Tuesday, October 22, 2019

మాధురి మనసు దోచేసావే మరి.. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 50

 అరేయ్ రాకేష్ ఏంట్రా ఇది జీవితం,పొద్దున్నే లెగడం సగం సగం మొహం కడగడం, మన టిఫిన్ బండి వాడు పెట్టే సగం కాలిన దోశ తింటు నీళ్లలో చట్నీ ఉందో చట్నీలో నీళ్లు ఉన్నాయో తెలియక అమాయకంతో ఎవడికి మన బాధ చెప్పుకోలేక ఆ దోశని తింటూ.లోలోపల బాధతో ఏడుస్తూ దాన్ని తినలేక నీళ్ల టీ తాగుతూ తాగలేక రూంకి వెళ్లి చన్నీళ్లతో స్నానం చేయలేక.
ఆఫీస్ కి వెళ్ళాక పనులురా రాకేష్ ఉదయం ఉప్పెనలా ఉన్న పనులు.పనులు సాగవు మనము ముందుకు వెళ్ళము మన జీతాలు పెరగవు.ఒకడి కింద బానిస బ్రతుకు,ఏమన్నా అంటే ఆత్మాభిమానం. ఏమి బతుకులురా ఇక్కడ మహానగరం లో జీవితం మలుపుల మయం.తీరం లేదు గమ్యం లేదు,ఏరు దాటడానికి తెప్ప లేదు.తప్పక తికమక తిప్పలు ఈ భాగ్యనగరం లో రాకేష్ ఇక రారా వచ్చి కూర్చో ఒక బీర్ వేయరా అంటూ నాని రాకేష్ కి చెప్తూ బీర్లు ఓపెన్ చేశారు.
బీర్లు తాగుతూ అరేయ్ నాని ఎందుకురా ఈ బాధలు జీతం బాగానే వస్తుంది కదరా పెళ్లి చేసుకో ఇలా పస్తులు ఉండడం ఎందుకు చెప్పు.లోపల ఇంత బాధ పెట్టుకుని అని రాకేష్ అంటుంటే. నాని రాకేష్ తో అరేయ్ ఈ ఉద్యోగంలో పడి నాకు ఉన్న ఒక కర్తవ్యం మర్చిపోయానురా. ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారా రాకేష్ అని అంటూ ఉండగా.నాని గారికి ఈ జబ్బు కూడ ఉందా వద్దురా నాని ప్రేమ జబ్బు దాని దెబ్బలు నువ్వు తట్టుకోలేవు. మీ ఇంట్లో చెప్పిన సంబంధం చూసుకుని చేసుకో అని రాకేష్ అంటూ ఉండగా.
నాని ఏమో నా వల్ల కాదురా మామ జీవితంలో ఆ ప్రేమ లోటు లేకపోవడం నాకు ఇష్టం లేదు. రాకేష్ పదర పోయి సిగరెట్స్ తెచ్చుకుందాం అని పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లి ఒక సిగెరెట్ డబ్బా ఇవ్వండి అని నాని అలానే చూస్తూ ఉన్నాడు షాపులో ఉన్న అమ్మాయిని.అరేయ్ రాకేష్ ఆంటి ఏంట్రా ఇంత అందంగా అయిపోయింది అని నాని అంటుంటే.
అరేయ్ నాని ఆమె షాపు ఆంటీ కూతురురా అని రాకేష్ అంటూ ఉండగా. ఇదిగొండి సిగెరెట్ డబ్బా అని ఆ అమ్మాయి ఇస్తూ ఉండగా. నాని వెంటనే మీరు ఎవరో తెలియదు కాని మీరు చాలా బాగున్నారు. మీరు నవ్వుతూ ఉంటే ముత్యాలు కనపడుతున్నాయి,ఆ మొహం లో చిన్న మచ్చ కూడ లేదు. మీకు ఏమి నామకరణం చేశారో చెప్తారా అని నాని అంటూ ఉండగా.రాకేష్ వెంటనే వీడు ఎవడో నాకు తెలియదు అమ్మ, ఇదే మొదటిసారి నేను చూడడం ఈ దుర్మార్గుడు ఇలా చేస్తాడు అని నేను అనుకోలేదు అమ్మ నన్ను క్షమించు అని రాకేష్ అంటూ ఉండగా.
