కాశ్మీర్ లోని అందమైన లోయలలో అప్పుడే కురుస్తున్న మంచులో వెండి పర్వతాల
మధ్య వయ్యారాలు తిరుగుతు వస్తున్న జలపాతంలో నీరును చూస్తున్న కిషోర్
ఆశ్యరంగా చూస్తూ తన పక్కన ఉన్న నవీన్ తో ఇది కద స్వర్గం అంటే.
హిమాలయాల అందాలు,లోయలో ఉన్న సొగసులు,ఆకాశాన్ని తాకే చెట్లు,ఈ భూ ప్రపంచంలో ఇటువంటి అందమైన చోటు ఇంకెక్కడా ఉండదు.
ఒక్కసారి అయిన చూడాలి అని అన్న నా కల నెరవేరింది నవీన్.
ఈ పక్షులు చూడు ఆ అందమైన సీతాకోకచిలుకలు చూడు అని ఒక సీతాకోకచిలుకను పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే ఎంత మార్పు అక్కడి ఆ లోయలో అందం చెప్పలేనంతగా పెరిగింది.
పైన నుండి పూల వాన, పక్షుల కిలకిలలు,తన చుట్టూ ఉన్న సీతాకోకచిలుకలు మెరుస్తూ ఉన్నాయి.
నవీన్ ఫోటో తీయి అంటూ కిషోర్ చెప్పిన వెంటనే ఫోటో తీస్తుంటే ఏమి కనపడడం లేదు ఆ కెమెరాలో.కిషోర్ కి చెప్పిన ఫోటో రావడం లేదు అని అవి ఏమి పట్టించుకోకుండా సీతాకోకచిలుకకు ముద్దు పెట్టి గాలిలో వదిలేసాక.
కిషోర్ నవీన్ తో ఏమి అయింది అలా చూస్తున్నావు అంటుంటే ఇప్పటిదాకా ఇక్కడ ఏమి జరిగిందో తెలుసా అంటే ఏముంది సీతాకోకచిలుకను పట్టుకున్న వదిలేసా అంతే కదా అన్నాడు.ఇంకేమి గుర్తు లేదా అంటే అంతే కద అంటున్నాడు.
ఇంతలో ఎన్నెన్ని వింతలు అనుకుని ఇద్దరు బయలుదేరుతుంటే దారి పొడుగునా సీతాకోకచిలుకలు వాటిని చూస్తూ కిశోర్ ఈ లోకం మర్చిపోతున్నాడు.నవీన్ కి కొంచెం భయం వేస్తుంది.
తిరిగి కాశ్మీర్ నుండి ఇంటికి వస్తుంటే దారి మధ్యలో కార్ లైట్స్ పనిచేయడం లేదు,రాత్రి అయింది అసలే చీకటి ఇద్దరే ఉన్నారు. కిషోర్ కార్ దిగగానే మళ్ళీ సీతాకోకచిలుకలు వెలుగుతూ వస్తున్నాయి,ఒకసారే ఎంత మార్పు నిండు వెన్నెల అయిపోయింది అంత మంచులో వీటి వెలుగుకి.కిషోర్ కార్ తీసి వెళ్తుంటే కార్ ముందు వెనకాల మొత్తం సీతాకోకచిలుకలు. ఉదయం అవగానే మొత్తం సీతాకోకచిలుకలు వెళ్లిపోయాయి.
ఆ అందమైన అనుభూతిని ఆనందిస్తూ ఇంటికి తిరిగి చేరుకున్నాక కిషోర్ ఎప్పుడు చూసిన తన కళ్ళ ముందు అవే సీతాకోకచిలుకలు కనపడేవి.ఇవన్నీ మర్చిపోతున్న సమయంలో కిషోర్ కి తన ఇంటి ముందు ఒక అమ్మాయి కనపడింది.చాలా అందంగా ఉంది.అమాయకమైన చూపులు చూస్తూ ఎవరికోసమో వెతుకుతూ ఉన్నది.మనసు ఆగలేక వెళ్లి అడిగాడు ఏమి చెప్పడం లేదు మౌనంగా ఉంది.
నవీన్ కి ఫోన్ చేసి రమ్మన్నాడు ఈ అమ్మాయిని చూపిస్తూ ఏమి తెలియదు అనుకుంటా అని చెప్తే మనకి ఎందుకురా అంటే ఏమి వినిపించుకోకుండా కిషోర్ తన ఇంటికి తీసుకు వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలకి పరిచయం చేసి ఈ అమ్మాయికి ఏమి తెలియదు మనతోనే ఉంటాది అని చెప్పి తనకి కావలసినవి అన్ని సమకూర్చి తన ఇంట్లో వాల్లలాగే చూసుకుంటున్నాడు.
