Tuesday, October 22, 2019

ఏమో ఏమి జరిగిందో... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 33

 ఉరుకుల పరుగుల జీవితంలో ఉలుకు పలుకు లేకుండ సాగిపోతున్న ఊ అన్న పలకరించే పక్కని వాళ్ళు లేని, ఆకాశాన్ని తాకే కొండల్లాంటి ఎత్తులో ఉన్న అపార్టుమెంట్ లో 8వ అంతస్తు 804 డబల్ బెడ్ రూం ఫ్లాట్ నుండి విజయవాడ పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి సర్ ఇక్కడ ఉన్న ఒక మహిళను హత్య చేసారు అని చెప్పారు.మామూలు వాళ్ళు అయితే ఇద్దరు పోలీస్ వాళ్ళు వెళ్లి వచేద్దురు, కానీ చనిపోయిన అమ్మాయి ఒక పార్టీ ముఖ్య నాయకుడి కూతురు.
ACP వర్మ సంఘటన స్థలానికి వెళ్లారు, వాళ్ళు పైకి వెళ్లే టైంకి లిఫ్ట్ పనిచేయలేదు.ఇక మెట్లు ఎక్కుకుంటు వర్మ పక్కన ఉన్న పోలీసు వాళ్ళతో లావు ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి అంటే ఇలాంటి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుని ఉండి లిఫ్ట్ లేకపోతే సరి అన్నాడు. ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యారు వర్మ గది మొత్తం గమనించాడు చనిపోయిన స్వప్న భర్తను పక్కింటి వాళ్ళని ఎలా జరిగింది అని అడుగుతున్నారు.
స్వప్న భర్త నేను ఉదయాన్నే వచ్చి చూసేసరికి గదిలో శవం అయి ఉంది అని అన్నాడు, మా పెళ్లి అయ్యి పది రోజులు అయ్యింది అన్నాడు. క్లూస్ టీం కూడా ఏమి చెప్పలేకుండా అయిపోయింది, తన మీద విషప్రయోగం చేశారు అని తెలుస్తుంది కానీ ఎలాగో తెలియడం లేదు ఎవరో చెప్పలేము వెంటనే అన్నాడు వర్మ. పెళ్లి అయిన పది రోజులలో ఎందుకు ఇలా జరిగింది అని భర్తని విచారణ మొదలు పెట్టారు.ఎంత అడిగిన నాకు ఏమి తెలియదు అన్నాడు.
అపార్టుమెంట్ వాచ్ మెన్ ని కూడ విచారణ మొదలు పెట్టారు, ఎవరిని అడిగిన మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని సమాధానం.పై నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంది మంత్రుల నుండి ఒకటే ఫోన్లు, ఎస్.ఐ మురళి వచ్చి జూన్ 16 2015(చిత్ర) మరియు 4 సెప్టెంబర్ 2016(శ్రావణి) ఇలాంటి విష ప్రయోగం హత్యలు జరిగాయి సర్ అంటే ఇందులో కామన్ పాయింట్ ఏంటి అంటే పెళ్లి అయిన పది రోజులకే అమ్మాయిలకి విషం ఇచ్చి చంపారు సర్ అన్నాడు.
ఆ కేస్ లో కూడ ఇప్పటి దాక ఏ క్లూ దొరకలేదు సర్ అన్నాడు, ఈ క్లూ చాలు మురళి అన్నాడు. వర్మ చనిపోయిన అమ్మాయిల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు, చనిపోయిన ముగ్గురు అమ్మాయిలు చాల ఉన్నత కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళ కుటుంబం దగ్గరకి వెళ్ళి కనుక్కున్న ఏమి తెలియలేదు.
వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్లిన వాళ్లకు ఏమి తెలియడం లేదు అన్నారు, మీకు ఏమన్నా తెలిస్తే నాకు ఫోన్ చేయండి అన్నాడు. వర్మకి కోపం ఎక్కువ అయిపోతుంది వాళ్ళు దొరకక, ఇక చూసుకో వర్మకి ఎవడైనా అమ్మాయిలను ఏడిపిస్తూ కనిపించాడు అంటే వాడు నడవడానికి రెండు రోజులు అయిన పట్టేలా కొట్టేవాడు. అమ్మాయిలు అంటే అంత అలుస చంపడానికి మురళి నాకు వాళ్ళు కావాలి, వాళ్ళు మనకి దొరికే దాక ఇంకా ఎక్కువ సేపు పని చేద్దాం అన్నాడు.
వర్మ స్నేహితుడు శేఖర్ చాల తెలివి అయిన వాడు, మంచి మేధావి ఎన్ని ఎత్తులని అయిన చిత్తు చేయగలడు. ఇక తప్పక శేఖర్ ని కలిసాడు వర్మ, జరిగింది మొత్తం చెప్తాడు, శేఖర్ ఖర్చు అవుతాది అన్నాడు, తమరు ఎప్పుడైనా డబ్బు లేకుండా పని చేశార ఇస్తాము తప్పిద్దా అన్నాడు.
శేఖర్ రంగం లోకి దిగాడు అతని ఆలోచన చాలా బాగుంటుంది,స్వప్న వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ లోకి వెళ్లాడు కొన్ని రోజులు అక్కడ ఒకరిని పరిచయం చేసుకుని, ఇదిలా ఉండగా అక్కడ ఉన్న వాచ్ మేన్ కొత్తగా బండి కొన్నాడు, మనమే అపార్ట్మెంట్ లో ఉంటు కింద మీద పడుతున్నాము, వాళ్ళ అబ్బాయికి ఫీవర్ అంటే నా దగ్గర 500 వందలు తీసుకుని వెళ్ళాడు,అలాంటి వాడు ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి కొత్త బండి కొన్నాడు వాడి పని మంచిగా ఉంది అని అంటుంటే ఆ మాటలు శేఖర్ విన్నాడు.
ఈ లోపు వర్మకి ఒక ఫోన్ వచ్చింది బయట దేశం నుండి సర్ నేను చిత్ర ఫ్రెండ్ ని, చిత్ర గురించి నాకు తెలిసినవి చెప్తాను మీకు అన్నది. చంపిన వాళ్ళని మీరు పట్టుకోవాలి అన్నది, వర్మ చెప్పు అన్నాడు , చిత్ర ఎప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండేది తాను అంటే ఇష్టం అనేది తననే పెళ్లి చేసుకుంటాను అని అనేది.
కానీ ఒక రోజు నా దగ్గరకు వచ్చి నేను వాడిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండలేను, వాడు అందరిలా కాదు వాడు అర్థం కాడు అన్నది. ఎప్పుడు రెండు ఫోన్లు పెట్టుకుని ఉండేది, తాను ఎప్పుడు బయటకి వెళ్లిన మాకు చెప్పేది కాదు, ప్రేమించిన వాడిని మేము ఎప్పడూ చూడలేదు అన్నది. వాడి పేరు జానీ అనుకుంట సర్ అన్నది, ఇవన్నీ రాసుకున్నాడు ఒక పక్కన బుక్ లో.
ఇంతలో శేఖర్ వచ్చాడు వర్మ దగ్గరకి వెళ్లి స్వప్న వాళ్ల అపార్ట్మెంట్ వాచమేన్ ని తీసుకు రమ్మని అడిగాడు. వాచమేన్ శ్రీను భయపడుతూ వచ్చాడు ఏమి మాట్లాడకుండా వర్మ ఒక గదిలోకి తీసుకు వెళ్లి కొడతానే ఉన్నాడు, నేను నిన్ను ఏమి అడగను మాకు కావాల్సింది నువ్వే చెప్పు అని.
