ఏంటి సత్యనారాయణ గారు మీ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంట
కదా, పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే చెప్పండి.మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి
చేస్తాము ఎంత కట్నం అయిన ఇస్తాము, చూస్తూ చూస్తూ గవర్నమెంట్ జాబ్ ఉన్న
అబ్బాయిని ఎలా వదులుకుంటాము చెప్పండి.అమ్మాయి సుఖపడతాది అని రాజేష్ వాల్ల
నాన్నతో దివ్య వాళ్ళ నాన్న అంటుంటే, మనది ఏముంది అండి పిల్లల ఇష్టం మనము
ఏమి చేయలేము కద.
మా అబ్బాయిని ఒక మాట అడుగుతాను మీరు కూడ ఒక మాట మీ అమ్మాయిని అడగండి అంటే.మా అమ్మాయి బంగారం నేను చెప్పింది ఎప్పుడూ వింటాది.రాజేష్ ని అడిగితే మొదట ఒప్పుకోకుండా అప్పుడే పెళ్లా నాన్న గారు.ఏమి లేదురా నారాయణ గారి చిన్న అమ్మాయి దివ్య ఉంది కదా, హ అవును నాన్న గారు, ఆ అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాము అన్నారు,నాన్న దివ్యనా దివ్యముగా చెప్పారు. నాకు ఇష్టమే నాన్న గారు దివ్య అంటే, ఓరి బడవ పెళ్లి అంటే వద్దు అన్నాడు దివ్య అంటే సరే అన్నాడు.అబ్బాయిలు అందాన్ని ప్రేమిస్తారు అనుకుంట అని సత్యనారాయణ గారు వెళ్లి దివ్య వాళ్ళ నాన్నగారి తో మాట్లాడి పెళ్లికి ముహుర్తాలు పెట్టుకున్నారు,పెళ్లి అయిపోయింది.
కొత్తగా కాపురం పెట్టారు రాజేష్-దివ్య , రాజేష్ దివ్యతో మా ఆవిడ చాలా అనుకూల వతి,గుణవతి, రూపవతి, మంచిగా పాడతాది,పురాణాల గురించి తెలుసు, పద్ధతులు గురించి తెలుసు, పెద్దలంటే గౌరవం అంత పద్దతిగా పెరిగిన అమ్మాయిని ఎవరు అయిన వదులుకుంటారా దివ్య గారు అంటే. ఇక ఆపండి ఇవి మీకు ఎలా తెలుసు అండి, మా అమ్మ ఎప్పుడూ నారాయణ రావు గారి అమ్మాయి దివ్యని చూసి నేర్చుకో అని మా చెల్లికి చెప్తూ వింటే వినే వాడును శ్రీమతి గారు.ఆహా.. మా నాన్న గారు అబ్బాయి గారికి ఏమి తెలియదు అంటే అమాయకులు అనుకున్నాము మిమ్మల్ని , మా నాన్న గారు అమాయకులు పాపం అండి,నచ్చలేదా నీకు నేను అంటే, నాకు ఏమి తెలుసు నాన్న గారు చేసుకోమన్నారు చేసుకున్న అంతే.
ఎక్కడ తగ్గిపోతామో అని మీరు చెప్పరు అమ్మ ,రాజేష్ దివ్యాల సంసారం చక్కగా సాగిపోతుంది.పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు అయింది,ఇంకా పిల్లలు లేరు,ఇక ఇంట్లో పోరు మొదలు అయ్యింది, పిల్లలు లేరు అని దివ్యను సూటి పోటు మాటలు అనడం మొదలు పెట్టారు తెలిసిన వాళ్ళు.రాజేష్ వాళ్ళను తిట్టేవాడు,దివ్య ఏడుస్తుంటే దివ్యని ఓదారుస్తూ ఏడవకు దేవుడు అనుగ్రహం మనకి ఉంటాది, అన్ని తోందరగా ఇచ్చేస్తే మనిషి దేవుడు మాట వినడు కద దివ్య, అందుకే కొన్ని కొన్ని లేట్ గా ఇస్తాడు అని ఓదారుస్తూన్నాడు.
