Tuesday, October 22, 2019

సూర్యం బాబు... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 46

 నాగలి పట్టి భూమి దున్ని వరి నాట్లు వేసి పంటలని సురక్షితంగా పెంచి మనకి అన్నం పెట్టే దేవుడు రైతు, రైతే మన దేశానికి గొప్పరా అని పీటర్ అంటుంటే.
పవన్ వచ్చి మనకి విద్యా బుద్ధులు నేర్పి మన జీవితానికి మంచి దారి చూపి మనకి ఎన్నో ఉన్నత విలువలు నేర్పి మన జ్ఞానాన్ని పెంచే గురువు దేశానికి గొప్పవాడు అంటుంటే.
ఇర్ఫాన్ వచ్చి మన ప్రాణాన్ని కాపాడి మనకి ఏ రోగం వచ్చిన మనల్ని కాపాడి మనకోసం మన ఆరోగ్యం కోసం ఉండే వైద్యులు మన దేవుళ్ళు, వాళ్ళే దేశానికి గొప్ప అని ఇర్ఫాన్ అంటున్నాడు.
వాళ్ళ ముగ్గురు మధ్యన వాదన జరుగుతుంది ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అని.కనపడిన వాళ్ళని అందరిని అడుగుతున్నారు ఒక్కోక్కరు ఒకరు గొప్ప వాళ్ళు అంటున్నారు.వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరు గొప్ప అని అడుగుతుండగా అక్కడ వాళ్ళకి నవీన్ ఎదురు అయ్యాడు.మీ సమస్యకి నేను పరిస్కారం చెప్తాను, పరిస్కారం చెప్పే ముందు ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఆయన గురించి తెలిసాక మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి సమాధానాలు.
సూర్య భగవాన్ అనే ఒక ఆయన ఉంటారు.చక్కని పలకరింపు ఉండేది ఎప్పుడు ఆయన మెహంలో.చాలా మంచివారు ఎవరికి ఎటువంటి చెడు చేసే మనస్తత్వం ఉండేది కాదు ఒకరికి చెడు చేయాలి అని,బాధ పెట్టాలి అని కానీ ఉండేది కాదు.సుగుణం దాన గుణం అన్ని తనకి చాలా ఎక్కువ.
ఒకసారి ఆయన్ని నేను పక్క ఊరిలో కలిసాను చక్కని పలకరింపు,ఏవండి బాగున్నారా మీ పేరు ఏంటి అన్నారు నేను పొగరుతో నీకు ఎందుకు అన్నాను కానీ ఆయన మీరు ఏదో బాధలో ఉన్నట్టు ఉన్నారు ఏమన్నా సహాయం కావాలా అని ఆయన అంటుంటే నాకు ఒక మూడు వేలు కావాలి మీరు ఇస్తారా అని అన్నాను.ఆయన ఏమి ఆలోచించకుండా డబ్బులు తీసి నాకు ఇచ్చి ఇంకా కావాలా అండి అని అన్నారు.మీరు ఇందాక ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు మీ భార్యకి ఒంట్లో బాగోలేదు అని అందుకే మీకు తీసుకోవడం ఇష్టం లేకపోతే అప్పుగా అయిన తీసుకోండి.ఒక ప్రాణం నిలబడుతుంది అంటే నాకు అదే చాలు అండి అని వెళ్ళిపోయాడు.
నేను తన గురించి తెలుసు కోవడం మొదలు పెట్టాను ఆయన ఎవరు అని,నాకు తన గురించి తెలుసు మీకు తెలియాలి అంటే రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడకి 5 కిలోమీటర్ల దూరం ఉన్న 'స్వగ్రామం' అనే ఊరుకి రండి నేను మీకు ఎవరు గొప్ప అన్నది చూపిస్తాను అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు.నవీన్ వెళ్ళిపోయాక మిగతా ముగ్గురు ఆయన చెప్పింది నిజమే అంటావ అని పీటర్ అంటుంటే చూద్దాం ఆయన మాటలు నమ్మేలాగే ఉన్నాయి అని పవన్ అంటున్నాడు.రేపు ఉదయం ఆయన చెప్పిన ఊరికి మనము అందరం కలిసి వెల్దాము అని ఇర్ఫాన్ అంటూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు.