వాచ్ మెన్ ఇక చెప్పడం మొదలు పెట్టాడు సర్ స్వప్న మేడం పొద్దు పొద్దున్నే జాగింగ్ చేయడం అలవాటు, నేను ఒక సారి బయటకి వెళ్తున్నపుడు పొద్దున్నే ఒక కార్ లో నలుగురు దిగి స్వప్న మేడం దగ్గరకి వెళ్లారు. మేడం భయపడుతూ ఇంటికి వెళ్ళింది అప్పుడు ఇంకా ఎవరు లెగలేదు సర్, తన వెనకాలే వచ్చారు ఆ నలుగురు, నేను ఆపుతుంటే నాకు ఒక డబ్బు కట్ట ఇచ్చారు, అసలే పేద బతుకులు కదా సర్ డబ్బు చూడగానే మనిషి విలువ మర్చిపోయాను.వాళ్ళు స్వప్న అమ్మను చంపేస్తారు అనుకోలేదు సర్,వాళ్ళని గుర్తు పడతావ అన్నారు, సర్ నాకు వాళ్ళు సినిమా హీరోల లాగా ఉన్నారు అందరూ అన్నాడు, ఒక పేరు రవి అని విన్నాను సర్.
శేఖర్ వెంటనే రవి గురించి వర్మ జానీ ఎవరో తెలుసుకోవడాని బయలుదేరారు,జానీ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు వర్మ. చిత్ర ఇంటికి వెళ్ళాడు చిత్ర గదిలోకి వెళ్లి వెతికారు, బాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసారు, మనీ ఎక్కువ డ్రా అయినట్టు ఉంది, ఒకే ఒక అకౌంట్ కి ఆరు లక్షలు ట్రాన్సఫర్ అయ్యాయి అని ఉంది, ఏ అకౌంట్ అని చెక్ చేస్తే ఒక కార్ కొనడానికి అని, చిత్ర వాల్ల నాన్నని అడిగితే మా అమ్మాయికి కార్ ఉన్నది ఏమి కొనలేదు అన్నాడు.
ఆ కార్ డీటెయిల్స్ కనుక్కున్నాడు అది ఏమో ఇంకా చిత్ర పేరు మీద ఉన్నది, ఆ కార్ నెంబర్ తో అది ఎక్కడ ఉన్నదో తెలియడం లేదు. కానీ కార్ కి చలనా వేసినట్టు కనపడింది ఇంటర్నెట్ లో,ఒకటే ప్లేస్ లో రాంగ్ రూట్ అని,శేఖర్ కూడా రవి ఉన్న ప్లేస్ ని కనుక్కున్నాడు.
విచిత్రం ఏంటి అంటే వర్మ శేఖర్ ఒక్కటే చోటు కలిసారు, ఈ హత్యలు చేస్తుంది ఒక ముఠా లేక స్నేహితులు అయ్యి ఉండవచ్చు అన్నాడు.చివరికి వాళ్లు ఉన్న ఇంటికి వెళ్తారు, ఇంట్లో ఎవరూ ఉండరు, తాళం పగల గొట్టి లోపలకి వెళ్లారు, లోపల ఒక బోర్డ్ మీద స్వప్న, చిత్ర, శ్రావణి, ఇంకో ఇద్దరు అమ్మాయిల ఫోటో ఉన్నాయి.
ఆ అమ్మాయలు ఎవరు వాళ్లే తరువాత టార్గెట్ అని వాళ్ళకి అర్థం అవుతుంది, కార్ ఇంట్లో ఉంది అంటే వీళ్లు లేరు ఇక్కడ అని ఆ అమ్మాయల కోసం వెళ్లారు. ఈ నలుగురి పని డబ్బు ఉన్న అమ్మాయిలను ప్రేమించడం డబ్బు గుంజడం ఎదురు తిరిగితే చంపేయడం, పెళ్లి అయ్యాక బెదిరిస్తే ఎక్కువ డబ్బులు వసూలు చేయవచ్చు అనుకున్నారు ఏమో అన్నాడు.మిగిలిన అమ్మాయిలను కాపాడాలి అని వాళ్ళ గురించి వెతకడం మొదలు పెట్టారు, ఇంతలోనే పోలీస్ స్టేషనకి ఫోన్ వచ్చింది ఇక్కడ ఒక హత్య జరిగింది అది ఫొటోలో ఉన్న అమ్మాయి అని.
