Tuesday, October 22, 2019

గౌతమ్ గాడి స్టొరీ.. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 30

 అరేయ్ గౌతమ్ ఎక్కడ ఉన్నావురా సచ్చినోడ, మొన్నటి నుండి ఫోన్ చేస్తున్నార వెదవ,మీ అయ్యకి ఫోన్ చేస్తే మా వాడు వాహనం మీద వస్తున్నాడు అని చెప్పాడు,ఎవరు మా అయ్య నీకు చెప్పింది వాహనం కాదుర అది సైకిల్ రా వెదవ, సూర్యా పేట దాటను రేపు ఉదయానికి వచ్చేస్తాను అన్నాను, వాడు ఎందుకురా అంత టైం దగ్గరే కదా వచ్చేయి అన్నాడు.
నాకు తిక్క ఎక్కిపోయి సైకిల్ మీ అయ్య తొక్కుతాడరా, మా నాన్న నాకు ఒక పేపర్ ఇచ్చాడు, వీలునామా అనుకున్నావు నేను వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఇచ్చాడు,అందులో ఉన్న ఊరికి వెళ్ళాక సెల్ఫీ దిగి మా నాన్న కి పంపలిరా, అదేంట్రా మీ నాన్న కి అదేమి పిచ్చి అన్నాడు వాడు, ఏమి లేదురా నాన్నగారు కాయా-కష్టం అంటే ఏంటి నాన్న అన్నాను నోటి దూల ఆగక,దొరికాడు నా కొడుకు అనుకున్నాడు మా నాన్న, వెంటనే ఆయన పాత సైకిల్ రెడి చేసాడు మామ,సైకిల్ రెడి చేస్తే మా నాన్నకు పిచ్చి కాకపోతే, ఏ పిచ్చి వెదవ తొక్కుతాడు ఈ సైకిల్ ని అని అనుకున్న మామ, నేనేెర ఆ పిచ్చి వెదవను మామ అంటే, నువ్వేమి చేయకుండా మీ నాన్న అలా చేయడు రా ఏమి అయింది అంటే మామ, నేను మా నాన్నని వచ్చే ఎన్నికలలో మోడీకి ఓటు వేయమన్న మామ,అంతే ప్రశాంతంగా ఉన్న ఆయనకి నోట్ల రద్దు మరియు జి.స్.టి గుర్తుకు వచ్చాయి మామ వెంటనే మా నాన్నకు, ఎందుకు అంటే అంతక ముందు కూడ పట్టుపట్టి మోడీకి ఓట్ వేయించా మామ అది ఇలా తీర్చుకున్నాడు మామ, నమో మోడీ కాదు నమో డాడీ అనాలి అన్నాడు మామ, కాళ్ళు నొప్పులు, వొళ్ళు నొప్పులురా మామ అని ఫోన్ పెట్టేసి సైకిల్ తొక్కుకుంటు వెళ్తూనే ఉన్నాను.
మరుసటి రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఎంటర్ అయ్యాను, ప్రకాష్ గాడికి ఫోన్ చేసి వాడి రూంకి పోయాను వాడికి దండం పెడుతూ మహాప్రభో ఈ నొప్పులు నా వల్ల కాదురో అని, అక్కడే ఉన్న అపోలో మెడికల్ షాపులోకి వెళ్ళాను,మెడికల్ షాప్ కి వెళ్ళింది మందులు కోసం కాదు ఒక అమ్మాయి వెళ్ళింది అని, మా ప్రకాష్ గాడు పిచ్చి వాడు ఎందుకు వచ్చానో తెలియదు వాడికి,బయటకి వచ్చి అరేయ్ జస్ట్ మిస్ మామ అన్నాను, దానికి వాడు అవును మామా కొంచెంలో జస్ట్ మిస్ బైక్ వాడు నన్ను గుద్దేద్దుడు మామ అన్నాడు, నవ్వుకుని వాడు నన్ను రూంకి పొమ్మని వాడు కంప్యూటర్ క్లాస్ కి పోయాడు,నేను రూం కి వస్తున్నాను బాగ్ వేసుకుని ఒకడు వచ్చి బ్యాగులో ఏముంది అన్నాడు, నాకు కోపం వచ్చి మీ అమ్మమ్మ ఉంది రారా చూడు అన్నాను,బ్యాచిలర్ అంటే చాలు అనుమానాలు వెదవలకి అని ఒక తోపు తోసాను వాడిని, వాడు ఇంటి ఓనర్ అంట మనకేమి తెలుసు వచ్చి తలుపేసి పడుకున్నాను.
