తాతయ్య గారు మన ఇంట్లో పండుగ కదా,షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు కుటుంబం
మొత్తం కలిసి. మరి చిన్న బాబాయిని కూడ పిలవాల్సింది కదా బాబాయి వస్తే
బాగుంటాది అంటే.వెంటనే రామదాసు తాతయ్య వాళ్ళ మనవడు నానిని చదువుకోకుండా ఇలా
పెద్ద వాళ్ళ వ్యవహారాలు నీకు ఎందుకు అని అనేసరికి మొహం మాడ్చుకుని వాళ్ల
నాన్నమ్మ దగ్గరికి వెళ్లి నాన్నమ్మ చిన్న బాబాయ్ అంటే తాతయ్యకి ఎందుకు
ఇష్టం లేదు అంత కోపం ఎందుకు అంటే.పక్కన నానిని కూర్చోపెట్టి ఆ తండ్రి
కొడుకుల బంధం గురించి చెప్పాలి అంటే 30 సంవత్సరాలు వెనకకు వెళ్ళాలి నాని
అని.
రామదాసు గారికి మొత్తం ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి చివరి వాడు రాకేష్ చిన్న వాడు కాబట్టి చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. చాలా అల్లరి చేసేవాడు,చదువు కూడ బాగా చదివే వాడు,
స్నేహితులు చాల ఎక్కువ ఎవరు అయిన తప్పు చేస్తే ఊరుకునే వాడు కాదు.చిన్నప్పుడు రాకేష్ పెన్సిల్ తన ఫ్రెండ్ సాకేత్ అడగకుండా తీసుకున్నాడు అని అదే పెన్సిల్ తీసుకుని అర చేతిలో గుచ్చి రక్తం వచ్చాక ఆ పెన్సిల్ తీసి ఇప్పుడు నీ దగ్గర ఉంచుకో నాకు ఇంకో పెన్సిల్ ఉంది.ఇంకెప్పుడు అడగకుండా తీసుకోకూడదు అని గుర్తు ఉండేలా చేసా సాకేత్ అని నవ్వుతుంటే.సాకేత్ రాకేష్ ని వామ్మో వీడో పిచ్చోడు అనుకున్నాడు.ఇంటికి వచ్చాక కూడ అల్లరి పనులు చేస్తూ దెబ్బలు తింటు,ఎదురు తిరుగుతూ పెరిగాడు.
వాళ్ళ నాన్నగారు రామదాసు గారు పోలీస్ కానిస్టేబుల్,ఆయన పనిలో ఉండడం వల్ల ఎవరు ఎలా ఉంటున్నారు పిల్లలు అని తెలిసేది కాదు.రామదాసు గారు పెద్ద అబ్బాయికి ఉద్యోగం వచ్చి ఢిల్లీలో ఉంటున్నాడు.రెండోవాడు అమెరికాలో ఉంటున్నాడు, అమ్మాయికి పెళ్లి చేసేసారు.
మిగిలిన రాకేష్ డిగ్రీలో చేరాడు రాకేష్ చేరిన కాలేజీలో రెండు బ్యాచ్లు ఉండేవి.ఎప్పడూ చూసిన గొడవలు ఉండేవి.రాకేష్ అవి ఏమి పట్టించుకునే వాడు కాదు,కానీ లోపల కోపం అలాగే ఉండేది. సాయంత్రం ఇంటికి వచ్చాక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేవాడు.
ఒకరోజు కాలేజీలో బయట ఉన్న బడ్డి కొట్టు దగ్గర కూల్ డ్రింక్ కొనుక్కుని తాగబోతు ఉండగా తన సీనియర్ వాసు వచ్చి రాకేష్ చేతిలో ఉన్న కూల్ డ్రింక్ లాక్కుని తాగుతున్నాడు.ఏమి ఎరగనట్టు ఇంకో డ్రింక్ తీసుకుని వాసు దగ్గరక వెళ్ళి ఒక చిన్న నవ్వు నవ్వి డ్రింక్ బాగుందా అన్నాడు రాకేష్.అంతలో ఏమి అయిందో తెలియదు కాని రాకేష్ తెచ్చిన డ్రింక్ తీసుకుని వాసు నెత్తి మీద కొట్టి రక్తం వచ్చాక ఇప్పుడు హ్యాపీగా తాగు అని వెళ్ళిపోయాడు. ఇది అంత చూసి అందరూ షాక్ అయ్యారు.వాసు దగ్గరకి వెళ్ళి సాకేత్ చిన్నప్పుడు నేను అడగకుండా పెన్సిల్ తీసుకుంటేనే అరచేతిలో అంగుళం దించాడు.ఇప్పుడు నీకు అయిదు కుట్లు పడేలా చేసాడు,కకృత్తి పడకుండా ఇక నుండి నీ డబ్బులతో కొనుక్కో అని సాకేత్ రాకేష్ దగ్గరకి వెళ్ళిపోయాడు.
