Tuesday, October 22, 2019

నేను మీ మిత్ర .. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 41

 అవకాశం అనేది ఇంట్లో ఉండి కూర్చుంటే రాదు,పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి తప్ప, పక్కన వాడు పరిగెట్టేది వాడి జీవితం కోసం నీ కోసం కాదు, నీకంటూ దారులు ఉంటాయి నువ్వు మనిషివే, చనిపోయిన అమ్మ నాన్నలు తిరిగి రారు, లే లేచి జీవితంలో పరిగెత్తు మిత్ర,నువ్వు ఉన్నది నవ యుగంలో నేటి మనుషులు అద్భుతాలు సృష్టిస్తున్నారు, నువ్వు వాళ్లలో ఒకడివే అంటు మిత్ర తో వాళ్ళ బాబాయ్ వాసు చెప్పగా.
మిత్ర కళ్ళు తుడుచుకుని ఆలోచనలకు పదును పెట్టాడు, మిత్ర దేవునికి దండం పెడుతూ నాకు ఇష్టం అయిన అమ్మ నాన్నలని తీసుకు వెళ్లిపోయావు, నేను నిన్ను ఏమి అడగను నా గురించి. వేరే ఎవరి అమ్మ నాన్నలని తీసుకు వెళ్లకు ఎప్పుడు,పోయిన వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు అంట కదా మా అమ్మ నాన్నలని ఏ బాధ రాకుండ చూసుకో దేవుడా, నేను సమయానికి తింటాను మంచిగా చదువుతాను అని చెప్పు మా అమ్మానాన్నలకి అని వేడుకున్నాడు దేవుడిని.
పడుకుని ఉన్న మిత్రకి కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి, సమయం ఉదయం 6 అయింది, కళ్ళు తెరిచి చూసాడు మిత్ర, కళ్లలో వస్తున్న నీళ్ళని చూసుకుని ఈ కల నన్ను వదలడం లేదు 16 సంవత్సరాల క్రితం జరిగినది.మిత్ర చదువు అయింది, ఒకరి దగ్గర జాబ్ చేస్తే అందరిలో ఒకడిలా ఉంటాను నేను వ్యాపారం చేస్తే నలుగురికి చేయూత ఇస్తాను అని తనకి తెలిసిన ఫుడ్ బిసినెస్ స్టార్ట్ చేసాడు.వ్యాపారం అంటే నోటి మాటలు కాదు కాగితపు లెక్కలు అని అనుకున్నాడు, అందుకే ఏ పని చేసిన ఎంత ఖర్చు పెట్టిన రాసుకునే వాడు, మిత్ర మంచి మాటకారి అని ఎవరు అయిన అంటే మాటలతో కడుపులు నిండవు కదండీ అనే వాడు మూటలతో నిండుతాయి.
మనిషికిి బాల్యం, యవ్వనం, ముసలితనం, అనేవి లెక్కల ప్రకారం ఉంటాయి జీవితంలో, అలాగే మన జీవితంలో కూడ ప్రతిదీ లెక్కతో ఉండాలి అనేవాడు. వ్యాపారం మంచిగా నడుస్తుంది.వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్త చేసి వేరొక వ్యాపారం మొదలు పెట్టాడు, ఇక్కడే మిత్ర సక్సెస్ అయ్యాడు.ఎందుకు అంటే ఎక్కడ వ్యాపారం చేసిన అక్కడ పెట్టిన ప్రతి రూపాయి ఆ వ్యాపారమే వసూలు చేయాలి. చచ్చిన ఇంకో రూపాయి పెట్టె వాడు కాదు.అప్పుడు కష్టం విలువ తెలిసి వస్తాది అని, వ్యాపార మెలుకవులు వస్తాయి అని నమ్మేవాడు.
