Tuesday, October 22, 2019

రెండు అక్షరాలు.. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 38

 రెండు అక్షరాలు కదా స్నేహం అంటే.రెండు అక్షరాలు కదా ప్రేమ అంటే.అలా మొదలు అయింది రవి మరియు ప్రేమ కథ కూడ.రవి వాళ్ళ నాన్న ఒక గుళ్లో పూజారి.రవికి చిన్నప్పటి నుండి దైవ భక్తి ఎక్కువ.చదువులు అయిన ఆటలు అయిన ఎప్పుడు ముందు ఉండేవాడు.
5వ తరగతి దాక ఊళ్ళో ప్రైమరీ స్కూల్లో చదివిన రవి, 6 వ తరగతికి పక్కన ఊరిలో ఉన్న హైస్కూలుకి వెళ్ళవలసి వచ్చింది. ఊరికి 5 కిలోమీటర్లులో ఉండేది హైస్కూలు. రోజు సైకిల్ తొక్కుకుంటు వెళ్ళేవాడు.ప్రేమ రవి ఇద్దరు ఒకటే తరగతి. ఎవరికి ఎవరు పరిచయం లేదు ఇంకా.
క్లాసులో లీడర్ ప్రేమ,మాస్టారు ఇంకా తరగతికి రాలేదు అని ప్రేమ తరగతి లో ఎవరిని మాట్లాడకుండా చూసుకుంటూ,మాట్లాడిన వాళ్ళ పేరు ఒక కాగితం మీద రాసుకుంటుంది,రవి తన స్నేహితుడు సాయి తో మాట్లాడుతుంటే ప్రేమ చూసి రవి సాయి పేర్లు కాగితం మీద రాసుకున్నాది.మాస్టారు వచ్చాక వీళ్ళ పేర్లు ఇస్తే తెలుగు మాస్టర్ వీళ్ళని కబడ్డీ ఆడేస్తాడు అని తెలిసిన రవి ప్రేమ దగ్గరకి వెళ్ళి నీ కాళ్ళు పట్టుకుంటా ప్రేమ అక్క నా పేరు కొట్టెయ్ అక్క అని అంటుంటే తరగతి మొత్తం నవ్వులే నవ్వులు రవి అలా అడుగుతుంటే.
ఇంతలో తెలుగు మాస్టారు వచ్చారు రవిని సాయిని మోకాళ్ళు వేయమని రెండు పీకి పది పద్యాలు ఇచ్చి ఇవి చెప్పాక ఇంటికి వెళ్ళండి అని మాస్టారు వెళ్లిపోయారు.మంత్రాలు చదివే నోటికి పద్యాలు పెద్దగా ఏమి అనిపించలేదు రవికి.
సాయి రవి పక్కన చూడగానే లేడు వెంటనే ప్రధాన ఉపాద్యాయులు దగ్గరకి వెళ్ళి నేను వెళ్లిపోతాను మాస్టారు తెలుగు మాస్టారు కొడుతున్నారు, కొట్టారు పర్లేదు నా నోరు మామూలుగానే తిరగదు ఈ పద్యాలు ఏంటి మాస్టారు ఒకసారి మీరు చదవండి అంటే.తెలుగు మాస్టారు ని పిలిపించి కొంచెం మందలించి.సాయి నీకు పద్యాలు ఇక వద్దులే గాని ఈ లెక్కలు చేసి ఎల్లుండి నా దగ్గరకి తీసుకు రార అంటే బాబోయ్ ఈ లెక్కలు కన్న ఆ పద్యాలు సులువు అని పారిపోయాడు అక్కడి నుండి సాయి.
రెండు సంవత్సరాలు గడిచాక 8వ తరగతిలో అడుగు పెట్టారు.కానీ రవి పగ మాత్రం అలాగే ఉంది.చదువులో ప్రేమ రవి పోటా పోటీగా ఉండేవారు.స్కూల్ విడిచాక ఎవరి ఇంటికి వారు వెళ్లే అప్పుడు ప్రేమ నడుచుకుంటూ వెళ్ళేది.రవి సాయి సైకిల్ తొక్కుకుంటు వెళ్లేవారు.అలా నడుచుకుంటూ వెళ్తున్న ప్రేమ జడను పట్టుకుని రవి లాగాడు.లాగి నాలుక బయట పెట్టి వెక్కిరించుకుంటు వెళ్తున్నాడు ఆనందంతో.
