జగమెరిగిన జగన్నాటకంలో జనాల మధ్య నాటకాలు తప్ప ప్రేమలు ఆప్యాయతలు
లేవు.ఆ ఆప్యాయతలు అనురాగలు అంతం అయిపోయాయి అని సూత్రదారికి పాత్రదారి
చెప్తున్నాడు.ఎందుకు అలా అవుతున్నాయి అని సూత్రదారి అడుగుతూ
ఉండగా.పాత్రదారి వెంటనే నీకు ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాలు గురించి
తెలియడం లేదు అనుకుంట రా నాతో రా సూత్రదారి అని తనతో తీసుకు వెళ్ళాడు.
మొదటగా నిండు గర్భిణి దగ్గరకి తీసుకు వెళ్ళాడు.ఈ కడుపులో ఉన్న ప్రాణం బయటకి వచ్చి జీవం పోసుకోవాలి అంటే కొన్ని వేల రూపాయల డబ్బు కావాలి.ఇప్పుడు మనము ఉన్న హాస్పిటల్ లో పోయి చూద్దాం అని ఇద్దరు కలిసి వెళ్తుండుగా పురిటి నొప్పిలతో బాధ పడుతున్న ఒక గర్భిణిని చూసి. పక్కన ఉన్న డాక్టర్ వచ్చి బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్ చేయాలి డబ్బులు సిద్ధం చేయండి అని అక్కడ లోపల చెప్పి .
బయటకి రాగానే తన రూమ్ లో ఉన్న నర్స్ తో ఆమెకు బిడ్డ ఏమి అడ్డం తిరగలేదు అలా చెప్తే ఆపరేషన్ చేసి ఎక్కువ డబ్బులు గుంజవచ్చు అని చెప్తూ ఉండగా ఇది బయట నుండి విన్న ఇద్దరు లోకంలో బిడ్డ పుట్టాలి అంటే ఆ దేవుడు అనుగ్రహముతో పాటు డబ్బు కుడా ఉండాలి ఇది మనం చూసిన మొదటి సంఘటన సూత్రధారి ఇక్కడ ప్రదానం డబ్బు అని అన్నాడు.
ఇక ఇక్కడ నుండి రెండో చోటుకు వెల్దాము మనము అని ఒక స్కూల్ దగ్గరకి వెళ్లారు.అక్కడ పాత్రదారి సూత్రదారితో ఇక్కడ ఉన్న ఈ స్కూల్ పక్కన ఉన్న కాలేజి అన్ని ఒకరివే.ఇక్కడ చేరిన పిల్లలు చదువు అయ్యేదాక ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు.ఇక్కడ ఉన్న ఈ తల్లిదండ్రులు లని చూడు తమ పిల్లలకి ఈ స్కూల్లో చేర్పించడానికి ఇలా పెద్ద లైన్ లో పడిగాపులు కాస్తున్నారు డబ్బు పట్టుకుని.
పిల్లల చదువు భవిష్యత్తు కూడ ఈ డబ్బులోనే ఉంది. స్కూల్ ఫీజు నుండి ప్రత్యేక తరగతులు దాకా తల్లిదండ్రులను గుల్ల చేసి వదిలేస్తాయి ఈ స్కూల్ యాజమాన్యం.ఇక్కడ బాల్యం ప్రేమ కాదు చదువు డబ్బే ముఖ్యం అని అక్కడ నుండి వేరే చోటుకు వెళ్లారు పాత్రదారి మరియు సూత్రధారి.
పిల్లల కోసం ఇంత చేయాలా పాత్రదారి అని సూత్రదారి అంటూ నడుస్తూ ఉండగా ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గరకి రాగానే అక్కడ ఒక రైతు పురుగుల మందు పట్టుకుని పంట పండించి అన్నం పెట్టే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదరా డబ్బు లంచం ఇమ్మని, వర్షాలు సరిగ్గా పడక భూములు తాకట్టు పెట్టుకుని మరి వ్యవసాయం చేసే మమ్మల్ని పాస్ బుక్ జారీ చేయడం కోసం లంచం అడుగుతున్నారు కదరా. మీలాగా చదువుకుని ఉద్యోగాలు చేయలేక కాదు పది మందికి అన్నం పెట్టామన్న సంతోషంతో బ్రతుకుదామని అనుకున్న మమ్మల్ని మీరే చంపేస్తున్నారు కదా అని ఆ రైతు తాను తెచ్చుకున్న పురుగుల మందు తాగేసాడు.