అతని కన్ను ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద పడింది, ఉరికి దూరంగా భూములు కొనేవాడు. అందరూ పిచ్చోడు అనుకునే వారు,అతను అనుకున్నది నిజం అయింది కాలుష్యం పెరుగుతున్న నగరాలలో కాలుష్యానికి కారణం అయిన ఫ్యాక్టరీస్ ని ఉరి బయటకి వెళ్లిపోమని ఆర్డర్ వచ్చింది, మిత్ర భూమి మీద పెట్టిన పెట్టుబడికి చెప్పలేనంత ఆదాయం వచ్చింది.కానీ అక్కడ మిత్ర మనుషులు ఇల్లు కట్టుకుని ఉండడానికి మాత్రం ఇవ్వలేదు. కాలుష్యం ఉంది అని ఫ్యాక్టరీస్ ని పంపితే మళ్ళీ ఇక్కడ జనం ఎందుకు అని, నమ్ముకున్న విలువలు అలాంటివి, విలువలు లేని వాడు ఉన్నత స్థితిలో ఉన్న వ్యర్ధమే అనుకునే వాడు మిత్ర.
ఒక పెద్ద ఆఫీస్ పెట్టాడు మిత్ర వ్యాపారం విస్తరిస్తు, ఒకటే పని నిద్ర ఉండేది కాదు ఫోన్ లు ఎప్పుడు చూసిన పనులు, అతి చిన్న వయసులోనే మిత్ర గ్రూప్ స్థాపించాడు,వందల కోట్ల అధిపతి అయ్యాడు.ఎంత ఉన్న తగ్గే ఉండేవాడు,అతనికి స్నేహితులు అంటే ప్రాణం,తనతో పాటు తన స్నేహితులను ఉన్నత స్థానాలకు తీసుకు వెళ్ళాడు.ఇలా జరుగుతున్న గజిబిజి జీవితంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది మిత్రకి.
తనకి ఇష్టం అయిన జీప్ తీసుకుని లోకాన్ని చూద్దామని బయలు దేరాడు. తను ఎక్కడికి వెళ్లాలో అనుకోలేదు, ప్రయాణం సాగుతుంది. ఒంటరిగా వెళ్తూ అడిగిన వాళ్లందరికి లిఫ్ట్ ఇస్తూ పోతూనే ఉన్నాడు.రోజు అన్నాక పగలు రాత్రి ఉంటాయి, పగలు అయినది, రాత్రి మొదలు అయినది, నిద్ర వస్తుంది మిత్రకి.జీపు ఒక ఊరికి రాగానే, బండి పక్కన పెట్టి పడుకున్నాడు మిత్ర.
ఒక పెద్దాయన వచ్చి లేపాడు మిత్రను, బాబు నువ్వు గొప్పింటి బిడ్డలా ఉన్నావు
ఇక్కడ పడుకోలేవు ఇక్కడ దోమలు కుడతాయి, మా ఇంటికి రా అని తీసుకు వెళ్ళాడు.అన్నం పెట్టి ఉండడానికి గది ఇచ్చాడు పెద్దాయన.ఉదయం అయింది ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు.ఊరి మధ్యలో దొరుకుతాయి అన్నారు. అక్కడ ఉన్న అవ్వ అన్నంలో నీళ్లు పోసుకుని తింటుంది ఉల్లిపాయ మామిడి కాయ పచ్చడి తింటూ ఏంటి అవ్వ ఇది అన్నాడు.తను బోసిపోయిన నవ్వుతో కూర్చో బిడ్డ నా మనవాడిలా ఉన్నావు దీన్ని నీళ్లు అనరు గంజి అంటారు ఇది ఆరోగ్యానికి మంచిది మనవడ అంది
నేను కూడా తింటాను అంటే నాకు కూడా పెట్టింది ఆ పిజ్జాలు బర్గర్లు బిర్యానులు ఈ గంజి ముందు ఎందుకు పనికి రావు, అన్నం తింటు ఉల్లిపాయ కొరుకుతూ ఆహా మళ్ళీ రాదు అనిపించింది. ఈ గంజి ఎలా తయారు చేస్తారు అవ్వ అంటే మళ్ళీ నవ్వి మనవడ ఇది అన్నం ఉడికినపుడు వస్తాది అన్నది. అంటే మనకి తెలిసింది కరెంట్ కుక్కర్ కదండీ అని మిత్ర అన్నాడు.అందులో గంజి ఉండదు కదా అని.