అలా సాగుతున్న సమయంలో రాజేష్ కి వేరే ఊరులో పోస్టింగ్ వచ్చింది,అక్కడ మాటలు అనే వాళ్ళు ఎవరులేరు సంతోషం గా ఉంటున్నారు. ఆఫీసులో ఉన్న రాజేష్ కి ఫోన్ వచ్చింది దివ్య దగ్గర నుండి, మీరు కల గన్న రోజు ఇంకో తొమ్మిది నెలలలో నెరవేరబోతుంది.మీరు తండ్రి కాబోతున్నారు అన్నది,ఇక రాజేష్ సంతోషంతో ఇంటికి వెళ్లి చెప్పాను కదా,దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకి అన్యాయం చేయడు అని,రాజేష్ దివ్యని కంటికి కనుబొమ్మలు తోడు అయినట్టు చూసుకునేవాడు.కాన్పుకు ఇంటికి వెళ్ళింది దివ్య, నారాయణ రావు ఫోన్ చేసి అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి అని హాస్పిటల్ లో జాయిన్ చేసాము మిమ్మల్ని చూడాలి అని అన్నది బాబు అంటే, అప్పుడు రాజేష్ కి వాళ్ల అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.ఆడపిల్లకు రెండు సార్లు జన్మలు ఉంటాయి ఒకటి అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చినపుడు ఒక జన్మ.. రెండోసారి ఇంకో బిడ్డకు ప్రాణము ఇచ్చనప్పుడు పునర్జన్మ పోసుకుంటాది.
ఆ సమయాన పక్కన అందరూ ఉండాలి అని కోరుకుంటాది అని, వెంటనే ఏమి ఆలోచించకుండా స్కూటర్ తీసి వాళ్ళు ఉన్న హాస్పిటల్ కి బయలు దేరాడు.దివ్య కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అని నారాయణ కి చెప్తే భయం వేసి మనసులో దేవుడిని వేడుకున్నాడు ఏమి అవకూడదు అని, వానలో తడుచుకుంటు వస్తునే ఉన్నాడు తన బిడ్డని చూడడానికి.తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదమే అని డాక్టర్ అంటుంటే నారాయణ కింద పడిపోయాడు బాధతో,ఇంతలో రాజేష్ వచ్చాడు.ఏమైందో కానీ డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తాము కానీ ఎవరూ బ్రతుకుతారో చెప్పలేము అని లోపలకి వెళ్లారు డాక్టర్,డాక్టర్ బయటకి వచ్చి మీకు అమ్మాయి పుట్టింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అన్నది. లోపలకి వెళ్లిన రాజేష్ కి తన చేతిలో తన పాపను పెట్టారు, చాలా ముద్దుగా ఉన్నది.రాజేష్ పాపని చూస్తూ ఏడుస్తూనే ఉన్నాడు,తన కూతురుని భార్యను కాపాడిన డాక్టర్ దగ్గరకు వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించి, తన కూతురును అలాగే చూస్తూనే ఉన్నాడు,దివ్య కళ్ళు తెరిచి కూతురును చూసి మీరు అనుకున్నట్టు మీకు అమ్మాయి పుట్టింది అని, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు.
రాజేష్ తన కూతురుకి ప్రియాంక అని పేరు పెట్టాడు, ప్రియాంకాని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు, కూతురు పుట్టాక రాజేష్ కి బాగా కలిసి వచ్చింది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాడు.అమ్మాయి ముద్దుగా బొమ్మలా ఉండేది,వచ్చిన వాళ్ళు బుగ్గ గిల్లి ముద్దు పెట్టడమే అంత అందం.రాజేష్ రోజుకి ఒక డ్రస్ కొనేవాడు తన పక్కన ఉన్న నాయుడు గారితో కలిసి, నాయుడు గారు రాజేష్ తో మాకు ఉన్నాడు అబ్బాయి వాడికి ఎంత వెతికిన ఒక చొక్కా లాగు తప్ప ఏమి ఉండవు అండి, మీరు అదృష్ట వంతులు మీకు అమ్మాయి ఉన్నది,చక్కగా ఎన్ని కొనవచ్చో అమ్మాయిలకి, నవ్వుతూ లోపల గర్వంతో ఉన్నాడు లోపల నా కూతురు అని.
