ఇది ప్రేమో ఏమో.. ఏమో.. మైకం కమ్మేసిందో అని పాటలు పాడుతున్న రేవంత్ ని
చూసి భువనేశ్వర్ మరియు నిత్యా కొంచెం వెరైటీగా చూస్తున్నారు.ఏమిటిరా అలా
ఉన్నావు ఏమి అయింది కొత్తగా ప్రేమ అంటున్నావు.లేదురా కొత్తగా వచ్చిన పాట
పాడుతున్న, మనకి ప్రేమలు దోమలు తెలియవు కదరా.ఎప్పుడు అయిన ప్రేమలో పడితే
అది నేను నాతోనే పడతానురా.మరి ప్రేమ పాట ఎందుకు పడుతున్నావు అని నిత్యా
అంటే.
పాట బాగుంది అందుకే పాడుతున్న నిత్య.అయిన నిన్ను చూసాక నువ్వు ఆ కుమార్ గాడికి పెట్టె నరకం దగ్గర ఉండి చూసాక నేను ప్రేమ అంటాన తింగరి.నేను గోదావరిలో అయిన మునుగుతాను కాని ప్రేమలో మాత్రం మునగనురా భువి.పోయి మీ పని చూసుకోండి,ఉన్నారు కదా ఇద్దరికి ప్రేమికులు సొల్లు వేసుకోండి. అరేయ్ చూడు రేవంత్ నువ్వు గోదావరిలో కాదు సముద్రంలో కొట్టుకుపోతావు ఇది నా శాపము రా అని భువి అంటుంటే రేవంత్ అలాగే చూస్తున్నాడు.
రేవంత్ ని ఎప్పుడు చూడు గ్రౌండ్ ఆటలు ఇవేన లోకం అని నిత్య అంటుంటే మీలాగ ఆడే ఆటలు కాదు అవి మా సంతోషం కోసం ఆడుతున్నాం అని రేవంత్ అంటుంటే. నిత్య చూడు చూడు నీకు నిన్ను బెండు తీసేది వస్తాది అని నిత్య చెప్తుంటే రేవంత్ పట్టించుకోకుండా క్రికెట్ బ్యాట్ తీసుకుని వెళ్ళిపోయాడు. రేవంత్ క్రికెట్ ఆడి బయటకి వస్తున్నప్పుడు నిత్య తన ఫ్రెండ్ మాయ కలిసి ఉన్నారు బయట.ఇప్పటిదాక నువ్వు భువనేశ్వర్ ఉన్నారు కదా వాడు ఎక్కడ, ఈ అమ్మాయి ఎవరు అని రేవంత్ అడగగా.
తన పేరు మాయ తను మా ఇంట్లోకి కొత్తగా వచ్చారు అద్దెకి,ఇటు వెళ్తుంటే కనపడి నా దగ్గరకు వచ్చింది.భువనేశ్వర్ వాడి లవర్ ని కలవడానికి వెళ్ళాడు.రేవంత్ వెంటనే మాయతో నీకు పేరు పెట్టింది ఎవరు అమ్మ అంటే మా నాన్న గారు అన్నది మాయ. వెంటనే మీ నాన్నగారికి ఏ మాయదారి రోగం వచ్చింది మాయ అని పెట్టారు ఎవరిని అన్న మాయం చేయమన అని నవ్వుకుంటు అన్నాడు.నిత్య వెంటనే వాడిని పట్టించుకోకు మాయ వీడికి అన్ని జోకులు లాగ ఉంటాయి,కానీ మనిషి చాలా మంచోడు.ఇక ఆపు నిత్యా నీ సుప్రభాతం ఏ మాయ నీకు లవర్ ఉన్నాడా అంటే మాయ లేరు రేవంత్ గారు అన్నది.హమ్మయ్య నువ్వు చాలా హ్యాపీగా బతుకుతావు నా లాగా.నువ్వు ఇక మా బ్యాచ్ లోకి జాయిన్ అయిపోవచ్చు సంతోషంగా.
మాయ వచ్చిన క్షణము నుండి రేవంత్ చాల మారిపోయాడు.మాయతో మాట్లాడడం మాయను ఆటపట్టించడం ఎప్పుడు చూసిన మాయ మాయ అంటున్నాడు రేవంత్. నిత్యా భువనేశ్వర్ వీళ్లు ఇద్దరు ఏదో చేస్తున్నారు అని,నిత్యా వెంటనే ఏరా రేవంత్ ఏంటి మాయ ని ప్రేమిస్తున్నావు అంట నువ్వు భువనేశ్వర్ కి చెప్పావు కదా అంటే, నేనా ఆ పొట్టి దాన్న నా క్రికెట్ బాట్ అంత లేదు దానికి అంత సీన్ లేదు.వీడు నువ్వు కలిపి కుట్రలు పన్నకండి నా మీద. ఏమే పొట్టి నీకు నేను ఏమన్నా ప్రపోజ్ చేసాన,అసలు నీ ఫోన్ నెంబర్ కూడ నా దగ్గర లేదే,చెప్పు అలా ఉన్నావు ఏంటి మొద్దులాగ మాట్లాడు అని మాయను అంటుంటే.కన్నీళ్ళు పెట్టుకుని నువ్వు అంటే నాకు ఇష్టం రేవంత్ నువ్వు అలా అనకు నీ లాంటి మంచోడిని, మనసు స్వచ్ఛంగా ఉన్నవాడు దొరకడు ఎవరికి,నేను ఎలా చెప్పను నువ్వు అంటే ఇష్టం లేదు అని.