నాని వెంటనే రాకేష్ ని పక్కకి తోసేసి నీ పేరు చెప్పవా దయచేసి అలా చేప కళ్ళు వలే చూడకు. ఆ చిరు నవ్వు చంపేస్తుంది ఎంత పలకరించిన మాట్లాడవు ఏంటి. చెప్పు నీ పేరు చెప్పు అంటూ ఉండగా రాకేష్ నానిని పట్టుకుని మరి లాగేస్తూ ఉండగా. లోపల నుండి అమ్మాయి వాళ్ళ నాన్న మాధురి లోపలకి రా అమ్మ అంటూ ఉండగా. వస్తున్న నాన్న అని అంటూ వెళ్తూ ఉండగా. నాని వెంటనే మాధురి నా మనసు దోచేసావే మరి ఇక ఈ క్షణం నుండి నీ బాటసారిని అంటూ ఉండగా. మాధురి మొహం ముడుచుకుని లోపలకి వెళ్ళిపోయింది.
గదిలోకి వెళ్ళగానే నాని రాకేష్ ని ఒక తన్ను తన్ని నేను ఎవడో నీకు తెలియదా.నేను దుర్మార్గుడుని అంటావు కదరా రాకేష్ గా అంటూ ఉండగా. రాకేష్ వెంటనే అరేయ్ ఇవ్వన్ని అపర ఆ అమ్మాయి మాధురి.నాకు షాప్ ఆంటీ చెప్పింది వాళ్ల అమ్మాయి ఒక బొటిక్ నడుపుతోంది అని. నాని వెంటనే ఇక రేపటి నుండి ఆ అమ్మాయే జీవితంరా అని పడుకున్నారు.
మరుసటి రోజు తెల్లవారుజాము అవగానే నాని మాధురి షాప్ కి వెళ్ళాడు. మాధురి షాప్ లో ఉంది, మాధురి గారు రాత్రి మత్తులో కొంచెం ఎక్కువ చేసాను,నన్ను క్షమించండి అని చెప్పి మీరు చాల బాగున్నారు అండి అని చెప్పి వెళ్లిపోతు ఉండగా. మాధురి వెంటనే నాని గారు అని పిలిచింది.ఏంటి అండి మాధురి గారు అనగానే నిన్న సిగరెట్ ప్యాకెట్ కి డబ్బులు ఇవ్వలేదు అంటూ ఉండగా. ఇదిగొండి సిగరెట్ ప్యాకెట్ మిమ్మల్ని చూసిన దగ్గర నుండి దీనితో నాకు అవసరం లేదు అనిపించింది అని సిగెరెట్ ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
కొన్ని గంటలు తర్వాత మాధురి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్లగా, నాని వెనక నుండి వచ్చి మాధురి గారు మీరు చాలా బాగున్నారు.మీరు అంటే నాకు చాలా ఇష్టం అండి,మిమ్మల్ని పెళ్లి చేసుకుకోవలని ఉంది అండి అని అంటూ ఉండగా మాధురి ఒక నవ్వు నవ్వి అమ్మాయి ఆట వస్తువు కాదు చూడగానే నచ్చేయడానికి.అమ్మాయి మనసు ఏమి పెరటిలో ఉన్న పువ్వు లాంటిది కాదు తెంచేసి చేతిలో పెట్టేసుకుని ఇచ్చేయడానికి. మీకు నా అందం మీద ఇష్టం నేను అంటే కాదు.నా గురించి ఏమి తెలియదు నీకు.మీరు అందరిలాగనే వెంటపడుతున్నారు.దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని చెప్పి మీకు ప్రతి రోజు చాలా బాగుండాలి అని ఆశిస్తున్నాను అని వెళ్ళిపోయింది.
