Tuesday, October 22, 2019

నాకు తెలిసిన ప్రేమ కథ... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 27

పోలవరం అనే ఊరిలో రవికాంత్ అనే అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి ఆలోచనలు చిన్నప్పటి నుండి అద్భుతంగా ఉండేవి, అతని అభిరుచులు అత్యంత ఆహ్లాదంగా ఉండేవి, ప్రకృతి ఒడిలో పచ్చని పొలాల్లో పెరిగిన ఆ అబ్బాయి, చదువులో సంస్కారంలో మొదటి స్థానంలో ఉండేవాడు, రవికాంత్ వాళ్ల నాన్నగారు శ్రీనివాసు గారు ఉన్నత చదువులు చదివి ఉన్న ఊరు మీద మమకారం వదులుకోలేక ఊరిలో వాళ్ళకి ఉన్న పొలాలు చూసుకునే వారు, రవికాంత్ వాళ్ళ అమ్మగారు శకుంతల దేవి గారు, నిత్యం పూజలు చేస్తూ ఊరిలో ఉన్న చిన్న పిల్లలకి కూచిపూడి నాట్యం నేర్పుతూ రవికాంత్ కి రామాయణం మహాభారతం లాంటివి చెప్తూ ఉంటారు, రవికాంత్ కి 10వ తరగతి చదువు అయిన తరువాత పెద్ద చదువుల నిమిత్తం పట్టణము వెళ్లి ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకుని ఐఐటీ లో సీటు తెచ్చుకుని చెన్నై వెళ్ళవలసి వస్తాది, రవికాంత్ చెన్నై వెళ్లే అప్పుడు వాళ్ళ తాత గారు రంగారావు గారు మనవడి దగ్గర మాట తీసుకుంటారు, చదువు అయిన తరువాత మీ నాన్న లాగా ఉద్యగం వదిలి ఇంటికి రాకూడదని, మీరు ఆగండి మనవడు వేరే రాష్ట్రం వెళ్తున్నాడు అక్కడ ఎలా ఉంటాడో అని ఏడుస్తూ వాళ్ళ నానమ్మని ఆపడం అక్కడ ఎవరి తరం కాలేదు,వాళ్ళ నాన్నగారు రవికాంత్ చెన్నై బయలుదేరారు, రవికాంత్ వల్ల నాన్నగారి స్నేహితుడు అక్కడే స్థిర నివాసం ఏర్పారుచుకిని అక్కడే కుటుంబంతో ఉంటున్నారు,కాలేజ్ లో చేర్పించాక వాళ్ళ నాన్నగారు ఇతనికి అప్పుడే మార్కెట్లోకి వస్తున్న రిలయన్స్ తెల్ల మొబైల్ ఫోన్ కి పైన కొమ్ము స్క్రీన్ బ్లూ కలర్ వచ్చే ఒక మొబైల్ ఫోన్ ఒక ఎ.టి. ఎం కార్డ్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు..