కొంచెం అలవాటు పడ్డాక తన పేరు దీక్షిత అని చెప్పింది కిషోర్ కి.కిషోర్ తో తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు.ఇక ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి అయిన సంవత్సరానికి ఒక అబ్బాయి పుట్టాడు వాళ్ళకి,ఆ అబ్బాయి పుట్టిన రోజు మాయమైన సీతాకోకచిలుకలు మళ్ళీ కనపడ్డవి కిశోర్ కి, సంతోషంతో తనకి పుట్టిన కొడుకు దగ్గరకి వెళ్లగా అక్కడికి కూడ సీతాకోకచిలుకలు వచ్చాయి.దీక్షత ఇంకా మత్తులో ఉన్నది. పుట్టిన అబ్బాయి చుట్టు సీతాకోకచిలుకలు ఉన్నాయి.దీక్షిత కళ్ళు తెరవగానే అన్ని మాయం అయిపోయాయి.
పుట్టిన అబ్బాయికి 'యక్షిన్' అని నామకరణం చేశారు.దీక్షిత యక్షిన్ ని చాల ప్రేమగా చూసుకునేది.యక్షిన్ ని కిషోర్ ఒక్కడే ఆడిపిస్తుంటే సీతాకోకచిలుకలు అన్ని వచ్చేవి.దీక్షిత రాగానే మాయం అవుతున్నాయి.ఇది గమనించిన కిషోర్ దీక్షితకి ఈ విషయం చెప్పాడు.అంతలోనే ఆమె మొహంలో మార్పు,ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన,అప్పటినుండి తన కొడుకుని చాల జాగ్రత్తగా చూసుకునేది.
ఇంతలో యక్షిన్ నడవడం మొదలు పెట్టాడు అప్పుడే చిన్ని చిన్ని అడుగులతో,ఒక అందమైన సీతాకోకచిలుక తన ముందు వాలింది.దాన్ని పట్టుకోవడానికి బుల్లి బుల్లి అడుగులు వేస్తూ వెళ్తున్నాడు.సీతాకోకచిలుకని పట్టుకున్న వెంటనే యక్షిన్ గాలిలో ఎగురుతూ వెళ్తున్నాడు.గాలిలో పైకి లెగగానే ఒకటే ఏడుస్తున్నాడు.డాబా మీద బట్టలు అరేస్తున్న దీక్షిత తన కొడుకు గాలిలో ఎగరడం చూసి పక్కన సీతాకోకచిలుకలు ఉండడం చూసి ఒక్కసారిగా డాబా మీద నుండి దూకేసింది.
అప్పుడే నవీన్ వచ్చాడు ఇది చూస్తున్నాడు.అలా దూకిన దీక్షిత ఒక్కసారిగా సీతాకోకచిలుకలాగా మారిపోయింది.తన కొడుకుని తీసుకుని వెళ్తున్న సీతాకోకచిలుకలు వెనకాల వెళ్తుంది.
ఇది అంత చూసిన నవీన్ కిషోర్ కి ఫోన్ చేసి నువ్వు రా ఇంటికి తొందరగా అంటే వచ్చాక ఉన్న విషయం చెప్పాడు.నమ్మక ఇంట్లోకి వెళ్లి దీక్షిత.. దీక్షిత.. అంటుంటే ఇంట్లో లేదు బాబు కూడా లేడు. బయట అంత వెతుకుతున్నాడు.ఇంతలో నవీన్ వచ్చి కిషోర్ ని ఒక్కటి పీకి చెప్తే అర్థం కాదా నీకు నీ పెళ్ళాం సీతాకోకచిలుకల మారి వెళ్ళింది అంటే,బుర్ర పెట్టి ఆలోచించు ఏంటి అన్నది నీకే తెలుస్తాది.
అప్పుడు కిషోర్ తన భార్య దీక్షిత గురించి ఆలోచిస్తున్నాడు,తన గురించి ఏమి తెలియకుండ పెళ్లి చేసుకున్న,తనని చూడగానే అన్ని మర్చిపోతాను.అసలు ఏంటి ఇది తనకి ఇష్టమైనది ఏమన్నా ఉంది అంటే మొక్కలని పెంచుతూ దానికి వచ్చే పువ్వులలో ఉన్న మకరందాన్ని తినేది.