ప్రకాష్ గాడిని రాగానే బ్యాండ్ బజాఓ భారత్ వాడికి ఇంటి ఓనర్లుతో, వీడికి కడుపు కాలి ఫామిలీ వాళ్ళని ఒక మాట అనరు, బ్యాచిలర్ అంటే ఎవరు అనుకున్నారు,అతిధులు మేము డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా లేట్ చేసామా, నీళ్లు ఎక్కువ వాడతామ, అది బాలేదు ఇది బాలేదు అని ఎప్పుడైనా అన్నామ మేము, రాత్రుళ్ళు పడుకోకుండా మీ ఇంటికి కాపాలాగ ఉంటాము,అంకుల్ మీరు లేనపుడు పక్కింటి సరోజ అంటీ తో ఫోన్ మాట్లాడతాడు అని తెలిసినా మీకు చెప్పాన అని అన్నాడు నోరుజారి, ఇది అంత వింటున్న సరోజ మెల్లగా లోపలకి వెళ్ళిపోయింది, ఇక చూసుకో అంటీ అంకుల్ ని వీరబాదుడు మొదలు పెట్టింది.
వాడు పైకి వచ్చి నన్ను చూసాడు, నేను రెండు బ్యాగులు, రైస్ కుక్కర్ పట్టుకుని రెడీగా ఉన్నాను, నువ్వు చాలా ఫాస్ట్ మామ, తమరి నోటి దూల గురించి తెలియంది కాదు కదా అని ప్యాక్ చేసారా వెదవ, మేము అన్ని పట్టుకుని ఆంటీ కి టాటా ఆంటీ మిస్ యూ అని చేప్పేసి పక్క గల్లిలో ఉన్న మా నాని గాడి రూంకి పోయాము డొక్కు సైకిల్ ని పట్టుకుని.
మహా నగరంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యగం కావాలి అంటే ఆంగ్లం రావాలి అంట, ఇక చూసుకోండి 30డేస్ ఇన్ ఇంగ్లీష్ కోర్స్ లో జాయిన్ అయిపోయాను అండి,ఎక్కడ చూసిన ఒకటే గోల గోలగా ఉంది మహానగరం ఎవరి దారి వారిదే అన్నట్టు,ఇంతలో నా పుట్టిన రోజు వచ్చింది, రేపు పుట్టిన రోజు అనగా ఆ రోజు రాత్రి ఒక పానీయం ఇచ్చారు, అది తాగాక మత్తుగా ఉన్నది, ఇంతలో మా నాన్న ఫోన్ చేసాడు, ఫోన్ లిఫ్ట్ చేసి డాడీ ఐ లవ్ యు డాడీ, నువ్వే గ్రేట్ డాడీ, నమో డాడీ ఐ యామ్ స్టడీ డాడీ అన్నాను,రేపు ఒక 3 వేలు వేయి డాడీ, గుడ్ నైట్ డాడీ అని పెట్టేసాను మా నాన్న ఇంకా హలో అని అనుకుండానే.
కేక్ తీసుకు వచ్చారు నా దగ్గరకి కేక్ ముందు ఉంచి నా చుట్టూ పది మంది రౌండ్ఆప్ చేసి కొవ్వొత్తులు వెలిగించి ఊదమన్నారు, నేను ఊదడం మొదలు పెట్టకుండానే, శత్రువులు మీద యుద్ధం చేసే సైనికులుగా నా మీద పడ్డారు, ఒకటే కొట్టుడు అమ్మ అబ్బా అనుకుంటున్న వదలలేదు, కోడిగుడ్లు, టమాటాలు ఫినాయిల్ , పెరుగు ఆ టైంలో ఏది దొరికితే అది పెట్టి కొట్టి ఊచకోత కోశారు నన్ను, కేక్ లు రెండు తెచ్చారు ఎవడు తిన్నాడు నా కర్మ కాకపోతే మొత్తం నా మొహానికే పూసారు,పూనకాలు అయిపోయాక అందరూ పడుకున్నారు ఎక్కడ పడితే అక్కడ,బర్త్ డే అంటే బాబోయ్ అనేలా చేసారు.
