Tuesday, October 22, 2019

అందాల దీవిలో.... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 32

పశ్చిమ తీరాన ఎగిసి పడుతున్న సముద్రపు అలలు,బలమైన ఈదురుగాలులు,అసలే పౌర్ణమి సముద్రం పోటెత్తుతుంది,ఎటు చూసిన సుడిగుండాలు, సముద్రంలో వర్తక రవాణా చేసే పడవలు అన్ని చెల్లా చెదురు పడుతున్నాయి,పడవలకి కట్టిన తెరచాపలని చీల్చుకుంటూ పోతున్న గాలులు, దేవరాయ పడవ కూడ సుడిగుండంలో చిక్కుకుంది,ఆ సుడి గుండం తిప్పిన తిప్పుడుకు పడవలో ఉన్న వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతు మాకు నువ్వే దిక్కు దేవుడా అని పడవలో ఉన్న వాళ్ళు పడిపోయారు.
సముద్రం పోటు తగ్గింది, సుడి గుండాలు లేవు, పడవ ఒక మూలన పడి ఉంది,దేవరాయ కళ్ళు తెరిచాడు,చనిపోయి స్వర్గంకి వచ్చాము అని చూసుకున్నాడు,పక్కన ఉన్న తన అనుచరులు 20 మంది అలానే ఉన్నారు,ఇంకా మాయలోనే ఉంది,నిజమో కాదో అని చూసాడు నిజమే మనం బతికాము అనుకున్నాడు,అనుచరులని లేపాడు దేవరాయ, అందరూ లేచారు,ఎక్కడ ఉన్నాము ప్రభు అంటే, దారి తెలియదు గమ్యం తెలియదు తీరాలు దాటి వచ్చి ప్రాణాలతో బయట పడ్డాము అన్నాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ప్రభు అంటే,ప్రాణాలతో బయట పడిన మనకి ఆ దేవుడు దారి చూపుతాడు మిత్రులార,శత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు మన ఆలోచన మెండుగా ఉండాలి మిత్రులార, ఎవరు అధైర్య పడవద్దు, కలిసి కట్టుగా ఉందాం,ఇంతలో మహాప్రభు ఇక్కడ ముత్యాలు ఉన్నాయి ప్రభు ఇది ఎదో పగడాల దీవి లాగ ఉంది ఆ ముత్యాన్ని చూసిన దేవరాయ ఆశ్యర్య పోయాడు. తన విన్న పురాణాలలో ఇలాంటి ముత్యాలు ఉన్న దీవి ఒకటే ఉన్నది అని, ఆ ముత్య సంపద చాలా విలువ అయినది అని విన్నాడు,ఒక మైలు తీరంలో ఒక దీవి కనపడుతుంది, ఇక్కడే దేవాదాయ ఒక గడియ కూర్చుని ఆలోచిస్తున్నాడు, ఏది అయిన కార్యం చేసే ముందు చాల ఆలోచించాలి అని తన గురువు గారు చెప్పిన మాటలువిని, కిరీటి అనే వాడు తన దగ్గర ఉన్న మంత్రి , కిరీటి ని రమ్మని,భోజనం ఎంత మందికి ఎన్ని రోజులు వస్తాదో అడిగాడు, ఒక 20 రోజులు వస్తాది ప్రభు అన్నాడు,వెంటనే 20 మందిని వరుసలో నిలబెట్టారు దేవరాయ, మనం బ్రతకాలి అంటే మనకి ఉన్న సమయం 20 రోజులు, ఇక్కడ పది మంది ఉండి చెడిపోయిన ఈ పడవను మరమ్మతులు చేయించండి, పనిలో నెమ్మది మాత్రం వద్దు మిత్రలార, సమయం మనకి లేదు,మిగిలిన పది మంది నాతో కలిసి పగడాల దీవికి రండి, ఆ సంపద చాల విలువ అయినది అది మనకి దొరికితే మన రాజ్యం సుభిక్షంగా ఉంటాది,మొత్తం 21 మందిమి 10 మంది ఇక్కడ 10 మంది నాతో వస్తారు, మన