ఎందుకో అర్థం కాలేదు మకరందం అంటే ఇష్టం అనుకున్నాను.వర్షం వచ్చే ముందు డాబా పైకి వెల్లిపోయేది వర్షం అంటే ఇష్టం ఏమో అనుకున్నాను.
దీక్షిత రాగానే మా అబ్బాయి చుట్టు ఉన్న సీతాకోకచిలుకలు వెంటనే వెళ్లిపోయేవి.ఈ విషయం తనకి చెప్పిన వెంటనే మొహంలో చాల మార్పులు వచ్చేవి.కాశ్మీర్ నుండి మనం వచ్చేసాక చాలా మంది నన్ను ఆఫీసులో మీ వెనకాల సీతాకోకచిలుక ఉంది అనేవారు.సరదాగా అంటున్నారు అనుకున్న.
దీక్షిత వచ్చాక ఆ సీతాకోకచిలుక వచ్చింది అని మళ్ళీ ఎవరు అలా అనలేదు.
నవీన్ వెంటనే కిషోర్ తో పద మనం తొందరగా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే ఇద్దరు వెళ్లారు.అక్కడ ఉన్న సీసీ కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళ దగ్గరకి వెళ్ళి 3 సంవత్సరాల క్రితం నవంబర్ నెల 15 నుండి డిసెంబర్ 9వ తారీఖు వరకు మొత్తం రికార్డింగ్ కావాలి అంటే తీసుకు వచ్చారు. కిషోర్ నవీన్ తో ఎందుకు రా ఇది అంత ఇప్పుడు అంటే మనం కాశ్మీర్ వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది నవంబర్ 13న ఆఫీస్ కి వచ్చింది నవంబర్ 15న.దీక్షిత నీకు పరిచయం అయింది డిసెంబర్9 న అంటే ఏదో ఉంది అని సీసీ కెమెరాలు చూస్తున్నారు. నవంబర్ 24 న సీసీ కెమెరాలో ఒక్కసారిగా ఆశ్యర్యం కిషోర్ వెనకాల దీక్షిత ఉంది సీతాకోకచిలుక లాగా నీ వెనకాల వచ్చింది వెంటనే అమ్మాయిలాగ మారిపోయింది.
నవీన్ వెంటనే కిషోర్ తో నేను చెప్పాను కదరా మీ ఆవిడ సీతాకోకచిలుక లాగా మారింది అని.ఇంటికి వెల్దాము రా నవీన్ నువ్వు రా అని కిషోర్ ఇంటిని మొత్తం చూస్తున్నాడు తానే గమనించలేదు ఇల్లు మొత్తం చాల ఫొటోస్ గోడలకిి అతికించి ఉన్నాయి. అవి అన్ని చూడగానే నవీన్ అరేయ్ కిషోర్ ఇవన్నీ మనం కాశ్మీరులో చుసిన ప్రదేశాలురా,అసలు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ అమ్మాయి ఎవరు అసలు ఇది అంత ఏమిటి ఆ సీతాకోకచిలుక నిన్ను ఎందుకు ఇష్ట పడింది అని నవీన్ అంటుండగా ఒక సీతాకోకచిలుక ఒక వర్తమానం తీసుకుని రెక్కలు ఆడిస్తూ కళ్ళు తెరిచి ఒక గోడ వైపు చూస్తూ ఉంటే ఆ గోడ మీద దీక్షిత కనపడుతూ చెప్తుంది.
ఏవండి నేను బాబుని తీసుకుని ఒక వారం లో వస్తాను వచ్చాక అన్ని మీకు వివరంగా చెప్తాను.ఇప్పుడు వర్తమానం తీసుకు వచ్చిన సీతాకోకచిలుక నా స్నేహితురాలు మీరు బెంగ పెట్టికోవద్దు అని ఏడుస్తూ చెప్తుంటే,కిషోర్ వెళ్లి ఆ గోడ దగ్గరకి వెళ్లి తనని పట్టుకునే లోపు వచ్చిన సీతాకోకచిలుక అప్పటిదాక కనపడే దీక్షిత కూడా మాయం అయిపోయింది.
