Tuesday, October 22, 2019

మీకోసం సూర్య - శంకర్... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 31

 న్యూస్ పేపర్స్ లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీరు తప్పు చేశారు అంటే మీరు తప్పు చేశారు అని రాజకీయ నాయకుల గొడవ, మా పార్టీ గొప్పది అంటే మా పార్టీ గొప్పది అని ఒకటే హడావిడి, మీరు అధికారం లో ఉండగా ప్రజల సొమ్ము ఇంత తిన్నారు అంత తిన్నారు అని గోల, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్య, ఆడవాళ్ళ మీద హత్యచారాలు, దీనికి టీవీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మీ క్రైమ్ ఇంత అని మళ్ళీ రేటింగ్స్, వాళ్ళ పాపులారిటీ కోసం, వచ్చే ఎన్నికలలో మనము గెలుస్తామ అని సర్వేలు,నా కొడుకుకి వచ్చే ఎన్నికలలో సీటు కావాలి అని ఒకటే రాజకీయ నాయకుడి హడావిడి,మా కులం గొప్పది అంటే మా కులం గొప్పది అని డిబేట్స్ , ఏంట్రా శంకర్ ఇది మన సమాజమేన మనం ఇక్కడేన ఉంటుంది అని సూర్య అంటుంటే, మనం మార్పు కోసం ఏం చేయగలం చెప్పు ఫేస్ బుక్ లో ఒక లైవ్ ఒక లైక్ ఒక షేర్ చేయగలం.
మొన్న మన పంచాయతీలో ప్రజలకు సమస్య వచ్చింది అని మన ఎమ్మెల్యే దగ్గరకి వెళ్తే ఏమన్నాడో తెలుసార సూర్య, మీరు ఏమన్నా మాకు ఓటు ఉరికునే వేశారా, ఓటుకు వెయ్యి తీసుకున్నారు, మొత్తం ఖర్చు పెట్టిన దాంట్లో నాకు ఇంకా సగం కూడా రాలేదు, ఓటు వేసినప్పుడు ఎంత ఇస్తావు అని అడిగారు కాని ఏమి చేస్తావు మాకోసం మా ఉరికోసం అని అడిగార, అయ్యా మా ఊరి ఓట్లు అన్ని మీకే వేశాము కదా ఎందుకు చెయ్యరు అయ్య అని మన సుబ్బయ్య తాత అంటే, ఆ ఎమ్మెల్యే మన తాతని గుండెల మీద తన్నాడురా చెత్త వెదవలు అని, అదే డబ్బు తీసుకోకుండా ఉంటే ఇంతలా ఉందునా చెప్పు
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ సారి ఓటుకి రెండు వేలు ఇస్తా అన్నాడు రా వాళ్ళతో, అంటే మనం 5 సంవత్సరాలు వాడికి బానిస కింద బతకాలి అంటరా, ఇప్పుడు చెప్పరా సూర్య సమాజం ఎక్కడ ఉందో, మనం మారాలి అని కాదురా సూర్య మనము ఎందుకు చేయకూడదు అని ముందుకు రావాలిరా, ఇప్పటి దాక నేను ఒక్కడినే పోరాడాను నువ్వు వస్తావా సూర్య చెప్పు,మనం కలిసి వెల్దాము ముందుకు నాకు తెలివి ఉంది నీకు గుండె ధైర్యం ఉంది మహా అయితే మన ప్రజల కోసం చచ్చిపోతాము, మనం గెలిస్తే మన సమాజం మారుతుంది, మనలో మనకి తెలియని ఒక కళాపోషకుడు ఉంటాడు సూర్య, ఆ కళ మన సమాజం అనుకుందాం మారుద్దాం రా..రా.. అంటే.