ఆ హంతకుల ముఠా వాళ్ళు హత్య చేసి పారిపోతుంటే వాళ్ళ కార్ వచ్చి పోలీస్ కార్ ని ఢీకొట్టారు, అనుమానాస్పదంగా ఉన్నారు మత్తులో అలా అని వాళ్లు తాగినట్టు లేరు, ఏదో డ్రగ్ తీసుకున్నారు, కార్ లోపల ఇంజెక్షన్స్ డ్రగ్స్ ఉన్నాయి. ఎస్.ఐ మురళి వచ్చాడు, కార్ లో నలుగురు ఉన్నారు అందరూ యువకులు లాగా ఉన్నారు. మత్తులో ఉన్న వాళ్ళని ఏమి అడగకుండానే వాళ్ళే నిజం చెప్తున్నారు, అవి రికార్డ్ చేస్తున్నాడు మురళి చాలా సిన్సియర్ గా లవ్ చేసాము, మేము లవ్ చేసిన అమ్మాయిల చాలా పలుకుబడి ఉన్నవాళ్లు. అందుకే ఏ ఆధారం వాళ్ల ఇంట్లో వాళ్ళకి దొరకకుండ మేమె వాళ్ళకి ఇంకో మొబైల్ ఇచ్చేవాళ్ళం ఎవరికి తెలియకుండ చాలా జాగ్రత్త తీసుకునే వాళ్ళము. కానీ ఆ అమ్మాయిలకు మాకు డ్రగ్స్ అలవాటు ఉన్న విషయం వాళ్ళకి తెలిసి పెళ్ళికి ఒప్పుకోలేదు.
అందుకే అందరం కలిసి మాకు దక్కని వాళ్ళని ఎవరికి దక్కకూడదని చంపేసాము,మాకు డబ్బు అవసరంలేదు మత్తు ఎక్కాక ఎవరు ఏమి చెప్పిన వినము,నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు ఇస్తాము వదిలేయండి అన్నారు. మురళి వెంటనే వర్మకి ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్ ఒక బాడ్ న్యూస్ సర్ అన్నాడు, దొరికారు అన్న కంగారులో మురళి చెప్పేది వినకుండా గన్ లో బుల్లెట్లు లోడ్ చేసి శేఖర్ మరియు వర్మ వెళ్లారు వాళ్ళ దగ్గరకి.
అక్కడికి వెళ్లగానే వర్మ మరియు శేఖర్ ల గుండెలు పగిలిపోయాయి, ఆ నలుగురిలో ఒకడు వర్మ కొడుకు, ఇంకొకడు శేఖర్ కొడుకు. మురళి వర్మతో అన్నాడు ఏమి చేయంటారు సర్ అని, కన్నీలతో మురళి నేను ఈ సమాజానికి మేలు చేయాలి అని వచ్చాను, నా ఇంట్లోనే ఒక హంతకుడు ఉన్నాడు అంటే నమ్మలేకపొతున్నాను.
పండిత పుత్ర పరమ సుంట అంటే ఇదేనేమో, అడిగినంత డబ్బు ఇచ్చి ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండా మేము బతికాము మాది చాలా తప్పు ఉన్నాది అని, శేఖర్ మనం ఇద్దరం కలిసి వీళ్లను మంచి స్నేహితులుగా ఉంటారు అనుకున్నాం,వీళ్లు నేరస్తులు అయ్యారు.
శేఖర్ వెంటనే మనము అనుకున్నదే చేద్దాం వర్మ ఇంకో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా అని, మురళి మీ పని మీరు చేసేయండి అని శేఖర్ వర్మ బయటకు వచ్చి ఒకరిని ఒకరు ఓదార్చుకుంటు ఉండగా బుల్లెట్ శబ్దాలు వినపడ్డాయి, చనిపోయిన అమ్మాయిలకు న్యాయం జరిగింది శేఖర్ అన్నాడు వర్మ ఏడుస్తూ...

No comments:

Post a Comment