అన్న ఎంతసేపటిలో వెళ్తావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి,తొందరగా
పోనివ్వు అన్న ట్రైన్ వెళ్లిపోతాది మళ్ళీ నాకు కష్టం అవుతాది.అరేయ్ చరణ్
ఫోన్ లిఫ్ట్ చేయరా ఎక్కడ ఉన్నావురా అని సలీం ఒకటే టెన్షన్
పడుతున్నాడు.నువ్వు వచ్చి ఆటో నడుపు అన్న ట్రాఫిక్ కష్టాలు అంటే ఏంటో
తెలుస్తాయి. కొద్ధి సేపు ఉన్న మీకే ఇలా ఉంటే డైలీ ఆటో నడిపే మాకు ఎలా
ఉంటాది.ఇంతలో స్టేషన్ వచ్చింది, మీటర్ రేట్ చూసి సలీం షాక్ అయ్యాడు.ఏంటి
అన్న 6 కిలోమీటర్లకు 600 వందల రూపాయల, నేను కూడ ఆ సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి
ఆటో కొనుక్కుని తిప్పుకుంటా అని అన్నాడు.ఒక పక్కన చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయడం
లేదు.
'హాజరత్ నిజముద్దీన్' ఎక్స్ ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అని రైల్వే ఎనౌన్సమెంట్ విని సలీం పరిగెడుతు ట్రైన్ ఎక్కాడు.లోపలకి వెళ్లి చూస్తే చరణ్ ఉన్నాడు. అబే చరణ్ గా ఫోన్ లిఫ్ట్ చేయవేర.సలీం నేను ఫోన్ లిఫ్ట్ చేసాను అనుకో ట్రైన్ ఉందా, వెల్లిపోయిందా ఇంకా ఎంతటైం లో వెళ్తాది అని అంటావు. నేను నిన్ననే చెప్పా నీకు సమయానికి స్టేషన్ చేరుకోవాలి అని.
ఆ మాత్రం ఉండాలి మామ సమయపాలన.ఇంతకి ఢిల్లీ ఎందుకు మనం వెళ్తుంది అంటే చరణ్ అందాలని చూద్దాం అని మామ,అయిన ఢిల్లీ ఒకటేన ఏంటి వెళ్ళేది మనము, చాలా ఉన్నాయి మనము చూడాల్సినవి.
అరేయ్ చరణ్ మా మేనేజర్ గాడు నాకు 4 రోజులే సెలవులు ఇచ్చాడు, తరవాత నీ ఇష్టం టైంకి రాకపోతే అన్నాడు మామ.ఏం కాదులేర కొత్త జాబ్ చూసుకుందువు గాని అంటే, నాకు అర్థమైంది నన్ను అప్పుడే ఇంటికి పంపవు అని.దానికి చరణ్ ఏమో చూద్దాం అన్నాడు.ట్రైన్ లో అందరూ ఫాస్ట్ ఫుడ్ తింటుంటే చరణ్ తన బ్యాగ్ తీసి పులిహోర ఇచ్చాడు.ఏంట్రా ఇది అంటే నేనే చేసాను తిను కుమ్మేయ్ సలీం అన్నాడు, నా మొహం రా, నా మొహం నువ్వు శాడిస్ట్ రేయ్ నువ్వు సైకోవి అంటుంటే నేను ఏదో బిర్యానీ అనుకున్నా.తినురా ముందు సొల్లు అపి అంటే ఇద్దరు తింటున్నారు. అరేయ్ విమానం ఎక్కితే 2 గంటలలో ఉండే వాళ్ళం, ఒక రోజు అంత కూర్చోవాలి ఏంట్రా ఇది చరణ్,మూసుకుని తిను సలీం అంటుంటే.
ట్రైన్ నాగ్ పూర్ వచ్చింది.బయటకి వెళ్లిన చరణ్ ఇంకా రాలేదు, ట్రైన్ కదులుతుంది, బయటకి చూసాడు చరణ్ లేడు, ఒకటే టెన్షన్ సలీంకి చరణ్ ఎక్కడ ఉన్నాడు అని, విజిల్ వేసుకుంటూ చరణ్ వస్తున్నాడు ఏమిరా సలీం ఏంటి బయపడ్డావ. హ హ నేను నీ పాలిట సైతనురా, అవునురా అవును వెధవ అని సలీం అంటుంటే.చరణ్ వెంటనే పడుకోర దుప్పటి ముసుగేసుకుని అంటే,హ ఓకే గుడ్ నైట్ అని సలీం పడుకున్న వెంటనే, చరణ్ ల్యాప్ టాప్ తీసుకుని చూస్తూ ఉన్నాడు.