పడవలో ఉన్న డేగ, పావురాన్ని తీసుకు రండి, ఒక గుడ్డ మీద మేము అపాయం లో ఉన్నాము, పగడాల దీవి గురించి తెలిసిన మన గురువు గారిని మీతో తీసుకురండి, ఆయన ఒక్కడికే ఈ చోటు తెలుసు, పశ్చిమ తీరాన వచ్చే అప్పుడు చాలా జాగ్రత్త వహించండి అక్కడ సముద్రం పోటెత్తుతుంది, ఇక్కడ అపార సంపద ఉన్నది, మీకు సమయం కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నది, దాని మీద ఇప్పుడు పౌర్ణమి తర్వాత రోజు ఈ వర్తమానం రాస్తున్నాము అని డేగకి ఒకటి చుట్టి పావురనికి ఒకటి చుట్టి పంపారు, అదేంటి మహా ప్రభు రెండు ఎందుకు డేగ మన రాజ్యానికి, పావురం నా స్నేహితుడు రాజ్యానికి ఈ పగడాల దీవి గురించి నా మిత్రునికి కూడా తెలుసు, వారు రావడం ఆలస్యం అవుతాది ఏమో కాని నా ప్రాణ మిత్రుడు కుమార తప్పక వస్తాడు సమయానికి.
పడవ తీరం నుండి నడుస్తున్న కొద్ది అసలు దీవి కనపడడం లేదు, ముందు కనపడ్డ దీవి కేవలం చెట్లు మాత్రమే ఉన్నాయి అదే పగడాల దీవి అని పొరపడ్డాము అని తన వాళ్లకి చెప్పాడు,ఇక్కడ దీవులు సమూహం చాలా విచిత్రంగా ఉంది ఒకదాని తరవాత ఒక దీవి ఉంది మళ్ళీ ఆ దీవికి వెళ్ళడానికి మధ్యలో సెలయేరు లాగా ఉంది, ప్రభు ఈ సెలయేరు చాలా పెద్దది మనం సగం వరకు మాత్రమే ఈదగలము తరువాత ఏమి జరుగునో మీకు తెలుసు అవును కిరీటి మీరు చెప్పినది నిజం, ఎటు చూసిన వెళ్ళడానికి దారి లేదు పది మందిలో ఒకరు నేను ఒకసారి ఈ సెలయేరు ఈదుతాను నేను అవతలి వడ్డుకు వెళ్లిన మనం అందరం ఈదగలము అని బయలుదేరాడు, సెలయేరు మధ్యలోకి వెళ్లగానే నీటి ప్రవాహం ఎక్కువ అయింది సగం దూరం వెళ్లగానే కొట్టుకుని పోయాడు,ఇదేదో ప్రమాదపు దీవి లాగా ఉంది ప్రభు అని అంటుంటే,కిరీటి ఒక పది నిమిషాలు అందరూ కళ్ళు ముసుకోండి అని, దేవరాయ మనసును మొత్తం ఏకాగ్రత చేసి కళ్ళు మూసుకుని తన చెవులు మాత్రమే పని చేసేలా ఆ దీవిలో ఉన్న ప్రతి శబ్దం వింటున్నాడు,సముద్రపు గాలి, ఇంకా ఎవరో మాటలు వినపడుతున్నాయి, ఎక్కడ అని మనసులో చూస్తున్నాడు చెవులతో వింటూ, నాలుగు వందల అడుగుల దూరాన అని కళ్ళు మూసుకుంటు అక్కడికి వెళ్ళాడు, కళ్ళు తెరిచి చూస్తే జలకన్య, నమస్కరించి తల్లీ మేము ఈ సెలయేరు దాటలి, మీ అనుగ్రహం కావాలి తల్లి అంటే వెంటనే దేవరాయ నువ్వు వస్తావు అని మాకు తెలుసు, ఎందుకు ఏమిటి అని అడగకు అది నీకే ప్రమాదం అని చెప్పి తనతో ఉన్న ముగ్గురిని ఈ దీవి దగ్గర ఉంచి, మన వాళ్ళు వస్తారు వాళ్ళకి మార్గం చూపించండి అని మిగిలిన 6 గురు జలకన్య సహాయంతో సెలయేరు దాటారు, జలకన్య వెళ్తూ ఒక అంగూలీకము ఇచ్చింది దేవరాయకి చెవిలో ఒక మాట చెప్తూ.