కోపంలో ఉన్న ప్రేమ ఒక్కసారిగా క్రింద ఉన్న రాయిని తీసుకుని విసిరింది.అది గురి తప్పి సాయికి తగిలింది,ఇది రవి చూసాడు.సాయి సైకిల్ ఆపి రాయి ఎవరు వేశారు అని ఏడుస్తున్నాడు.ప్రేమ రవి వైపు చూస్తూ చెప్పొద్దూ చెప్పొద్దూ అని తన కళ్ళతో చెప్తుంది.రవి నవ్వుకుని ఒక కన్ను కొట్టి సాయి రక్తం వస్తుంది కధ హాస్పిటల్ కి వెల్దాము పక్కనే ఉంది కదా,ప్రేమ ఇటురా ఒకసారి మన సాయిని ఎవరో రాయి పెట్టి కొట్టారు. మీ ఊరిలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెల్దాము అంటూ, చెప్పనా సాయికి చెప్పనా అని కనుసైగలు చేస్తూ ఉంటుంటే ప్రేమ రవి కాళ్ళని ఒక తొక్కు తొక్కింది.బాబోయ్ మేమె వెళతాం అని సాయి రవి వెళ్ళిపోయి సాయికి హాస్పిటల్లో కట్టు కట్టించాడు.
రవి ప్రేమ పెద్దగా అవుతున్నారు,ఇంతలో 10 వ తరగతిలోకి వచ్చేసారు.10 వ తరగతిలో శ్రీలత అనే కొత్త అమ్మాయి వచ్చింది.ఆ అమ్మాయికి కొంచెం టెక్కు ఎక్కువ చదువు తక్కువ.రవిని చూసిన మొదటి చూపులో నచ్చేసాడు శ్రీలతకి.కానీ రవికి శ్రీలత అంటే చిరాకు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నాకు ఇలాంటి టెక్కు నచ్చదు అనేవాడు.
రవి చూపులు ఎప్పుడు ప్రేమ మీదే ఉండేవి,ప్రేమ ఎప్పుడు సచ్చినోడ నీకు పని ఏమి లేదా ఇటు వైపే చూస్తున్నావు అంటే, నాలుక బయటకి తీసి ఎక్కిరిస్తూ ఉండేవాడు.ప్రేమకి కోపం వచ్చి చేతికి ఏది దొరికితే అది పెట్టి కొట్టేది.దగ్గర ఉన్నప్పుడు రవికి తగిలేవి,దూరంగా ఉంటే మాత్రం సాయి ని వెతుక్కుని మరి వెళ్లి తగిలేవి.సాయి రవితో ఆకాశం నా మీద పగ పట్టింది అనుకుంట నా మీద ఏవేవో వచ్చి పడుతున్నాయి అని అంటుంటే రవి పడి పడి నవ్వుతుండేవాడు.
శ్రీలత కి రవి ప్రేమతో అలా ఉండడం నచ్చేది కాదు.అలా ఉండగా శ్రీలత ప్రేమ ఆటలు అడుతుండుగా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది.
శ్రీలత ప్రేమని చెంప మీద ఒకటి కొట్టింది.దూరం నుండి చూసిన రవి వెంటనే పరిగెత్తుకుని వచ్చి మా ప్రేమని కొడతావ అని శ్రీలతని నెత్తి మీద పీకి వీపు మీద ఒక్కటి చరిచాడు దెబ్బకి శ్రీలత వెళ్ళిపోయింది.
రవి ప్రేమ దగ్గరకి వెళ్ళి మిలిగుడ్లు వేసుకుని అలా చూడకు అది ఏమో గేదిలా ఉంది,నీకు ఏమో పావు కేజీ కండ కూడ లేదు.ఏమన్నా అంటే ఆ కళ్ళు వేసుకుని చూస్తావు మీ ఆస్తి ఏదో పట్టుకుని వెళ్లిపోతున్నట్టు.ఆ గోళ్లు కొరకడం మానేసి తిను తినడం మొదలు పెట్టు.మళ్ళీ ఆ గేదె దగ్గరకి వెళ్లకు నలిపేస్తాది నిన్ను అంటుంటే రవి పొట్టలో ఒకటి గుద్ది రమ్మను ఆ గేదెను రమ్మను బయటకు అని రవి దగ్గర ఉన్న క్రికెట్ బ్యాట్ పట్టుకుని శ్రీలత వైపు వెళ్తుంటే శ్రీలత భయపడి దాక్కుంది కనపడకుండ.రవి ప్రేమని హే బక్కి ఆ బాట్ ఇవ్వే వెళ్లి నేను ఆడుకోవాలి అంటే ఇంకోసారి నన్ను బక్కి అంటే మక్కిలు విరగ కొడతాను అని బ్యాట్ విసిరేసి క్లాస్ కి వెళ్లిపోయింది,ఆ బాట్ వచ్చి సాయి గాడి కాళ్ళకి తగిలింది, వాడు ఒకటే నొప్పి అని బాధ.