రేవంత్ వెంటనే అసలు ఈ పంచాయితీ ఏంటి నేను ప్రశాంతంగా ఒంటరిగా బతికేద్దాం అనుకుంటే ప్రేమ అంటున్నావు,నీకు నేను సెట్ అవ్వను నేను నా లాగ ఉంటాను,ఎవరికోసమో నేను నా ప్రవర్తన మారదు పోవే నువ్వు నిజంగానే మాయలో ఉన్నావు.అరేయ్ ఇది కూడ మీ బ్యాచ్ లో కలిసిపోయింది.దీనికి కూడ ఎవరో ఒకరిని పరిచయం చేయండి,పోయేకాలం వచ్చింది అనుకుంట ప్రేమ అంటుంది అంటే, మాయ వెంటనే ఎవడినో ఎందుకు ప్రేమిస్తా నిన్నే ప్రేమిస్తా నిన్నే ఇష్టపడ్డ అంటుంటే రేవంత్ పోవే పో ఇంట్లోకి వెళ్లి వడియాలు పెట్టుకో మీ అమ్మతో అన్నాడు నవ్వుతూ.
అక్కడ నుండి అందరు వెళ్లిపోయాక చాలా రోజులు రేవంత్ ఎవరిని కలవలేదు. పని ఉండి ఒకసారి రేవంత్ నిత్యా వాళ్ళ ఇంటికి వెళ్లి నిత్యా నిత్యా అని పిలుస్తున్నాడు. అక్కడ ఇంటిలో మాయ చీర కట్టుకుని ఉంది చాల అందంగా, రేవంత్ వెంటనే నిత్యా దగ్గరకి వెళ్ళి మీరు మాయ చెల్లెల్లు కదా చాల బాగున్నారు అంటే కాదు నేనే మాయని అన్నది సిగ్గుపడుతూ, అమ్మో ఎప్పడూ చూసిన జీన్స్ షర్ట్స్ వేస్తే మాలాగే అబ్బాయి ఆనుకున్నాము పర్లే అమ్మాయిల బాగానే ఉన్నావు.ఏంటి బూస్ట్ వాడుతున్నావా లేక ఇంట్లో తిండి మొత్తం నువ్వే తినేస్తున్నావా ఒక సారిగా బొద్దుగా అయ్యావు అంటే లేదు అందరూ బక్కగా ఉన్నాను అంటున్నారు అందుకే కొంచెం బరువు పెరిగా అని మాయ అంటూ,మీరు ఎందుకు కనపడడం లేదు అంటే ప్రేమ పిచ్చోళ్ళకు దూరంగా ఉంటున్న అందుకే అంటే,ఇక ఆపండి రేవంత్ గారు మరి అంటున్నారు మీరు.
మాయ నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే మా నెంబర్ మీకు ఎందుకు సర్, మళ్ళీ ఇచ్చిన దగ్గర నుండి ఎప్పుడు అయిన ఫోన్ చేశారు అనుకో మళ్ళీ నన్ను మా అమ్మతో వడియాలు పెట్టుకోమంటారు,ఏమి కాదు అని నెంబర్ తీసుకుని నిత్యా వచ్చాక తనతో మాట్లాడి వెళ్తూ వెళ్తూ మాయని చూస్తూ నువ్వు సూపర్ ఉన్నావు అని చేతితో సైగ చేస్తూ చిన్న నవ్వు నవ్వి వెళ్తున్నాడు.
బైక్ మీద వెళ్తుండగా మాయకి మెసేజ్ చేసాడు నువ్వు చాలా బాగున్నావు అని,ఆహా కొత్తగా మారారు ఏంటి రేవంత్ గారు అని మెసేజ్ చేస్తే,మొన్ననే టైటానిక్ సినిమా చూసాను అందులో ఉన్న ప్రేమ చాల బాగుంది,ఆ సినిమా చూసిన దగ్గర నుండి నువ్వే గుర్తుకు వస్తున్నావు ఎందుకో తెలియడం లేదు అని మెసేజ్ చేసాడు.