వెంటనే పాత్రదారి సూత్రధారి ఆ రైతుని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లిపోయారు. అక్కడ చేరుకునే సమయానికి అక్కడ డాక్టర్ లేడు. అక్కడ ఉన్న వారిని అడిగితే ఆ డాక్టరు గారికి వేరే ఆసుపత్రి ఉంది అండి.అది చూసాక వస్తారు లేదు అంటే మీరు ఈ రైతుని అక్కడికి తీసుకువెళ్ళండి అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ రైతుని గత్యంతరం లేక అదే ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లి డబ్బులు కట్టి ప్రాణాలు కాపాడారు సూత్రధారి పాత్రదారి కలిసి.ఆ రైతు బంధువులకు కబురు పంపి అక్కడ నుండి వెళ్లిపోయారు ఇద్దరూ.
మొదట ఊరు మొత్తం తిరిగారు ఇద్దరు ఎక్కడ చూసిన అన్యాయం ఆక్రమణ రేషన్ షాప్ కి వెళ్తే తూనికలలో మోసం. ఇదేంటి అని అడిగితే ఆ రేషన్ షాప్ డీలర్ సూత్రదారిని ఇది ఇంతే మేము మారము. తీసుకునే వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు లేదు అని అంటే.
సూత్రధారి నవ్వుకుని పాత్రదారితో ఇక పద ఇక్కడ నుండి వెళ్దాం అని రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ కార్యాలయం దగ్గరకి వెళ్లగా అక్కడ ప్రతి పనికి డబ్బు కట్టాలి అంట. జనన మరణాల సర్టిఫికెట్స్ దగ్గర నుండి రైతులకు ఇచ్చే సబ్సిడీలు కాగితాలు వరకు ప్రతి దానికి డబ్బే.ఇచ్చే వాడికి బుద్ది లేనపుడు తీసుకునే వాడికి ఏమి బాధ ఉంటాది పాత్రదారి అని చెప్తూ ఉండగా ఇది ఆలోచించ వలసిన విషయం అని వెళ్లిపోయారు.
ఆ మరుసటి రోజు ఉదయం సూత్రధారి పాత్రదారితో మనం ఇక మంచి పని చేయవలసిన రోజు వచ్చింది అనుకుంట సూత్రధారి అంటూ ఉండగా పాత్రదారి అప్పుడేనా ఇంకా మనము చూడవల్సినవి చాలా ఉన్నాయి ఈ లోకంలో పాపాలు వాటిని కడగాలి అంటే కొంత ఓపిక ఉండాలి కదా అంటే.అవును అవును అని సూత్రధారి వెళ్తూ ఉన్నారు దారి తప్పిన బాటసారులు లాగ.
అంతలో ఒక రాజకీయ నాయకుడు కుమారుడు అభం శుభం తెలియని ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ పైన హత్య చేసి ఏమి తెలియని అమాయకుడిలా ప్రజల మధ్య తిరుగుతున్న వాడికిి ప్రజలు జేజేలు కొడుతున్నారు. అది వాడికి ఉన్న డబ్బు వలన డబ్బుతో వచ్చిన పరపతి వలన అని అంటూ ఉండగా సూత్రదారి పాత్రదారితో ఈ రాజకీయ నాయకుడిని గుర్తు పెట్టుకుందాము అని తమ ప్రయాణము కొనసాగించారు.
సూత్రధారి పాత్రదారితో అక్కడ రోడ్ల మీద ఉన్న మురుగు నీరు చూసి మనం మురికివాడల్లో ఉన్నామా లేక అవే ఇక్కడ ఉన్నాయా ఈ రోడ్ల పరిస్థితి ఏంటి పాత్రదారి అంటే.పాత్రదారి వెంటనే రోడ్లు వేస్తారు ఎందుకు వేస్తారో తెలుసా డబ్బులు కోసం ఎక్కువ డబ్బులకు ఆశపడి నాణ్యత లోపించేలా వేసి, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా డ్రైనేజీలు కూడ కట్టకుండా వాళ్లే ఇంజినీర్లు అని అనుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రోడ్లు డ్రైనేజీలు కట్టేస్తారు సూత్రధారి అంటే.ఇది కూడ రాసుకో పాత్రదారి మన పుస్తకంలో అని అక్కడ నుండి కదిలారు.
ప్రభుత్వ అధికారులు ఎవ్వరు సమయపాలన పాటించడం లేదు ఎన్ని ఊరులు తిరిగిన. ప్రభుత్వ స్కూల్లో ఎప్పుడు చూసిన చదువు చెప్పే గురువులు రాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినపుడు వస్తున్నారని. మధ్యాహ్న బోజనంలో కల్తీ అని తెలుసుకుని అన్నం తినే విద్యార్థుల పోషకాహారం లోపం తెలుసుకుని ఇద్దరు భావోద్వేగానికి గురి అయ్యారు.
