Tuesday, October 22, 2019

మై డియర్ మనోరమ... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 47

 విది ఆడే ఆటలో ఎన్నెన్నో వింతలు, కొత్త కొత్త మనుషులు, గాయం చేసే ప్రేమలు, దగ్గర అయ్యే స్నేహాలు ఇలా చెప్పుకుంటూ పోతే జీవితాలు సరిపోవు ఏమో మనుషుల మనసు మరియు ప్రేమ గురించి చెప్పడానికి.ఏ ప్రేమ అయిన చిగురించేది యువకులుగా ఉన్నపుడే అది కాలేజ్ జీవితంలో.
మనుషులు ఎంత మంది ఉన్న మనసు ఎప్పుడు ఒకరినే కోరుకుంటుంది.
2007 వ సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది.ఎంసెట్ లో మంచి ర్యాంకు వస్తే అనుకున్న కాలేజీ లో సీట్ వచ్చేది.లేదా డబ్బులుపెట్టి కొనుక్కోవాలి అలా జాయిన్ అయిన అమ్మాయి మనోరమ.తనకి చదువు అంటే అంత ఇష్టం ఉండేది కాదు ఎప్పడూ చూసిన ఎదో మాయలో ఉండేది.స్నేహితులు చాలా మంది ఉండేవారు.కానీ తనకి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం వాళ్ళ కాలేజీలో ఉన్న వరుణ్ అంటే.మనోరమ ఎప్పుడు వరుణ్ తన పక్కన నుండి వెళ్లిన నవ్వుకుని తననే పదే పదే చూస్తూ ఉండేది.రోజులు గడుస్తున్న వరుణ్ తో ఏ వంక పెట్టి మాట్లాడలేదు అని బాధ మనోరమది.
వరుణ్ చాలా మంచివాడు,ఎంత మంచివాడో అంత కోపం ఉండేది.నున్నటి మీసం అప్పుడే వస్తున్న గడ్డం, రింగుల జుట్టు అలా బైక్ మీద వస్తుంటే ఏ అమ్మాయి అయిన ఒక సారి చూడాలి అనుకునే అందం.అలా ఉంటే ఏ అబ్బాయికి పొగరు ఉండదు వరుణ్ కి కూడ కొంచెం పొగరు ఉండేది.
అప్పుడే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో 'హ్యాపీడేస్' సినిమా విడుదల అయింది.అసలే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ సినిమా,చాలా బాగుంది అని పబ్లిక్ టాక్ ఎలా అయినా సినిమా చూడాలి అని ఆశ వరుణ్ కి వచ్చింది.ఇంకో రెండు రోజులు వరకు టికెట్స్ లేవు అని చెప్పగానే, వరుణ్ కి ఎలా అయినా సినిమా చూడాలి అని అంటే వరుణ్ ఫ్రెండ్ గౌతమ్ వచ్చి మన క్లాస్ లో ఉన్న మనోరమ వాళ్లదే థియేటర్.ఒకసారి వెళ్లి మనోరమ ని అడుగుదాం అంటే ఇద్దరు వెళ్లారు.మనోరమ గారు మాకు రెండు సినిమా టికెట్స్ కావాలి ఇప్పించగలరా అంటే.అలా నిల్చున్న మనోరమ ఒక్కసారి కూర్చుని ఇది ఏమన్నా మాయ అని వరుణ్ వైపు చూస్తూ కళ్ళు రెప్పలు కూడా వేయడం లేదు. అప్పుడు వరుణ్ మనోరమ ముందు చిటెక వేసి ఉన్నారా ఈ లోకంలో అనగానే,మనోరమ లేచి మీకు ఎప్పటికి కావాలి అని అంటే ఈ రోజు ఫస్ట్ షోకి కావాలి అంటే మనోరమ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాకు నాలుగు టికెట్స్ కావాలి అంటే వాళ్ళ నాన్న సరే అన్నాడు.ఇంకో రెండు ఎవరికి అని వరుణ్ అంటే నాకు నా ఫ్రెండ్ గీత కలిసి వస్తాము అంటే అలాగే రండి అని వరుణ్ గౌతమ్ వెళ్లిపోయారు.