ముందు అది కాదు శంకర్ ఆ ఊరికి నన్ను తీసుకు వెళ్ళు అన్నాడు. ఇద్దరు కలిసి ఆ ఊరికి వెళ్లారు, ఊరి ప్రజలను పోగు చేశారు, మీ ఊరు సమస్య చెప్పండి అన్నాడు,ఊరికి బస్ లేదు అయ్య ,ఊరిలో తాగడానికి మంచి నీళ్ళు లేవు,ఊరిలో రోడ్స్ లేవు అయ్య, పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాలి అయ్య,రైతుకు అప్పులు బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం లేదు ఇలా చెప్పుకుని పోతుంటే సూర్య ఒక్కసారి ఆగండి మీరు ఇప్పుడు ప్రతి ఇంటికి బండి ఉందా అంటే ఉంది అయ్య అన్నారు, ప్రతి.ఈ ఇంటికి బోర్ ఉందా అంటే ఉంది ఒక 100ఇళ్లకు తప్ప అన్ని ఇళ్లకు బోర్ ఉందయ్య, పిల్లలు ఎన్ని కిలోమీటర్లు నడవాలి ఒక కిలోమీటర్ అయ్య, అసలు మీ ఊరికి సమస్యలు లేవు మీరే పెద్ద సమస్య మీ ఊరుకు, నేను రెండు రోజులు నుండి మీ ఊరును చూస్తున్న ఎవరికి తెలియకుండా, ఏంటి అయ్య ఆ తాగుడు మీరు రాత్రి అయితే ఇలా తాగితే రైతుకు అప్పులు కాకపోతే ఇంకేమి అవుతాది, రైతే రాజు అయ్య మన దేశానికి మీరే అలా అయిపోతే దేశం ఏమైపోతాది అయ్య, పంటలు పండక పోతే మనము పాడి మీద కూడ దృష్టి పెడదాము, పాడితో కలిపి పంటలు అంటారు అయ్య పాడిపంటలు అని, గ్రామలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు,పట్టుకొమ్మలో పట్టు ఉండాలి కదా సుబ్బయ్య తాత, మనము ఒక వెయ్యి రూపాయలు తీసుకుని ఓటు వేస్తాము అదే మనకు పోటు అవుతాది అని ఆలోచించావ రాము, పిల్లలు కిలోమీటర్ నడవనివ్వండి కష్టం బాధ్యత తెలుస్తాది, మీ పంచాయతీకి ప్రభుత్వం డబ్బులు పంపుతాది అని మీకు తెలుసా, అందరూ తెలియదు అయ్య మాకు ఆ లెక్కలు అంత ప్రెసిడెంట్ గారికే తెలియాలి.
ఈ ప్రెసిడెంట్ గారికి తెలిసేది ఈయన తాగి డాన్స్ వేస్తాడు రాత్రి అంత, ఈయన ఆ ఎమ్మెల్యే ఏది చెప్తే అదే చేస్తాడు,మీ సమస్యలు తీరాలి అంటే వచ్చే ఎన్నికలలో వాళ్ళకి గుణపాఠం చెప్పాలి, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతికి పల్లెకు తిరిగి సమస్యల గురించి తెలుసుకుని పరిస్కారం చెప్పేవాడు, సూర్య-శంకర్ ని చూసి ప్రత్యర్థులు బయపడేవారు, వారిని ఏమన్నా చేద్దామన్న వాళ్ళు ఇద్దరు ప్రముఖులు కొడుకులు, వీళ్ళ ఆశయం నచ్చిన యువత రోజు రోజుకు పెరుగుతుంది, ఊరును కాదు ఊరు ప్రజలను మార్చితే ఊరు బాగుపడతాది అని నమ్మే సిద్ధాంతం,ఒక రోజు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తో పాటు పక్కన ఉన్న నియోజక వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కలిపి సూర్య శంకర్ తో మీరు మా పార్టీలో చేరండి మంచి పదవులు ఇస్తాము అని,మీ వల్ల ప్రతి నియోజకవర్గంలో మాకు సమస్యలు వస్తున్నాయి,మీ బాబులని చూసి దయ చూపిస్తునాము.