ట్రైన్ ఉత్తరప్రదేశ్ లో ఎంటర్ అయింది వెళ్తూ వెళ్తూ "ఝాన్సీ" అనే రైల్వే స్టేషన్లో ఆగింది. కళ్ళు తెరిచిన సలీం చరణ్ కోసం చూస్తున్నాడు,వాడు ఎక్కడికి పోతాడులే అనుకుని బయట టీ తాగుదమని దిగాడు.50 అడుగుల దూరంలో చరణ్ లాగా ఉన్నాడు ఎవరితోనో మాట్లాడుతూ.
కానీ ఆ మంచులో ఏమి కనపడడం లేదు, చలికాలం మంచు విపరీతంగా పడుతుంది చరణ్ ఆ కాద అని టీ పట్టుకుని వెల్లెలోపు వెనక నుండి సలీం అని పిలిచాడు. మంచులో శాలువ ముసుగేసుకుని ముసుగు దొంగలా ఎటు పోతున్నావురా.మన భోగి ఇటు ఉంది అంటే ఇందాక నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అనిపించింది.
అరేయ్ పిచ్చ నిద్ర మత్తులో ఉన్నట్టు ఉన్నావు మొహం కడుక్కో ముందు అంటుంటే నిజం మామ నువ్వే అనుకున్న చరణ్,సలీం మాట్లాడే లోపు చరణ్ పడుకున్నాడు. ట్రైన్ ఆగ్రా ఎంటర్ అయింది,అప్పుడే తెల్లవారు జాము అవుతున్నాది.చరణ్ ఫోన్ చేస్తున్నాడు ఎవరికో.సలీం చలికి వణికి పోతున్నాడు,ఇంతలో చరణ్ షర్ట్ విప్పి ట్రైన్లో డిప్స్ కొడుతున్నాడు, అమ్మాయిలు అందరూ నోరు వెళ్ళబెట్టి మరి చూస్తున్నారు ఆ ఆరుపలకల దేహం చూస్తూ, అందులోను అందగాడు, ఇక ఊరుకుంటార చూడకుండ. సలీం చరణ్ తో రెండు సంవత్సరాలు క్రితం కరువులో ఉన్న వాడిల బక్కగా ఉండేవాడివి. ఇప్పుడు ఏమో బలిసిన కోడిలా అయ్యావు, అందరూ నిన్నే చూస్తున్నారు లేచి షర్ట్ వేసుకో అంటే. ఇంకో 100 డిప్స్ మామ అని డిప్స్ కొట్టి లేచి షర్ట్ వేసుకుంటే పక్కన 4 గురు నార్త్ ఇండియన్ అమ్మాయిలు వచ్చేసారు.ఫోన్ నెంబర్ ఇవ్వమని,చరణ్ సలీం నెంబర్ ఇచ్చాడు ఆహా అనుకున్నాడు సలీం.చరణ్ దేవుడు అనుకున్నాడు.
ఢిల్లీ ఎంటర్ అవుతుంటే ఇక రెడి అయ్యారు దిగడానికి. ఎక్కడికి వెళ్ళాలి మామ అంటే 'చాందిని చౌక్ ' అంటే ఓహ్ అనుకుని ఇద్దరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఆటో వాడిని అడిగితే చాందిని చౌక్ కి 1200 వందలు అడిగాడు 8కిలోమీటర్ల కి, వెంటనే సలీమ్ మా హైదరాబాద్ బెస్ట్ అక్కడే ఎక్కుతాము ఇక్కడ ఆటో ఎక్కము మేము అని తీసుకుపోతుంటే చరణ్ టాక్సీ బుక్ చేసి వెళ్ళవలసిన ప్లేస్ కి వెళ్లారు, సలీం చరణ్ తో మామ ఇండియా గేట్, ఎర్ర కోట, తరువాత ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూసి అలా ఇంటికి పోదాం అంటే. ఆపర చిన్నప్పటి నుండి ఇంతేన సలీం నీ నోరు, నీకు నీ నోరుకు దండంరా అని వాళ్ళు వెళ్ళగానే అక్కడ రూప అనే అమ్మాయి వచ్చి చరణ్ కి షేక్ హాండ్ ఇచ్చి అక్కడ ఉన్న అపార్టుమెంట్ కి తీసుము వెళ్ళింది.