సినిమాకి వెళ్లారు నలుగురు కలిసి,సినిమా మొదలు అయింది వరుణ్ పక్కన మనోరమ కూర్చుంది.వరుణ్ సినిమా చూస్తున్నాడు,గౌతమ్ అలాగే గీతని చూస్తున్నాడు ఏదో కొత్తగా,మనోరమ వరుణ్ ని చూస్తూ సినిమా చూస్తుంది.మనోరమని గౌతమ్ ని చూస్తూ తలగోక్కుంటు సినిమా చూస్తుంది గీత.
సినిమా అయిపోయింది ఈ నలుగురు ఒక బ్యాచ్ అయ్యారు.స్నేహం లో ప్రేమ అంటే ఏంటో కొత్తగా చూస్తుంది మనోరమ.
ఎంతో ఇష్టం ఉన్న మనోరమని చాలా లైట్ తీసుకునే వాడు వరుణ్.మనోరమ ఏది చెప్పిన ఆపవే నీ నోరు చాలా పెద్దది నా చెవులు చాలా చిన్నవి వినలేక చస్తున్న తింగరబుచ్చి అనేవాడు.మొదటి సంవత్సరం పరీక్షలు అవగానే ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్ మిగిలింది వరుణ్ కి తప్ప.గౌతమ్ గీత దగ్గరకి వచ్చి నీది నాది ఒకటే సబ్జెక్ట్ పోయింది అంటే మనము ఇద్దరం ఒకటే అంటే అరేయ్ వెధవ నువ్వు ఏమి రాసావుర మొత్తం నా పేపర్ లో నేను ఏమి రాసానో నువ్వు కూడ అదే రాసావు సచ్చినోడ, ఒకసారి 9 వ ఎక్కము చెప్పర చేపలు పట్టే మొహం నువ్వు పోరా నువ్వు ఇక్కడనుండి అంటే.గీత జడ లాగి నువ్వు ఊరిలో ఉన్న కోళ్లు పడతావు అనుకుంట ఆ కోడి కెలికిన హ్యాండ్ రైటింగ్ నీది పరీక్షల్లో అర్థం చేసుకోలేక నాకు కళ్ళజోడు పడిందే అని పారిపోయాడు ఎక్కడ కొడతాదో అని.
ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉండగా అర్ధరాత్రి 10 గంటలకు వరుణ్ మనోరమకి ఫోన్ చేసాడు.ఫోన్ చేసి ఏమే ఏం చేస్తున్నావు ఉన్నావ అన్నాడు.హా ఉన్నాను అంది మనోరమ.మేత మేసావ అన్నాడు హ తిన్నాను నువ్వు తిన్నావా అంది.ఇప్పుడే తిన్న అంటే హో ఆంటీ ఏమి కర్రీ చేశారు అంటే వండిందిలే మాడిపోయిన పప్పు అంటే ఎందుకు మాడింది అని మనోరమ అంటే మా నాన్న మీద కోపం వచ్చినపుడు కూర మాడిపోతాది అన్నాడు.మనోరమ నవ్వుకుని ఇంకా వరుణ్ అన్నది.ఇదిగో మనోరమ నాకు ఇంకా.. నువ్వు చెప్పు.. ఇలాంటి మాటలు అనకు నాకు పిచ్చి ఎక్కిపోతాది ఈ మాటలు వింటూ ఉంటే అనగానే మనోరమ అలాగే వరుణ్ ఇక అలా మాట్లాడను అన్నది.