ఉదయం ఆరు గంటలకు నవీన్ చెప్పిన స్వగ్రామం ఊరు వెళ్లారు ముగ్గురు.వాళ్ల ముగ్గురిని తీసుకుని ఒక చోటుకి తీసుకుని వెళ్ళాడు నవీన్.అక్కడ ఒక యువకుడిని చూపిస్తూ ఈయనే సూర్య భగవాన్ అందరూ సూర్యం బాబు అంటారు.అప్పుడే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ఆయన దగ్గరకి వస్తున్నారు, లోపలకి వెళ్లే ముందు పిల్లలు అందరూ వాళ్ళ చెప్పులని విడిచి ఒక క్రమంలో వాటిని పెడుతు లోపలకి వెళ్తు కాళ్ళు కడుక్కుని గదిలో కూర్చున్నారు.
సూర్యం బాబు వచ్చి చెప్పే మొదటి మాట క్రమశిక్షణ తో కూడుకున్న విద్య చాల విలువ అయినది. తల్లిదండ్రులు లని గురువులను పెద్ద వాళ్ళని మనం గౌరవించాలి.విలువలతో కూడుకున్న జీవితం చాలా గొప్పది అని చెప్తూ తన పాఠాలు చెప్తూ ఉన్నారు సూర్యం బాబు.వెంటనే పవన్ వచ్చి చూసారా గురువు చాలా గొప్పవాడు అని నేను చెప్పాను. ఆ సూర్యం బాబు మాటలు విన్నాక ఇకనైనా ఒప్పుకోండి అంటుంటే.నవీన్ నవ్వుతూ ఆయన పాఠాలు చెప్పే తీరు వినండి అంటూ అక్కడ ఉన్న యువత ఆయన చెప్పే విధానం చాలా బాగుంటాది అని ఇక్కడికి వస్తారు వినడానికి అని రెండు గంటలు ఇక్కడే ఉంటారు మనము కూడా విందాము అని అక్కడే ఉన్నారు.అందరూ బయటకి వచ్చి నువ్వు చెప్పింది ఒప్పుకుంటాము పవన్ గురువే గొప్పవాడు ఆయనని చూసాక చెప్తున్నాము అంటే. ముందు మనం అల్పాహారం తీసుకుందాము అని చెప్పి తిన్నాక మనము 9 గంటలకు ఒక చోటుకు వెల్దాము అంటే సరే అని చెప్పి వెళ్లారు.
ఊరి చివర పొలాలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలి, మట్టి వాసన ఇది చూసిన పీటర్ చాలా బాగున్నాయి ఈ పొలాలు ప్రకృతి ఒడిలో ఉండడం అంటే తల్లి ఒడిలో ఉన్నంత హాయిగా ఉంటుంది అనే లోపు సూర్యం బాబు సైకిల్ తొక్కుకుని పొలాల వైపు వస్తున్నాడు.సూర్యం బాబు మొహంలో ఏ కల్మషం లేదు అని పవన్ అంటుంటే సూర్యం బాబు సైకిల్ దిగి పొలం వైపు చూసి నమస్కరించి పొలంలో పనులు చేస్తున్నారు.ఇంతలో ఒక ఇద్దరు వచ్చి ఏంటి సూర్యం బాబు ఇది మేము చేసి పెడతాము ఈ పని అంటే. ఈ పుణ్యకార్యం నన్ను చేయనివ్వండి దేశానికి అన్నం పెట్టేవాడు రైతు ఆయన చేతులు మీదగా ఎంతో మందికి అన్నం వెళ్తుంది,ఏదో సంతృప్తి ఈ పని చేస్తుంటే మనం రైతు బిడ్డ అని గర్వంగా చెప్పుకోవచ్చు.మీరు కూడ పురుగులు మందులు వాడడం మానేసి సేంద్రియ ఎరువులు వాడండి ఈ సారి దిగుబడి పెంచుదాము మనము అని నవ్వి. సేంద్రియ పద్ధతులు తెలుసుకోవడానికి ఆయన దగ్గరకి వచ్చిన ఇద్దరు యువకులకి తాను చేసే వ్యవసాయం గురించి సూర్యం బాబు వివరిస్తూ ఉండగా పీటర్ వచ్చి సూర్యం బాబు చెప్పిన మాటలకి ముందు నేను మారాలి నేను కూడ మా పొలాలకు విపరీతంగా పురుగులు మందులు వాడుతున్నాము అని చెప్పి నేను కూడా ఆయన దగ్గరకి వెళ్తాను అని చెప్తుంటే,అలా ఒకరికి సూర్యం బాబు చెప్తుంటే మధ్యలో మనము వెళ్లకూడదు అని నవీన్ చెప్తూ, మధ్యాహ్నం మనము సూర్యం బాబు ఇంటికి వెల్దాము అంటే పవన్ పీటర్ సరే అన్నారు.ఇర్ఫాన్ వచ్చి ఏంటి ఇది అంత మాకు తెలిసి వైద్యుడు గొప్ప అంటుంటే నవీన్ వెంటనే ఏమి మాట్లాడకుండా నాతో రండి అని చెప్పి అక్కడ ఉన్న భోజనసాల దగ్గరకి తీసుకు వెళ్లి భోజనం చేయించాడు.