నాని తనలో తాను అనుకుంటున్నాడు.ఎంత తీయగా ఉన్నాయి మాటలు ఎంత మధురంగా ఉన్నాయి పలుకులు తేట తెలుగు వలే తేనె పట్టు వలే ఏమన్నా ఉన్నాయా మాటలు.భగవంతుడా ఈ అమ్మాయి నాకు కావాలి,నీ దయ నా మీద చూపించు భగవాన్ అని ఆఫీసుకి వెళ్ళిపోయాడు, బయట మాధురి షాపు దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని మరి.
ఆఫీసుకి వెళ్ళగానే నాని తన పై అధికారికి తాను ఊరికి వెళ్ళాలి అని చిన్న అబద్దం చెప్పి ఒక 10 రోజులు సెలవు తీసుకుని, రాకేష్ దగ్గరకి వెళ్లి ఈ రోజు నుండి మన కర్తవ్యం మాధురి.మాధురి కోసమే నేను నా కోసమే నువ్వు అని ప్రతిజ్ఞ చేస్తున్నావు రాకేష్ ఆనగానే. రాకేష్ వెంటనే నానితో నీ మాధురి కోసం నేనా. ఒరేయ్ వెధవ మొన్నటిదాక బాగానే ఉన్నావు కదరా ఏంట్రా ఇది నాకు.నన్ను ఏమి చేద్దాం అనుకుంటున్నావు చెప్పారా నాని, అసలే మా అమ్మకి ఒక్కడినే కొడుకుని అంటే.నువ్వు నా ప్రాణంరా నాకోసం నువ్వు ప్రాణాలు కూడ ఇవ్వలేవ అంటే.రాకేష్ తల బాదుకుని నాని భుజం మీద చేయి వేసి ఇక తప్పిద్దా మామ అంటూ మాధురి షాప్ దగ్గరకి వెళ్లిపోయారు.
మాధురి లోపల నుండి చూస్తూనే ఉంది బయట ఉన్న నాని ని.ఉండని ఎంత సేపు ఉంటారో అని చూసింది.బయట తనకి ఏమి తెలియనట్టు మొత్తం చూస్తూనే ఉంది.
నాని కి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది.అరేయ్ నాని ఎలా ఉన్నావు అంటే, నాని నేను బాగానే ఉన్నాను అమ్మ. నువ్వు పెళ్లి సంబందాలు చూడకు ఇక నేను అమ్మాయిని వెతుక్కున్నాను అంటే.నాని వాళ్ళ అమ్మ ఇక అపర నా బంగారుకొండ అమ్మాయి వెనకాల పడ్డాడ నేను నమ్మనురా అంటే. నాని వెంటనే ఇప్పుడు అయితే ఆ అమ్మాయి కోసం రోడ్ మీద పడ్డాను అమ్మ.నువ్వు ఫోన్ పెట్టేసి ఇక నాన్న బుర్ర తిను అమ్మ ఐ లవ్ యూ అమ్మ అని ఫోన్ పెట్టేసాడు.
వారం రోజులు అయిన మాధూరిలో మార్పు లేదు. ఎప్పుడు చూసినా చూడకుండా వెళ్ళిపోతుంది.నాని కి తిక్క ఎక్కిపోయి మాధురి దగ్గరకి వెళ్ళి ఎదో ఒకటి చెప్పు అభిప్రాయం ఒక పక్క నీ టెన్షన్ నా వల్ల కాదు మాధురి ఏంటి అన్నది చెప్పు అంటూ ఉండగా. మాధురి మొన్ననే చెప్పాను నా అభిప్రాయం అందులో ఏ మార్పు లేదు.నీకు బాధగా ఉంటే నా వెనక తిరగడం ఆపేయండి అని అంటే.