ప్రేమ వచ్చి రవి దగ్గరకి ఈ క్రిస్టమస్ కి మా ఇంటికి రావాలి అన్నది,మా ఇంటి పైన మా చర్చ్ ఉంటాది,మా నాన్నగారు చర్చ్ ఫాథర్ అని చెప్పింది.రవి సాయి కలిపి చర్చ్ లోపలకి వెళ్లారు అదే మొదటి సారి కొత్తగా అనిపించింది రవికి.ప్రేమ కూడ తెల్లటి డ్రెస్ లో అదిరిపోతుంది దేవత లాగ,రవి కూడ అలా చూస్తూ ఒక్కసారి బైబిల్ ని చూసి ఎందుకో చదవాలి అనుకున్నాడు,ఏ మతం ఏమి చెప్పిన అందులో ఉన్న మంచిని మనము తీసుకోవాలని అనుకున్నాడు.ప్రేమ ఇచ్చిన విందు తిని వెళ్తూ వెళ్తూ బైబిల్ ఒకటి ఇవ్వమని తీసుకుని వెళ్ళాడు.
ఇంతలో 10 వ తరగతి అయిపోయింది. ఇంటర్ లోకి వచ్చారు ప్రేమ అంటే ఎంటో తెలియని ఇద్దరి మధ్యన ఉన్న ఆకర్షణ వల్ల ఆ స్నేహం ఇంకా గట్టి పడింది.ఒకరు అంటే ఇంకొకరు వదిలి ఉండలేనటు వంటి స్నేహం ఉన్నాది. ఇలా చదువులు అవుతుండగా డిగ్రీ చివరి సంవత్సరంలో ప్రేమ రవిని ఎవరు లేని చోటుకు తీసుకు వెళ్ళింది.
రవి నువ్వు అంటే నాకు ఇష్టం,నువ్వు లేకపోతే నేను లేను,నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటే రవి నవ్వుతూ ప్రేమ మన ఇద్దరి పేర్లు రెండు అక్షరాలు మన స్నేహం రెండు అక్షరాలు ఇప్పడు మన ప్రేమ రెండు అక్షరాలు అంటుంటే ప్రేమ మాట్లాడుతూ మన పెళ్లి కూడా రెండు అక్షరాలు అని ఒకరిని ఒకరు ఆప్యాయంగా పట్టుకుని సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
చదువు అయిపోయింది ఉద్యగ అవకాశాల కోసం ఇద్దరు బయట ఊరికి వెళ్ళవలసి వచ్చింది,ఉన్న ప్రేమ ఇంకా గట్టిపడింది.ప్రేమతో రవి మాట్లాడుతూ నా కోసం నీ అలవాట్లు ఏమి మార్చుకోవాల్సిన అవసరం లేదు ప్రేమ.నువ్వు నమ్ముకున్న దైవం,మీ సంప్రదాయాలని నేను ఎప్పుడు గౌరవిస్తాను అని తనకి ఇష్టం అయిన చోటుకు తీసుకు వెళ్ళేవాడు.
ఇంతలో ప్రేమకు ఇంట్లో పెళ్లి సంబందాలు చూడడం మొదలు పెట్టారు.రవి వచ్చి ప్రేమతో మీ ఇంట్లో నేను అడగన అని అంటే వద్దు నేనే మా ఇంట్లో చెప్తాను అని ఇంటికి వెళ్ళింది.ఎవరి ఇంట్లో వాళ్ళు చెప్పడానికి ఇంటికి వెళ్లారు.రవి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు వేరే కులం వాళ్ళు వద్దు అని. ప్రేమ వాల్ల ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోతాము అని బెదిరించారు ప్రేమతో.