రాకేష్ సాకేత్ సందీప్ వీళ్లు ముగ్గురు ప్రాణ స్నేహితులు కలిసి బాగ ఉండేవారు ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటు.సాకేత్ మిగతా ఇద్దరితో మన క్లాస్ లో ఉన్న లలితని ఎప్పుడైనా మీరు చూసారా అసలు పాలరాతి బొమ్మ లాగ ఉంటాది. మాట్లాడదామని వెళ్తే చాలు కసురుకుంటుంది.ఎలా అయినా మాట్లాడాలి అంటుంటే మీరు ఇద్దరు కూడ రండి అని లలిత ఉన్న చోటుకు తీసుకు వెళ్ళాడు.
కొంచెం దూరం నుండి లలితని చూడగానే రాకేష్ సాకేత్ తో లలిత ఈ రోజు నుండి నీకు అక్కతో సమానం, అరేయ్ సందీప్ నీకు చెల్లెలుతో సమానం అంటుంటే. పోరా నువ్వు అని సాకేత్ వెళ్తుంటే,రాకేష్ చేతిలో ఉన్న పెన్ తీసి ఇది పెన్సిల్ కన్న ఇంకో అంగుళం వెళ్తాది అనుకుంట సాకేత్ అంటే, ఎవరు అన్నారు లలిత నా అక్క కాదు అని లలిత నా అక్క అన్నాడు.సందీప్ నీకు ఏ కూల్ డ్రింక్ కావాలి చెప్పు తొందరగా అంటే రాకేష్ బావ మా చెల్లె కదా లలిత అని సైలెంట్ గా సాకేత్ సందీప్ జారుకున్నారు అక్కడినుండి.
రాకేష్ లలిత దగ్గరకి వెళ్ళి ఏంటండి అసలు మీకు ఇది న్యాయమని అనిపిస్తుందా,అసలు నేను ఏమి చేసాను అండి లలిత అంటుంటే రాకేష్ మా కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు. పోనీ అయ్యారే అనుకో మా క్లాస్ లో ఎందుకు జాయిన్ అయ్యారు. మీ అందం అంత బాగుంటే మేము ఎప్పుడు చదువులు చదవాలి.బుక్స్ తీస్తే మీరే గుర్తుకు వస్తున్నారు.పోనీ చదవడం ఆపేసి అలా టీవీ లు చూస్తున్నా అందులోను మీరే కనపడుతున్నారు,ఇలా అయితే మేము పాస్ అవడం కష్టం.రండి ఇద్దరం కలిసి ప్రిన్సిపాల్ దగ్గరకి వెల్దాము.మీకు టి.సి ఇప్పించేస్తాను వేరే కాలేజీకి మీరు వెళ్లిపొండి అంటే కోపంతో లలిత అరేయ్ ఎవడ్రా నువ్వు అని చేతులు పట్టుకుని నీకు దండం పెడతా మా ఇంట్లో ఒప్పించి మరి ఈ కాలేజీలో చేరాను.నన్ను వదిలేయ్ రా బాబు నీకు నమస్కారము అని చెప్పి వెళ్లిపోతుంటే,రాకేష్ లలిత వెనక పరిగెడుతూ లల్లి నువ్వు చాలా బాగున్నావు,నీకోసం పడి చచ్చిపోతా నేను అంటే.లలిత వచ్చి నా పేరు లల్లి కాదు శ్రీలలిత,చచ్చిపోండి ఏదన్నా గోదావరిలో దూకి అని మూతి తిప్పుకుని వెళ్ళిపోయింది.