నానికి తిక్క ఎక్కి ముందు ఆ చేతులు తిప్పడం ఆపు, మీ షాపులో పొట్లాలు కట్టినట్టు ఓ మెలి తిప్పేస్తున్నావు. అమ్మాయని ఇష్టపడడానికి కొన్ని వందల సంవత్సరాలు అవసరం లేదు ఒక నిమిషం చాలు నచ్చడానికి. ఏంటి అయిన అంత టెక్కు మా వెనకాల అమ్మాయిలు పడరు అనే కదా.నిజం.చెప్పనా అబ్బాయిలు అమ్మాయిల వెనకాల పడితేనే బాగుంటాది.అందుకే చీ కొట్టిన సిగ్గు లేకుండ పడతారు అబ్బాయిలు.మీరు ఎమన్నా పడతారు అబ్బాయిలు అందుకే చులకన భావన అని నాని అంటూ ఉండగా.మాధురి ఒక నవ్వు నవ్వింది నువ్వు మారవు అంటూ వెళ్లిపోతు ఉండగా.
నాని మాధురి చేయి పట్టుకుని వదిలి వెళ్లిపోకు నన్ను దయచేసి, నా గుండె ఎవరో పట్టుకుని పిండేసినట్టు ఉంది. నా మదిలో ఆలోచనలు అన్ని నీవే ఉన్నాయి.ఒప్పుకోవే నీకు దండం పెడతా నీ కాళ్లు పట్టుకుంటాను. నిన్ను చూసిన దగ్గర నుండి ఆకలి లేదు నిద్ర లేదు అయితే మీ ఇంటి దగ్గర లేకపోతే మీ షాపు దగ్గర మాధురి. ఏమి చేయను చెప్పు ఈ గుండె చప్పుడు నీకోసమే ఈ శ్వాస నీ ప్రేమ కోసం చూస్తోంది మాధురి అంటుంటే.
నాని గారు మీ ప్రేమ ఎక్కువయ్యింది. నాకు ప్రేమ మీద మంచి నమ్మకం ఉంది. మీరు పొద్దున్నే యోగ చేయాలి నన్ను ప్రేమించాలి అంటే. మీరు జిమ్ కూడ చేయాలి నేను కొట్టే దెబ్బలు పడాలి అంటే. ఇంట్లో పనులు నేర్చుకోవాలి నన్ను పెళ్లిచేసుకోవాలి అంటే అని మాధురి అంటుంటే. నాని వెంటనే మాధురితో నువ్వు ఎన్ని ప్రళయాలు సృష్టించిన నేను నిన్నే ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటాను మాధురి అంటుంటే. మర్చిపోయాను మీకు చెప్పడం నాని గారు మీరు పొట్లాలు కట్టడం కూడ నేర్చుకోవాలి మా నాన్నగారి దగ్గర ఉండి మరినేర్చుకోవాలి అంటే. నాని వెంటనే తల్లి అన్నింటికి తలొగ్గాను నాకు నువ్వే కావాలి.
మాధురి వెంటనే నాని గారు మీరు అంటే నాకు చాల ఇష్టం అండి.మీరు చాలా మంచివారు,మీరు మీ అమ్మానాన్నలతో వచ్చి మా ఇంట్లో మాట్లాడండి.మనం పెళ్లి చేసుకుని ప్రేమించుకుందాం అంటే.నాని వెంటనే హెయ్ భగవాన్ నువ్వు ఉన్నావు,ఇక నీ చేయి వదలను మాధురి, మనసా వాచా కర్మణ నీ కోసమే నేను. మాధురి నా మనసు దోచేసావే మరి ఇక నీ కోసమే ఈ ఊపిరి మన ఇద్దరి దారి ఒకటే మరి అని పెళ్లికి సిద్ధం అయిపోయారు నాని మాధురి..

No comments:

Post a Comment