ఇది అంత చూసిన నవీన్ వెంటనే కిషోర్ తో ఏడవకు వెళ్లి బట్టలు సర్దు తొందరగా నేను విమానం టికెట్స్ బుక్ చేస్తున్న కాశ్మీర్ వెల్దాము అనే లోపు కిషోర్ బట్టలు తీస్తూ ఉంటుంటే సర్దడానికి, ఒక హారం కనపడింది ఆ హారముకి సీతాకోకచిలుక లాకెట్ ఉన్నాది.అది కూడా తీసుకుని ఇద్దరు వెళ్లారు.మంచు విపరీతంగా కురుస్తున్నాది.ఎక్కడ వాళ్ళు మొదటిసారిగా సీతాకోకచిలుకలుని చూసారో ఆ చోటుకి వెళ్లారు.అక్కడికి వెళ్ళాక మంచు గడ్డ కట్టేసి ఉన్నది.అక్కడి వాళ్ళని అడిగితే ఎక్కడో లోయలు మధ్యలో నుండి ఈ సీతాకోకచిలుకలు వస్తాయి అని ఇంకో రెండు రోజులలో రావడం మొదలు పెడతాయి అని చెప్పారు.నవీన్ మొత్తం కనుక్కుంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళని.
ఒక సాధువు దగ్గరకి వెళ్ళాడు నవీన్ సామి ఇక్కడ ఏమి అయిన సీతాకోకచిలుకలు లోకం ఉన్నాద అని.సాధువు వెంటనే నీకు ఎలా తెలుసు నాయన దీని గురించి. ఈ లోయలలో దక్షిణం వైపున 24మైళ్ళ దూరాన ఒక కొలను ఉంటాది.ఆ కొలనులో ఉదయం సూర్య కిరణాలు పడే సమయంలో మీకు అక్కడ కొలనుకు ఒక పక్కన నీరు జరిగి లోపలకి ఒక దారి ఉంటాది,లోపలకి వెళ్ళడానికి సమయం మీకు 45 నిమిషాలు,ఆ సమయంలో మీరు గమ్యానికి చేరకపోతే మీరు ఆ నీటిలో మునిగి దారి లేక చనిపోవాల్సి వస్తుంది అని మా గురువు గారు చెప్పారు మాకు.
మీరు ఇప్పుడు బయలుదేరి వెళ్తే రేపు ఉదయానికి అక్కడికి చేరుకుంటారు.వెంటనే నవీన్ కిషోర్ నడక మొదలు పెట్టారు.దారి మొత్తం మంచు అక్కడ ఉన్న ఒకరిని సహాయం తీసుకుని వెళ్తున్నారు.ఇంకో మైలు ఉందని అనగా సూర్యోదయం అప్పుడే మొదలు అవుతుంది.కిషోర్ నవీన్ నడక వేగం పెంచారు అతనితో ఉన్న సహాయకుడితో కలిసి.ఆ కొలనుకు చేరుకోగానే సూర్యోదయం సమయం దాటిపోయింది.
ఇంతలో ఎంత అందం అక్కడ సీతాకోకచిలుకలు అన్ని అప్పుడే బయటకి వచ్చాయి.వెంటనే కిశోర్ నవీన్ తో మనకి స్వామిజీ సూర్యోదయం అయితే వెళ్ళవచ్చు అని చెప్పారు.కానీ ఇక్కడ సూర్యాస్తమయం అయ్యాక కూడ వెళ్ళవచ్చు నవీన్ ఇక్కడ రాతి మీద ఉన్న బొమ్మలు చూడు ఎంత పరిశీలనగా రాసారో.ఈ కొలను లోపల ఏదో లోకం ఉన్నది.హేయ్ కిషోర్ ఇక్కడ చూడు నీ దగ్గర ఉన్న హారం ఇక్కడ ఉన్నది.అది బయటకి తీసి నీ మెడలో వేసుకో కిశోర్ అంటే వెంటనే వేసుకున్నాడు.
సూర్యాస్తమయం సమయం అవుతుంది.ఇంతలో ఎంత మార్పు కొలను మధ్యలో నీరు పక్కకి జరిగి లోపలకి ఉన్న లోకానికి దారి చూపిస్తుంది.కిషోర్ లోపలకి వెళ్తుండగా నవీన్ ఆపాడు ఒక్క నిమిషం అగు అని,ఇంతలో సీతాకోకచిలుకలు ఆ దారి లోపలకి వెళ్తున్నాయి.వెంటనే వాటి వెనకాల పరిగెడుతున్నారు ఇద్దరు.సమయం దగ్గర పడుతుంది ఉన్న చోటుకు కొంచెం కొంచెం నీరు వస్తుంది,అక్కడ లోపల ఇంకో 5నిమిషాలలో సీతాకోకచిలుకలు లోకానికి వెళ్ళడానికి సమయం ఉన్నది.వీళ్లు ఒక చోటుకు వెళ్ళగానే నీరు రావడం ఆగిపోయింది.