సాకేత్ సందీప్ దూరం నుండి తొంగి తొంగి చూస్తున్నారు.రాకేష్ దగ్గరకి వచ్చి ఆ అమ్మాయి నీకు ఎప్పుడు తెలుసు అంటే,నేను మీ క్లాస్ కదా, నాకు ఆ అమ్మాయి తెలుసు.మొన్న మన సీనియర్ వాసుని కొట్టింది ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు అని. ఎప్పుడు దొరుకుతాడ అని చూసాను మొన్న అలా కుదిరేసింది అంతే సాకేత్ అంటే.అమ్మ దుర్మార్గుడ మాకు తెలియకుండా ఇంత చేసావ అని అంటు మెడ మీద చెయ్యి వేసి తోసేసారు సరదాగా.
డిగ్రీ రెండవ సంవత్సరంలో లలిత రాకేష్ లవ్ ని ఒప్పుకుంది.అలా సాగిపోతున్న లైఫ్ లో సందీప్ రాకేష్ సాకేత్ తో కలవడం తగ్గిస్తున్నాడు.ఎప్పుడు చూసిన సిగరెట్ తాగుతూ ఉండేవాడు.సాకేత్ రాకేష్ తో సందీప్ గంజాయికి అలవాటు పడ్డాడు మన కాలేజీలో డబ్బు కోసం కొంత మంది సీనియర్లు ఇలా చేస్తున్నారు అని రాకేష్ కి చెప్పగానే,వెంటనే సందీప్ దగ్గరకి వెళ్ళారు రాకేష్ సాకేత్.ఏంట్రా కొత్తగా గంజాయి అలవాటు ఏంటి అని రాకేష్ సాకేత్ కలిపి కొడుతూనే ఉన్నారు సందీప్ ని.ఇంకోసారి తాగుతావ అని అంటే బాబోయ్ కొట్టడం ఆపండిరా ఇక తాగను.మన కాలేజీలో ఆ వాసు గాడి బ్యాచ్ డబ్బులు కోసం మాకు అలవాటు చేస్తున్నారు అంటే.
ఏమి ఆలోచించకుండా రాకేష్ వాసు బ్యాచ్ ని కొట్టడానికి వెళ్తుంటే రాకేష్ వెనకాల సపోర్ట్ గా చాల మంది వచ్చారు.రెండు బ్యాచ్ లు కొట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాలేదు. తలలు పగులుతున్న రక్తం కారుతున్న ఎవరు వెనకకు తగ్గడం లేదు.ప్రిన్సిపాల్ వచ్చిన తోసి వేశారు రోడ్ మీదకి వెళ్లి కొట్టుకుంటే పోలీస్ వాళ్ళు వచ్చి రెండు బ్యాచ్ వాళ్ళని తీసుకుని పోయారు.
రాకేష్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక సెల్ లో మిగతా బ్యాచ్ ని ఇంకో సెల్ లో పెట్టారు.మీ తల్లిదండ్రులుకి ఫోన్ చేసి రమ్మని అన్నారు.రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న రాకేష్ వాల్ల నాన్న రామదాసు వచ్చి రాకేష్ ని సెల్ లో చూడగానే చాల బాధపడ్డారు. అందరిని ఇంటికి పంపించేసాక రాకేష్ ని ఈ రోజుతో నా పరువు మొత్తం పోయింది.ఇప్పటిదాకా చాలా గౌరవంగా ఉన్నాను.అందరూ అక్కడ మీ అబ్బాయే గొడవకు కారణం అంటున్నారు అని అంటుంటే. అసలు చెప్పింది వినండి నాన్న అంటుంటే,అవి ఏమి నాకు చెప్పకు ఒక పక్కన కూర్చో అంటే.
నాన్న నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మడి కట్టుకుని మూలన కూర్చుని మంత్రాలు చదవడం నాకు రాదు,మండి పోతాది నాకు. మీరు తప్పు చేస్తే ఉరుకుంటారు అనుకుంట నా వల్ల కాదు అని బయటకు వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ దగ్గరకి.
వెళ్ళగానే సందీప్ ని ఒక్కటి పీకి అసలు నీ వల్లే వచ్చింది అంటుంటే.ఈ లోపు లల్లి వచ్చింది ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు రాకేష్ అని బుంగ మూతి పెట్టుకుంది.