లోపల అంత వింతగా ఉంది, ఏవేవో రాసి ఉన్నాయి ఆ ఇంట్లో గోడల మీద ఎవరెవరో ఉన్నారు ఫొటోస్ లో,జిమ్ ఉంది, కిక్ బాక్సింగ్ కిట్ ఉన్నది.లోపల ఒక ప్రపంచం ఉన్నది, సలీం కి భయం వేసింది అరేయ్ చరణ్ ఏంట్రా ఇది అంటే మన వాళ్లే మామ బయపడకు.
రూప నా ఫ్రెండ్ వీడు సలీం అని పరిచయం చేసాడు.
ఆ రోజు సలీం ని రూంలో ఉంచి రూప చరణ్ బయటకి వెళ్లారు.ఒక టాప్ మోడల్ స్పోర్ట్స్ కార్ ఒకటి తీసుకుని రూమ్ కి వచ్చారు. నైట్ డిన్నర్ చేసి రేపు ఉదయం మనం ఉత్తరాఖండ్ లో "నైనితాల్" వెళ్తున్నాము హాలిడే ట్రిప్ కి అంటుంటే అరేయ్ చిన్నపుడు చెప్పారు "భూతల స్వర్గం" అని ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్ అంటారు అదే కద మామ యాహు అన్నాడు సలీం.
ఢిల్లీ నుండి నైనితాల్ 300 కిలోమీటర్లు అందమైన ప్రదేశం విదేశాల నుండి చాల మంది యాత్రికులు వస్తారు,ఎత్తు అయిన కొండలు, ఘాటి రోడ్లు చాలా బాగుంటాయి,నైని సరస్సు చాలా అందంగా ఉంటాది, అందులో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. చలి చాలా ఎక్కువ, అక్కడ ఎప్పుడూ 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటాది పగలు, రాత్రుళ్ళు మైనస్ లోకి పోతాది.
సలీం చరణ్ రూప ముగ్గురు చాలా హ్యాపీగా కార్ లో ప్రయాణం మొదలు పెట్టారు.కార్ ఉత్తరప్రదేశ్ లోకి ఎంటర్ అయింది,టిఫిన్ తినడానికి కార్ ఆపారు.రూప చరణ్ లు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటుంటే ప్రేమ జంట అనుకుంట అనుకున్నాడు సలీం, రూప కార్ డ్రైవ్ చేస్తుంది, దారి మధ్యలో ఎన్ని అందమైన ప్రదేశాలో చూడడానికి.కార్ వెళ్తుంటే ప్రాణం హాయిగా ఉంది అని సలీం అనుకుంటుంటే చరణ్ తన ఫోన్ చూస్తూ ఉన్నాడు ఎదో అయిపోతున్నట్టు.
భూతల స్వర్గం వచ్చేసింది అక్కడ ఘాటి రోడ్డు లోకి ఎంటర్ అయ్యారు,బండి నెమ్మదిగా పోనిస్తుంది రూప,సలీం ఏమో రూప నీకు భయం అయితే చెప్పు నేను డ్రైవ్ చేస్తా అన్నాడు. వద్దులే అండి ముందు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్నాది.3 వ నెంబర్ ఘాటి రోడ్డుకు రాగానే మీరు వెతుకుతున్న వ్యక్తి 9 వ నెంబర్ ఘాటీలో uk06au7799 స్కోడా కార్ లో ఉన్నాడు అని చరణ్ కి మెసేజ్ వచ్చింది.
రూప కార్ స్పీడ్ పెంచు మనం 9వ నెంబర్ ఘాటీ రోడ్ లోకి వెళ్ళాలి, సలీం సీట్ బెల్ట్ పెట్టుకో, రూప కార్ స్పీడ్ 40 నుండి 120 స్పీడుకు పెంచింది.సలీం భయపడుతూ నేను కార్ దిగిపోతాను అంటే ఎవరు పట్టించుకోవడం లేదు,రూప డ్రైవ్ చేస్తుంటే బయట అందరూ ఆశ్చర్యం గా చూస్తున్నారు,9 వ నెంబర్ ఘాటీ రోడ్డు లో కార్ వెళ్తుండగా. అదే నెంబర్(7799)నెంబర్ ఉన్న కార్లు మొత్తం అయిదు ఉన్నాయి మధ్యలో స్కోడా కార్ ఉండి ముందు రెండు కార్లు వెనక రెండు కార్లు ప్రొటెక్షన్ కింద ఉన్నాయి.