సెలయేరు దాటగానే ఉన్న దీవిలో అంత భయంకరంగా ఉన్నది, తగిన వర్షం లేక ఈ దీవిలో ఉన్న చెట్లు మొత్తం ఎండి పోయాయి, పక్కన అంత సెలయేరు ఉన్న ఇక్కడికి నీరు రావడం లేదు అని తనతో ఉన్న వారితో కలిసి సెలయేరు లో ఉన్న నీరును దీవిలో ఉన్న మొక్కలకి చెట్లుకు మళ్లించారు, ఇంతలోనే ఎంత ఆశ్చర్యం నీరు తగలగానే దీవి అందం మారిపోయింది,ఆకాశాన్ని తాకే చెట్లు, పువ్వులు, తమకి కావాల్సిన ఆహారం కూడా దొరికాయి వాళ్ళకి,ఇంతలో వన కన్య ప్రత్యక్షమయ్యింది, దేవరాయ ఇన్ని రోజులు మేము చూస్తున్న రోజు రానే వచ్చింది, మా దీవిని ఇంత అందగం చేసిన నీకు ఒక రహస్యం చెప్తాను ఒక అంగూలీకము ఇస్తాను అని చెప్పింది, అంగూలీకము ఇస్తూ చెవిలో రహస్యం చెప్పింది, ఇంకో దీవికి వెళ్ళాలి అక్కడి నుండి తనతో ఉన్న 6 గురిలో ముగ్గురిని ఇక్కడే పెట్టి మిగిలిన ముగ్గురితో కలిసి ఒక ఎడారి లాంటి దీవికి వెళ్ళాడు అప్పుడే సమయం 10రోజులు అయిపొయింది.
పావురం వర్తమాన సమాచారము అందిన కుమార బయలు దేరి వస్తున్నాడు, తన అన్నదమ్ములు మాత్రం వర్తమానం అందిన ఆ ప్రదేశం గురించి భయపడి బయలుదేరలేదు,కుమార తన కార్య వర్గంతో 7 పడవలు మీద బయలు దేరాడు,పగడాల దీవి గురించి తెలిసిన తాలపత్రాల గ్రంధం తీసుకుని.
ఎడారి దీవికి వచ్చిన దేవరాయకి కిరీటి ప్రభు మనం ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏంటి అంటే, ఆలోచిస్తున్నా కిరీటి ఏమిటా అని అక్కడే ఉన్న ఒక బండ రాయి మీద చేయి వేసాడు,ఆ బండ రాయి ఒక దేవకన్యలా మారిపోయింది, ఆ ఎడారి స్వర్గం అయిపోయింది, ఆశ్యర్యం ఆనందం ఒకేసారి దేవరాయ నువ్వు వస్తావు అని మాకు తెలుసు, ఆ జలకన్య వనకన్య ఇచ్చిన అంగూలీకముతో ఈ బండ రాయిని తాకిన నువ్వు నన్ను దేవకన్యలా మార్చావు, నీవు అనుకున్నది తప్పక నెరవేరుతుంది ఇదిగో అంగూలీకము అని తను వెల్లవలిసిన దీవికి తీసుకుని వెళ్తుండగా కిరీటి మీ ముగ్గురు ఇక్కడే ఉండండి నేను ఒక్కడినే వెళ్తాను అని పగడాల దీవికి బయలు దేరాడు.