సమయం మధ్యాహ్నం రెండు అయింది అందరూ కలిసి సూర్యం బాబు ఇంటికి వెళ్లారు.లోపల చాలా మంది జనం ఉన్నారు అక్కడ సూర్య హాస్పిటల్ అని బోర్డ్ ఉంది.నవీన్ మాట్లాడుతూ సూర్యం బాబు డాక్టర్ పెద్ద చదువులు చదివి ఇక్కడే ఉచితంగా వైద్యం చేస్తారు.అక్కడ ఉన్న హుండీలో డబ్బులు వేయమంటారు మీకు ఇష్టం ఉంటే అవి కూడా పేద ప్రజల ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు అని అంటుంటే చాలా తప్పు చేసాము నవీన్ గారు ఒక మంచి వ్యక్తిని చూసాము మేము మీ వల్ల ఒకసారి ఆయనని కలుద్దాం అని అందరూ వెళ్లి సూర్యం బాబు దగ్గరకి వెళ్లారు.
సూర్యం బాబు దగ్గరకి వెళ్ళగానే నవీన్ మిగతా వారు నమస్కారం చేస్తూ కూర్చున్నారు.సూర్యం బాబు మాట్లాడుతూ ఏంటి నవీన్ గారు ఇప్పుడు మీ భార్య బాగున్నార అని అంటూ ఉండగా, ఒకరి గురించి ఒకరు ఏమేమి చేస్తున్నారో చెప్తున్నారు.
పీటర్ మాట్లాడుతూ నేను వ్యవసాయం చేస్తాను సూర్యం గారు అని అంటుంటే,మీ గురించి తెలుసు పీటర్ మీరు యువతకి వ్యవసాయం విలువ గురించి చెప్పి వారిని కూడ వ్యవసాయం మీదకి వెళ్లేలా మీరు చేస్తున్న సేవ మేము ఎప్పుడు ఫేస్ బుక్ లో చూస్తూ ఉంటాము అనగానే పీటర్ అలాగే ఉన్నాడు ఏమి మాట్లాడకుండ.
పవన్ మాట్లాడుతూ నేను అందరికి ట్యూషన్స్ చెప్తాను సూర్యం గారు అంటుంటే పవన్ మీరు నాకు తెలుసు మీ ట్యూషన్స్ చాలా ప్రసిద్ధము చెందినవి అని అంటుంటే అలాగే చూస్తూ ఉండగా.
ఇర్ఫాన్ తన గురించి చెప్తూ ఉండగా మీరు ఇర్ఫాన్ కదా నాలుగు సంవత్సరాల క్రితం మీరు ఎంసెట్ టాపర్ కదా అంటుంటే మా గురుంచి మీకు ఎలా తెలుసు అంటుంటే ముగ్గురు కలిసి. మీ గురించే కాదు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరు ఎప్పుడు గుర్తుకు ఉంటారు అని చెప్పి, ఇప్పుడు మీ సమస్యకి నేను పరిస్కారం నేను చెప్తాను,నిన్ననే నవీన్ ఫోన్ చేసి మొత్తం చెప్పాడు.
రైతు గొప్ప, గురువు గొప్ప, వైద్యుడు గొప్ప అని దానికి నా సమాధానం మనము మనిషిగా ఉండడం గొప్ప అంటాను అది ఈ పవిత్ర భారతదేశంలో పుట్టినందుకు.భిన్నత్వంలో ఏకత్వం ఇదే మన భారత దేశం గొప్పదనం.అనేక సంప్రదాయాలు, మతాలతో కూడుకుని ఉన్న మన దేశం భారతదేశం.
మనం ఎప్పుడు గొప్పలకి పోకూడదు అందరిని సమానంగా గౌరవించాలి అప్పుడే మనకి ఉన్న గౌరవం పెరుగుతాది అని చెప్తూ ఉండగా పవన్ పీటర్ ఇర్ఫాన్ కలిసి సూర్యం గారు రేపటి నుండి మేము మీ దగ్గరకి వస్తాము మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి వెళ్లిపోయారు బయటకి.వాళ్ళు ముగ్గురు కలిసి గొప్పవాడు ఎవరో కాదు మన సూర్యం బాబు మీరు మాకు మంచి వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు నవీన్ గారు అని మళ్ళీ సూర్యం బాబూని కలవడానికి రేపటి ఉదయం ఎప్పడూ అవుతుంది అని వెళ్తూ వేచిచూస్తున్నారు..

No comments:

Post a Comment