Tuesday, October 22, 2019

ఎక్కడ మొదలు పెట్టానో... ఎక్కడ ఆపానో.. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 36

జీవితం అంటేనే మలుపులు ఎక్కడ ఏమి జరుగుతుందో ఎప్పుడు ఏమి అవుతుందో ఏ మనిషికి తెలియదు,నేను ఎంత, నా పేరు పవన్ మా ఊరు పల్లెటూరు, అవునండి మా ఊరి పేరే పల్లెటూరు,మా తల్లిదండ్రులకిి నేను ఒక్కడినే కొడుకుని, అందుకే మనం ఏది చెప్తే అదే ఇంట్లో, డబ్బులకి లోటు లేదు, ప్రేమకు అంతే లేదు, నానమ్మ కి ప్రాణం నేను అంటే, మన దగ్గర చాలా డబ్బులు ఉండేవి చిన్నప్పటి నుండి నాన్న గారికి ఊరిలో పెద్ద కొట్టు,పొలాలు,రైస్ మిల్లులు ఉన్నాయి, ఇక మా ఊరు గోదారమ్మ పక్కన చల్లాగా ఉండేది, పచ్చ తనానికి లోటు లేదు, ఒకటే ఆటలు పాటలు,జానపధాలు, తీర్థాలు,గుడిలో భజనలు, హరికథలు, తెర మీద సినిమాలు, అంత్యాక్షరి ఇక చెప్పుకుంటు పోతే ఇన్ని ఉన్నాయా అనిపిస్తాది ఈ తరానికి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చుట్టాలు కాకపోయినా వరసలు పెట్టి పిలుచుకోవచ్చు, ఇక మనం చదివిన స్కూల్ గవర్నమెంట్ స్కూల్, పేద ధనిక ఎవరు అయిన అక్కడ చదవాల్సిందే ఎందుకు అంటే చుట్టుపక్కల ఇంకే స్కూల్ లేదు కనుక, మనం స్కూల్లో రాజే, అంటే ఆటలు లో అండి, క్లాసులో ఎప్పడూ 45 మార్కులు కన్నా ఎక్కువ వచ్చేవి కాదు, ఎందుకు అని మా నానమ్మని అడిగితే స్కూల్ కి వాస్తు దోషం అనుకుంటార అంది, నాకు సౌండ్ లేదు నేను చదవకపోతే వాస్తు దోషం ఏంటి నా బొంద అనుకున్న, అమ్మని అడిగితే నీకు దిష్టి తగిలిందిరా అన్నది ,ఓ మా అమ్మకి నేను అంటే పిచ్చి కదా అలాగే అంటుంది అనుకున్న, మా మావయ్య ఏమో నీ రాత బాలేదు అన్నాడు, అవును మావయ్య నా తలరాత బాలేదు అన్నాను, ఒక్కటి నెత్తి మీద పీకి నీ చేతిరాత బాలేదుర వెదవ అన్నాడు,అప్పటి నుండి తెలుగులో మన రాత కోసం చూచి రాతలు రాయడం మొదలు పెట్టాం, మనలో మన మాట నాకు వొత్తులు రావడం లేదు నానమ్మ అంటే నీకు ఎందుకురా దీపాలు వెలిగించే వొత్తులు అన్నది మా నానమ్మ, దీనెమ్మ మనకి పిచ్చి ఎక్కిపోయి ఊరి నుండి కిలోమీటర్ పరిగెత్తాను మా నానమ్మ సమాధానం విని, మొత్తానికి 10 వ తరగతికి వచ్చేసాను, మా నాన్న గారు హెడ్ మాస్టర్ దగ్గరకి వచ్చి ఎక్కువ మార్క్స్ రావాలంటే ఏమి చేయాలో అడగకుండా మీరు మా కొట్టులోనే మీరు సామానులు కొనాలి అన్నాడు,అమ్మ తోడు నాన్న నాకు అర్థంకాలేదు, మావయ్య మనకి ఏది కావాలి అన్న చేసేది, ఓయమ్మ మా మావయ్య గైడ్స్ అవే అండి ప్రతి సబ్జెక్టు గైడ్ తీసుకువచ్చాడు, మా నానమ్మ అమ్మ కలిసి ఆ గైడ్ లకి పూజలు చేస్తున్నారు హారతులు ఇస్తూ, మావయ్య కి ఏమో నేను మంచిగా చదవాలని ఆశ మనకి వచ్చే మార్కులు చూసి మనకి చదువు చెప్పే మాష్టర్ లకి నిరాశ, మొత్తానికి 10 వ తరగతి 2వ క్లాసులో పాస్ అయ్యాను, ఇక గోదావరి అమ్మ వడిలో ఆటలు,సినిమాలకు సైకిల్ తొక్కుకుని వెళ్లి రావడం,కాలేజ్ కి వెళ్తే అమ్మాయిలు ఉంటారు ఇక పండగే అని అనుకున్నాను.