సీతాకోకచిలుకల లోకానికి వెళ్ళగానే లోపల సీతాకోకచిలుకలు అన్ని మనుషులు లాగా మారిపోతున్నాయి.లోపలకి అడుగుపెట్టిన వెంటనే దీక్షిత తన బాబు యక్షిన్ ఉన్నారు అక్కడ.తనని చూసిన వెంటనే దీక్షిత కిశోర్ దగ్గరకి వచ్చి తనని పట్టుకుని ఉన్నది.ఈ లోపు మొత్తం సీతాకోకచిలుకలు నాయకులు వచ్చి మా రాజకుమారి అయిన ఈమెను మీరు వివాహం చేసుకున్నారు. ఈమె మా నాయకురాలు ఈమెను మీతో మేము వెళ్ళనివ్వము అంటే.
అసలు దీక్షత ఏంటి ఇది అంత అని కిషోర్ అడుగుతుంటే, దీక్షిత చెప్తుంది మేము భూలోకానికి రావాలి అనుకున్నప్పుడు సీతాకోకచిలుకలు లాగా మేము వచ్చి మీ ప్రకృతి అందాలను చూస్తాము.అలా వచ్చినపుడు ఒకసారి నేను సీతాకోకచిలుకలాగ ఉన్నపుడు నన్ను మీరు పట్టుకుని ముద్దు పెట్టుకున్నారు.అప్పుడే మీరు అంటే ఇష్టం మొదలు అయింది.నేను ఈ లోకాన్ని వదిలి మీకోసం వచ్చేసాను మానవ జన్మల మారి మీతో ఉండాలి అని.ఎలాగ అయిన నన్ను ఈ లోకానికి తీసుకు రావాలి అని మా నాన్నగారు మన బిడ్డను తీసుకు వచ్చారు ఇక్కడికి నేను వస్తాను అని.
మీ దగ్గర ఉన్న హారంలోనే వీళ్ళ ప్రాణాలు ఉన్నాయి అది పగిలితే ఒకరు కూడా మిగలరు.ఈ సీతాకోకచిలుకల లోకం అంతం అయిపోతుంది అని అంటూ ఏడుస్తూ చెప్తుంది.ఇంత ప్రేమ ఉన్న తనని చూసిన తండ్రి నువ్వు భూలోకానికి వెళ్తే ఈ లోకాన్ని నాయకులు ఎవరు అమ్మ చెప్పండి అంటే.
నాకు నా కొడుకు భర్త కావాలి నాన్న అంటుంటే ఏమి చేయాలో తెలియక కిషోర్ తన దగ్గర ఉన్న హారాన్ని సీతాకోకచిలుకల నాయకుడికి ఇచ్చి నా భార్యని కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి.నా వల్ల మీ లోకానికి ఏమి కాకూడదు అని తన కొడుకుని దీక్షిత ని ముద్దు పెట్టుకుని వెళ్తుండగా పక్కన ఉన్న నవీన్ సీతాకోకచిలుకలు నాయకులు అందరూ వీరి ప్రేమను చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు.
అంతలో ఒక సీతాకోకచిలుక నాయకుడు వచ్చి నేను ఈ లోకాన్ని చూసుకుంటాను దేవ వాళ్ళని వెళ్ళనివ్వండి అని అడుగుతుండగా మిగతా సీతాకోకచిలుకలు కూడ అలానే అడుగుతున్నాయి. ఇక తప్పక ఒప్పుకున్నాడు వీళ్ళ ప్రేమను చూసిన ఆ సీతాకోకచిలుకలు నాయకుడు.
నవీన్ వెళ్తూ వెళ్తూ మీ మనవడిని కూతురిని చూడడానికి మీరు రండి మా లోకానికి అంటే.మేము ఎప్పటి నుండో వస్తున్నాము వాళ్ళ దగ్గరకి మీకు తెలియదు అనుకుంటా దీక్షిత కి తెలుసు అని వాళ్ళను సూర్యోదయం అవగానే వాళ్ళని కొలను దాకా వదిలి పెట్టి వాళ్ళ లోకానికి వెళ్లిపోయారు.ఇంతలో నవీన్ కూడ ఒక సీతాకోకచిలుకని ముద్దు పెట్టుకొని గాలిలో వదిలాడు. ఆ సీతాకోకచిలుక దీక్షిత స్నేహితురాలు,అది కూడ నవీన్ వెంట వస్తూనే ఉంది....

No comments:
Post a Comment