ఏవండి మీ ఇంటి పైన అద్దెకు ఇవ్వడానికి గదులు ఉన్నాయి అంట కదండీ. నేను
మా అమ్మ గారు కలిసి ఉంటాం అండి అని ఒక మృదుల ఇంటి యజమాని సరోజ గారితో
మాట్లాడుతూ ఉండగా. సరోజ మృదులతో మీరు ఏమి చేస్తుంటారు అని అడగగా,నేను ఇక్కడ
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కింద చేస్తున్నాను.మీ దగ్గర ఇల్లు ఖాళీగా ఉంది
అని మా హెడ్ మాస్టర్ గారు చెప్పారు అనగానే. హో శ్రీనివాసు గారు చెప్పారా,
రండమ్మ లోపలకి అని సరోజ గారు చెప్తూ అద్దె వచ్చి రెండు వేలు రూపాయలు,
కరెంట్ బిల్లు వాటర్ బిల్లు వేరేగా ఉంటాయి మృదుల అంటూ ఉండగా.మాకు ఇష్టమే
అండి అని మృదుల ఒక నెల అద్దె ముందుగానే ఇచ్చి రెండు రోజుల్లో వస్తాము అని
వెళ్ళిపోయింది.
సరోజ గారి అబ్బాయి హర్ష, చదువు అయితే చదవలేదు గాని సంస్కారానికి లోటు లేదు. ఊరిలోని మొక్కలను పువ్వులను పెంచుతూ వాటి బాగోగులు చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నాడు.
హర్ష వాళ్ళ స్నేహితుడు సత్య ఇద్దరు కలిసి ఈ మొక్కల వ్యాపారం చేస్తున్నారు. సత్య హర్ష తో ఏంటి ఇది హర్ష ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇక్కడ మొక్కలతో కాపురం పెట్టేసావు.వెంటనే హర్ష సత్యతో నువ్వు పెళ్లి చేసుకున్నావు అయిన ఇంట్లో కన్నా ఇక్కడే ఎక్కువ గడుపుతున్నావు.దేనికైనా రాత రాసి ఉండాలి సత్య,పెళ్లి అనేవి స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు.కళ్యాణం అనేది కాలం కలిసి వస్తే జరిగిపోతుంది,లేకుంటే బ్రమ్మచారి అంతేరా సత్య జీవితం.కంగారు పడకుండా మొక్కలకు నీళ్లు పెట్టు అని నవ్వుకుని వెళ్లి మంచి పాట పెట్టుకుని వింటూ గులాబీ మొక్కలను చూస్తూ ఉన్నాడు.
హర్ష ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ సరోజ గారు, హర్ష పైన ఉన్న రెండు గదులు వేరే వాళ్ళకి అద్దెకు ఇచ్చాము. వాళ్ళు రేపు వస్తారు అంట హర్ష, నువ్వు వెళ్లి కొంచెం పని వాళ్ళతో శుభ్రం చేయించు అనగానే. ఇంతలో మృదుల వాళ్ళ అమ్మ గారు వచ్చారు.
మృదుల సరోజ గారితో ఏవండి ఈ రోజు మంచి రోజు అంట, మీకు ఏమి అభ్యంతరం లేకపోతే ఈ రోజు మేము వస్తాము అండి అంటూ ఉండగా.సరోజ గారు మృదులతో ఇంకా గదులు శుభ్రం చేయలేదు మృదుల.కావాలి అంటే మా అబ్బాయి తోడుగా వస్తాడు వెళ్లి ఇద్దరు శుభ్రం చేసుకుని మీరు ఇంట్లోకి రండి అనగానే.
హర్ష వాళ్ళ అమ్మతో అమ్మ ఏంటి ఇది నేను ఒక్కడినే శుభ్రం చేస్తాను అంటే, వీడికి అమ్మాయిలు అంటే భయం అమ్మ మృదుల ఏమి అనుకోకు,నువ్వే తీసుకుని వెళ్ళు అని ఇద్దరు పైకి వెళ్ళారు.
పైకి వెళ్లిన వెంటనే మృదులతో హర్ష ఇంత అందంగా ఉన్నావు.చాలా చక్కగా ఉంటావు ఎందుకు అమ్మాయి ఎప్పుడు చూసిన మా తోటలో జామకాయలు దొబ్బేస్తున్నావు అంటే.
