Tuesday, October 22, 2019

ఉండిపోరాదే..ప్రేమ నీదేలే.. పార్ట్ 2.. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 59

 నేను శ్రీలతని చూసాక ఇక ఈ లోకంలో నందు గాడు రాజు, శ్రీ లత నా రాణి అని ఒక రెండు నిమిషాలు ఊహల్లో విహరిస్తూ ఉన్నాను. ఏమి అందం తనది ఎంత పొగిడిన తక్కువే అనిపిస్తుంది, తను కొంచెం కొంచెం నవ్వుతూ ఉంటే మనసు ఆగడం లేదు. ఆ లేత బుగ్గల మీద సొట్టలు, లేలేత పెదాలు ఓరి నాయనో ఇక నా వల్ల కాదు అని లైబ్రరీ నుండి బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోయాను.
బయటకు వచ్చాక ఇలాంటి అమ్మాయి తగిలితే ఇక నేను ఇంజనీరింగ్ పూర్తి చేసినట్టే అని అనుకుంటు ఉండగా, లైబ్రరీయన్ నా దగ్గరకు వచ్చి గాడిద ఈ రిజిస్టర్ బుక్ ఎందుకు తీసుకు వచ్చావురా అని అన్నాడు, నేను వెంటనే నవ్వుతూ ఇక గాడిద రోజు లైబ్రరీ కి వస్తుంది అని కరో కరో జల్సా సరిగమ పదనిస అని పాట పాడుకుంటూ అక్కడి నుండి తరగతి గది వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాను.
ఇంకేముంది నా బ్యాచ్ లో ఉన్న వెదవులు అందరికి వేదాంతం చెప్పి ఇక మన ఆశయం అంతా లైబ్రరీ లో చదువులే అని చెప్పాను. వాళ్ళు కూడ మేము కూడ సిద్ధం అని ఒకమాట అనేసరికి ఇంకేముంది శ్రీలత పాప నాదే అనుకుని అలా క్రికెట్ ఆడుకోవడానికి అందరం పోయాము.
అందరం కలిసి క్రికెట్ ఆడుతూ ఉండగా, మేము వెళ్తున్న వైపు నుండి శ్రీలత తన బ్యాచ్ అమ్మాయిలు కలిసి వెళ్తున్నారు. ఇంకేమి ఆడుతాం ఆట ఇక ఈ శ్రీలత తోనే మన ఆటలు అనుకుని అక్కడ నుండి మెల్లగా జారుకుని రాజేష్ గాడిని వెంట వేసుకుని ఆ అమ్మాయల వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాము.
ఓ శ్రీలత పాప ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నావ్ నా మనసు కొల్లగొట్టి అలా వెళ్తున్నావు అనే సరికి అమ్మాయిలు అందరూ ఒకేసారి మా వైపు తిరిగారు. రాజేష్ గాడు ఓరిని నేను ఎం పాపం చేసానురా నన్ను ఇలా ఇరికించావు, ఇప్పుడు చూడరా అమ్మాయిలు అందరూ ఎలా చూస్తున్నారు అని ఒకటే నస పెడుతున్నాడు.
ఇవేమీ పట్టినుంచుకోకుండా శ్రీలత దగ్గరకి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు, నీ నవ్వుల లోకంలో మాకు కొంచెం చోటు ఇవ్వవచ్చు కదా. నీతో స్నేహం చేయాలని ఉంది నీ పలుకల మాటలలో నేను ఒక భాగం అయ్యి నీకో మంచి నేస్తం క్రింద ఉండాలని ఉంది శ్రీలత అని అన్నాను.
నేను ఇలా అంటూ ఉండగా శ్రీలత ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నది. ఏమి పాప ఏంటి ఏమి అయింది మాట్లాడు అలా మరి చిన్న పిల్లల చూడకు మధ్యాహ్నం నుండి నిన్ను లైబ్రరీ లో చూసిన దగ్గర నుండి పిచ్చి పిచ్చిగా ఉంది. ఒప్పుకో నా స్నేహాన్ని శ్రీలత అంటూ ఉంటే అవేమి పట్టించుకోకుండా గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది.
నీకు దండం పెడతాను అలా నవ్వకు ఈ గుండె కదిలిపోయి అలలు వచ్చేస్తున్నాయి శ్రీ అంటూ ఉండగా, ఇప్పుడు తన గొంతులో నుండి మాట వచ్చింది పోరా వెధవ అని. వెంటనే అక్కడ ఉన్న రాజేష్ గాడు ఇక చాలురా పోదాం అంటూ ఉండగా మా బ్యాచ్ మొత్తం వచ్చేసింది నా దగ్గరకు.
ఇంతలో శ్రీలత వెళ్లే ఆటో వచ్చింది, ఆటోలో ఎక్కింది శ్రీలత. అందాల దేవతలా ఉన్నావే ఇలా వెన్నెల్లో మళ్ళీ కనపడ్డావు అనుకో ఎత్తుకుని పోతాను అని నేను అంటూ ఉండగా. మా బ్యాచ్ మొత్తం నన్ను మోసుకుని ఇక ఆగురా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని గ్రౌండ్ కి తీసుకుని పోయారు.
