విమానాశ్రయం లో ఒకటే గజిబిజి, లోపలకి వెళ్ళడానికి లేదు, బయటే ఉండాలి అంట,
తెల్లోళ్ళు నల్లోళ్ళు మనవాళ్ళు కలగలిపి ఉన్నారురా మహేష్ ఇక్కడ, మనం ఏమో
శంకర్ రావు గారి అబ్బాయి కోసం వచ్చాము.ఆయన ఊరు వదిలి అమెరికాకు పోయి 23
సంవత్సరాలు అయింది.ఇన్నాళ్లకు మళ్ళీ వస్తున్నాడు ఆ బాబు, ఎక్కడ చూడాలి
ఇక్కడ అని లక్ష్మణ్ డ్రైవర్ మహేష్ తో అడిగాడు.
ఇంతలో శంకర్ రావు గారి అబ్బాయి కళ్యాణ్ బాబు వచ్చి లక్ష్మణ్ తాత బాగున్నావ అన్నాడు.ఇన్నాళ్లకు గుర్తొచ్చామ బాబు మీకు అని తాత కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఆనందంతో, కల్యాణ్ బాబు తన ఇద్దరి పిల్లలని పరిచయం చేస్తూ కార్ ఎక్కారు అందరు. పిల్లలకి తెలుగు సగం సగం వచ్చు అనుకుంట పాపం,లక్ష్మణ్ అమ్మగారు రాలేదా బాబు అంటే తను పనిలో ఉంది వచ్చే వారం వస్తాను అన్నది అని చెప్పాడు.
డాడ్ మనం ఏ ఊరు వెళ్తున్నాము అని అంటే మన ఊరు పేరు తెలియదా వాళ్ళకి అంటే, కళ్యాణ్ లక్ష్మణ్ తో వాళ్ళకి ఇండియా అని తెలుసు మన ఊరు చూపించే వరకు నేను చెప్పకూడదు అని చెప్పలేదు.మన ఊరు పేరు నందనవనం.
ఊరు ఎంటర్ అయ్యాక కార్ ఆపి అందరూ దిగి శంకర్ గారి సమాధి దగ్గరకు వెళ్లి నమస్కరించి ఇది మీ తాతయ్య గారి సమాధి అని దండం పెట్టి ఇంటికి బయలు దేరారు.కళ్యాణ్ కొడుకు నాని కళ్యాణ్ తో డాడీ ఎందుకు ఏడుస్తున్నారు. 23 సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాను రా ఇక్కడికి, నాన్న గారు, మన ఊరు, ఊరి చివర చెరువు, పొలాల గట్లు మీద ఆటలు,ఏడవనివ్వండిరా సంతోషంగా నన్ను, మళ్ళీ ఊరు చూస్తాను అనుకోలేదు,చూసాను లక్ష్మణ్ తాత. బతికాము అంటే అక్కడ బతికాము, కానీ బ్రతుకు నేర్పింది ఇక్కడే అని గుర్తు పెట్టుకున్నాము.గాలిలో బతికేస్తున్నాము అనుకున్నాము పెద్ద పెద్ద మేడలలో ఉంటూ,ఇక్కడ పైరు గాలి ముందు అవన్నీ వేస్ట్ తాత, "ఊరు మనది ఊరు పరువు మనది ఉన్న ఊరుకు ఉపయోగపడని వాడు ఊరి చివర ఉన్న వల్లకాడిలో ఉన్న ఒకటే అనే వారు" నాన్న గారు, ఊరు చాలా మారిపోయింది తాత.
హేయ్ కార్ ఆపు అని కళ్యాణ్ బాబు దిగి తన ప్రాణ స్నేహితుడు రాంబాబును చూసి ఏంటి రాంబాబు బాగున్నావ అంటే రాంబాబు ఎవరు అండి మీరు అంటే అరేయ్ కళ్ళజోడు పెట్టుకోరా అంటే నోటి మాట రావడం లేదు రాంబాబుకి గట్టిగా హత్తుకుని ఇన్నాళ్ళకు గుర్తొచ్చానార అని పట్టుకుని ఒకరిని ఒకరు వదులు కోవడం లేదు.ఆ కౌగిలిలొనే ఎంత ప్రాణ స్నేహితులో ఇద్దరు అర్థం అవుతుంది. శ్రీను,సుబ్బయ్య చెప్పానా నేను చెప్పాన మా కళ్యాణ్ బాబు వస్తాడు అని వచ్చాడురా,మన కోసం తన ఊరి కోసం అని.