మృదుల హర్షతో మీరు ఎప్పుడు చూసారు అండి, మీ అమ్మ గారు ఏమో మా అబ్బాయికి అమ్మాయిలు అంటే భయం అంటున్నారు.మీరు చూస్తే ఏమో చాలా కళాకారులే అండి అంటూ ఉండగా. మీ పేరు మృదుల కదా ఇప్పటిదాక మీరు కోసిన జామకాయలే కాదు.ఇప్పుడు మీరు పెట్టుకున్న మందార పువ్వు కూడ మా నర్సరీలోదే అంటూ ఉండగా.
మహాప్రభు ఇక నన్ను క్షమించు అలా దొంగలా చూడకు నన్ను.ఈ మందార పువ్వులు మా స్కూల్ లో ఉన్న పిల్లలు ఇచ్చారు నాకు ఇష్టం అని ఊ అని మూతి ముడుస్తూ జడ ముందుకు వేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ పిడికిలి బిగించి కోపంగా చూస్తూ ఉంటూ ఉండగా. హర్ష ఆ మృదుల మొహాన్ని చూస్తూ నవ్వు ఆపుకోలేక కింద పడి పడి నవ్వుతూ ఏదో సరదాగా అన్నాను. మీరు ఏమో మూతి మెడ అలా రుబ్బురోలు లాగ తిప్పకండి మళ్ళీ అరిగిపోతే కష్టం అని నవ్వుతూ చెప్తున్నాడు.
మృదుల మీరు ఏమి చేస్తుంటారు హర్ష గారు అనగానే. హర్ష మృదులతో నాకు సాయం చేయడం అంటే ఇష్టం అందుకే వ్యవసాయం చేస్తున్న మృదుల గారు, మనుషులు కన్న మొక్కలు అంటే చాలా ఇష్టం వాటికి ఈర్ష్య అసూయ స్వార్థం ఉండవు కనుక అందుకే నర్సరీ నడుపుతున్నాను అని హర్ష చెప్తూ ఉంటే అలా చూస్తూ.మీరు ఏమి చదువుకున్నారు హర్ష గారు అనగానే ఏదో చదివా అండి 10 వ తరగతి.మా ఊరు వదలి వెళ్లడం ఇష్టం లేక చదువుకు దూరంగా ఉన్నాను అండి అనగానే మృదుల అలా చూస్తూ ఇంత ప్రేమ మీకు మీ ఊరు, వ్యవసాయం, మొక్కలు అంటే మీలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అండి హర్ష గారు.జేబులో ఒక పది వేలు ఉంటే ఉన్న ఊరుని మర్చిపోయి, మాకు పల్లెటూర్లు అంటే చిరాకు అంటున్నారు. మీకు ఇంత ఉండి కూడ చాలా అమాయకంగా ఆనందంగా ఉన్నారు హర్ష గారు.
మరి మీరు ఏంటి మృదుల గారు,మీరు స్కూలులో పిల్లలకి ఏమి చెప్తారు.మీరేనా కొత్తగా వచ్చిన టీచర్ పిల్లలకి ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు అంట కదా మొక్కలు గురించి, ఏదో శాస్త్రీయ నామాలు చెప్తున్నారు అంట.చింత చెట్టుకు వేప చెట్టుకు కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు అంట, వాళ్ళు అంత ఒకటే గొడవ మృదుల గారు అంటూ ఉండగా.
హర్ష గారు నేను సైన్స్ టీచర్ ని, నేను చెప్పేవి క్లాసులో ఉన్న పాఠాలు.అయిన నేను ఏమి చెప్తే మీకు ఎందుకు అండి అంత శ్రద్ధ.ముందు పని చూడండి తుడిచిన చోటే తుడుస్తూ ఉన్నారు.ఇలా అయితే మీరు కడిగినట్టే మేము వచ్చినట్టే హర్ష గారు అంటూ, శుభ్రం చేసి మృదుల వాళ్ళు ఇంట్లోకి దిగి పాలు పొంగించేశారు.