దెయ్యాలు సినిమాలు నుండి ప్రేమ సినిమాలకి వచ్చారు ఇంకా ఎక్కడికి వెళ్తారో చూద్దాం అంటే,అమ్మ మాయ నీ మాయలో పడ్డాను అనుకుంట నిన్ను తిట్టి వెళ్లిన దగ్గర నుండి నీ గురించీ ఆలోచిస్తున్న ఇక నుండి మనం కలిసి ఉందాము అని మెసేజ్ చేసాడు.
అలా మెసేజ్ లు అయ్యాక ఇక రేవంత్ మాయ కలుస్తూ ఉన్నారు తరచుగా.
మాయ ఎప్పుడు రేవంత్ ని ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకుంటుంది.రేవంత్ మాయ తో నేను బొమ్మను కాదే మరి ఇంత ప్రేమ. నేను ఇంకా నీకు ఏమి చెప్పలేదు కదే ప్రేమ అని మాయ.
మాయ రేవంత్ తో నువ్వు నీలాగా ఉండు నీలాంటి మంచి వాళ్ళు దొరకరు, ఏది ఉన్న మొహం మీద చెప్తావు,నీలాగా అర్థం చేసుకునే వాడిని ఎవరు వదులుకోలేరు.ఆస్తులు డబ్బు ఇవన్నీ ఎందుకు మనకి సంతోషం లేని అప్పుడు, నిజం చెప్పనా నువ్వు మంచోడివి అబద్ధాలు చెప్పవు నమ్మకంతో ఉంటావు ఇవే ఒక అమ్మాయికి కావాల్సింది అంటుంటే.మాయ ఇన్ని ఉన్నాయా నాలో దేవుడా ఈ రోజు నుండి నైట్ తిండి తగ్గిస్తా నాకు నువ్వు చెప్పిన మాటలకు కడుపు నిండిపోయింది మాయ అంటుంటే అంతలో వర్షం పడుతుంది.
రేవంత్ మాయతో నీకు వర్షంలో తడిస్తే ఏమి రోగాలు రావు కదా అంటే ఏమి రావు అన్నది అయితే బైక్ ఎక్కు అని వర్షంలో లాంగ్ రైడ్ చేసి ఇద్దరు ఐస్ క్రీం తింటూ అలా వెళ్తుండగా అక్కడ ఇంద్రధనస్సు కనపడిన చోట బండి అపి మాయ కళ్ళు ముసుకో అని రింగ్ ఇచ్చి మాయకి పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఈ ఏడు రంగుల ఇంద్రధనస్సు సాక్షిగా చెప్తున్నా నిన్ను ఏ కష్టం రాకుండ చూసుకుంటాను అని,మాయ ఏమి మాట్లాడకుండా కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఆ వర్షంలో మోకాళ్ళు వేసి మొహం మీద చేతులు వేసుకుని సంతోషంతో ఏడుస్తుంది.
ఇంతలో నిత్యా భువనేశ్వర్ గొడుగులు పట్టుకుని వచ్చి మాయ ఎలా ఉంది మా వాడి ప్రేమ,వాడికి నువ్వు మా ఇంట్లోకి అద్దెకి వచ్చిన దగ్గర నుండి నువ్వు రేవంత్ కి తెలుసు, నువ్వు ఆ రోజు గ్రౌండ్ కి వచ్చాక నువ్వు వచ్చావు అని మెసేజ్ పెట్టాను,అప్పుడు రేవంత్ బయటకి వచ్చాడు.నిన్ను ఆ రోజు తిట్టింది కూడ నీకు వాడి మీద ఎంత ప్రేమ ఉందొ తెలియాలి అని.మన ఇంటికి వచ్చింది నా కోసం కాదు నీ కోసం మాయ నిన్ను చూస్తాను చాలా రోజులు అయింది అని వచ్చాడు.నీ ప్రేమకు పరీక్ష పెట్టాడు ఎందుకు అంటావు జీవితంలో తోడు ఉండే అమ్మాయి ఆ మాత్రం భరించాలి ఇప్పుడు తెలిస్తేనే మనిషి గురించి జీవితాంతం సుఖంగా ఉంటాది అని.
ఇంతలో రేవంత్ మాట్లాడుతూ మాయ నాకు ప్రేమ అంటే ఇష్టమే కానీ టైం పాస్, టైం వేస్ట్ ప్రేమలు అంటే చిరాకు నిన్ను జీవితాంతం చాలా సంతోషంగా చిరు నవ్వుతో చూసుకుంటాను, నిన్ను అర్థం చేసుకుంటాను ఎప్పడూ ఐ లవ్ యు.. అని చెప్పి ఇక మన పెళ్లే పొట్టి అని మాయ చేతికి రింగ్ తొడిగాడు.మాయ కూడ ఐ లవ్ యూ రేవంత్ అంటూ గుర్తుగా ఒక సెల్ఫీ తీసుకున్నారు వెనక ఉన్న ఇంద్రధనస్సు పడే లాగ...

No comments:
Post a Comment