తర్వాత కళ్యాణ్ బాబు వాళ్ళ ఇంటి లోపలకి వెళ్తున్నాడు,లోపల చెల్లి, బావ మేనల్లుడు మేనకోడలు ఉన్నారు.చెల్లి బావ ఎప్పుడూ అమెరికాకి వస్తూనే ఉంటారు వీళ్ళని చూడడానికి, రా అన్నయ్య వదిన రాలేదా అన్నది, వస్తాది అమ్మ పని ఉంది కొంచెం అన్నారు, బావ గారు వచ్చారు మాకు సంతోషం, ఎలా ఉంది మీ ఊరు బావ గారు అంటే,నా ఊరు ఎలా ఉంటాది ఎప్పుడు ఉన్నట్టే ఉంది అందంతో ఆనందంతో.నా మేన కోడలు చాలా అందంగా ఉంది, ఏమే కోడలు పిల్ల మా నానిని చేసుకుంటావా అంటే సిగ్గు పడుతూ లోపలకి వెళ్ళిపోయింది, ఎన్ని రోజులు ఉంటావు అన్నయ్య అని ఆడిగింది చెల్లి తన పక్కన కూర్చొని,ఎందుకు అన్నయ్య ఇన్ని రోజులు రాలేదు మేము నీకు కానీ వాళ్ళం అయిపోయామ,మమ్మల్నే రమ్మంటావు అమెరికాకి. ఇక వెళ్లను ఇక్కడే ఉందాం మనం అందరం కలిసి,అలా మాట్లాడుతూ నాన్నగారి అమ్మగారి ఫోటో చూస్తూ మనకు ఏ లోటు చేయలేదు ఎప్పుడూ, కానీ మనల్ని వదిలేసి వెళ్లిపోయారు వాళ్ళకి మనము ఏమి చేయకుండా.
ఇది ఇలా ఉండగా నానికి వాళ్ల నాన్న ఎందుకు ఊరు వదిలి వెళ్ళిపోయాడు అని తెలుసు కోవాలని అనుకుని లక్ష్మణ్ తాత దగ్గరకి వెళ్ళి అడిగాడు అప్పుడు తాత నాని కి చెప్తున్నాడు.నా కన్నా నాన్న ఫ్రెండ్ రాంబాబు మావయ్య ని అడుగు చెప్తాడు అంటే మావయ్య దగ్గరకు వెళ్లి అడిగాడు.ఎందుకు నాని నీకు ఇవన్నీ కాదు, నాకు చెప్పు అన్నాడు, మీ నాన్న నేను చిన్నప్పటి నుండి బాల్య మిత్రులం.మీ తాత గారు ఈ ఊరికి పెద్ద ఆయన అంటే అందరికి గౌరవం మాట అంటే మాట. పరువు కోసం ఊరి కోసం బతికే వారు.
నేను మీ నాన్న 1990 లో ఏలూరు పట్నంలో డిగ్రీ చదివే వాళ్ళము. మీ నాన్న చదువుల్లో బాగా ముందుడే వాడు,డిగ్రీ మధ్యలో ఉండగా మీ తాత శంకర్ గారు చనిపోయారు.ఇంటి బాధ్యతలు మీ నాన్న చూసుకుని చదువుకునే వారు,మీ నాన్న గారికి ఇంటర్ నుండి లక్ష్మీ అనే అమ్మాయి అంటే చాల ఇష్టం,ఎప్పడూ మీ నాన్న గారు ఆ అమ్మాయినే చేసుకుంటా అని అనేవారు.కానీ ఊరు గొడవలు మధ్యన మీ నాన్న గారి ప్రేమ నలిగిపోయేది, మన ఊరుకి మీ నాన్న ప్రేమించిన అమ్మాయి ఊరికి పడేది కాదు.ఆ అమ్మాయి పేరు మీ నాన్న చేతి మీద పచ్చబొట్టు ఉంటాదిరా, అప్పట్లో మీ నాన్న అంటే అందరికి భయం,లక్ష్మీ ని పెళ్ళి చేసుకోవాలి అని లక్ష్మీ వాళ్ళ నాన్నని అడగడానికి వెళ్తే మా అమ్మాయిని చంపేస్తాము.నిన్ను ఏమి చేయము అంటే, నన్ను ప్రేమించిన పాపానికి తనని ఎందుకు చావనివ్వడం అని తనని మర్చిపోలేక తనలో తాను కుమిలిపోయేవాడు.లక్ష్మీ వచ్చి ఎటు అయిన వెళ్లిపోదాం పెళ్లి చేసుకుందాం అంటే ఊరి పరువు ఇంట్లో చెల్లి పెళ్లి ఇవన్నీ గుర్తుకు వచ్చి వెనక్కితగ్గాడు మీ నాన్న.లక్ష్మీ కి పెళ్లి చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఒక ఉత్తరం వచ్చింది లక్ష్మీ నుండి కళ్యాన్ కి,నేను నా జీవితం అనుకున్నది నీతోనే ఎవరి తోను కాదు,నేను చనిపోతున్న ఇక నా జీవితం నీ ప్రేమతోన అని, మీ నాన్న నేను లక్ష్మీ దగ్గరకి బయలుదేరాము, అప్పటికే లక్ష్మీ చనిపోయింది అని తెలిసింది.