ఇక ఉద్యగం గురించి ప్రయత్నాలు మొదలు, టక్కులు వేసుకుని, టై లు కట్టుకుని ఇంటర్వ్యూలకి పోతూనే ఉన్నాము, 13 ఇంటర్వ్యూలు అయ్యాక 14 వ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అండి అది మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో నాతో పాటు మా ప్రకాష్ గాడు కూడ జాబ్ కొట్టాడు, పడుకున్న లేచిన నేను మెడికల్ షాపులో చూసిన అమ్మాయి గురించే నా మదిలో,ప్రకాష్ గాడికి చెప్పాను ఆ అమ్మాయి గురించి, ఇంత పెద్ద సిటీలో ఎక్కడ రా వెతికేది అన్నాడు, చూస్తూ ఉన్నాను తాను దొరకక పోతాదా అని, ఇంతలో అదృష్టం గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు ఆ అమ్మాయి మా ఆఫీసు లొనే జాయిన్ అయింది, నాకు తెలియదు ఇంకా, శ్రావణ శుక్రవారం వచ్చింది ఆఫీసులో ఉన్న అమ్మాయిలు అందరూ హాఫ్ శారీలో ఉన్నారు,ఆఫీస్ కలకల లాడిపోతుంది.
కాంటీన్ లో నేను మెడికల్ షాప్ లో చూసిన అమ్మాయిని చూసాను, పింక్ హాఫ్ శారిలో "పింక్ డైమండ్" లాగా ఉంది, వామ్మో మళ్ళీ పింక్ డైమండ్ అంటే రమణ దీక్షితులు,అమిత్ షా వచ్చి టీటీడీకి తీసుకుపోతారు అనుకున్న, అసలే పింక్ డైమండ్ కనపడడం లేదు అంటున్నారు అని అనుకుని, డైమండ్ లాగా ఉన్నది అనుకున్న మనసులో, పక్కన ప్రకాష్ గాడితో ఆ అమ్మాయిని చూడు మెడికల్ షాప్ అమ్మాయి చూడు మామ అంటే,అరేయ్ ఆ అమ్మాయి పేరు "కిరణ్మయి" రా అన్నాడు.
అరేయ్ ప్రకాష్ " కిరణ్మయి నడక చూడు హంస కూడా అలా నడవలేదు అనుకుంట,నెమలి తన అందాన్ని చూస్తే కుల్లుకుంటాది,తన స్వరం విని రామచిలుక,కోయిల అసూయ పడతాయిరా,ఉదయాన్నే వచ్చే కిరణాలు ఈ కిరణ్మయిని చూస్తే రావడం ఆగిపోతాయి మనసు నొచ్చుకుని, ఆ బుగ్గ మీద సొట్టలు ఆమె నవ్వుతూ ఉంటే ఇంకా అందం రెట్టింపు అవుతుంది,తన వాలు జడ ని చూస్తుంటే నేను గాలి వానలో కొట్టుకుని పోతునట్టు ఉందిరా మైకంలో,నక్షత్రాల దీవి నుండి వచ్చిన దేవతలా ఉందిరా", అని వెంటనే తాను ఎటు వెళ్తే అటు పోతూనే ఉన్నాను మూడు నెలలు,చిరు నవ్వు నవ్వుతుంది కనపడినప్పుడు, తనకి అర్థం అయింది అనుకుంట గౌతమ్ ఒకసారి లంచ్ తరవాత కలవండి అన్నది.
రింగ్ రోడ్డులో యమహా rx100 మీద సంతోషంగా వెళ్తున్నట్టు అనిపించింది మనసుకి, దేవత కరుణించింది అని, ఇంతలో నాన్న ఫోన్,చెప్పు డాడీ అన్నాను, తిన్నవా నాయనా అన్నాడు తిన్నా డాడీ అంటే, మీ తమ్ముడు కూడ కాయకష్టం అంటే ఏంటి డాడీ అన్నాడురా, వాడు కూడ, హ.. ఒకే డాడీ.. కొంచెం కొత్త సైకిల్ కొనియండి డాడీ వాడికి అన్నాను, లేదురా వాడికి మన ఫ్రూట్ షాపులోనే పనికి పెట్టాను, వామ్మో డాడీ ఉంటాను డాడీ అని ఫోన్ పెట్టేసాను.