రాకేష్ వెంటనే నాకు తిక్క ఎక్కిపోయి ఉంది, అలా మూతిని వంద వంకర్లు తిప్పకు రబ్బరు లాగ సాగిపోతాది అంటు,మా నాన్న ఇంట్లో నస నీ నస ఇక్కడ సరిపోయింది నాకు అని , సందీప్ ని ఒక తన్ను తన్నాడు మళ్ళీ మొత్తం ఈ వెధవ వల్లే అని.లల్లి నువ్వు ఇంటికి వెళ్ళు నిన్ను ఇప్పుడు ఒకటి పీకాను అనుకో మళ్ళీ నేను నిన్ను ఒక వారం రోజులు బతిమలాడుకోవాలి.నీ అలక అలాంటిది అని లల్లిని ఇంటికి పంపించేసి సినిమాకి వెళ్లారు మిగతా ముగ్గురు.
గొడవ అయిన తరువాత రోజు కాలేజ్ ప్రిన్సిపాల్ గొడవలో ఉన్న అందరిని ఒక వారం రోజులు సస్పెండ్ చేసారు ఇదేంటి అని సాకేత్ పద ప్రిన్సిపాల్ ని అడుగుదాము అంటే, రాకేష్ సాకేత్ తో వాళ్ళ అబ్బాయిని కూడ సస్పెండ్ చేసాడు. నువ్వు వెళ్లి అడిగావు అనుకో నిన్ను డిబార్ చేస్తాడు అంటే, అమ్మో వద్దులేర అని వెళ్లిపోయారు.రాకేష్ లల్లి దగ్గరకి వెళ్ళి మన కాలేజి యాజమాన్యం నా ప్రదర్శన చూసి ఒక వారం రోజులు సెలవులు ఇచ్చారు.నువ్వు ఏమి ఇబ్బంది పడకుండా ఈ వారం రోజులు క్లాసులు బాగ విని నాకు రాత్రి ఫోన్లో పాఠాలు చెప్పు అంటే. సచ్చినోడ నావి రబ్బరు పెదాలు అంటావ అని ఒక గుద్దు గుద్దింది.జాగ్రత్త ఈ వారం ఎండలో తిరగకు ఇంట్లో రెస్ట్ తీసుకో అని చెప్పి ఫ్లై కిస్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంట్లొకి వెళ్లిన రాకేష్ షాక్ అయ్యాడు వాళ్ళ చిన్న అన్నయ్య అమెరికా నుండి వచ్చాడు.అరేయ్ అన్నయ్య చెప్పలేదు ఎప్పుడు వచ్చావు ఏమి తెచ్చావు అని సరదాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు.
రాకేష్ డిగ్రీ 3వ సంవత్సరం కి రాగానే ఇద్దరు అన్నయ్యలకు పెళ్లి అయిపోయింది.అలా చదువులు కూడ అయిపోయాయి రాకేష్ వి. ఈ లోపు లల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది మా ఇంట్లో నాకు పెళ్లి సంబందాలు చూస్తున్నారు అని, రాకేష్ వెంటనే హ్యాపీగా పెళ్లి చేసుకో నీ తిక్క కుదిరిద్ది మాట్లాడితే నా దగ్గర తిప్పుతావు కదా మూతి అలాగే తిప్పు అక్కడకూడా అంటే. అరేయ్ రాకేష్ గా చెప్తే అర్థం కాదా నీకు,కాదే ఏంటి చెప్పు అంటే నువ్వు వచ్చి మా నాన్నని అడగలేదు అనుకో నేను మీ నాన్నని అడుగుతా అన్నది.వద్దే తల్లి మీ బాబు ఇంట్లో తగలడ్డాడ లేక బయటకి పోయాడా.ఓయ్ మా నాన్నగారు మాటలు జాగ్రత్త ఇంట్లోనే ఉన్నారు అంటే వస్తున్న మాట్లాడడానికి అంటుంటే రార.. రా.. నువ్వు వస్తావు అని నాకు తెలుసు నా బంగారం.హ మళ్ళీ నేను రాగానే నచ్చలేదు అని చెప్పావు అనుకో నీకు నీ బాబుకి అక్కడే మోత మోగిపోతాది అంటే,నువ్వు ముందు రా అన్నది.లల్లి వాళ్ళ నాన్నగారి దగ్గరకి వెళ్లగా మాట్లాడి ఒప్పించాడు.కానీ ఒక కండిషన్ బాబు మీ ఇంట్లో వాళ్ళని అయిన తీసుకురా లేక మంచి ఉద్యోగంతో అయిన రా రాకేష్ అన్నాడు అలాగే అండి అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నని అడగగా నేను ఒప్పుకొను, నా చెల్లెలి కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం అని మాట ఇచ్చాము.వేరే కులాలు వాళ్ళని నేను ఒప్పుకోను అంటే. నాన్న నా ఇష్టం నా పెళ్లి నేను కలిసి ఉండేది మీరు కాదు, అయిన ఈ కులాలు మనకి కూడు పెట్టవు నాన్న,మనం పెట్టుకున్నవి ఈ కులాలు,మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన నేను లలిత నే చేసుకుంటా అంటే.వెంటనే నా ఇంట్లో నుండి బయటకు పో రాకేష్ అంటే అలాగే నాన్న అని.అమ్మ వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు బయటకి.