అప్పట్లో ఉత్తరాలు తొందరగా వచ్చేవి కాదు బాబు, మీ నాన్న ఎంతలా ఏడ్చే వాడు అంటే లక్ష్మీ గుర్తుకు వచ్చినప్పుడు ఊరి చివర పొలం లోకి వెళ్లి ఒక్కడే గంటల తరబడి లక్ష్మీ కి అన్యాయం చేసార, నా వల్లే చనిపోయిందిరా అని ఏడ్చేవాడు, ఇష్టం అయిన నాన్న ,లక్ష్మీ లేరురా అని ఏడ్చేవాడు గుండెలు పగిలేలా.
ఇంతలో మీ అత్తయ్య పెళ్లి చేసాడు, కళ్యాణ్ కూడ వాళ్ళ మరదలని చేసుకున్నాడు,అదేరా మీ అమ్మను,తనకి ఇవన్నీ తెలుసురా, నీ రెండెల్లపుడు ఇక్కడ నుండి వెళ్లారు, అక్కడకి వెళ్ళాక చెల్లి పుట్టింది అంట ఇందాక చెప్పాడు.థాంక్స్ మావయ్య డాడీ గుండెల్లో ఇంత బాధ ఉందా మాకు ఏమి తెలియకుండా సంతోషం గా పెంచారు.
నా పేరు శంకర్(నాని) , చెల్లి పేరు లక్ష్మీ అంటే ఇద్దరు రెండు కళ్ళు అనేవారు,వాళ్ళని మాలో చూసుకుంటున్నారు మావయ్య, నన్ను ఎప్పుడూ పేరు పెట్టి పిలవరు, నాని అనే పిలుస్తారు లేదా నాన్న గారు అంటారు.చెల్లిని అయితే ప్రాణం కన్నా ఎక్కువుగా చూసుకుంటారు మావయ్య, అదేర మీ నాన్న ప్రేమ అంటే ఎంత ఉందో మనము కొలవలేము.ఇది అంత పక్కన నుండి నాని చెల్లెలు లక్ష్మీ వింటుంది. నాన్న దగ్గరకు ఇద్దరు పరిగెత్తి వెళ్ళి పట్టుకుని ఉన్నారు గట్టిగ,రాంబాబు కళ్యాణ్ బాబుతో వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉన్నారురా కళ్యాణ్, నాని మనం ఇక ఇక్కడే ఉండబోయేది
ఉన్న ఊరి ఋణం తీర్చుకునే రోజు వచ్చింది రా,మా అమ్మ నాన్నల కూడా కలిస్తే బాగుంటాది నాని, అని కళ్యాణ్ బాబు అంటే మా మేన కోడలు పేరు మా అమ్మ గారి పేరు మీనాక్షి, నీకు తనకి పెళ్లి చేద్దాం అనుకుంటునాము.నీకు ఇష్టమేనా మీ ఇష్టమే నా ఇష్టం నాన్న గారు అని అన్నాడు నాని, తమ ఊరి పెద్ద తిరిగి వచ్చాడు అని ఊరు అంత వచ్చింది, అయ్యా ఇన్ని రోజులు మీరు దూరంగా ఉన్న మన ఊరికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక మీరు వచ్చేసారు అయ్యా, మాకు ఇక సంతోషం అయ్యా అని జై కళ్యాణ్ బాబు అని అంటూ ఉన్నారు ఊరి జనాలు, కళ్యాణ్ బాబు దండం పెడుతూ ఇది మన ఊరు.. మన ఊరు కోసమే ఇక ఈ మిగిలిన జీవితం...

No comments:
Post a Comment