తన చిన్న పాపను బొమ్మలాగ అందంగా తయారు చేసి దిష్టి చుక్క పెట్టి ఆడుకునే వాడు.ఆఫీస్ కి వెళ్లిన దివ్యకి ప్రతి గంటకి ఫోన్ చేస్తూ నా కూతురు ఏం చేస్తున్నది, పాలు తాగింద, ఆడుకుంటుంద అని అడుగుతూనే ఉండేవాడు.
కాలం మారుతుంది ఇంతలో ఎంత మార్పు దివ్య పాప చెవులకు చెవిలీలు,కాళ్ళకి పట్టీలు, నుదుటన బొట్టు,అంతలోనే నడక, నడుస్తుంటే బొమ్మ కాస్త కుందనపు బొమ్మ అయింది అనిపిస్తోంది.
నాన్న నాన్న ఏది అయిన నాన్న ఇంకేం మాట లేదు ఏది కావాలి అంటే అది తన ముందు ఉండేది, చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేక పోయేవాడు.వీళ్ళ అల్లరి చూసి దివ్య కొంచెం అసూయ పడేది, నా ప్రేమకి చిహ్నం నా కూతురు అనేవాడు, తను స్కూల్ కి వెళ్లిన దగ్గర నుండి, రోజు తీసుకువెళ్లడం తీసుకురావడం.
అమ్మాయి ఎదుగుతుంది పాపకి పది సంవత్సరాలు వచ్చాయి అసలు సమయం తెలియలేదు,ఇంత అయ్యిందా నా పాప అని,అందరూ నాన్న కూచి, నాన్న బంగారం అని ఎడిపిస్తూ ఉండేవారు,అవును మా నాన్న.. నేను నాన్న కుచినే అనేది.తండ్రికి ఏమి అయిన అయితే కూతురు, కూతురుకి ఏమైనా అయితే తండ్రి తట్టుకోలేక పోయేవారు అది ఇద్దరి మధ్య ప్రేమ,ప్రియాంక మంచిగా పాడుతుంది అని ఎప్పుడూ ఒక పాట పాడు తల్లి అని తనతో పాడించి వింటూ ఉండేవాడు.
చదువులు అయిపోయాయి, జాబ్ వచ్చి అమ్మాయిని వేరే ఊరు పంపాల్సి వచ్చింది.ఇన్ని రోజులు దగ్గర ఉన్న అమ్మాయి వేరే ఊరు అంటే ఒప్పుకోలేదు. అమ్మాయి భవిష్యత్ గురించి ఆలోచించి తనే దగ్గర ఉండి అన్ని చూసి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చాడు రాజేష్, ఒకటే బాధ పాప ఎలా ఉంది అని వచ్చి రెండు రోజులు అవలేదు మళ్ళీ వెళ్ళిపోయాడు కూతురు దగ్గరికి.
నాన్న నేను నీకు చెప్పాన అప్పుడే మళ్ళీ రావొద్దు అని, అంత దూరం కార్ డ్రైవ్ చేసుకుని ఎందుకు నాన్న అంటే , నా కూతురుని చూస్తాను అనే ఆనందంలో ఈ దూరం నాకు తెలియలేదురా బంగారం అంటే, నాన్న ప్లీస్ నాన్న నేను వచ్చేేస్తా నువ్వు అలా అంటుంటే నేను ఉండలేను నాన్న.