వరుణ్ నువ్వు సిగరెట్ తాగుతావు కదా నువ్వు ఎప్పుడు చూసావే నేను బాగానే ఎవరికి తెలియకుండా కవర్ చేసా కదా అంటే.ఆ గౌతమ్ గాడు చెప్పాడా నీకు అంటే కాదు నేను ఒకసారి చూసా మన కాలేజ్ బయట బడ్డి కొట్టు పక్కన తాగావు అంటే,అయితే చూసేసావ ఇక నుండి నోట్లో ఏమి వేసుకొని రావాల్సిన అవసరం లేదు నీ దగ్గరకి అంటే.మనోరమ వెంటనే నీ ఆరోగ్యం పాడు అవుతుంది అంటే ఇక ఆపవే తల్లి నాకు క్లాసులు అని.
మొన్న గురువారం నువ్వు వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా అని వరుణ్ అంటుంటే మనోరమ వెంటనే బాగుందా డ్రెస్ అంటూ ఉండగా ఏమీలేదు నిన్ను ఆ డ్రెస్ లో చూస్తూ ఉంటే మన కాలేజీలో చెత్త ఎవరు ఊడవల్సిన అవసరం లేదు నీ డ్రెస్ తో చెత్త మొత్తం వచ్చేస్తాది అంటే.హేయ్ వరుణ్ ఆపేయ్ ఇక అంటే. ఏం లేదు సరదాగా అన్నాను చాలా బాగుంది డ్రెస్ మరియు నువ్వు కూడ బాగున్నావు అంటే.ఈ లోపు వరుణ్ అని వాళ్ళ అమ్మ పిలిచింది.హేయ్ ఉంటా మా అమ్మ పిలుస్తుంది వెళ్ళలేదు అనుకో నన్ను ఉతికి ఇస్త్రీ చేసేస్తాది మొన్ననే నా పాకెట్ లో సిగరెట్ ప్యాకెట్ దొరికింది అది గౌతమ్ గాడిది అని చెప్పి సర్ది చెప్పాను వెళ్తాను రేపు వచ్చే అప్పుడు చికెన్ చేసి తీసుకురా అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఉదయం బైక్ మీద వరుణ్ గౌతమ్ వెళ్తూ ఉండగా గౌతమ్ వరుణ్ తో నేను గీతని లవ్ చేస్తున్నారా అంటే.చెయ్ చెయ్ లవ్ చెయ్ అది చిన్నపుడు కరాటే లో బ్లాక్ బెల్ట్ అంట నువ్వు కర్మకాలి ప్రేమిస్తున్న అని చెప్పాక అది ఒప్పుకున్నాది అనుకో ఉంటాదిరా నీకు మామూలుగా ఉండదు. ఎందుకు చెప్తునానో విను ఒకసారి ప్రేమలో పడ్డాక ఆ గీతను వదలలేవు ఏ గీత దాటలేవు అంటే అరేయ్ వరుణ్ గా ఆపర నీకు దండం పెడతా అంటే బైక్ ఆపి వరుణ్ వెళ్లి ఒక చాక్లెట్ కొని కాలేజీకి వెళ్లిపోయారు.
మనోరమ వచ్చి చికెన్ వండి తీసుకు వచ్చిన బాక్స్ ఇచ్చింది వరుణ్ కి. ఏంటే ఇంత పెద్దగా ఉంది బాక్స్ ఒక బాక్స్ లో చికెన్ ఇంకో బాక్సలో రైస్ అన్నది. అలాగే అని చాక్లెట్ ఇచ్చి నువ్వు చాల స్పెషల్ నాకు అని వెళ్ళిపోయాడు వరుణ్.
