Tuesday, October 22, 2019

ఊడలమర్రి... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 35

ఊడల మర్రి చెట్టు పక్కనే ఉన్న స్మశానంలో సగం కాలుతున్న శవం లెగిచి, స్మశానంలో సమాధుల లోపల ఉన్న దెయ్యాలు రా పగలగొట్టు ఈ సమాదులని అంటుంటే.ఆ సగం కాలిపోయిన శవం అక్కడ ఉన్న జనాలని చీల్చుకుంటూ ఒక్కొక్కడి రక్తాన్ని తాగుతూ,ఆ సమాధులు దగ్గరికి వస్తుంటే.
ఒకటే అలజడి భయంకరమైన అరుపులు.ప్రకృతి ఉగ్రరూపం దాల్చుతుంది.సగం కాలిపోయిన శవం నిప్పులు కక్కుతూ సమాధులని ఒక్కొకటిని పగల గొడుతుంటే.ఎముకలు గూడుతో ఉన్న అస్థిపంజరాలు బయటకి లేస్తూ స్మశానంలో ఉన్న సమాధులు అన్ని తవ్వుతూ ప్రేతాత్మలని లేపుతున్నాయి.ఆత్మలు ప్రేతాత్మలు ఒకటే గోసిస్తున్నాయి.
ఊరిలో ఉన్న కుక్కలు అన్ని ఒక్కసారిగా స్మశానం వైపు పరిగేడుతుంటే ఊరి జనాలకి ఒకటే భయం మొదలు అయింది.శవాన్ని కాల్చడానికి వెళ్లిన ఒక్కరు తిరిగి రాలేదు వెనక్కి.ధైర్యం చేసి ఊరిలో ఇద్దరు స్మశానం వైపు వెళ్లారు ఏమి జరిగిందో అని.స్మశానంలో అడుగు పెట్టిన వాళ్ళ కళ్ళకి కుక్కలని గాలిలో పట్టుకుని కుక్కల రక్తాన్ని తాగుతున్న పిశాచులు చూసిన ఇద్దరి మొహంలో భయం, వొళ్ళంత చెమటలు, గుండె దడ, కాళ్ళు చేతులు ఒణుకుతున్నాయి ఇద్దరికి. ఇద్దరు భయంతో పారిపోతుంటే.అందులో ఒకడు పొలిమేరలోకి వస్తుంటే ఒక్కసారిగా భూమిలోపల నుండి రెండు పిశాచులు వచ్చి వాడి కాళ్ళు పట్టుకుని భూమిలోకి లాక్కుని,వాడి మెడ దాక మట్టితో కప్పి,మెడకి రెండు వైపులా రక్తాన్ని తాగుతూ రక్త పిశాచులు ఆనంద పడుతున్నాయి.
ఇంకొకడిని మర్రిచెట్టు మీదకి తీసుకుని వెళ్లి వాడి మాంసపు ముద్దలను కడుపు నిండ ఆరగిస్తున్న కొరివి దెయ్యాలు.సగం కాలిన శవం వీటికి నాయకుడు.రక్త పిశాచులు కొరివి దెయ్యాలు ఆత్మలు ప్రేతాత్మలుకి సగం కాలిన శవం చెప్తుంది. చుట్టుపక్కల ఉన్న ఊరిని వల్లకాడు చేసి అందులో ఉన్న మనుషుల రక్తాన్ని తాగుతూ,వారి మరణాన్ని చూస్తూ, సంతోషంగా మనలో కలిపేసుకుందాము పదండి అంటూ ఊరికి రెండు వైపులా వెళ్తున్నాయి.
ఎంత ప్రయత్నించిన ఊరి లోపలకి వెళ్ళ లేకపోతున్నాయి పిశాచులు.ఊరిలోక వెళ్లలేక అక్కడే ఉన్న పొలిమేరలో కాచుకుని ఉన్నాయి.
ఊరిలో ఉన్న పూజరికి విపరీతమైన ఆందోళన ఏదొ కీడు జరుగుతుంది అని,ఊరి జనాలు అందరూ ఒక చోటే ఏకమయ్యారు.రాత్రి 12 అవుతుంది.పూజారి ఊరి జనాలు అందరికి ఒకటే చెపుతున్నాడు.ఎవరు ఊరి పొలిమేర దాటి పోవద్దు అని.మనం నమ్ముకున్న దైవమే మనల్ని కాపాడుతుంది అంటుంటే ఊరి సర్పంచ్ వచ్చి అసలు ఏమి జరిగింది ఎందుకు కుక్కలు శ్మశానం వైపు వెళ్లాయి శవాన్ని కాల్చడానికి వెళ్లిన వాళ్ళు ఏమి అయ్యారు.తరవాత వెళ్లిన ఇంకో ఇద్దరు ఎటు వెళ్లారు.ఎటు చూసినా చీకటే ఉంది.ఊరి చివరి నుండి ఒకటే అరుపులు,పొలిమేరలో కేకలు.పైన ఆకాశంలో ఒక పక్షి కూడ లేదు ఏంటి పూజారి గారు ఇది.ఎప్పుడు చూడని ఈ ప్రకృతి వైపరిత్యం ఏంటి ఇది ఎలా జరిగింది పూజారి గారు. దీనికి పరిస్కారం ఏంటి పూజారి గారు అంటుంటే అదే ఆలోచిస్తున్న సర్పంచ్ గారు.ఉదయం అయ్యిందా ఊరిలో ఒక్కడు కూడ బతకడు సమస్యకి సమాధానం వెతకండి అందరూ.