ఏంట్రా మీరు చేసేది నా బొచ్చు ఇప్పటిదాకా ఏమి పీకారు గెలిచాక ఎప్పడు అయిన మీ నియోజకవర్గానికి వెళ్ళార్ర మీ బ్రతుక్కి, తు.మీ.. మొహాలు ప్రజల మీద పడి ఎడవకుండా మీ వ్యాపారాలు చూసుకోండి, ఇంకొక్కసారి.. సారీ ఏమి చేస్తానో నాకే తెలియదు అని శంకర్ అంటే సూర్యతో సహా అందరూ అలానే చూస్తున్నారు,వాళ్ళు వెళ్లిపోయారు.
ఓపిక ఎవడికి అయిన కొంత వరకే ఉంటాది, ఇప్పుడు శంకర్ నెక్స్ట్ జనాలు ఏంటిది ఎమ్మెల్యే గారు ఏం చేద్దాం,వాళ్ళు ఫేస్ బుక్ అని వాట్స్ అప్ గ్రూప్స్ అని,మీడియాలో, నేషనల్ మీడియాతో కలిపి ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నారు, ఇంతలో ఒక ఎమ్మెల్యేకి ఫోన్ వచ్చింది, సిగ్గు ఉందా నీకు ఒక ఊరు వచ్చి బస్,మంచి నీళ్లు అడిగితే ఆ ఊరుకు ఇవ్వడం తెలియదా, ఇప్పుడే సర్వే రిపోర్ట్స్ అందాయి మీ నియోజక వర్గంతో పాటు పక్కన ఉన్న 4 ఎమ్మెల్యేల సీట్లు గెలవడం కష్టం అని, చేతులకి గాజులు వేసుకుని చెక్క భజన చేసుకోమని పెద్దాయన చెప్పారు, పంపించమంటారా గాజులు అంటే సిగ్గు వేసి ఇది చేసిన వాళ్ళని బ్రతకనివ్వకూడదు అని సిద్ధమయ్యారు.
వాళ్ళని వాళ్ళ ఇంట్లో చంపలేము, బయట ప్రజల్లో ఇప్పడూ వాళ్ళకి ఉన్న పేరుకి కొంచెం తేడా వచ్చినా "ఎవరు అయిన చంపడానికి వెళ్లిన వాడిని ఊరు నడి మధ్యన నుండి కొట్టుకుంటూ తీసుకు వెళ్లి ఊరి పొలిమేరల్లో పాతేస్తారు అని చెప్పాడు".
సూర్య ఆశయాలు ఆవేశం చూసిన ఒక ఊరి అమ్మాయి మనస్వి వచ్చి సూర్య నువ్వంటే ఇష్టం నీతో అడుగు కలిసి ముందుకు వేద్దాము అనుకుంటున్నాను నీకు ఇష్టమేనా సూర్య అంటే, అందంగా ఉన్నావు చక్కగా ఉన్నావు నాకు ఈ ప్రేమాయణాలు తెలియదు నేను చేయవలసిన పుణ్యకార్యాలు చాలా ఉన్నాయి దయచేసి నన్ను వదిలేయ్ అని శంకర్ దగ్గరకి వెళ్ళి చుట్టు పక్కల ఉన్న 5 నియోజకవర్గ ప్రజలకు దగ్గర అవ్వాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఒక ఊరికి వెల్లగా అక్కడ యువత నిరుద్యోగ సమస్య పరిష్కారం మాకు లేదు అంటే దానికి సూర్య యంగ్ ఇండియా, స్కిల్ ఇండియా అని ఎందుకు అంటారో తెలుసా మన ఆలోచనా విధానం ప్రపంచంలో అందరికంటే ముందు ఉంటాది అని,చదువు చదివితే ఉద్యొగమే పరిస్కారం కాదు, చేతి పని కూడ చేయవచ్చు, నేను ఉద్యగం వస్తేనే వెళ్తాను ఇంకే పని చేయను అంటే నువ్వు ఇండియా లో లేవు అని అర్థం చేసుకో,ఆలోచన విధానం పెద్దగా ఉంటే అన్ని సమస్యలకు పరిస్కారం ఉంటాది, బాగా ఆలోచించు అని వెళ్ళిపోయాడు, ఇది నచ్చిన యువత సూర్య సూర్య అంటూ ఒకటే అరుపులు.