గ్రౌండ్ కి వెళ్ళగానే అందరూ నన్ను క్రింద పడేసి నా చుట్టూ రింగ్ వేశారు. ఏంటి ఇది కొత్తగా అమ్మాయి అంటున్నావు అని ఒక్కొక్కటి పీకుతున్నారు. అరేయ్ మామా ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా, మీరు నా దోస్తులు కదా ఆ అమ్మాయి వివరాలు కనుక్కోండిరా అన్నాను. నందుగా నీకోసం ఆ మాత్రం చేయలేమా రాత్రికి పార్టీ సెట్ చెయ్, మేము ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుంటాం అని అంటూ ఉండగా, మా అయ్య ఇచ్చిన డబ్బులు చాలా ఉన్నాయి ఇక ఈ రోజు నుండి పార్టీస్ మామా అన్నాను.
అరేయ్ నువ్వు తాగవు కదా అని రాజేష్ అనగానే, సందీప్ గాడు వచ్చి ఈ రోజు వాడికి తాగుడులో అక్షరభాష్యం చేయుద్దం అని అనగానే ఇక ఈ రోజు తొమ్మిది గంటలకు నా రూమ్ లో పార్టీ అన్నాను.
ఇక్కడ అందరం వేరు వేరు చోట నుండి వచ్చి రూమ్స్ లో ఉండే వాళ్ళు ఎక్కువ, మా నాన్న గారికి నేను చదివే చోట ఒక సొంత ఇల్లు కూడ ఉంది. దానిలో నేను ఉంటున్నాను ఇల్లు మొత్తం మనదే ఎవరు ఏమి అనడానికి ఉండదు ఇక ఈ రాజ్యంలో నేను నా సేన అన్నట్టు ఉంటాది అని అందరిని పార్టీకి రమ్మని చెప్పాను.
అదే రోజు రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది, మేడ మీద ఎక్కాను, ఒక్కసారిగా నేను చూసిన అందాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్న. పింక్ రంగు డ్రెస్ లో ఉన్న తన అందం ముందు ఎందుకు నేను అలా అయిపోయాను, ఇంతకన్నా అందగత్తెలు నా వెనకాల పడ్డారు నేను శ్రీలత వెనకాల పడ్డాను.ఆమె మొహంలో ఉన్న చిరునవ్వు ఏదో చేసింది నన్ను, ఎంత అయిన ప్రేయసి కదా ఆ మాత్రం ఉండాలి అని కళ్ళలో నీళ్ళు వచ్చేసి గతం నుండి ప్రస్తుతానికి ఒకసారి వచ్చేసాను.
ఇంతలో నేను తెచ్చుకున్న రెండో బీరు కూడ అయిపోయింది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇంత ప్రేమ ఉన్న నేను ఆ అమ్మాయిని వదులుకున్నాన అని క్రింద ఫ్రిడ్జ్ లో ఉన్న ఇంకో బీర్ తీసుకుని ఓపెన్ చేసి కొద్దీ కొద్దిగా తాగుతూ మళ్ళీ గతంలోకి వెళ్ళాను.
ఇంతలో సందీప్, రాజేష్ , రఘు, రాధ ఇంకొంత మంది కలిసి వచ్చారు. నువ్వు ఇచ్చిన డబ్బులకు మొత్తం డజను బీర్లు తీసుకుని వచ్చాము నందు అని చెప్పగానే మేడ మీద అందరం కలిసి కూర్చున్నాం.
అందరూ తాగుతూ ఉండగా నేను బీర్ కొంచెం తాగి దీనెమ్మ చేదుగా ఉందిరా అని అంటూ ఉండగా, సందీప్ గాడు చెప్తున్నాడు శ్రీలత చదివేది కంప్యూటర్ సైన్సు ఉండేది మన కాలేజి హాస్టల్ లో, ఆ అమ్మాయికి బీభత్సమైన అభిమానులు, ఆ అమ్మాయి పడాలి అంటే నువ్వు ఒక చిన్నపాటి యుద్ధం చేయాలి అన్నాడు.
నేను వెంటనే హ హ అంటూ యుద్ధం ఏంటి మామా యుద్ధాలు చేయాలి అన్నాను. మనం ఇప్పుడు మందు కొడుతున్నాం రేపటి నుండి ఒక్కొక్కడని కొట్టుకుని యుద్ధం మొదలు పెడదాం అనగానే.
సందీప్ గాడు అరేయ్ నందుగా దుర్మార్గుడ నాకు తెలుసురా నువ్వు ఏది అయిన చేస్తావు అని, అవును మామ రాజేష్ గా కొంచెం బాడీ పెంచు నువ్వు కూడ మా యుద్ధంలో తమరు కూడ భాగస్వాములు అని నవ్వుకుని జోకులు వేసుకుని మందు కొట్టి, దమ్ము కొట్టి, మంచి మాస్ పాటలు పెట్టి ఎవడికి వాడు ఎక్కడికి అక్కడ పడుకుని పోయాడు.
మరుసటి రోజు తెల్లవారు జామున అందరం లేచి టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతూ ఒకరికి ఒకడిని చూసి ఇక నుండి మనకు జాగారాలే రాత్రులు అని నవ్వుకుంటు ఎవడి రూమ్ కి వాడు వెళ్లిపోయారు.
నేను రాజేష్ గాడు కాలేజీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, నేను బైక్ నడుపుతూ ఉంటే కాలేజి రోడ్డులో శ్రీలత ఆటోలో వెళ్తూ ఉంది. శ్రీలత ఏంటి నేను నీతో స్నేహానికి పెట్టుకున్న అప్లికేషన్ ఏమి అయింది అనగానే, మళ్ళీ పోరా అని అన్నది.
పోతున్న ఇక నుండి నేను నీ ప్రేమలోకి శ్రీలత అని గాలిలో ముద్దు ఇచ్చి ఇక నుండి మన లోకం వేరు నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు అని నవ్వుతూ వెళ్తూ ఉండగా పోరా వెధవ అని అన్నది..
ఇక నుండి జరిగే ప్రేమ పాఠం మీకు తరువాత పార్ట్ లో రాస్తాను..

No comments:

Post a Comment