ఎవరు ఏమి మాట్లాడడం లేదు అంతలో ముసుగు వేసుకుని ఉన్న ఒక తాత లెగిచి ఇది చేతబడి నేర్చుకుని కొరివి దెయ్యాలని వశం చేసుకునే వాడే ఇది చేస్తాడు.అసలు చనిపోయిన శవం 'ఆత్మరావు' ది.ఒక్కసారి వాడి ఇంటిలో వెతకండి ఏమన్నా దొరకవచ్చు.ఊరు మొత్తం ఏకమయ్యి ఆత్మరావు ఇల్లు మొత్తం వెతుకుతున్నారు. ఆత్మరావు గదిలోకి వెల్లగానే లోపల ముగ్గు వేసి అందులో తల పుర్రె ఎముకలు పెట్టి ఉన్నాయి ఆ ముగ్గులో.ఇంటి ఆవరణలో అప్పుడే కప్పి ఉన్న మట్టిలా ఉంది,తవ్వి చూస్తే పీక లేని మూడు కోళ్లు,అందులో 10 టెంకాయలు ఉన్నాయి.వెంటనే తాత వచ్చి ఇది ఇది మహా ప్రళయం.పడుకున్న ఆత్మలు అన్ని లెగిచాయి, ఊరు అంత ఏకమైన ఏమి చేయలేము దుష్టశక్తులు అన్ని కాచుకుని ఉన్నాయి.మన రక్త మాంసాల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆత్మరావు ఆత్మహత్య చేసుకోలేదు ఆత్మలని లొంగ తీసుకోవడానికి చనిపోయాడు.వాడు మళ్లీ పిశాచిలాగా తిరిగి వస్తాడు.అదే ఇప్పుడు జరిగింది.
వీడు క్షుద్ర మంత్ర తంత్ర విద్యలు నేర్చుకున్నాడు.వీడిని ఆపాలి అంటే మనం అందరం కలిసి వెళ్లి వాడితో పోరాడాలి. ఇంటిలో ఉన్న ముగ్గును దానిలో ఉన్న పుర్రెను ఎవరు ఏమి ముట్టుకోవద్దు.ఈ కొబ్బరి కాయలు కన్నె కుర్రవాళ్ళు మాత్రమే పట్టుకుని రండి.సర్పంచ్ గారు మీరు వెళ్లి నల్ల కోడిని, నల్ల గుడ్డను, నల్లటి నువ్వులు తీసుకుని రండి. పూజారి గారు మీరు తలస్నానం చేసి తడి బట్టలతో రండి. ఆత్మరావు చనిపోయిన ఈ ఇంటికి చుట్టూ ఒక పెద్ద దారాన్ని కట్టండి.ఇంటి బయట ఉన్న గోడకు నలువైపులా మేకులు కొట్టండి దానికి దారం చుట్టండి ఇంటి వైపు మొత్తం.
ఇంతలో పూజారి తల స్నానం చేసి తడి బట్టలతో వచ్చాడు.పూజారి గారు పసుపు కుంకుమ కలిపిన నీళ్లు తీసుకు రండి మీ చేతితో ఇంటి బయట మొత్తం చల్లండి. పూజారి పసుపు నీళ్లు చల్లుతుంటే ఒక్కసారిగా ఊరి పొలిమెరలు నుండి కేకలు, అరుపులు, ఆకాశం ఎర్రగా మారిపోతుంది.భూకంపం వచ్చినట్టు ఆ ఆత్మరావు ఇల్లు ఊగిపోతుంది, అప్పుడు తాత వచ్చి నేను అనుకున్నది నిజమే ఊరిలో ఉన్న ఆత్మ ఎప్పటి నుండో ఆత్మరావుతో ఉన్నాది.
ఈ ఆత్మ ఊరిలో నుండి, ఈ ఇంటి నుండి బయటకు వెళ్లలేక ఇక్కడే ఆత్మరావుకి అన్ని విద్యలు నేర్పింది ఎవరో కాదు అది వాళ్ళ మావయ్య ఆత్మ. 50 సంవత్సరాల క్రితం ఊరిలో జనాలకి చేతబడి చేస్తూ జనాలని చంపుతుంటే అప్పుడు నేను ఊరి పెద్దలము కలిపి ఒక సన్యాసిని తెప్పించి ఈ ఊరిలోనే ఈ ఇంట్లోనే రాళ్లతో కర్రలతో కొట్టి పళ్ళు పీకేసి ,గోళ్లు తీసేసి వాడి గుండెల్లో వచ్చిన సన్యాసి మేకులు గుచ్చాడు. ఉన్న ఇంట్లోనే పూడ్చి పెట్టి, శాంతి పూజలు చేయించి ఊరి కి రెండు వైపులా ధ్వజస్తంభాలని పెట్టి ఈ ఉరికి పట్టిన పీడ వదిలింది అనుకున్నాము.అప్పుడు వాడి శవాన్ని ఊరి అవతల పూడ్చాల్సింది తప్పు చేశారు, ఆ శవం పూడ్చిన చోట ఆత్మరావు తవ్వినట్టు ఉన్నాడు,అది ఆత్మరావు ని ఆవరించి అన్ని విద్యలు నేర్పి వదిలిపెట్టింది.