నాన్న గారు నన్ను నారాయణ కాలేజ్ లో చేర్పించారు, కాలేజీలోకి అడుగు పెట్టే ముందు దూరంగా ఎక్కడ నుండో నక్కలు అరుస్తున్న శబ్దం వచ్చింది నా చెవిలోకి, నానమ్మ ఏమో మంత్రించిన తాయత్తులు అంట అవి కట్టుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి అంట అని కట్టింది అక్కడే,నా బొంద ఈ తాయత్తులకి మార్కులకి సంబంధం ఏమిటిరా నా బొంద అనుకున్న, మా అమ్మ ఏమో సరస్వతి లేహ్యం అంట జ్ఞాపకశక్తి బాగా ఉంటాది అని, మా నాన్న ఏమో ఒక 100 రూపాయలు ఇచ్చాడు, ఏమి చేయాలో వందని, మావయ్య పాపం తెలియకుండా1000 రూపాయలు ఇచ్చాడు, అందరూ ఇంటికి వెళ్ళాక నాకు కాలేజీలో డప్పులు మొదళ్లయ్యాయి, అవే అండి దెబ్బలు, మనకి వచ్చిన చదువు ఇక్కడ చెప్పే చదువు వేరే అనుకున్న,పాపం నన్ను కొట్టి కొట్టి బెత్తాలకి ఖర్చు ఎక్కువ అవుతుంది అని కొట్టడం మానేశారు, అంతలో నరుడా ఏమి నీ కోరిక అన్నట్టు ఈ పవన్ గాడికి సూర్య గాడు వచ్చాడు ఫ్రెండ్ కింద, ఇక దెబ్బలు తినకూడదని చదవడం మొదలు పెట్టాను, విది ఆడిన వింత నాటకంలో నేను కూడా టాపర్ అయిపోయాను,అది నా మహిమ కాదండి నారాయణ దెబ్బ అలాంటిది, రోజుకి 4గంటలు పడుకుని కళ్ళ కింద గుంతలు పడ్డాయి,మనమేన అన్నట్టు అయ్యాము ఇంటర్లో,శిక్షణ పేరు చెప్పి క్రమశిక్షణ లో పెట్టి తాట ఎలా తీయలో నారాయణ లో చదివిన ఎవరిని అడిగిన చెప్తారు అని మా పెద్ద అన్నయ్య అంటే ఏంటో అనుకున్న, ఇదా సంగతి, ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ అంట రాసేసాము మంచి ర్యాంక్ వచ్చింది,నాన్నమ్మ నాకు మంచి ర్యాంక్ వచ్చింది అన్నాను, ఇప్పుడు మనకి ఎందుకురా నీళ్ల ట్యాంకు అన్నది,మనకి ఎప్పుడు ఉండే షాక్ కదా, నవ్వుకున్నా కొంచెం, అమ్మ అభిషేకం చేయించి గుడిలో నాతో 108 ప్రదక్షిణలు చేయించింది, దెబ్బకి ఎండలో కళ్ళు తిరిగి పడిపోతే నేను పోతున్న ఏమో అని 108 అంబులన్స్ కి కాల్ చేసాడు ఒకడు, మావయ్య వచ్చి నీళ్లు కొట్టి మొహం మీద లేపాడు, ఏంటి చెల్లి ఇది అని కోపంతో, సెలవుల్లో మన కళ్ళ కింద గుంతలు పూడ్చడానికి15 రోజులు పడుకునే ఉన్నాను, అంతగా నిద్రకి మోహం కరువాసి పోయి ఉన్నాను.
ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఇంజినీరింగ్ లో సీట్ వచ్చింది, ఈ సారి కాలేజీలోకి అడుగుపెట్టగానే నందనవనం లోకి వెళ్తున్న శ్రీ కృష్ణుడు వెళ్తున్నట్టు అనిపించింది, గోపికలు కోసం ఎదురు చూస్తున్న అన్నట్టు ఉంది నా మొహం, మా నానమ్మ ఈ సారి నాలుగు తాయత్తులు తెచ్చింది, సంవత్సరానికి ఒక తాయత్తు అంట, అమ్మ ఏమో మంచిగా చదివి పాస్ అయితే తిరుపతికి కొండ మీదకి తీసుకు వచ్చి గుండు చేయిస్త నీకు అన్నది, అమ్మో అమ్మ అన్నాను, ఏమి అనలేక,నాన్న గారు ఉత్తములు ఈ సారి 10 వేలు ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు మావయ్య బైక్ ఇచ్చాడు లాప్ టాప్ ఇచ్చారు,టాటా లు చెప్పేసి వెళ్లిపోయారు, ఫ్రెండ్స్ పార్టీస్ అమ్మాయిలు చదువులు అలా సాగిపోతున్న జీవితంలో దీపిక వచ్చింది నా జూనియర్ కింద, చూడగానే నచ్చింది , "దీపిక దగ్గరకి వెళ్ళి ఇంత అందం ఎక్కడిది నీకు, ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావు, ఆ కళ్లు ఏంటి ఆ కనుబొమ్మలు ఏంటి, ఏమి చేద్దాము అని వచ్చావు నన్ను, ఆ చూపు ఏంటి చంపేస్తావా నన్ను,ఈ రోజు నుండి నేను నీ బానిసను, నీ కోసం బతికే పిశాచిని " నేను అంటుంటే ఒక్కటి పీకింది కోపంతో దీపిక గుబా పగిలి పోయింది నాకు, చదువులు ప్రేమలు రెండు కలిపి చదువేస్తున దీపిక కి కూడా కొంచెం కొంచెం ఇష్టం వస్తోంది నా మీద, ఆ అందాన్ని పొగడని రోజు అంటే లేదు, కాలేజ్ లాస్ట్ డే ఫేర్ వెల్ పార్టీ అందరికి, ఒకటే ఏడుపులు అందరు, అందరిదీ ఒక ఏడుపు అయితే మన ఏడుపు దీపిక గురించి,మనకి ఐబీమ్ లో జాబ్ వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్ లో, జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది అని, ఇంటికి వెళ్ళాను మావయ్య దగ్గరకి వెళ్ళి నేను దీపిక ని ప్రేమిస్తున్న మావయ్య అన్నాను, దగ్గరకి పిలిచి ప్రేమతో ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయిస్తారా అన్నాడు, మావయ్య మాట అంటే మాటే, మా ఇంట్లో ఒప్పించి దీపిక వల్ల ఇంట్లో కూడా ఒప్పించం,అమ్మాయి చదువు అయిపోగానే పెళ్లి చేసుకోవాలి అని, నాకు ముందు చూపు ఎక్కువ, దీపికకి కూడా ఒక సంవత్సరం లో చదువు అయిపోయింది, ఇద్దరికి పెళ్లి అయింది ఇద్దరు బాబులు, పెద్ద వాడు ఒకటో తరగతి, వాడు మనలా ఆడుకోలేదు అని బాధ, ఎప్పుడు చూసిన టీవీ మొబైల్ పిల్లలు బయటకి వెళ్లి ఆడకోివడాని స్థలాలు లేవు, మేము పెరిగిన బాల్యం మీరు పొందలేదు అని బాధ, అందుకే సెలవులు వచ్చినపుడు సెలవులకి మా ఉరికి కుటుంబం మొత్తం వెళ్లిపోతాము, చదువు పెరిగే కొద్దీ జీవితంలో ముందుకు వెళ్తున్నాము అనుకున్నాను, అయిన వాళ్ళకి దూరంగా వెళ్తున్నాము అని ఇప్పుడు అనిపిస్తుంది, జీతాలు కోసం జీవితాలను పక్కన పెట్టేస్తున్నాము అనిపించి ఇంటికి వెళ్ళాక ఉన్న బాధలు అన్ని మర్చిపోయి పిల్లలని అక్కడే ఉంచి తిరిగి ప్రయాణం అవుతుండగా మా మావయ్య నాతో వస్తా అన్నాడు, మా నానమ్మ ఏమో ఈ సారి పిల్లల కోసం తాయత్తులు కొన్నది, మా అమ్మ పూజలు స్టార్ట్ చిన్నోడికి ఒక గంట ఇచ్చి పూజ గదిలో ఉంచింది, నాన్న ఏమో వచ్చేర ఇక మన ఉరుకి అన్నాడు, వస్తా నాన్న ఇంకొంచెం టైం ఉంది అన్నాను, నాలో నేను నవ్వుకుని, గోదారమ్మ తల్లిని పచ్చని పొలాలను చూసుకుంటూ నాకంటూ బాల్యం తిరిగి వస్తే బాగుండును అని బయలు దేరాను ఇంట్లో అమ్మ చేసిన సున్నుండలు తింటూ...
బాల్యాన్ని బందించకండి బ్రతికించండి...

No comments:

Post a Comment