Tuesday, October 22, 2019

స్నేహమా.. ప్రేమమా... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 28

చల్లని సాయంత్రం ఆదివారం 4.50 నిమిషాలకు కిరణ్ తన స్నేహితుడు శివకి ఫోన్ చేసి తొందరగా మన బాబాయ్ హోటల్ దగ్గరకి రారా అని ఫోన్ పెట్టేసాడు, శివ కిరణ్ ఉన్న చోటుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, శివ బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్న దారిలో కిరణ్ కి ఏమైంది అని భయంతో ఉన్నాడు, అసలే వాడు చాలా సుత్తి మెత్తని మనిషి, ప్రేమలో ఉన్నాడు ఆ అమ్మాయి అంటే ఇష్టం అని ఒకసారి కష్టం అని ఒకసారి చెప్తాడు, తాను లేకపోతే నేను లేను అంటాడు, నేను దూరంగా ఎప్పుడైనా పనిలో ఉంటే నన్ను ఇబ్బంది పెట్టడు, అలాంటిది రమ్మన్నాడు, బండి వేగం పెంచి 20 నిమిషాల్లో కిరణ్ ముందు నిలబడ్డాడు, ఏమైంది రా ఎందుకు మొహం అలా పెట్టావు అన్నాడు, నా వల్ల కాదుర నేను ఎంత ప్రేమించిన అనిత ప్రతి దానికి అలుగుతుంది, ఇక విడిపోతానుర తనతో, ఆమె లోకం ఏంటో నాకు తెలియదు కాని నన్ను మాలోకం చేస్తుందిర,నా వల్ల కాదు మామ నేను దూరంగ వెళ్లి బతుకుతాను అన్నాడు.
శివ ఒక మాట అన్నాడు నేను ఒక సంవత్సరం మీకు ఎవ్వరికి కనపడకుండా వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళావు అని అడగవద్దు అంటాను, టైం వస్తే ఎదో ఒక రోజు నీకు చెప్తాను అన్నాను కదార, హ అవును ఇప్పుడు అది ఎందుకు అన్నాడు కిరణ్, ఆ రోజు వచ్చింది అనుకుంట ఈ రోజు చెప్పాలి నీకు, కిరణ్ నువ్వు నేను బాల్య మిత్రులం మనతో పాటు మన స్కూల్లో చదివిన కీర్తన గుర్తు ఉంది కద, హ అవును వాళ్ల నాన్న పోలీసు కదా, హ అవును వాళ్లే, కీర్తన ఇంటర్ వరకు మనతో చదివి మెడికల్ లో సీట్ వచ్చి డాక్టర్ చదవడానికి వెళ్ళిపోయింది, ఒకసారి మా అన్నయ్య పెళ్లికి మన స్నేహితులు అందరిని పిలవడానికి స్కూల్లో మనము రాసుకున్న స్లామ్ బుక్ తెరిచి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ ఉన్నా కిరణ్, కీర్తన వాళ్ళ అమ్మగారు ఫోన్ ఎత్తారు, అంటీ గారు నేను శివ కీర్తన లేదా అని అడిగాను లేదు అమ్మ అని కీర్తన ఫోన్ నెంబర్ ఇచ్చారు, కీర్తనాకి ఫోన్ చేసాను హలో అని అవతలి నుండి పలకరింపు ఒక్కసారిగా నా మైండ్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది, నీకు తెలియదు కిరణ్ తాను అంటే నాకు ఇష్టం అని అప్పుడే తెలిసింది, స్కూల్ లో తను ఒకసారి లంగావోణిలో వచ్చిన రోజు అలాగే చూసాను, కానీ వాళ్ళ నాన్న పోలీస్ అని కీర్తనకి దూరంగ ఉండే వాళ్ళం భయంతో, ఫోన్ ఎత్తి హలో హలో అని అంటుంటే ఏమి మాట్లాడకుండ మౌనంగా ఉంటే పిచ్చా మీకు ఫోన్ ఎత్తి మాట్లాడడం లేదు అన్నది, హ నేను శివ ని మీ స్కూల్ ఫ్రెండ్ ని అన్నాను, హ చెప్పు అన్నది అన్నయ్య