మృదుల ఉదయాన్నే లేచి యోగ చేయడం అలవాటు.డాబా పైకి వెళ్లి యోగ చేద్దాం అనుకున్న మృదులకి పైన పువ్వులు ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తూ, పువ్వులను ముద్దు పెట్టుకుంటూ,వాటితో ఫొటోస్ దిగుతూ చాలా సంతోషంగా ఉన్న హర్ష ని చూసి ఇది కదా సంతోషం కదా అనుకుని.ఏమి ఎరుగునట్టు వెళ్లి ఆసనాలు వేయడం మొదలు పెట్టింది మృదుల.
అక్కడ ఆసనాలు వేస్తున్న మృదులని ఒక్కసారిగా చూసిన హర్ష ఆ తెల్లవారు జాము మంచుల్లో దగ దగ మెరిసిపోతూ ఉంది మృదుల.పువ్వులు పక్కన పెట్టి మృదులని చూస్తూ ఉన్నాడు.ఏమి అందం ఏమి భాగ్యం ఈ కళ్ళు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నట్టు ఉన్నాయి.మృదుల కళ్ళు మూసుకుని ఆసనం వేస్తూ ఉండగా, అక్కడ ఉన్న పూలను కోసి, పూలతో మృదుల అని రాసి వెళ్ళిపోయాడు.కొంగ జపం లా ఆసనాలు వేస్తున్న మృదుల ఒకవైపు కనిపెడుతూనే ఉంది అక్కడ హర్ష చేసే పనిని. సరదాగా నవ్వుకుని ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోయింది అక్కడ పువ్వులతో రాసిన పేరుతో.
కాలంలో వాళ్ళ పయనం అలా ముందుకు వెళ్తుంది.అల్లరి చేసే వయసుకు ప్రేమ తోడు అయితే అన్నట్టు వాళ్ళ స్నేహం అలా వెల్లుపోతుంది.మనుషులు క్రింద వాళ్ళది స్నేహం మనసులు కింద వాళ్ళది ప్రేమ అన్నట్టు ఉండేవారు.
మృదుల స్కూల్ కి హర్ష తన స్నేహితులు కలిసి వెళ్లారు.మృదుల ని చూసిన హర్ష చేతితో హాయ్ చెప్పి లోపలకి వెళ్ళాడు. అదే స్కూల్ లో లెక్కలు చెప్తున్న మాస్టర్ ని బయటకు తీసుకు వచ్చి ఒకటే కొట్టుడు కొడుతున్నారు.ఇంకోసారి స్కూల్ లో ఉన్న అడపిల్లలని ఏడిపిస్తావ అని వాడికి వాచిపోయేలా కొడుతూనే ఉన్నారు.వాడి వాళ్ళ మృదుల చాల ఇబ్బంది పడింది అని తెలిసిన హర్ష, ఎవరి మాట వినకుండా కొడుతూనే ఉన్నారు. ఇంకోసారి ఇది జరిగితే బాగోదు అని వెళ్లిపోయారు.ఇష్టం ఉన్న అమ్మాయి కోసం ఏది అయిన చేస్తారు అనుకుంది మృదుల.
ఇక వెళ్లి హర్షతో ఎందుకు కొట్టావు అతనిని,నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని నీకు తెలుసా, అందుకే కొట్టావు కదా అని అడిగితే.ఏమి మాట్లాడకుండా చూస్తూ మృదుల మాటలు వింటూ మృదుల తలలో పెట్టుకున్న మందార పువ్వును చూస్తూ ఉన్నాడు.అలా చూడకు హర్ష ఏంటో సరిగ్గా చెప్పు నేను అంటే ఇష్టమా కాదా చెప్పు హర్ష.నువ్వు మంచి అమ్మాయివి మృదుల అని వెళ్ళిపోయాడు.
మృదుల కి ఏమి అర్థం కాలేదు, నేను వెళ్లి అడిగిన కాదన్నాడు అంటే,హర్షకి ఏమైంది ఎవరు అన్న ఎమన్నా అన్నారా అనుకుంది.ఇంటికివెళ్లి మృదుల వాళ్ళ అమ్మతో నువ్వు ఏమన్నా అన్నావ హర్షని అమ్మ అని అనగానే.మృదుల వాళ్ళ అమ్మ నాకు ఏమి తెలియదు, ఆ అబ్బాయి చాల మంచోడు అని మృదుల వాళ్ళ అమ్మ అంటూ ఉండగా.మృదుల వెంటనే వాడు నాకు కాబోయే మొగుడు నీకు అల్లుడు, నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడు ఏమి అనకు అని వెళ్ళిపోయింది.
