హాయ్ అండి, పైన బృందావనం టైటిల్ చూసి ఇదేదో శ్రీ కృష్ణుడు బృందావనం అని
అనుకున్నారు,శ్రీ కృష్ణుడు అని అన్న, బృందావనం అన్న, మనకి ముందుగా
గుర్తుకు వచ్చేది తెలుగు జాతి గొప్పదనం అన్న గారు శ్రీ నందమూరి
తారకరామారావు గారు, ఆయన అంటే ఎంతో ఇష్టం ఉన్న మా కాలేజ్ యాజమాన్యం మా
కాలేజీకి బృందావనం అని పేరు పెట్టి కాలేజ్ మధ్యలో అన్న గారి విగ్రహం
పెట్టారు.
ఇక కథలోకి వెళ్తే మన బృందావనం కాలేజ్ చుట్టూ పక్కల ఉన్న కాలేజీ లో నెంబర్ 1, ఆటలు అయిన చదువులు అయిన ముందే ఉండే వాళ్ళం, ఇక నా పేరు చెప్పలేదు కదా నా పేరు కృష్ణ అండి,నా బెస్ట్ ఫ్రెండ్స్ నవదీప్,సాయి మరియు తేజ్. నవదీప్ చాలా హాస్యంతో ఉంటాడు, సాయి ఎప్పుడు ఆటలతో ఉంటాడు, తేజ్ చదువులో ముందు ఉంటాడు, మనం వీళ్ళ ముగ్గురితో కలిసి అన్నింట్లో ముందు ఉంటాము, అంటే నేనే ఈ బ్యాచ్ కి మా కాలేజ్ కి నాయకుడిని.సమస్య ఏది అయిన దానికి పరిస్కారం దొరికే వరకు నిద్రపోను,రాత్రి పగలు కష్ట పడతాను, నా ఫ్రెండ్స్ ని కష్ట పెడతాను, వాళ్ళని ఎందుకు అనా మాట్లాడితే నీకు నేనున్నా మామా అంటారు,వాళ్ళే అన్నాక ఇక మనము వదులుతాము చెప్పండి, గురువులతో ఎప్పుడు మర్యాదగా ఉండేవాళ్ళము, వాళ్లకు చూడగానే భయము,భక్తి మనకి, ఒక్క ముకుందం లెక్చరర్ అంటేనే వణుకు మాకు,ఏది అయిన తప్పు చేసామా, మేము కాలేజీలో చదువుతున్నాము అని కూడా చూడరు,ఒకటే మోత మోగిస్తారు వీపు, దవడ అని చూడకుండ, మా కాలేజ్ ప్రిన్సిపాల్ పాత సినిమాలో గుమ్మడిలాగా సౌమ్యంగా ఉంటారు.
ఎప్పటిలాగానే క్లాసులు అవుతున్నాయి మనం చదివేది మెకానికల్ గ్రూప్,అమ్మాయిలు ఉండరు,మన కాలేజ్ నిండా చెట్లు,పువ్వులు, పచ్చదనంతో చాలా బాగుంటాది, మనం ఎప్పుడు క్లాస్ జరుగుతున్న కిటికీ పక్కన ఉండే వాళ్ళం ఒక పక్కన క్లాస్ వింటూ ఇంకో పక్కన ప్రకృతి అందాన్ని చూడవచ్చు అని. ఒకటే వర్షం కురుస్తుంది, ముకుందం గారి క్లాసు జరుగుతుంది, నేను కిటికీ పక్కన ఉంటూ క్లాస్ వింటున్నాను,ఇంతలో నవదీప్ గాడు కిటికీ పక్కకి చూడు చూడు అంటున్నాడు, ఏముందిలే అని చూసాను అటు వైపు ఇంతలో తెల్ల చుడిదర్ డ్రెస్ లో నీలం రంగు చున్నీతో పాలు పసుపు కలిపిన రంగులో ఉన్న అమ్మాయి , ఆ పచ్చని అందంలో వన దేవత ఏమో అనుకుని కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూసాను, ఇక వెంటనే క్లాస్ చెప్తుంది ముకుందం సర్ అనికూడ చూడకుండా అక్కడ నుండి పరిగెత్తుకుని వెళ్లి తన పక్కన వాలిపోయాను, నేను తడుస్తూ వెళ్తున్న తనని చూస్తూ,ఆ పచ్చని గడ్డిలో గుడ్డివాడిలా తనకోసం చూస్తూ ఉన్నాను.తను మా కాలేజ్ అంట, కంప్యూటర్ లాబ్ కి వెళ్ళింది అంట వచ్చేదాకా ఉన్నాను బయట.