నో తల్లి నేను వెళ్తున్న జాగ్రత్త తల్లి అని రాజేష్ వెళ్ళిపోయాక, ప్రియాంక ని తన ఫ్రెండ్ అడిగింది మళ్ళీ ఎందుకు వచ్చారు మీ నాన్న అని, నేను అంటే ప్రాణం,నేనే అన్ని అనుకుని ఆయన బ్రతుకుతారు, ఈ లోకంలో ఆయనకి ప్రియాంకానే లోకం అనుకుంటూ అని గర్వంగా మా నాన్న అని చెప్పి వెళ్ళిపోయింది.
దివ్య రాజేష్ తో ఏవండి అమ్మాయి జాబ్ కి వెళ్లి ఏడాది అవుతుంది ఇక అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే,అప్పుడే నా కూతురికి పెళ్లా అంటే, మీ అమ్మాయికి 22సంవత్సరాలు, అలా బిక్క మొహం వేయకుండా సంబంధాలు చూడండి అన్నది. అంతలోనే ఎంత మార్పు అని అమ్మాయికి చెప్పి ఇంటికి రమ్మని అమ్మాయిని కూర్చో పెట్టి వాళ్ళ అమ్మ ,అమ్మాయి నీకు పెళ్లి చేద్దాం అని అనుకుంటునాము,అప్పుడే నాకు పెళ్లా వద్దు అమ్మ అంటే, ఏమి లేదు అమ్మ మన నాయుడు అంకుల్ గారి అబ్బాయిని ఇచ్చి చేద్దాము అనుకుంటున్నాము అంటే.నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు బాగా చదువుకున్నాడు,మంచి అబ్బాయి అని, నాన్న కి నచ్చితే నాకు ఓకే అమ్మ అని వెళ్ళిపోయింది.
అప్పుడు రాజేష్ తో దివ్య మీరు మీ అమ్మ గారి మాటలు విని నన్ను చేసుకున్నారు, ఇప్పుడు మీ అమ్మాయి మీ మాట విన్నది, తండ్రి కూతుళ్లు ఇద్దరు ఒక్కటే,పెళ్లి కుదిరింది.పెళ్లికి కావల్సినవన్నీ కొని, ప్రియాంకను పెళ్లి కూతురు చేస్తున్నారు పెళ్లి కూతురుని చేస్తున్న కూతురుని చూసి అప్పుడే ఎంత పెద్దది అయిపోయింది నా బంగారం.నాకు ఏమి తెలియదు నాయుడు గారు చేతిలో ఇంత చిన్న పిల్ల, నాకు భయం వేసింది పట్టుకోవాలంటే పుట్టినప్పుడు, అంతలోనే మాటలు,నాన్న నాన్న అని నాతో ఆటలు, ఇద్దరం కూర్చొని వాళ్ళ అమ్మని ఆటపట్టించే వాళ్ళం. స్కూల్లో నాన్న సైకిల్ అంటే సైకిల్ కొని నేర్పించాను దగ్గర ఉండి, కాలేజ్ లో స్కూటీ అంటే అది కూడా దగ్గర ఉండి నేర్పించ,తను ఏది చెప్పిన ఎంతో ఆనందంగా ఉండేది,అలా పెరిగిన నా అమ్మాయిని మీ చేతిలలో పెడుతున్నాము.మీకు అమ్మాయిలు లేరని,అమ్మాయి విలువ మీకు తెలుసు అని, మీకు మా అమ్మాయి అంటే ఇష్టం అని నాయుడు గారు.
ఏ కష్టం రాకుండా చూసుకోండి,పెళ్లి అయిపోయింది, ఇక తల్లి తండ్రులు మధ్య నుండి కూతురు అప్పగింతల సమయం వచ్చింది. వారి ప్రేమను చూస్తూ అక్కడ వాళ్లు కూడా తట్టుకోలేక పోయారు, తండ్రిని కూతురు వదలలేక, బరువెక్కిన గుండెలతో అలానే ఉండిపోయారు ఇద్దరు.. నాన్న నాన్న నేను వెళ్ళను నాన్న అని ప్రియాంక వెళ్ళిపోయింది పుట్టినిల్లు నుండి మెట్టెనిల్లుకు..

No comments:
Post a Comment