కిరణ్మయి వచ్చింది ఇంతలో నీ బాధ ఏంటి ఇన్ని రోజులు ఎందుకు తిరుగుతున్నావు నా వెనకాల అంటే, నువ్వు "కొరమేను చేప" లాగా బలే ఉంటావు,నిన్ను పెళ్లి చేసుకుందామని అని అంటే, సిగ్గు లేదురా వెదవ నీకు అలా ఎలా మాట్లాడుతున్నావు సచ్చినోడ,పోర ఇక్కడ నుండి అంటే 'కొరమేను చేప ఎప్పటికి అయిన గాలానికి పడుద్ది అంటే, నేను తిమింగలం రా వెదవ అన్నది, తిమింగలానికి వల, ఉచ్చు కలిపి వేస్తాను అన్నాను, సముద్రంలో దూకి చచ్చిపో వెదవ అన్నది,ఏ ప్రేమ అయిన గోడవలతోనే మొదలు అవుతాది, మా ప్రేమ కూడా అప్పుడే మొదలవుతుంది అండి, రోజుకో డైరీ మిల్క్ సిల్క్ చాకలెట్ ఇచ్చే వాడిని, నవ్వేది తినేది నా ప్రేమ గురించి అడిగితే మాత్రం మొత్తం 90 రోజులు రోజుకి ఒక చాకలెట్ ఇవ్వాలి అని చెప్పింది, అప్పుడు చెప్తా ఏంటి అన్నది అంది, నేను ఏమో చాకలెట్ పిచ్చిది అనుకున్నాను,తినేది నవ్వేది ఏంట్రా ప్రకాష్ ఏంటి ఇది నాకు చెప్పు అన్నాడు, ప్రకాష్ గాడు హంస నెమలి రామచిలుక కొయిల స్టోరీ మళ్ళీ చెప్పాడు, ఆపురే నీ కీర్తనలు అని.
ప్రతి శనివారం ఆదివారం తాను ఉండే హాస్టల్ కి వెళ్లి మరీ చాకలెట్ ఇచ్చేవాడిని,86 చాక్లెట్స్ ఇచ్చాను, 87 వది ఇద్దామని చూస్తే తాను వాళ్ళ ఊరికి వెళ్ళింది తెలిసి నేను కూడా పోయాను తన దగ్గరకు, వెళ్లగానే నువ్వు వస్తావని నాకు తెలుసురా గౌతమ్ గా, అని చాకలెట్ తీసుకుంది.
లాస్ట్ చాకలెట్ ఇచ్చే రోజున నేను సర్ప్రైజ్ అయ్యాను, వాళ్ళ ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు ప్రకాష్ తీసుకు వచ్చాడు, అంటే నాకు తెలియకుండానే కిరణ్మయి ప్రకాష్ మా నాన్న వాళ్ళతో మాట్లాడి ఒప్పించింది, వాళ్ళ ఇంటిలో కూడా తనే ఒప్పించింది, ఇంత చక్కని అమ్మాయిని నువ్వు ప్రేమించాను అంటే కాదంటాన అని నాన్న అంటుంటే కళ్ళలో ఆనందం, కిరణ్మయిని పక్కకి తీసుకు వెళ్లి ఈ చాకలెట్స్ ఎందుకు అని అంటే భరించే వాడు భర్త, ఓర్పు సహనము ఉండాలి అని ఈ టెస్ట్ నీకు, ఈ టెస్ట్ నేను ఫెయిల్ అయితే అరేయ్ మొద్దు నువ్వు అంటే నాకు నిన్ను పిలిచి తిట్టిన రోజు నుండి ఇష్టమేర నువ్వంటే, వెంటనే చెప్తే కిక్కు ఏముంటాది అని పిచ్చి గౌతమ్ అని నవ్వుకుని సిగ్గుతో లోపలకి వెళ్ళిపోయింది, పెద్ద వాళ్ళు పెళ్లి సెట్ చేసేసారు, నేను కిరణ్మయి ప్రకాష్ గాడు సరదాగా వాళ్ళ ఊరు చూడడానికి పోయాము...

No comments:

Post a Comment