిక్కిపోయావు అనగానే, చదువు సక్కగా చదివినా నీ వల్ల తినలేకపోయాను నువ్వే బాగా గుర్తుకు వస్తున్నావు అనగానే. ఏంట్రా కొత్తగా మళ్ళీ నా మీద పడ్డావు అనగానే ఇక ఇది అంతా ఆపేయ్ లవ్ చేసుకుందాం అనగానే. అరేయ్ నందు లవ్ వద్దు మనం ఫ్రెండ్స్ లాగా ఉండి పెళ్లిచేసుకుందాం, అది లైఫ్ లో సెటల్ అయిన వెంటనే అని అనగానే. అమ్మని మొత్తానికి ఒప్పుకున్నావు అని స్నేహంగా ముందుకు సాగుతూ పోతున్నాం.
చదువులు అయిపోయాయి మాకు అందరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి, శ్రీలతకి నాకు రాజేష్ సందీప్ గాడికి అందరికి ఒకే చోట జాబ్స్ వచ్చాయి. ఒక సంవత్సరం జాబ్స్ చేస్తూ ఉండగా అన్ని అనుకూలంగా ఉన్న వేల ఒక పిడుగు లాంటి వార్త వచ్చి నన్ను చేరింది శ్రీలతకి అమెరికాలో పై చదువులకు సీటు వచ్చింది అని. నాకు ఒక మాట కూడ చెప్పకుండా అమెరికాకు వెళ్ళిపోయింది, సందీప్ గాడికి ఒక లెటర్ ఇచ్చి మరీ పోయింది అది నాకు ఇవ్వమని చెప్పి.దానిలో మనం కలుద్దాం త్వరలోనే అని చెప్పి వెళ్ళిపోయింది. దానికి ఎక్కువ చదువులు చదవడం ఇష్టం అనుకుంటా నన్ను వదిలి పోయింది అనుకున్న.
కానీ శ్రీలత పాప మామూలు తెలివి అయినది కాదు, నన్ను వదిలే రకం కూడా కాదు. నన్ను కూడా అమెరికాకి రమ్మని అడిగింది అది పోయి 6 సంవత్సరాలు అయింది, దాన్ని కలవడానికి నేను కూడ ఒక నెలలో పోతున్న అమెరికాకు హెచ్1బీ వీసా మీద. ఈ సారి మాత్రం దాన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్న, లవర్ లేదు అన్నాను కదా అది నాకు ఎప్పటకి లవర్ కాదు మంచి స్నేహితురాలు అని ఉన్న బీరు తాగేసి అలా పడుకునిపోయాను.
అలా కాలం కదులుతూ ఉండగా నేను అమెరికా పోయాను శ్రీలత పాప నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. లాగిపెట్టి ఒకటి పీకి ఇంకోసారి ఎటు అయిన చెప్పకుండా వెళ్లావు అనుకో గూబ పగిలిపోతాది మిలిగుడ్లు దాన అని చెప్పి హగ్ ఇచ్చి అక్కడే రాజేష్ గాడు సందీప్ గాడితో మళ్ళీ జీవితాన్ని కొత్తగా అడుగులు వేసాను శ్రీలతని పెళ్లి చేసుకుని. మొత్తానికి సాధించాను అని నా పెళ్ళాన్ని దగ్గరకు లాక్కుని లవ్ యూ చెప్పాను రాజేష్ గాడికి కన్ను కొడుతూ...

No comments:

Post a Comment