ఒక్కసారిగా అంత ప్రేమ ఉన్న ఇద్దరు చూసుకోవడానికి కూడ లేకపోయింది, రవి వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి బైబిల్ భగవద్గీత రెండు పక్కన పెట్టి నాన్న ఈ రెండింటిలో చెప్పేది మనిషి ఎలా ఉండాలి అని నాన్న, మనము రాసుకున్న పెట్టుకున్న కులాలు నాన్న ఇవన్ని, నా గుండె బాధతో ఏడుస్తుంది ఆ ప్రేమ అదే నా ప్రాణం తిన్నదా లేదా అని, ఎలా ఉన్నదో అని, ఒక్క నిమిషం ఉండలేను నాన్న ప్రేమ లేకుండ.కులాల మధ్య మేము నలిగి పోవాల, మీరు కూడ అడగరు నాన్న నన్ను తిన్నవా ఎలా ఉన్నావు ఏమి చేస్తున్నావు,జాగ్రత్తగా ఉండు అని,12 సంవత్సరాలు నుండి తెలుసు నాకు ప్రేమ,తను వెల్లిపోతే నా అంత దురదృష్టవంతుడు ఎవడు ఉండడు నాన్న అని కన్నీరు పెట్టుకుంటుండగా సాయి వచ్చి బయటకి తీసుకు వెళ్ళాడు రవిని.
వీళ్ళ ప్రేమ రెండు ఊర్ల మధ్య వైరాన్ని తీసుకు వచ్చింది ఈ కులాల వల్ల. ప్రేమ కూడ ఇంట్లో వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకున్నాది. కానీ పెళ్లి చేసుకున్న వాడిని దగ్గరకి రానిచ్చేది కాదు, తాను ఎప్పుడు రవి రవి అని ఏడుస్తూనే ఉండేది.ప్రేమకి పెళ్లి అయిపోయింది అన్న బెంగతో పిచ్చోడిలా తిరిగే వాడు,ప్రేమ వెళ్ళాక రవికి, రవి వెళ్ళాక ప్రేమకి సంతోషం అనేదే లేకుండా అయిపోయింది.ప్రేమించిన వాడిని మనసులో పెట్టుకుని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను,దయచేసి నాకు విడాకులు ఇవ్వండి అని రవి దగ్గరకి బయలు దేరింది.
రవి ఇంటికి వెళ్ళగానే ప్రేమకి గుండె పగిలిన అంత పని అయ్యింది. రవి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇప్పుడే స్మశానానికి తీసుకు వెళ్లారు అని.వెంటనే ప్రేమ ఏడుస్తూ అక్కడికి వెళ్ళింది.ప్రేమ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చారు అక్కడికి. పాడి మీద రవిని పడుకోపెట్టారు.ప్రేమ వెళ్లి రవిని పట్టుకుని చూడగా చేతి మీద ప్రేమ అని రాసుకుని ఉన్నది రక్తం కారుతూ.అది చూసిన ప్రేమ ఇప్పుడు సంతోషం అనుకుంటా అమ్మ నాన్న మిగతా వాళ్లందరికీ, ఎందుకు అమ్మ నన్ను రవిని పెళ్లి చేసుకోవద్దు అన్నది మీరు, రవి లాంటి వాడు దొరకడు.నా చిన్నప్పటి నుండి తెలుసువాడు, మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అన్నాడు.ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా మనసు చంపుకుని ఉంటాము అమ్మ,నేను అలా ఉండలేను.రవి లెగరా లే రవి మా మంచి రవి కద లెగుర నువ్వు లేకపోతే నేను ఏమి అయిపోవాలిరా లెగుర అని ఏడుస్తూ రవి గుండెల మీద కుప్పకూలిపోయింది ప్రేమ,రవి దగ్గరకి వెళ్ళిపోయింది ప్రేమ తను కూడా చనిపోయింది.
ఇది చూసిన సాయి వచ్చి రెండు అక్షరాల కులం వల్ల ఇద్దరి గుండె ఆగిపోయింది,అదే రెండు అక్షరాల చావు మళ్ళీ వాళ్ళని కలిపింది.మీరు ఒప్పుకుని ఉంటే రవి ప్రేమల స్నేహం ప్రేమ పెళ్లి అన్నిటికి న్యాయం జరిగేది రా,ఇప్పటికైనా మారండిరా అని రవిని ప్రేమని గట్టిగా పట్టుకుని సాయి ఏడుస్తున్నాడు....

No comments:

Post a Comment