మనసులో అనుకున్నాడు ఇప్పటిదాకా మనం వచ్చింది పగడాల దీవి కాదు ఇప్పుడు మనము వెళ్ళేది అని, పగడాల దీవిలో అడుగు పెట్టగానే పగడాలు వజ్రాలు బంగారంతో కల కళలాడిపోతుంది, ముట్టు కందాము అంటే మాయము అయిపోతున్నాయి, ఆ దీవిలో మాయ మాంత్రికుడు ఉన్నాడు, ఇంతలో ఇద్దరు రాక్షసులు వచ్చారు వాళ్ళని తన దగ్గర ఉన్న ఖడ్గంతో సంహరించాడు, మాయ మాంత్రికుడు ఎంత వెతికిన కనపడడం లేదు, అక్కడ ఉన్న ఒక పగడాన్ని పట్టుకుందామని వెళ్తే అది ఒక్కటే మాయమవలేదు, వెంటనే దేవరాయ తన ఖడ్గంతో ఆ పగడాన్ని నాశనం చేసాడు వన కన్య చెప్పిన రహస్యం అదే అని,అలా చేసిన వెంటనే మిగిలిన పగడాలు వజ్రాలు మాంత్రికుడు అన్ని కనపడుతున్నాయి, మాంత్రికుడితో పోరాడుతున్న దేవరాయ తన మనసులో జలవనదేవ కన్య అనుకున్నాడు వాళ్లు ఇచ్చిన అంగూలీకములని చూస్తూ వెంటనే ముగ్గురు ప్రత్యక్షమయ్యి మంత్రికుడిని నాశనము చేశారు.
జల కన్య మాట్లాడుతూ ఈ పగడాల దీవి లో మేము అందరమూ సంతోషంగా ఉండేవాళ్లము,ఈ మాంత్రికుడు వచ్చి మమ్మల్ని వివాహము చేసుకోవాలని అడిగాడు విడివిడిగా వాడి శక్తులని పెంచుకోవడానికి, ఎవరు ఒప్పుకోలేదు అని మాకు శాపం ఇచ్చాడు వాడికి ఉన్న శక్తులతో, ఒక్కరు అయితే ఎదుర్కోలేము ముగ్గురము అయితే సంహరిస్తాము అని నారాయణుడు చెప్పాడు, మీకోసం ఒక మానవుడు వస్తాడు అని,అది నువ్వే దేవరాయ ఈ దీవి నీది నీకు ఎల్లప్పుడూ మేము తోడు ఉంటాము, పగడాల కన్య ఉంది ఇక్కడ తను ఈ మంత్రికుడికి భయపడి ఒక పగడం లో దాక్కుని ఇప్పుడు బయటకి వచ్చింది,ఈమెను వివాహం చేసుకో అని వరం ప్రసాదించి మాయం అయిపోయారు.
అనుకున్న సమయానికి కుమార వచ్చాడు అక్కడ ఉన్న పడవ దగ్గరకి,వాళ్ళకి ఆహారం ఇస్తూ దేవరాయ దగ్గరకి బయలు దేరాడు తన సహచరులతో,తను అక్కడ పెట్టిన ఒక్కొక్కరు దారి చూపిస్తూ చివరికి దేవరాయ దగ్గరికి వెళ్ళాడు కుమార, దేవరాయ మాట్లాడుతూ నా కోసం నా ప్రాణ మిత్రుడు వస్తాడు అని తెలుసు కుమార, చెప్పాను కదా కిరీటి కుమార వస్తాడు అని, ఆ పగడాల కన్యతో అక్కడ ఉన్న సంపదతో తిరిగి తీరం చేరుకున్నాక ఆ దీవి మాయం అయిపోయింది, అది చూసిన కుమార మన గురువు గారు చెప్పింది నిజమే దేవరాయ అని అందరూ బయలు దేరి పడవలో సముద్రంలో ప్రయాణానికి సిద్ధం అయ్యారు...

No comments:

Post a Comment