ఎన్ని ఊర్లు తిరిగిన ఎక్కడ చూసినా సమస్యలు. సమస్యలకు ఎన్ని పరిష్కరాలు ఉన్నా ఆచరణ పెట్టడానికి అందరూ బద్దకంతో పని చేస్తున్నారు అని ఒక జిల్లాలో ఉన్న మండలాలు పంచాయతీలు ఊర్లు అన్ని తిరిగిన ఇద్దరు మన ప్రయాణం ముగింపు దశకు వచ్చింది సూత్రధారి ఇక మనం చేయాల్సిన బాధ్యత రేపటి నుండి ఉంది అని పాత్రదారి అన్నాడు.పాత్రదారి చెప్పాక ఈ సూత్రధారి చేస్తాడు అని వెళ్లిపోయారు ఎవరి ఇంటికి వారు.
జిల్లా కలెక్టర్ ఆఫీసులో కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు అని ఒకటే హడావిడి.ఇంతలో కారు వచ్చింది అందులో నుండి సూత్రధారి దిగాడు.సూత్రధారి కలెక్టర్ అని తెలియగానే అక్కడ ఉన్న సిబ్బందిలో చాలా మంది భయంతో వణికిపోతున్నారు. ఇన్ని రోజులు వచ్చి చాలా సమస్యల పరిస్కారం కోసం రోజు ఏమి తెలియనట్టు వచ్చేవాడు పాత్రదారితో కలిసి.
అక్కడ ఎవరు ఏమి తెలియనట్టు పట్టించుకునే వారు కాదు. సమస్యల మీద అవగాహన కోసం తానే మూడు నెలల ముందుగానే ప్రభుత్వంతో మాట్లాడి జిల్లా మొత్తం ఎవరికి ఏమి తెలియకుండా తిరిగాడు తన మిత్రుడు పాత్రదారితో కలిసి.
తాను రాసుకున్న ప్రతి సమస్య మీద ఒక నివేదిక తయారు చేసుకున్నాడు.తాను మొదటి వెళ్లిన డాక్టర్ ని పిలిపించి అవసరం లేకుండా ఆపరేషన్ చేసిన నువ్వు ఇక నుండి ఆ హాస్పిటల్ మూసివేయవచ్చు అని పంపించేసాడు. స్కూల్స్ యజమాన్యాలని పిలిపించి నిరిష్ఠ రుసుము కన్నా ఎక్కువ డబ్బు వసూలు చేస్తే ఇక మీరు ఈ స్కూల్స్ మానేసుకుని కోళ్ల ఫారాలు పెట్టుకోవాల్సి వస్తాది అని హెచ్చరించి పంపించాడు.
పురుగుల మందు తాగిన రైతుని తీసుకురమ్మని తనకి రావాల్సిన పాస్ బుక్ జారీ చేసి, తనని బాధ పెట్టి లంచం అడిగిన వారిని సస్పెండ్ చేసాడు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ ని పిలిపించి ఇక మీరు మీ హాస్పిటల్లో సంతోషంగా పని చేసుకోవచ్చు. ప్రభుత్వ హాస్పిటల్ నుండి మిమ్మల్ని తీసి వేస్తున్నాము అని చెప్పి పంపేసాడు.
జిల్లాలో ఉన్న రేషన్ షాప్ డీలర్లు అందరిని పిలిపించి ఇంకోసారి తూనికలులో తేడా జరిగితే మీ స్థానాల్లో వేరే వాళ్ళు వస్తారు అని హెచ్చరించి పంపించేసాడు.
అత్యాచారం చేసి చంపిన ఆ రాజకీయ నాయకుడిని వెంటనే అరెస్టు చేయించి జైలుకు పంపి. స్కూల్లో ఉన్న ప్రతి ఉపద్యాయునికి సమయపాలన లేకపోతే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి వారంలో ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి స్కూలుకి వెళ్లి విద్యార్థులతో భోజనం చేయడం మొదలు పెట్టాడు సూత్రధారి పాత్రదారితో కలిసి.
అవినీతి చేసిన కాంట్రాక్టర్లుని పిలిచి మీకు అప్పచెప్పిన పని నాణ్యతతో అనుకున్న సమయానికి ఇచ్చిన ప్రణాళికతో పూర్తి చేయాలి అని పంపించేసాడు.
సూత్రధారి పాత్రదారితో మనం అనుకున్న రోజు ఇక ముందు ముందు కనపడుతుంది. మన వంతు కృషి మనము చేసి ఈ ప్రజల మధ్య ప్రేమ అనురాగలు కూడా పెంచుదాము అంటే నీ దారిలో నేను మిత్రమా అని వారు సమస్యల మీద పోరాటానికి ప్రయాణం మొదలు పెట్టారు..

No comments:
Post a Comment