అందుకే ఇప్పుడు ఇలా జరిగింది. పసుపు నీళ్లు ఆ గేటు ముందు చల్లండి ఒకసారి అని తాత అంటే పూజారి చల్లగానే అక్కడ ఒక ఆత్మ ఎగిసెగిసి పడుతూ ఎవ్వరిని వదలను,నన్ను ఈ ఇంటి నుండి బందీగా ఉన్న నన్ను విడిపించేందుకు నా వాళ్ళు వస్తున్నారు. మీ శవాల్ని కూడ చూస్తూ మిమ్మల్ని నాతో తీసుకు పోతాను అంటే ఒకటే బయపడుతున్నారు జనాలు అది చూసి.
తాత వెంటనే ఏమి బయపడకండి అంటూ తాత తన ఇంట్లోకి వెళ్లి నల్లని పంచె దరించి నల్లటి విభూది మొహం మీద రాసుకుని,మగవాళ్ళు అందరూ చెప్పులు చొక్కలు విప్పేయండి అన్నాడు.ఆడవాళ్లు ఇంట్లోకి వెళ్లి ఇల్లు అంత పసుపు నీళ్లు చల్లుకుని మేము వచ్చేలోపు ఊరి మధ్యలోకి రండి అంటూ తాత పూజారి సర్పంచ్ పెళ్లి కాని వాళ్ళు మిగిలిన మగవాళ్ళు వెళ్లారు పొలిమేర దగ్గర ఉన్న ధ్వజస్తంభం దగ్గరకి.
తాత ఒక గీత గీసాడు పొలిమేరలో.ఈ గీత దాటి ఎవరు దాటి రావద్దు నేను చెప్పినపుడే ఎవరిని పిలుస్తానో వాళ్లే రావాలి. తాత పొలిమేర దాటగానే అక్కడ ఉన్న పిశాచులు ఆత్మలు కొరివి దెయ్యాలు ఒకటే తాతని చుట్టుముట్టి భయంకరంగా నవ్వుతూ చూస్తున్నాయి.తాత భయపడకుండా తన తన మణికట్టు ని కోసుకుని రక్తాన్ని ఆత్మలకి ఇస్తున్నాడు, సగం కాలిన ఆత్మ రావు శవం తాత దగ్గరకి రాగానే 50 సంవత్సరాల క్రితం సన్యాసి ఇచ్చిన చిన్న శూలాని ఆత్మరావు శవము మీద పెట్టాడు.పూజారి గారు రండి వీడు చుట్టు ఆ పసుపు నీళ్లు చల్లండి, సర్పంచ్ గారు నల్ల గుడ్డలో నల్ల నువ్వులు తీసుకు వచ్చి ఇక్కడ పెట్టి ఆ నల్ల కోడిని కోయండి, కన్నె కుర్రవాళ్ళు ఆ 10 కొబ్బరి కాయలను ఒకే సారి పగల కొట్టండి వీడి చుట్టూ,అంటే అందరూ అదే పని చేస్తున్నారు.అలా చేసిన పది నిమిషాలకి ఆత్మరావు శవము గాలిలో భూడిద అయిపోయింది, ఆత్మలు గాలిలో కలిసి పోయాయి.
అందరూ తిరిగి ఊరి మధ్యలోకి వెళ్ళగానే ఆడవాళ్లు వాళ్ళకి ఎదురు వచ్చారు.అందరూ తలస్నానం చేసి ఎవరి ఇంటికి వారు వెళ్తుండగా నా ఆత్మకి విముక్తి చేయండి అంటూ అక్కడ ఉన్న ఇంట్లో ఆత్మ గోసిస్తుంటే వెంటనే తాత వెళ్లి తన దగ్గర ఉన్న చిన్న శూలం ఆ ఆత్మ మీదకి విసిరి ఇక మన ఊరుకి పట్టిన పీడ వదిలింది అని ఇక వెళ్ళండి అంటూ చివరిలో
సమాప్తం అని వస్తే టీవీ లో.ఇంతలో కరెంట్ పోయింది ఇది అంత టీవీలో చూసిన సతీష్ గజగజ లాడుతున్నాడు వెనక నుండి వాళ్ళ అమ్మ వచ్చి చేయి వేస్తే బాబోయ్ అన్నాడు.సతీష్ 102 చలి జ్వరంతో వణికి పోతుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఈ ఊడల మర్రి సినిమా చూడవద్దు అంటే చూస్తావు అని పక్కన పడుకో పెట్టుకుని ఏం కాదు అది సినిమానే బయపడకు అని చెప్తు జో కొడుతుంది...

No comments:

Post a Comment