సరోజ గారి దగ్గరకి వెళ్ళి నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్న ఆంటీ మీకు ఇష్టం అయితే చెప్పండి అనగానే.సరోజ మృదులతో నేనే మీ అమ్మ గారిని అడుగుదాము అనుకున్నాను మృదుల,నువ్వు నా కోడలు అయితే నాకు అంతకన్నా అదృష్టమా తల్లి మాకు అంది.
హర్ష నువ్వు అనుకున్నట్టు అందరి అబ్బాయిల కాదు.అమ్మాయిలు అంటే చాలా అభిమానము,హర్షకి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం.హర్ష వాళ్ళ అక్కకి మొక్కలు పెంచడం అంటే చాల ఇష్టం,హర్ష 10 వ తరగతిలో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమిస్తున్నా అంటూ ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది.అప్పటి నుండి అక్క ఎప్పుడు అయిన తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు.మనకి ఒక మాట చెప్పి ఉంటే మనం అక్కకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళం కదా అమ్మ.చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన అక్క గుర్తుకు వస్తున్నప్పుడు ఫొటోస్ లో చూసుకోవాల్సి వస్తుంది అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు చిన్నపిల్లోడి లాగ.ఏమి చేస్తాం అమ్మ మా కర్మ తిరిగి రాలేదు.ఇప్పుడు నా బెంగ నాది నేను లేకపోతే వీడిని ఎవరు చూసుకుంటారు అని.ఇప్పుడు నువ్వు ఉన్నావు అని ధైర్యం వచ్చింది అమ్మ అనగానే హర్ష ఎక్కడ ఉన్నాడు ఆంటీ అనగానే నర్సరీలో ఉన్నాడు అమ్మ అనగానే మృదుల వెంటనే నర్సరీకి వెళ్ళిపోయింది.
హర్ష వచ్చి ఏంటి మృదుల ఇలా వచ్చావు, ఏ మొక్కలు కావాలి నీకు అని అంటూ ఉండగా. మృదుల వచ్చి హర్ష కాలర్ పట్టుకుని కుడి చేత్తో హర్ష కడుపులో ఒక గుద్దు గుద్ది ఎడమ చేత్తో ఒక లెంపకాయ పీకి నువ్వు అంటే నాకు ఇష్టం అనగానే. వెంటనే హర్ష మృదులతో నువ్వు అంటే ఇష్టమే కానీ నీ బుర్ర నాకు నచ్చలేదు నీ ఆలోచనలు నాకు నచ్చలేదు.ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు ఒకసారి ప్రేమ ఉంటాది ఇంకోసారి చిరాకు కోపం అసహ్యం ఉంటాయి.ఎప్పుడు ఒకలాగ ఉండే అమ్మాయి నాకు కావాలి.ఇష్టం ఉంటే మాట్లాడుతూ ఇష్టం లేకపోతే మాట్లాడ లేని అమ్మాయి నాకు వద్దు మృదుల అంటూ ఉండగా.
మృదుల వచ్చి హర్ష ని పట్టుకుని ఒక అమ్మాయి ఇష్టం ఉంటే ప్రాణం ఇస్తాది. అయిన నువ్వు ఏమి చిన్న పిల్లోడివి కాదు నన్ను నువ్వు మార్చుకోవచ్చు అనగానే.ఆహా మృదుల నువ్వు మారతావ అంతకన్నా నాకు సంతోషం ఏమి ఉంది అనగానే.మరి పెళ్లి చేసుకుందామా హర్ష అంటూ ఉండగా.కొన్ని రోజులు ప్రేమించుకుందాం తరవాత పెళ్లి చేసుకుందాం హర్ష అనగానే, పట్టుపట్టి ఒక నెలలో పెళ్లి చేసుకుంది హర్ష ని మృదుల.
హర్ష మృదుల తో నువ్వు మొండి దానివి,పెంకి దానివి అంతకుమించి బంగారానివి.మా ఇంటికి వచ్చిన మృదుల మందారానికి ఏమి ఇచ్చి మా కృతజ్ఞత తెలపాలి అనగానే సిగ్గుతో మృదుల నవ్వుకుంటూ కనుబొమ్మలు ఎగరవేస్తూ చూస్తుంది హర్ష వైపు...

No comments:
Post a Comment