ఇంతలో శంకర్ జనంలోకి వెళ్తూనే "మన గ్రామం, మన పంచాయతి, మన మండలం, మన నియోజకవర్గం ,మన జిల్లా, మన రాష్ట్రం, మన ఇండియా, అంటాము కదా.
అలానే వెల్దాము ముందుకు మన ఊరు నుండి మన సమస్యల్ని తరిమి కొడుతూ,మండలం జిల్లా రాష్ట్రం చివరికి మన ఇండియాకి పట్టిన ప్రతి సమస్య కోసం పోరాడదాము మనమే పరిస్కరించుకుందాం అంటూ ఉంటే జై శంకర్ అన్న జై సూర్య అని అరుస్తున్నారు.
ఎన్నికల నామినేషన్ వేసారు శివ శంకర్ ఇంకో ముగ్గురు కలిసి మొత్తం ఐదుగురు,వీళ్ళతో పాటు మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు కూడ నామినేషన్లు వేశారు, ఒకటే హోరు ఎత్తి పోతుంది ప్రచారం,ఈ నియోజకవర్గంలో వచ్చిన మాజీ ఎమ్మెల్యేలకి చివాట్లు పెడుతూనే ఉన్నారు ప్రజలు, సుబ్బయని అవమానించిన ఎమ్మెల్యే సుబ్బయ్య ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే చేతిలో రెండు వేలు పెట్టి దయచేసి నీ పాదం మా ఊరిలో పెట్టకు వెదవలు కాళ్ళు మా ఊరిలో మోపకూడదు అని అన్నాడు,సిగ్గుతో ఆ ఎమ్మెల్యే సగం అక్కడే ఓడిపోయాడు, డబ్బులు పంచుతున్న వాళ్ళని ఊచకోత కోస్తున్నారు ఊరి వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిపి.
ఇంతలో సూర్య శంకర్ కలిసి వెళ్తుండగా ఎవరు లేని చోట వాళ్ళ కారు ఆపి 5గురు గుండాలు వీళ్లను చంపుదామనే లోపు సూర్య ఒక గన్ శంకర్ కి ఇచ్చి మొన్ననే కోఠి లో 50 వేలుకు రెండు కొన్నాను, చక్కగా పనిచేస్తున్నాయి చూడు అంటూ 5గురిని కాల్చి పారేశాడు, ఎందుకురా ఇలా చేసావు అంటే 5లక్షల మంది కోసం వీళ్ళని చంపడం నేరం కాదు,చెత్త ఎక్కువ అయితే ఊడ్చేస్తాం కదా వీళ్ళని ఊడ్చేస్తాం అలాగే, అలాగే ఊర్లకి వెళ్లి ప్రచారం చేస్తూనే ఉన్నారు, నియోజకవర్గాలలో ఎంత మార్పు ఒకేసారి అందరూ ఒకటే మాట డబ్బులు తీసుకుని ఓటు వేయము అని.
ఎలెక్షన్స్ అయిపోయాయి అందరూ భారీ మెజారిటీతో గెలిచారు,ప్రమాణస్వీకారం రోజున సూర్య ప్రమాణస్వీకారం చేస్తూ, నా నియోజకవర్గ ప్రజల సాక్షిగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అని,వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ వాళ్ళతో మమేకం అయి ఉంటాను అని ప్రమాణం చేస్తున్న అని అందరూ చేశారు,శంకర్ మాట్లాడుతూ మా పార్టీ ప్రజల పార్టీ అని మా పార్టీకి జెండా లేదు మా దేశ జండానే మా జండా, అని గెలిచిన వాళ్ళు తమ నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టడానికి వెళ్లిపోయారు...

No comments:

Post a Comment