రూప ఏమి జరిగిన కార్ ఆపకు తెలుసు కద అని ఇద్దరు రెండు గన్స్ తీసి లోడ్ చేశారు, కార్ పైన ఉన్న ఉన్న రూఫ్ ఓపెన్ అయింది, చరణ్ గన్స్ తీసుకుని రెడీగా ఉన్నాడు,కార్ స్పీడ్ పెంచి రూప ఒక్కసారిగా హాండ్ బ్రేక్ వేసింది డ్రిఫ్ట్ కొట్టి,వాళ్ళకి కావలిసిన కార్ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తున్నారు రివేర్స్ గేర్ లో, చరణ్ రూప ఫైరింగ్ మొదలు పెట్టారు. మూడు కార్లు గాలిలో ఎగిరిపోయాయి ఇంకా స్కోడా కార్ ఒకటి ఇంకొక కార్ ఉన్నది
చరణ్ ని గుర్తు పట్టిన వాళ్ళు కూడ గన్ ఫైరింగ్ మొదలు పెట్టారు.ఇద్దరి దగ్గర బుల్లెట్లు అయిపోయాయి.కార్ ని వెంట పడుతూనే ఉన్నారు రూప చరణ్. అరేయ్ స్పోర్ట్స్ కార్ లో విహార యాత్ర అనుకున్న నా అంతిమ యాత్ర అనుకోలేదురా.
అరేయ్ సలీం బుల్లెట్స్ అయిపోయాయి, లేదంటే నిన్ను కూడా వేసి పడేస్తా మూసుకో.
వాళ్ల కార్ ని బలంగా గుద్దారు. కార్ నుండి దిగిన వాళ్ళని ఒక గుద్దుకే పడిపోయేలా చేస్తుంది రూప. వాళ్ళకి కావాల్సిన వాడు "చోటడాన్" దొరికాడు.క్రిందటి సంవత్సరం కొంచెంలో తప్పించుకున్నావు, ఈ సారి కుదరదు బుజ్జి, నిజం చెప్పేయి మీ పెద్ద డాన్ ఎక్కడ ఉన్నాడో.పక్కన మీరు ఎవరు రా అంటే వాళ్ళని చెక్ చేస్తే ఒకడు పాకిస్తాన్ ఇంకొకడు చైనీస్ వాడు వీళ్లతో ఏమి వ్యాపారం మీకు అని ముగ్గురిని బంధించి అక్కడే కట్టేశారు.
సలీం వచ్చి చరణ్ అసలు ఏంటి ఇది మీరు ఎవరు ఏమి చేస్తున్నారు ఆ గన్స్ ఎక్కడివి ఈ అమ్మాయి ఎవరు అసలు భూతల స్వర్గం అని నన్ను డైరెక్ట్ స్వర్గానికి పంపిస్తార చెప్పండి రా, ఉద్యానవనంలోకి అని నేను వస్తే ఉగ్రవాదంలో మనం అంటున్నారు ఏంట్రా, అసలు ఇది అంత ఏంటో నాకు చెప్పండి అంటే.
సలీం రెండు సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోయింది గుర్తు ఉంది కదా గుండె సమస్య వచ్చి. అమ్మకి గుండె నొప్పి అంటే మన ఫ్రెండ్ శశాంక్ పని చేసే హాస్పిటల్ లో జాయిన్ చేసాను. గుండెకు స్టంట్ వేస్తే సరిపోతాది అన్నారు. స్టంట్ వేసాక కొన్ని రోజులు అమ్మ బాగానే ఉండేది,మూడు నెలలోనే మళ్ళీ నొప్పి అంటే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాను,అప్పటికే అమ్మ చనిపోయింది.
అమ్మవి అన్ని కార్యక్రమాలు అయిపోయాక శశాంక్ వచ్చాడు నా దగ్గరకు, అమ్మ పది సంవత్సరాలు బతికేది, గుండెకు వేసిన స్టంట్ నాసిరకం వల్ల మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మే కాదు అలాగ చాలా మంది చనిపోతున్నారు.మొత్తం నకిలీ మందులు నకిలీ స్టెంట్స్ రా.ఇది పెద్ద ముఠా ల ఉంది అని నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది అని నాకు చెప్పాడు, ఇంతలో ఎవరో శశాంక్ ని చంపేశారు,నేను వెతకడం మొదలు పెట్టాను ఎవరా అని రెండు సంవత్సరాలు నుండి.