రవికాంత్కి ఇష్టం అయిన కంప్యూటర్ గ్రూపులో చేరాడు, ఆ గ్రూపులో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సగం సగం ఉన్నారు, ఎక్కడెక్కడ నుండో వచ్చారు దేశం నలుమూలల నుండి, రవికాంత్ చూడడానికి అందంగా ఎత్తుగా అజానుబావుడులాగ ఉంటాడు, తన గదిలో ఒక మలయాళం అబ్బాయి ఒక కలకత్తా అబ్బాయి వచ్చారు, ఇక గదిలో కష్టాలు మొదలు, ఎవరైనా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాడు ఏమన్నా నా గురించి చెబుతున్నాడా అని దిగులు, తెలుగు మలయాళం బెంగాలీ ఒక గదిలో ఉండలేక గదిలో ఆంగ్లం తప్ప ఇక ఏమి మాట్లాడకూడదని ఒప్పందం చేసుకున్నారు, కానీ కాలం ముందుకు వెళ్లే కొద్ది ఒకరి నుండి ఇంకొకరు ఇష్టంతో వాళ్ళ భాషలను నేర్చుకున్నారు.రవికాంత్ కి క్లాసులో ఉన్న పల్లవి పరిచయం అయింది, పల్లవి కూడ తెలుగు అమ్మాయి, ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది, పల్లవి కూడా చాలా అందగత్తె, తెలివైన అమ్మాయి చలాకీ అయిన అమ్మాయి కూడ, ఈలోగా ఒక సంవత్సరం చదువు అయింది ఇంటికి వెళ్లే ముందు రవికాంత్ బ్యాచ్ ఒక 9మంది ఒక ఒప్పందం చేసుకుంటారు, ఇంటికి వెళ్ళాక మనం మొబైల్ లో మాట్లాడుకోవద్దు ఉత్తరాలు రాసుకుందాం అని వారి వారి ఇంటి అడ్రెస్సులు ఇచ్చుకుని వెళ్లిపోయారు, రవికాంత్ అందరికి ఉత్తరాలు రాసాడు తప్ప ఇతనికి ఎవరు జవాబు రాయలేదు,కొన్ని రోజులు ఊరిలో ఉండి నాన్నగారి పొలంలో వ్యవసాయంలో సహాయం చేస్తూ ఉండగా ఒక ఉత్తరం వచ్చింది,ఆ తెలుగు అమ్మాయి పేరు శరణ్య తను ఈసీఈ బ్రాంచ్, ఈ బాచ్లో ఉన్న ఒక అమ్మాయికి కామన్ ఫ్రెండ్, ఉత్తరంలో ఇలా ఉంది నిన్ను వచ్చిన దగ్గర నుండి చూస్తున్న ఏనాడు అయిన నన్ను చూడకుండా ఉంటావ అని ఎదురు చూస్తూనే ఉన్న ఇప్పుడు చెప్పకపోతే జీవితాంతం అలాగే చూడకుండా ఉండిపోతావు అని బయమేసి మా ఫ్రెండ్ కి తెలియకుండ రాస్తున్న,మీరు అడ్రెస్సులు మార్చుకున్నపుడు నేను నీ పక్కన ఉన్న తెలియలేదు నీకు,ఇదిగో నా ఫోన్ నెంబర్ కొత్తగా మొబైల్ తీసుకున్న అని నెంబర్ కూడా పంపింది, రవికాంత్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు, కానీ ఉత్తరానికి జవాబు రాయలేదు, మొబైల్ కి కాల్ చేయలేదు
సెలవలు ముగిశాక కాలేజీకి వెళ్లారు అందరూ, శరణ్య ని కలిసాడు మాట్లాడాడు,ఆమె మాటలలో నిజాయితీ ని చూసాడు, ఇది చూసిన పల్లవికి నచ్చక రవికాంత్ మీద కోపం వచ్చింది, ఉన్న కోపం ఆపుకోలేక వెళ్లి రవికాంత్ ని నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ అన్నది, రవికాంత్ చిన్న నవ్వు నవ్వి మన మధ్యన స్నేహం ఎప్పుడు ఇలాగ ఉండాలి ప్రేమ వద్దు అన్నాడు, మరి అయితే శరణ్య మీద ప్రేమ ఉన్నదా నీకు అన్నది, నాకు అందరూ ఒకటే అన్నాడు ఎక్కడ పల్లవి ఏమి చేసుకుంటాదో అని శరణ్య మీద ఇష్టం ఉన్న చెప్పకుండ,పల్లవి ఏమో ఉన్న బ్యాచ్ నుండి తప్పుకొని కొత్త బ్యాచ్లోకి వెళ్ళింది రవికాంత్ మీద ఇష్టాన్ని చంపుకోలేక, అలాగ క్లాసులు సెమిస్టర్స్ టూర్స్ అవుతూ గొడవలు కొట్లాటలు పెట్టుకుని అల్లరి చిల్లర పనులు చేసుకుంటూ చివరి సంవత్సరానికి వచ్చేసారు, శరణ్య రవికాంత్ ని అడిగింది అసలు ప్రేమ అంటే ఏంటి అని, బాబు రవికాంత్ దయచేసి కుటుంబ ప్రేమలు కాకుండ ఒక జంట మధ్య ప్రేమ చెప్పు అన్నది, దానికి రవికాంత్ "గొప్ప ప్రేమలు ఎప్పుడు చరిత్రలో హింసించబడతాయి " అన్నాడు, దానికి అందరూ షాక్ తిన్నారు.