Tuesday, October 22, 2019

నా భారతం.. నా దేశం.. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 51

 దేశం అంటే మట్టి కాదోయ్, భారతం అంటే మహాభారతం కాదోయ్.మా భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, శత్రువుని కూడ ప్రేమతో చూసే దేశం.ఓపికకి ఇంకోక పేరు ఉన్న దేశం ఉంది అంటే అది మా భారతదేశం అని భరత్ పీటర్ కి చెప్తున్నాడు.
పీటర్ వెంటనే మాది బ్రిటన్ దేశం మేము మిమ్మల్ని పాలించము కదా,మిమ్మల్ని పాలించిన మేము కదా గొప్పవాళ్ళం అంటూ.ఎన్నో దండయాత్రలు చేసాము రవి ఉదయించిన చోటు నుండి అస్తమించిన చోటు వరకు అపజయం లేకుండా ముందుకు సాగాము భరత్. మా పాలనలోనే మీకు అభివృద్ధి చాల జరిగింది, బానిస బతుకులు నుండి మిమ్మల్ని బయటకి లాగి విముక్తులని చేసి మీ దేశానికి అంటూ ఒక స్వాతంత్ర్యo అంటూ ఇచ్చాము భరత్ అంటూ ఉండగా.
అవును పీటర్ మా దగ్గర అన్ని దోచుకుని మీరు ఫ్రెంచి వారు బ్రిటన్ వారు డచ్ వారు మా దేశాన్ని కొల్లగొట్టి అపార సంపదను లాక్కొని వారితో పాటు తీసుకుని వెళ్లిపోయారు. ఎన్ని దురంగతాలు చేసిన ఎంత హింసించిన మా దేశీయులు మిమ్మల్ని ఏనాడు వెన్నుపోటు పొడవలేదు అది మా దేశం గొప్పదనం పీటర్.
భరత్ నువ్వు ఎన్ని చెప్పిన ఎంత చెప్పినా మీ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు మేము పరిపాలించాము. విడి విడిగా ఉన్న మీ దేశపు సామ్రాజ్యాన్ని ఒక తాటి వైపుకు తీసుకు వచ్చి ఒక దేశంగా చేసాము. అభివృద్ధి అంటేనే తెలియని దేశం మీది, నాగరికతకు దూరంగా బతుకున్న మీ దేశాన్ని మా దేశ గొప్ప గొప్ప నాయకులు పరిపాలించారు. ఫ్రెంచ్ వారిని డచ్ వారిని ఓడించి వారి దగ్గర నుండి మిమ్మల్ని విడిపించి మీకు అంటూ ఒక బ్రతుకు మార్గాన్ని నడిపించాము భరత్.
ఒకటి గుర్తు పెట్టుకో పీటర్, వాస్తవానికి వర్తకం కోసం వచ్చిన మీరు ఇక్కడ ఉన్న ఖనిజాలను సంపదను చూసాక వాటి మీద ఉన్న ప్రేమతో, అన్నదమ్ములు లాగ ఉన్న రాజ్యాలలో వైరం వచ్చేలా చేసి. తిరుగుబాటు సామంతు రాజులను చంపి, ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుని ఆనందపడిన మీరు గొప్ప నాయకులు అంటుంటే నాకు నవ్వు వస్తుంది పీటర్.
భరత్ నువ్వు ఎంత చెప్పినా మీ దేశం మా దేశానికి బానిస దేశం. మేము ఇచ్చిన మేధస్సు మీకు మీ దేశానికి ఎంతో ఉపయోగపడింది, రహదారులు నుండి వంతెనలు డ్యాములు కట్టింది మా దేశము. వరదల నుండి ముంపు ఉన్న ప్రదేశాలని కాపాడడానికి ఎన్నో ఆనకట్టలు కట్టారు మా వాళ్ళు. పన్నులు కట్టించుకుని మీకు అవి ఉపయోగపడేలాగ చేసింది మా వాళ్ళు. చదువులని పరిచయం చేసింది మీ దేశానికి మా దేశం ఎంత చెప్పినా తక్కువే నా దేశం గురించి భరత్ అంటుంటే.
పీటర్ మా దేశ ప్రాచీన కట్టడాలు నీకు తెలియవు అనుకుంట. నా దేశంలో ఉన్న ఏ పురాతన గుడికి అయిన వెళ్ళు మా దగ్గర ఉన్న మేధావి తనం అక్కడ గుడి కట్టిన విధానం చూస్తే తెలుస్తుంది. విద్య గురించి నువ్వు మాకు చెప్తున్నావు. ఇక చదువులు గురించి చెప్తున్నావు నలంద విశ్వ విద్యాలయము ఇది పూర్వము నుండి చాలా ప్రసిద్ధి చెందినది పీటర్.నువ్వు ఇంకా భ్రమలో ఉన్నట్టు ఉన్నావు వాస్తవానికి రా పీటర్ అంటూ ఉండగా.
భరత్ మీ దేశాన్ని మా దేశ గొప్ప నాయకులు అయిన కార్నవలిస్, విలియం బెంటిక్, లార్డ్ రిప్పోన్, లార్డ్ వారెన్ హస్టింగ్ మరియు మౌంట్ బాటిన్ లాంటి గొప్ప గొప్ప నాయకులు పరిపాలించారు, జార్జ్ 6 లాంటి గొప్ప రాజుల పాలనలో మీకు ఎన్నో ఉన్నత విలువలు ఇచ్చి మీకు స్వాతంత్ర్యం ఇచ్చాము భరత్.
ఇక ఆపు పీటర్ నువ్వు నీకు తెలిసిన చరిత్ర ఇది అనుకుంట, నేను చెప్తాను అసలు చరిత్ర నీకు పోరాటంలో జయం ఉంది అని మాకు తెలిసింది 1857 సిపాయుల తిరుగుబాటు నాడు.అప్పటి నుండి ప్రతి దినం ప్రతి క్షణము భారత మాతకీ బానిస సంకెళ్ళ నుండి విముక్తి కోసం పోరాట యోధులు ఒక్కొక్కరు తమ ప్రాణాల్ని అప్పగించి పోరాటం చేస్తూనే ఉండేవారు పీటర్. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, వందేమాతరం, శాంతి సందేశం అని అలుపెరగని పోరాటం చేశారు పీటర్ మా భారతీయులు.ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు ఉద్యమాన్ని నడిపించారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రు, లాల లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు పోరాడి ఎన్నో కొన్ని వేల ప్రాణాలు అర్పించి మా దేశ ప్రజలకి స్వాతంత్ర్యం తీసుకు వచ్చి, తెల్లవారిని తరిమికొట్టి 1947 ఆగస్టు 15 న ప్రతి భారతీయుడు గర్వించేలా మా దేశ జండాని ఎర్రకోట మీద ఎగురవేసి మా జాతి కీర్తిని ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా చేసి.ఇది నా భారత దేశం అని నీలాంటి వాళ్ళ దగ్గర గొప్పగా చెప్తున్నాను పీటర్. ఇది నా భారతదేశం.. జై హింద్..

No comments:

Post a Comment