రూప ips ఆఫీసర్ శశాంక్ వాల్ల కజిన్ సిస్టర్, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ మాఫియాలో, మనం ట్రైన్ లో వచ్చినపుడు నేను 'ఝాన్సీ' స్టేషన్ లో వేరే వాళ్ళతో మాట్లాడుతుంది నిజమే, నువ్వు నన్ను చూసింది నిజమే,అక్కడ దొరకని గన్స్ ఉండవు అందుకే అక్కడ దిగాను, వాళ్ళకి డబ్బు ఇచ్చి ఢిల్లీ లో దిగాక నేను వెళ్లి గన్స్ తీసుకున్నాను, రూప ఈ ఆపరేషన్ చాల సీక్రెట్ గా చేస్తుంది,ఈ చోటడాన్ క్రిందటి సంవత్సరం హర్యానాలో తప్పించుకున్నాడు.
ఇప్పడు దొరికాడు, ఇప్పుడు ఈ పాకిస్తాన్ చైనీస్ వాడు వీళ్లకు నకిలీ మందులు నకిలీ పరికిరాలు తీసుకు వస్తారు. నేపాల్ దేశానికి మన దేశానికి మధ్య ఉన్న సంబందాలు వల్ల మనకి వాళ్ళకి పాస్ పోర్ట్స్ అవసరం లేదు.అందుకే దొంగతనంగా నేపాల్ మీద నుండి ఇండియాకి నకిలీ మందులు పంపుతారు అడ్డ దార్లలో,అని వాళ్ళ ముగ్గురిని ఒక్కొక్కడిని కొడుతూ చెప్తున్నాడు సలీంకి.
రూప వీళ్ళ మొబైల్స్కి వచ్చిన ఫోన్ నంబర్స్ హ్యాక్ చేయాలి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలి అంటే, అందుకే కద సలీం ని తీసుకు వచ్చింది, వీడు మంచి హ్యాకర్. సలీం వెంటనే అందుకా నన్ను తీసుకు వచ్చింది చరణ్. వాళ్ళు ఉన్న నంబర్స్ హ్యాక్ చేస్తే నేపాల్ బోర్డర్ లో ఉన్నారు అని తెలిసింది. వెంటనే ఇండియా ఆర్మీ సపోర్టు తీసుకుని, కొన్ని వందల కోట్ల నకిలీ మందులు పట్టుకున్నారు,అందులో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకున్నారు వదలకుండ.
చరణ్ ని ఇంటర్వ్యూ చేయడానికి నేషనల్ మీడియా వాళ్ళు వచ్చారు, చరణ్ వాళ్ళతో మనము మంచి ఏదో చెడు ఏదో కనిపెట్టలేకపోతున్నాము, మన శరీరానికి కొంచెం ఇబ్బంది వచ్చినా అన్ని మెడిసిన్ వాడేస్తున్నాము, వీధికో ఒక మెడికల్ షాపు, కాలెనీకి ఒక హాస్పిటల్ ఉన్నాయి, ఎవరి వల్ల మన బద్దకం వల్ల, రోజు ఒక గంట నడిస్తే ఆరోగ్యంగా ఉండలేమ, జలుబు వస్తే ఆవిరి పడితే పోదా జలుబు, ఆముదం తాగితే కడుపు శుభ్రం అయితుంది కద,విటమిన్లు మనము కొనుక్కోవల సహజంగా మనకి దొరకవా. ప్రతి దానికి మనం హాస్పిటల్ మెడికల్ షాప్ ఇదేనా. ఇదే వాళ్ళకి అలుసు అయిపోయి డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మందులు తయారు చేస్తున్నారు.
మనం రోజూ మింగే మందులు ఎంత ప్రమాదమో తెలుసా అదే చివరికి విషం అవుతాద అని తెలిసి కూడ వేసుకుంటాము.
వెళ్ళాలి హాస్పిటల్ కి అవసరం అనుకుంటేనే వెళ్ళండి.మన ప్రాచీన అలవాట్లుని పక్కన ఉన్న దేశాలు వాళ్ళు పాటిస్తున్నారు, మనం పాటించలేమ చెప్పండి.ఇక నుండి మనము కూడ మారదాము,మనం మారి మనుషులం అని నిరూపించుకుందాము అని అంటుంటే, రూప కూడ అవును చరణ్ చెప్పింది రైట్ అని అంటే ఒకటే హోరెత్తిపోయింది ఈ మ్యాటర్ మీడియాలో...

No comments:
Post a Comment