మాటలు కలిసాయి చూపులు కలిసాయి స్నేహం పెరిగింది ప్రేమకి మొదట అడుగు కోసం ఇద్దరు వేచి చూస్తున్నారు. కానీ ఎవరు చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు ఇద్దరికి.వరుణ్ మనోరమ దగ్గరకి వెళ్ళి నేను స్వర్గం లో ఉన్నాను అనుకుంట అన్నాడు.ఆహా ఏంటి కొత్తగా స్వర్గం అంటున్నావు ఏమి అయింది వరుణ్ అంటుంటే. మనోరమ నీకు ఒకటి చెప్తున్న విను నాకు 10వ తరగతిలో 535 మార్కులు ఇంటర్ లో 920 మార్కులు ఇంజనీరింగ్ మొదటి మరియు రెండవ సంవత్సరంలో 75% మార్కులు వచ్చిన నాకు ఈ మూడవ సంవత్సరంలో ఏ మార్కులు రావు అన్ని సున్నాలే వస్తాయి అంటే.
ఎందుకు వరుణ్ ఏమి అయింది అంటే ఏమి చెప్పనే నాకు మనోరమ అనే మనోవ్యద పట్టుకుంది.నేను మనోరమ అనే దాన్ని ప్రేమిస్తున్న అనుకుంట దానికి నేను అంటే ఇష్టమే అనుకుంట ఏమి అంటావు మనోరమ అంటే కొంచెం టైం కావాలి అంట మనోరమకి అని వెళ్తూ ఉంటుంటే వరుణ్ మనోరమ వెనక పడుతు, మను నా మాట విను, నీకోసం నేను అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
అదే రోజు రాత్రి 9 గంటలకు మనోరమకి నువ్వు అంటే ఇష్టం అని మెసేజ్ చేసింది మనోరమ. వెంటనే వరుణ్ బయటకి వచ్చి ఫోన్ చేసి మను నిజంగా నేను అంటే ఇష్టమా నీకు అంటే.అవును వరుణ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటుంటే ఇన్ని రోజులు నేను చెప్తాను అని చూసావ అంటే .అలా అని కాదు నేను చెప్పాక నువ్వు ఒప్పుకోలేదు అనుకో నేను ఉండను పైకి పోతాను అనిపించి చెప్పలేదు.ఏంటి మాటలలో తేడాగా ఉన్నాయి ఎక్కడో విన్నట్టు నాలాగే మాట్లాడుతున్నావు అంటుంటే ఆరు నెలల్లో వారు వీరు అవుతారు అని నవ్వుకుని ఈ రోజు 'అక్టోబర్ 26' నా జీవితంలో మర్చిపోను అని ఐ లవ్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.ఇద్దరి మధ్యన ప్రేమ చనువు పెరిగాయి.
ఇలా ఉండగా గౌతమ్ గీత దగ్గరకి వెళ్ళి ఈ చేపలు పెట్టేవాడు కోళ్లు పట్టే గీతని ప్రేమిస్తున్నాడు అంటే గీతకి వొళ్ళు మండి ఒకటి కొట్టి నాకు నువ్వు అంటే చిరాకు నువ్వు ఎప్పుడు నా పేపర్ లో చూసి రాయకుండా పాస్ అవుతావో అప్పుడే ప్రేమిస్తా అంటే.అవును మరి నీ కోడి రాత చూసే మరి మేము పాస్ అవుతున్నాం పోవే నువ్వే నాకు వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేస్తావు అన్నాడు,గీత గౌతమ్ ని పోరా అన్నది.