వామ్మో ఆ అమ్మాయి వస్తుంది ఒకటే టెన్షన్ ఎలా మాట్లాడాలి అని,ఇక తప్పక వెళ్ళాను భయం భయంతో, ఏవండి అని అన్నాను,ఏంటి అండి ఇందాక అలా పరిగెత్తుకుని వచ్చారు వానలో, మీకు వాన అంటే అంత ఇష్టమా అని అన్నది, వాన కాదే తల్లి, నువ్వు అంటే ఇష్టం అన్నాను, ఆపండి కృష్ణా గారు అంటే,నిజం అండి నేను నిజమే చెప్తున్నా నా పేరు మీకు ఎలా తెలుసు అండి, ఈ కాలేజీలో మంచి పని అయిన వెదవ పని అయిన ముందుకు మీరే వస్తారు అని మా ఫ్రెండ్స్ చెప్పారు మిమ్మల్ని చూపించారు,ఆహా..మీ పేరు ఏంటి అండి వన దేవత గారు అంటే.
మా ఇంటి పేరు తోట నా ముద్దు పేరు చిన్ని నా అసలు పేరు గోపిక అన్నది ఒక నవ్వు నవ్వుతూ, మనము వెంటనే గోపికని చూసి "ఆ కళ్ళు, కంటి పాపలు(రెప్పలు), కనుబొమ్మలులో ఏమన్నా అందమా, బొట్టు పెట్టుకునే అందమైన నుదురు,ముక్కు పుడక పెడితే దానికే అందం తీసుకు వచ్చే ముక్కు,గాలి వస్తే ఎగిరే అందమైన నల్లని కురులు,ఇంత అందం కలగలిపి తోట వారి ఇంట్లో పూసిన ఎర్ర గులాబి వలే చాలా అందంగా ఉన్నావు గోపిక అంటే", హ హ అని నవ్వుతూ వెళ్తూ గోపిక స్వరం వినగానే మళ్ళీ
"నీ స్వరం కోసం సప్త స్వరాలు వేచి చూస్తున్నాయి, బంది అయి ఉన్న ఈ బానిసను నీ గానంతో ముక్తి ప్రసాదించు గోపిక అని అంటుంటే", నా పక్కన వచ్చిన మా ఫ్రెండ్స్ వీడిని తొందరగా భూతవైద్యుడు దగ్గరికి తీసుకువెళ్లాలి ఏదో గాలి సోకింది అన్నాడు తేజ్ గాడు, నేను ఏమో గోపిక గాలి సోకింది మామా అంటే నన్ను ఎత్తుకుని మరి తీసుకు వెళ్లిపోయారు.
ఇంతలో బృందావనం కాలేజ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజ్ డే గొప్పగా చేయాలి అని మా కాలేజ్ వాళ్ళు సిద్ధం అయ్యారు,మనం ఏమో డాన్స్ కి పేరు ఇచ్చాము, గోపిక ఏమో పాటలకి ఇచ్చింది, మనము డాన్స్ ప్రాక్టీసు చేస్తున్నాము ఏ పాటకి అనుకుంటున్నారా "గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణము పాటకి" నేను ఏమి పాటకి డాన్స్ వేస్తానో అని గోపిక చూడడానికి వచ్చింది, మనం సెలెక్ట్ చేసుకున్న పాట చూసి గోపిక ఒకటే పరుగు వెనక్కి చూడకుండా, ఈ పాటకి డాన్స్ ఎలా అని, నవదీప్ గాడు ఏమో స్టేజి మీద ఒక స్విమ్మింగ్ ఫూల్ లాగా కట్టించి, ఒక చెక్కతో పడవ చేయుద్దం మామా అంటే తేజ్ గాడు కూడ సరే అంటే సాయి గాడు వచ్చి యాక్.తు.అంటే దెబ్బకి డాన్సుకి పాట మార్చేసాము.