సందీప్ వాళ్ళ ఇంటి పైన పెంట్ హౌస్ లో ఉంటూ గ్రూప్1 కి ప్రిపేర్ అయ్యి డీ.ఎస్.పి కింద సెలెక్ట్ అయ్యాడు జాబ్ లో.మంచి ఉద్యగం వచ్చింది అని లల్లిని ఇచ్చి పెళ్లి చేసారు.కానీ రామదాసు రాలేదు పెళ్లికి,వెళ్తే ఎక్కడ తన పంతం తక్కువ అవుతాది అని.
రామదాసు పని చేసే పోలీస్ స్టేషన్ లొనే రాకేష్ ట్రాన్సఫర్ అయ్యాడు.రాకేష్ కి గ్రాండ్ వెలకం చెప్పారు రామదాసుతో కలిపి అందరూ సెల్యూట్ చేసి మరి.లోపల చాల గర్వంగా ఉంది నా కొడుకు అని బయటకి కనపడరు. వాళ్ళ నాన్న ని తన క్యాబిన్ లోకి పిలిపించి ఏంటి నాన్నగారు ఇది మీరు ఇంకా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు అంటే. సారి సర్ మీరు నాకు బాస్ ఇక్కడ అవి కాకుండా వేరే ఏమన్నా చెప్పండి అంటే మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఏంటి అమ్మ నాన్న ఇంక మారడ అంటే నువ్వు మార్చు నాయన ఇక నీతోనే ఉంటారు కదా అంటే ఫోన్ పెట్టేసారు.
ఒకసారి ఒక దొంగ దొంగతనం చేస్తూ పరిగెడుతూ ఉంటే వెనకాల రామదాసు కూడ పరిగెడుతున్నాడు. ఇది జీప్ లో నుండి చూసిన రాకేష్ కూడా వాళ్ళ నాన్న గారితో పరిగెడుతూ ఏంటి నాన్న గారు మరీనూ మీరు చిన్న పిల్ల లాగ అలా పరిగెడుతున్నారు అంటే, ముందు మూసుకుని దొంగను పట్టుకోరా అంటే ఇద్దరు కలిసి ఆ దొంగని పట్టుకున్నారు. వెంటనే మంచి నీళ్ళు ఇస్తూ నాన్న గారు మీకు ఇష్టం లేకపోతే ఈ జాబ్ వదిలేయ్ మంటారా అంటే వద్దురా అలా అనకు అని పట్టుకున్నాడు గట్టిగా.కానీ ఇంటికి రమ్మని అడగలేదు,అలా రోజులు వెళ్తున్నాయి అని నానికి వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది.
రాకేష్ వాళ్ళ నాన్న రామదాసు ఇంట్లో వాళ్ళందరిని రెడి అవ్వమని చెప్పి రాకేష్ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి రాకేష్ ని ,అరేయ్ రాకేష్ నువ్వుకూడ మన ఇంటికి వచ్చేయి ఇప్పటికే చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నావు అంటే.తప్పకుండా నాన్నగారు అని ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా షష్ఠిపూర్తి చేసి అందరూ ఆనందంతో గడిపేస్తు ఉండగా, నువ్వు చెప్పింది నిజం ఈ కులాలు అన్ని మనము పెట్టుకున్నాయి.నువ్వు నీలాగా ఉన్నావు నువ్వు ఏమి మారలేదు నువ్వు మొండి వాడివిర, నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది అని కౌగిలించుకున్నాడు..

No comments:
Post a Comment