పెళ్లి ఉన్నది తప్పకుండా రావాలి అన్నాను, సారీ శివ నాకు సెలవులు లేవు అన్నది,ఏమి అనుకోను నువ్వు తప్పదు అంటున్నావు నా సెమిస్టర్ తిప్పలు నీకు తెలియదు అన్నది, మాట మాట కలిసింది, ఫోన్ మాట్లాడుకోవడం చాటింగ్ లు చేసుకోవడం మొదలు పెట్టాము,అభిరుచులు తెలుసుకున్నాము,అనుకోకుండా నేను కూడ విశాఖపట్నం వెళ్ళాను ఉద్యోగం వస్తే అక్కడే తాను కూడా ఉండేది, నా మొహానికి ఏమి తెలియక పోతే తన స్కూటీ తీసుకు వచ్చి నాకు కావలసినవి అన్ని తనే చూసి వాళ్ళ నాన్న గారికి పరిచయం చేస్తే అక్కడే తెలిసిన వాళ్ల గదిలో పెట్టారు, మనకేమో సిటీ కొత్త , రాక రాక వీకెండ్ వచ్చింది, కీర్తన ఫోన్ చేసి బయటకు వెళ్లొచ్చు అన్నది, నేను ఏ సినిమాకో పోవచ్చు అనుకున్న, బయటకి వెళ్ళగానే కీర్తన వాళ్ళ అమ్మగారు ఇద్దరు కార్ లో వచ్చారు, నువ్వు రమాదేవి గారి అబ్బాయివి కదా అన్నారు అవును అండి అన్నాడు, మీ అమ్మ గారు మాకు బాగా తెలుసు బాబు అన్నారు, అలా గుడికి వెళ్ళాము ముగ్గురం, ఆ రోజు కీర్తన చీరలో చాలా బాగుంది, నేను అలా చూస్తూ ఉంటుంటే కీర్తన చిన్నగా ఒక చిరునవ్వు విసిరింది, కీర్తన నువ్వే నా ప్రాణం అని చెబుదామని అనుకున్న, అలా ఇంటికి వెళ్ళిపోయాక ఆ రోజు నిద్ర పట్టక ఫోన్ చేస ఏంటి సర్ ఈ టైం లో అన్నది, రేపు సాయంత్రం కలుద్దాము అన్నాను, ఒకే సర్ అన్నది, ఇద్దరం కలిసి పార్క్ కి వెళ్ళాము, మనసులో ఉన్నది చెప్పాను, కీర్తన కూడ నాకు నువ్వు అంటే ఇష్టం కలిసే ఉందాం అని అన్నది,ఇక చాలా సంతోషం వేసింది తను నాదే అని,తను కూడ జూనియర్ డాక్టర్ క్రింద చేస్తూ సొంతంగా హాస్పిటల్ పెట్టాలని తన కల, తను ఒక రోజు కూడ కలవకుండ చూడలేనంతగా ప్రేమించాను, నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది ఇంట్లో నాన్నగారు ఫోన్ చేసి రమ్మన్నారు, నన్ను బస్టాండ్ దాక తీసుకు వచ్చి ఇంట్లో వాళ్ళకి తీసుకువెళ్లాడనికి స్వీట్స్ కొని ఇచ్చింది, మన బుర్రకి అవి తెలియదు కదా అలా పట్టుకుని వెళ్ళాలి అని, పంపించే అప్పుడు జాగ్రత్త అని నుదిటి మీద ముద్దు పెట్టి పంపించింది, ఇంటికి వెళ్ళాక పనిలో ఉండి ఫోన్ చేయడం మర్చిపోయాను, విశాఖపట్నం బయలుదేరే ముందు కీర్తన కి ఫోన్ చేస ఫోన్ కలవలేదు, లైట్ లే రేపు కలుద్దాం అని వెళ్ళాను, తను ఒక మాట చెప్పింది "నీతో ఎప్పుడు ఉండేది నువ్వే" నీ మొహం లో చిరునవ్వు చేరగవద్దు అని అన్నది, తను చిన్నది అయిన తన మాటలు గొప్పవి అని కొత్తగా కొన్న బైక్ వేసుకుని బయలుదేరి వచ్చాను, ఉదయం లేవగానే గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి కీర్తన వాల్ల ఇంటికి బయలుదేరాను, కీర్తన ఫోన్ కలవడం లేదు అని, ఇంటికి వెళ్ళాక తాళం వేసి ఉంది, పక్కన ఉన్న వాళ్ళని అడిగితే అమ్మాయికి ఆక్సిడెంట్ అయింది హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు అన్నది, ఏ హాస్పిటల్ తెలుసా అని అన్నాను వెంటనే కీర్తన వాళ్ళ అమ్మ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసారు ఏడుస్తూ బాబు అని అంటే నేను హాస్పిటల్ కి వెళ్ళాను, ఐసీయూలో ఉన్నది కీర్తన, కోమాలోకి వెళ్ళింది అని చెప్పారు, అక్కడే కుప్పకూలి పోయాను ఏడుస్తూ, అప్పుడు వాళ్ళ అమ్మ గారు వచ్చి ఏడుస్తూ కీర్తనకి ఫిట్స్ ఉన్నాయి చిన్నపటి నుండి మందులు వాడుతూ ఉండేది అంట, ఎప్పుడు అయిన నేను ఫోన్ లిఫ్ట్ చేసినపుడు ఎత్తేది కాదు తర్వాత ఫోన్ చేసేది,తలనొప్పి గా ఉంది తర్వాత చేస్తాను అనేది, నాకు చెప్తే ఎక్కడ నేను బాధపడతానో అని చెప్పేది కాదు, స్కూటీ మీద వెళ్తున్నపుడు ఫిట్స్ వచ్చాయి అంట పెట్టుకున్న హెల్మెట్ కూడ కాపడలేకపోయింది, నాకు తన పుట్టినరోజున నీకు ఒక నిజం చెప్తాను అన్నది, అది ఇదే , ఒకవేళ నేను ఎప్పుడైనా దూరం అయిపోయిన సంతోషం గా ఉండు బాధ పడకు అనేది, వెక్కి వెక్కి ఏడ్చాను ఏడ్చి ఏడ్చి నా కళ్ళలోన కన్నీళ్ళు ఇంకిపోయాయి, ఆ కన్నీలకు కూడ కనికరం లేదు అనుకుంట నేను బాధ పడుతున్న కన్నీళ్ళు రావడం ఆగిపోయాయి,అలాగే పిచ్చోడిలా ఒక సంవత్సరం ఎటు వెళ్ళకుండ తన కోసమే అక్కడే హాస్పిటల్ లో ఎదురు చూస్తూ ఉన్నాను, దేవుడికి కీర్తన అంటే ఇష్టం అనుకుంట తనని తీసుకు వెళ్ళిపోయాడు, కిరణ్ తనకి చివరి వరకు ఉంటాను నీతోనే అని మాట ఇచ్చాను అది స్మశానం దగ్గర దాకా అని నాకు తెలియదురా, హృదయం తట్టుకోలేని బాధ ఇచ్చినప్పుడు ఈ హృదయం ఎందుకు అంటే పక్కన ఉన్న హృదయం తో కలుపుకుని బాధను పంచుకోమన్నాడురా దేవుడు, ఆ పక్క హృదయం నువ్వేరా కిరణ్ అందుకే మన ఊరు వచ్చేసాను, తనతో మాట్లాడాలి అంటే తను లేదు, ఎప్పడూ పిచ్చోడిలా నవ్వుకుంట మాట్లాడుకుంటా నాలో నేను ఎందుకు అంటే తను నాతోనే ఉన్నది.
కిరణ్ ఏడుస్తూ శివ తో అరేయ్ ఎందుకురా ఇన్ని రోజులు ఇలా ఉన్నావు అన్నాడు, ఒక నవ్వు నవ్వి అనిత చాలా మంచిది ప్రేమలో చిన్న చిన్న గొడవలు ఉండాలిర, ఇంకెప్పుడు కోపంలో ప్రేమని వదలకు, నువ్వు మంచోడివిర, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, నువ్వు ఫోన్ చేసిన వెంటనే నేను అనిత కి ఫోన్ చేసాను, అన్నయ్య నేను కిరణ్ ని సిగరెట్ మానేయమన్నాను, మానడం లేదు తనకి ఏమి అయిన అయితే ఏంటి నువ్వే చెప్పు అన్నది, నేను చెపుతాను అమ్మ అన్ని ఫోన్ పెట్టి నీ దగ్గరకి వచ్చాను, నీ కోసం వాళ్ల అమ్మ నాన్నలని వదిలి వచ్చే అమ్మాయి కోసం సిగరెట్ మానేయలేవార అన్నాడు, వెంటనే శివని గట్టిగా వాటేసుకుని ఇంత ప్రేమను ఇంత బాధను ఎలా దాచుకున్నావురా అని ఇక అనితను ఎప్పుడు బాధ పెట్టనుర అని అలాగే శివని గట్టిగా పట్టుకునే ఉన్నాడు కిరణ్....

No comments:

Post a Comment