3వ సంవత్సరం పరీక్షలు రాస్తూ ఉండగా గీత వెనకాల గౌతమ్ ఉన్నాడు.గౌతమ్ వెంటనే తను తీసుకు వచ్చిన స్లిప్స్ తీసి గీత పక్కన పడేసాడు.అది చూసిన గీతకి టెన్షన్ మొదలైంది.ఎక్కడ స్క్వాడ్ వస్తాడో అని.అరేయ్ గౌతమ్ ఆ స్లిప్స్ నా మీద విసరకురా నీకు దండం పెడతా అంటే,ఇప్పుడు చెప్పు ఐ లవ్ యూ అంటే నేను చెప్పనురా అంటే ఒక పెద్ద స్లిప్స్ కట్ట తీసి ఇవన్నీ నీ ముందు పడేస్తా చెప్పు అంటే అరేయ్ నువ్వు అంటే నాకు ఇష్టంరా వెధవ,ఇక వదిలేయ్ రా నువ్వు కూడా వాటిలో చూడకుండా ఈ కోడి రాతలో చూసుకో అని చూపిస్తుంది నవ్వుకుంటూ గోనుక్కుంటు.గౌతమ్ పక్కనే ఉన్న వరుణ్ వైపు చూసి యాహూ అన్నాడు.వరుణ్ చీ తు వెధవ అని ఉమ్ము వేసాడు నవ్వుతూ.
పరీక్షలు అయిపోయాయి కాలేజీకి సెలవులు వచ్చాయి. మనోరమ వరుణ్ మెసేజ్ లు ఫోన్లు చేసుకుంటూ ఉన్నారు. మనోరమ వరుణ్ తో ఫోన్ లో మాట్లాడుతూ సర్ పడుకోకుండా ఏమి చేస్తున్నారు అంటే దేవత దయ చూపిస్తాది అని చూస్తున్నా అని మాట్లాడుతూ ఉండగా మనోరమ ఫోన్ కట్ అయ్యింది.మళ్ళీ ఫోన్ చేస్తున్న ఎత్తడం లేదు మనోరమ.రేపు చేద్దాంలే ఫోన్ అని 'మిస్ యు బట్ ఐ లవ్ యూ' అని మెసేజ్ చేసి పడుకున్నాడు.
తరవాత రోజు ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా రోజులు గడుస్తున్న ఫోన్ కలవడం లేదు.
4వ సంవత్సరం కాలేజీలో అయిన తన వస్తుంది అనుకుంటే మనోరమ టి.సి తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు.వరుణ్ గుండె పగిలేలా ఏడుస్తున్నాడు మను మను అని తన లోలోపల, బయటకి కనపడకుండా.పిచ్చోడిలా తను వస్తాది అని ఎదురుచూస్తూ ఉన్నాడు.సిగరెట్స్ మీద సిగరెట్స్ తాగుతున్నాడు ఆ సిగరెట్స్ తో తనని తానే కాల్చుకుంటున్నాడు.
ఇది అంత చూసిన గౌతమ్ వరుణ్ ఇంట్లో మొత్తం చెప్పేసాడు.కొడుకు అలా అయిపోవడం చూసి వరుణ్ వాళ్ళ అమ్మ వరుణ్ దగ్గరకి వెళ్ళి ఏంటి బాబు ఇది మాకు ఉంది నువ్వు ఒక్కడివే నువ్వు ఇలా అయిపోతే ఎలార అంటే.వరుణ్ వాళ్ళ అమ్మతో నాకు ఆ పిల్ల కావాలి అమ్మ నేను ఏమి అనలేదు అమ్మ వెళ్లిపోయింది అమ్మ నన్ను వదిలేసి నేను చచ్చిపోతా అమ్మ ఆ పిల్ల లేకుంటే అని అంటుంటే మెల్లగా ఓదార్చుతున్నారు వరుణ్ ని.
కాలం గడిచి పోతుంది చదువులు అయిపోయాయి కానీ మనసుకు తగిలిన గాయాలు మానడం లేదు.
వరుణ్ ఒక కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాడు. అక్కడ హారిక అనే అమ్మాయి పరిచయం అయింది. హారిక కూడ వరుణ్ ని లవ్ చేయడం మొదలు పెట్టింది.కానీ వరుణ్ ఒక మంచి ఫ్రెండ్ కింద చూస్తున్నాడు హరికని.హారిక వెళ్లి 'ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు వరుణ్ ' అని అంది.వరుణ్ ఒక నవ్వు నవ్వి నా మనసులో నువ్వు లేవు నా ప్రాణం నా ఊపిరి అయిన మనోరమ ఉంది.నీతో అబద్దాలు ఆడుతూ నా ప్రేమను చంపుకోలేను, నిజంతో నిలకడగానే శాశ్వతంగా ఉంటాది నా ప్రేమ అని హారిక నీకు నాకన్నా మంచివాడు దొరుకుతాడు అని వెళ్ళిపోయాడు.