నీకు తెలిసిన ప్రేమ ఏంటి అన్నారు "హద్దులో ఉండి సరిహద్దులు దాటకుండా ఉండేది గొప్ప ప్రేమ" అన్నాడు, అందరూ షాక్ అయ్యారు, ఇది అంత పల్లవి ఒక పక్క నుండి గమణిస్తుంది, ఆహా మహారాజా అని మలయాళం అబ్బాయి వచ్చి మీ ఇష్టసఖి ఎవరు అన్నాడు, రవికాంత్ వెంటనే పల్లవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు, పల్లవి వెంటనే పరిగెత్తుకుని తన గదికి వెళ్ళిపోయింది శరణ్య షాక్ లో ఉన్నది, ఏంటి ఇది రవి ఎందుకు ఇలా చేశావ్ అన్నది, అప్పుడు రవి కన్నీలతో చూడు శరణ్య నువ్వు మీ అమ్మా నాన్నలు ఫోన్ చేస్తే మీ బావను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మీ ఇష్టం నా ఇష్టం నాన్న గారు అన్నావు తప్ప నేను అంటే ఇష్టం అని చెప్పలేదు కదా,నేనె ఇష్టంగ నేను మాట్లాడడం లేదని పల్లవి వాళ్ళ నాన్నగారితో రోజు చెప్తూనే ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్లినా ఏమిచేసిన నా గదిలో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది నా బాగోగులు, వెక్కి వెక్కి ఏడుస్తుంది నేను మాట్లాడడం లేదని, ఇందాక చెప్పాను కదా గొప్ప ప్రేమలు ఎప్పుడు చరిత్రలో హింసించబడతాయి అని, గొప్ప ప్రేమ పల్లవిది, హించించింది నేనే అన్నాడు, అందరి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి,ఇంకో నెలలో కాలేజీ అయిపోతుంది పల్లవి దగ్గరికి వెళ్లి చిన్న చిరునవ్వు నవ్వి ఒక కాగితం చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు, ఆ కాగితంలో నీ ఆశయం నా ఆశయం ఒకటే ముందు ఆ పని మీద ఉందాం అన్నాడు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కాలేజి అయిపోయాక వాళ్ల పరిస్థితి అయింది,రవికాంత్ సివిల్స్ లో కష్టపడి IAS అయ్యాడు, మంచి కలెక్టర్ గా పని చేస్తూ ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాడు, తన కల గన్న రోజు రానే వచ్చింది పల్లవి కూడా IAS అయ్యింది, పల్లవి వచ్చి మన ఆశయం పూర్తి అయింది పెళ్లి చేసుకుందామా అని అడిగింది రవికాంత్ నవ్వుతూ ఉంటే బాబు ఇక నవ్వకు ఏ కాగితం నా చేతిలో పెట్టకు,ఎదో మనం కాలేజీలో చేరినప్పుడు నీ ఆశయం నా ఆశయం ఒకటే అన్నందుకు అయ్యేదాక తప్పదు అన్నావు,ఇప్పుడు అయింది కదా అంటే సరదాగా రవికాంత్ రెండు సంవత్సరాలు లేట్ అయింది అని బాధ పడుతున్న అన్నాడు, మీరేమో toppers సర్ మేము కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం IAS కి అన్నది, ఇందులో గెలిచింది నేను కాదు మా నాన్న, మా నాన్న గారు నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, మన ఆశయం ఎప్పుడు దేని ముందు ఓడిపోకుడుదని, మనము జీవితంలో గెలిచాము ప్రేమలో గెలిచాము, ముందు జీవితంలో గెలవాలి తర్వాత ఏది అయిన..

No comments:

Post a Comment