ఊరిలో జాతర ఉంది మనవడ ఉంటావా అన్నది అవ్వ, ఉంటాను అవ్వ అన్నాడు మిత్ర. రాగిజావ ఇచ్చింది మళ్ళీ అవ్వ, తాగేసాడు సూపర్ టేస్ట్ అనుకుని. ఎవడు అయిన జీపు పక్కన సీట్ లో మంచి అమ్మాయి ఉండాలి అనుకుంటాడు. కానీ మిత్ర అవ్వని ఎక్కించుకుని ఊరు మొత్తం తిరిగాడు. బాగ నచ్చింది ఊరు, జాతర చూసి బయలదేరుతు పెద్దాయనికి డబ్బులు ఇవ్వబోతుంటే,ఒకసారి ఇటు రా బాబు అని తన బీరువా చూపించాడు. దాని నిండా డబ్బు ఉంది,బ్యాంక్ లో ఇంకా ఉంది డబ్బు,ఎందుకు బాబు ఈ డబ్బు పోయిన ప్రాణాన్ని తీసుకు రాగలదా చెప్పు,నిండు మనసు ఉండాలి మనకి అందుకే మన ఊరిలో ఏ కష్టం వచ్చిన ఈ డబ్బును ఉపయోగిస్తాను,ఆయన పాదాల మీద పడదామని అనిపించింది మిత్రకి,తప్పక బయలుదేరాడు ఆ పెద్దాయనికి దండం పెట్టి.ఎంత మంచి మనుషులు ఇంట్లో అంత డబ్బు పెట్టుకుని వచ్చింది మంచి వాడ చెడ్డ వాడ అని ఆలోచించకుండా ఇంట్లో పెట్టుకుని తన వాళ్ళ లాగా చూసుకున్నారు అని.
నిన్న మొదలు అయిన వేగం ఈ రోజు తగ్గింది ప్రయాణం లో మిత్రకి, డబ్బు ఎక్కువ ఉన్న ఆనందాన్ని ఇవ్వదు అన్న లెక్కల మాస్టారు గుర్తుకు వచ్చారు మిత్రకి.ఇంతలో ఆఫీస్ నుండి ఫోన్ సర్ ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకం పెట్టాలి అని అంటే వెంటనే నేను ఒక వారం రోజులు రాను మీరే చూసుకోండి అన్నాడు.ఒక ఆశ్రమం దగ్గర ఆగాడు లోపలకి వెళ్ళాడు అక్కడ ఏ స్వామిజీ లేడు ఒక చెట్టు ఉంది అక్కడే ధ్యానము చేస్తున్నారు అందరు, పక్కన ఉన్న ఒక ఆమెను అడిగాడు మిత్ర ఎవరు లేకుండ ఎవరిని ద్యానిస్తున్నారు అన్నది, మిత్రకి వివరంగా చెప్తు ఇక్కడ ఉన్న జనాలు మనుషుల్ని పూజించారు,చెట్లను, మొక్కలను, పూజిస్తాం అన్నది. ప్రాణ వాయువుని ఇస్తాయి మొక్కలు,మనకి కావల్సిన ఆహారాన్ని ఇస్తాయి, మనుషులను ఆశ అహంకారం అసహ్యం ఉంటాయి వీటికి ఏమి ఉండవు అన్నది, అందుకే మేము ఇక్కడ ఉన్నాము అన్నది.అంటే మానవుడు ఇంతలా అయిపోయాడ అనుకుని బయలుదేరాడు మిత్ర.