ఒకటే ఆటలు పాటలు ఒకడు కాలేజ్ డే లో గ్లాసులను మేడల్లా పేర్చితే బాల్ తో కొట్టాలి అంట, ఇంకొకడు ఏమో పిట్టల దొరలకి తుపాకీ ఇచ్చినట్టు బుడగలను కొట్టాలి అంట కాలేజీలో సరదాగా, ఇంతలో పాటలు పాడటానికి అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు పాడుతుంటే ఆహా చచ్చిపోవచ్చు ఈ పాటలు విని అని అంత మధురంగా పాడుతున్నారు,తరువాత పాటలకి డాన్సులు,మనం కూడా డాన్సు వేస్తే తొందరగా దిగిపోమని ఒకటే కేకలు,అభిమానం అనుకుని ఇంకో పాటకి డాన్స్ వేయడానికి వెళ్తే అందరూ గోడలాగ కట్టి మరీ వెళ్ళనివ్వలేదు మన డాన్స్ చూసి, కాలేజ్ డే చాలా సక్సెస్ అయింది, చాలా సంతోషంతో ఉన్నాము ఆ రోజు.
గోపికకి మన మీద ఇష్టం పెరిగిపోయింది, చదువులు చివరికి వచ్చేస్తున్నాయి, చివరి సంవత్సరంలో ప్రాజెక్ట్స్ చేయాలి,మేము ఏది అయిన కొత్తగా చేయాలని ఉంది,ఒక కార్ తయారు చేయాలి అనుకున్నాము ఎక్కువ మైలేజ్ వచ్చేది,ఇదే విషయం కాలేజ్ యాజమాన్యంకి చెప్తే ఒకే అన్నారు, ప్రాజెక్ట్ సక్సెస్ మా కాలేజ్ పేరు మారు మ్రోగిపోయింది,ఇంతలోనే చదువు అయిపోతుందా అనిపించింది, చివరి రోజులు వస్తున్నాయి.మేము కాలేజ్ నుండి వెళ్లిపోవడానికి, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండును అనిపిస్తుంది, ఒకటే దిగులు బాధ పట్టుకున్నాయి అందరికి, ఒకడి బాధ ఒకడికి చెప్పుకోలేనిది, ఎక్కడెక్కడ నుండో వచ్చాము,ఎక్కడికో వెళ్లిపోతాము,మళ్ళీ వదిలి వెళ్ళిపోతే కలుస్తామ అని బాధ, ఇంట్లో వాళ్ళతో కూడా అంతలా కలిసి ఉండలేము,గురువులు చెప్పే మాటలు ఉండవు మనకి అని,కలిసి వెళ్లిన టూర్లు,ఒక లంచ్ బాక్స్ ని మళ్ళీ కలిసి తినలేము అని,ఇప్పుడు ఆడిన ఆటలు మళ్ళీ ఆడతామ అని కాలేజ్ ప్లే గ్రౌండ్ ని చూస్తూ ముద్దుపెడుతూ, ఇక తప్పక నేను గోపిక ఫ్రెండ్స్ బృందావనం ని విడిచి వెళ్లక తప్పలేదు, నా గుండెల్లో ఎప్పడూ ఆ బృందావనం దాని గుర్తులు ఎప్పుడు ఉంటాయి అని వదిలి వెళ్లలేక వెళ్లిపోయాము అందరం..

No comments:
Post a Comment