ఇంతలో గౌతమ్ ఫోన్ చేసి ఏరా ఎక్కడ ఉన్నావు అంటే ఆఫీస్ లో ఉన్నాను అంటుంటే.నీతో ఒకరు మాట్లాడతారు అంట మాట్లాడు అంటే ఫోన్ లో వరుణ్ హాలో హలో అంటుంటే ఏడుపు వినిపిస్తుంది,మనోరమ మను అన్నాడు ఏడుస్తూ హు నేనే వరుణ్ అంటే గౌతమ్ ఫోన్ తీసుకుని అరేయ్ బయట ఉన్న 'కాఫీడే' దగ్గరకి రా అంటుంటే.
గౌతమ్ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అక్కడికి.
అక్కడ మనోరమని చూడగానే అక్కడే కింద పడిపోయి వరుణ్ మనోరమతో "అప్పుడు కట్ చేసిన ఫోన్ మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడడానికి 7 సంవత్సరాలు పట్టింది నీకు మనోరమ, నేను బ్రతికి ఉన్నానో చచ్చిపోయానో అని చూద్దాం అని వచ్చావ.నా గుండెల్లో ఇంకా నువ్వే ఉన్నావు.ఈ క్షణము నిన్ను ఒకటే అడుగుతున్నాను. నీ గతంలో ఏమి జరిగిందో నాకు ఏమి చెప్పవద్దు.ఇప్పుడు ఈ నిమిషాన నిన్ను అడుగుతున్న నన్ను పెళ్లి చేసుకుంటావా అని" అంటుంటే. మనోరమ ఏడుస్తూ ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదు అని నేను అంటే కోపంతో ఉంటావు అనుకున్నాను.
ఆ రోజు మా నాన్న నా దగ్గరకి వచ్చి మన విషయం తెలిసి,నా ఫోన్ లాగేసుకుని నన్ను వేరే కాలేజీలో జాయిన్ చేసి నిన్ను కలవకుండా చేసాడు.నిన్ను కలవాలని అనుకున్న ప్రతిసారి నాకు ఏదో ఒకటి అడ్డం వచ్చేది.ఇప్పడు ఎప్పుడూ ఎల్లప్పుడూ నా గుండెల్లో నా మనసులో నా చేతి మీద పచ్చబొట్టు క్రింద నువ్వే ఉన్నావు వరుణ్ అంటుంటే.వరుణ్ అక్టోబర్26 అని ఇంగ్లీష్ లో పచ్చబొట్టు వేసుకుని ఉంటే.
వరుణ్ వచ్చి మనోరమతో నువ్వు ఇంగ్లీష్ మీడియం అనుకుంట చూడు నా పచ్చబొట్టు అని మనో26 అని ఉంటే.గౌతమ్ వచ్చి అసలు ఈ 26 ఏంట్రా అంటే వరుణ్ వచ్చి మనోరమ నాకు ప్రపోజ్ చేసిన రోజు అంటే.ఓయ్ వరుణ్ నిజం చెప్పు అని మనోరమ అంటుంటే ముందు నేను ఆ రోజు ప్రపోజ్ చేసాను. తరువాత అదే రోజు తను ఒప్పుకుంది అని మనోరమని గాల్లోకి ఎత్తుకుని ఇక నన్ను వదిలి వెళ్లిపోకు అని మనోరమ కళ్ళలో అలా చూస్తూ ఉన్నాడు వరుణ్....

No comments:

Post a Comment