వేగం తగ్గిన ప్రయాణం మదిలో మనము ఇంతేన,ఇంకా ఏంటి మనము చేయవల్సింది అనుకున్నాడు.ఒక టీ తాగుదాం అని జీపు ఆపాడు మిత్ర , ఒక రైతును చూసాడు ఆరు పలకల దేహం ఉన్నది, జిమ్ లో కష్టపడిన ఆ రైతు లాగా అవ్వలేడు అనిపించింది.రైతు దగ్గరకి వెళ్లి వ్యాపారం ఎలా ఉన్నది అన్నాడు మిత్ర.రైతు దీన్ని వ్యాపారం అనరు బాబు వ్యవసాయం అంటారు, ఏమి చెప్పాలి మా బతుకులు గురించి పురుగు పట్టకుండా పొలానికి మందు కొడతాము, అదే పొలము వల్ల అప్పులు అయితే అదే పురుగులు మందు తాగుతాము బాబు అన్నాడు, ఈ ఏడాది వర్షాలు లేవు బాబు చాలా అప్పుల్లో ఉన్నాము.దేవుడు కరుణిస్తాడని చూస్తున్నాము బాబు, క్రిందట ఏడాది మా ఊరిలో నలుగురు చనిపోయారు అయ్య అప్పులు బాధ తట్టుకోలేక, రైతే రాజు అనుకున్నాము, రైతుకి ఇన్ని కష్టాలు ఉంటాయా అనిపించింది, నీ అప్పు నేను తీరుస్తా అనుకుని మనసులో లేచి రైతు అన్నం తెచ్చుకున్న సంచిలో 5లక్షలు పెట్టి లేచాడు.
దారిలో దాహం వేసి ఒక కుళాయి దగ్గర ఆగాడు మిత్ర, మిత్రని గుర్తు పట్టిన అక్కడ యువత సర్ మీరు మిత్ర గ్రూప్స్ అధినేత కదా అని మాటలు మొదలు పెట్టారు, మీ జీవితం మాకు ఒక పాఠం మీ గురించి మా మాస్టర్ ఎప్పుడు చెప్తూనే ఉండేవారు అంటే ఎవరు ఆ మాస్టర్ అంటే రాజయ్య మాస్టర్ అన్నారు. నన్ను తీసుకు వెళ్తారా అంటే తీసుకు వెళ్లారు.
ఆయన ఎవరో కాదు మిత్ర లెక్కల మాస్టర్, చూడగానే ఆప్యాయంగా పలకరించి పాదాభివందనం చేసాడు.మాది ఈ ఊరే మిత్ర రిటైర్ అయ్యాక ఇక్కడే ఉంటున్న అన్నాడు.మీ బాబాయ్ గారు ఎలా ఉన్నారు అంటే మిత్ర ఆయన కూడ నన్ను వదిలేసి వెళ్లిపోయ్యారు అంటే బాధ పడకు మిత్ర పెళ్లి అయ్యిందా అని అన్నారు మిత్రను, పెళ్లి అని మీరు చెప్పే దాక డబ్బులో పడి చేసుకోవాలి అనే ఆలోచన రాలేదు అన్నాడు, అన్ని ఉంటేనే జీవితం అందం మిత్ర,మాస్టర్ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని చూసాడు మిత్ర.మొదటి సారి అమ్మాయిని చూడడం ప్రేమతో నచ్చింది, వెంటనే మాష్టర్ తో ఈ అమ్మాయిని చేసుకుంటాను మాస్టర్ అన్నాడు మిత్ర. ఏమి తెలియకుండా ఎలా బాబు అన్నాడు.మీ కూతురు మాస్టర్ అది ఒక్కటి చాలు అన్నాడు
పెళ్లి చేసుకున్నారు, మిత్ర తిరిగి ఇంటికి వెళ్లగానే ఉన్న సమాజం కోసం ఉపయోగ పడాలి అని,ట్రస్ట్ స్థాపించి పేదలకు, పర్యావరనానికి సేవ చేస్తు అందంగా ఆనందంగా ఆహ్లదంగా బ్రతికేస్తున్నాడు మిత్ర...

No comments:

Post a Comment