Tuesday, October 22, 2019

ఓ చెలి క్షమించమన్నానుగా... -- తెలుగు కథలు(Telugu Kathalu) - 53

 అసలే చలి కాలం అందులోను కలికాలం,వద్దు అంటే విన్నావ పట్నం చదువులు వద్దు మనకి అంటున్న అక్కడే చదువుతాను అని మొండి పట్టుదల పట్టావు.ఇప్పుడు చూడు ఫోన్లో మాట్లాడు కోవడం తప్ప చూడడం కుదరడం లేదు హర్షిణి అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే.నువ్వు ఆపు అమ్మ ఇక ఇప్పుడు చూడు పాత సినిమాలు చూసినవే మళ్ళీ చూపించి బుర్ర తిన్నట్టు తింటున్నావు. ఆపేయి అమ్మ నేను మంచిగా చదువుకుని జాబ్ చేయాలి అమ్మ అంటూ ఉండగా.
అలాగే హర్షిణి జాగ్రత్తగా ఉండు ఈ సారి సంక్రాంతికి తొందరగా వచ్చేయి ఇంటికి. పట్నంలో ఉన్నాను అని సోకులకు పోకుండా తలకి కొబ్బరినూనె రాయి. అసలే పిచ్చిక గూడుల ఉంటాది,మొహానికి సుని పిండి పెట్టుకో అడ్డమైన క్రీములు రాయకుండా అంటూ ఉండగా హర్షిణి ఇక ఆపు అమ్మ నీకు ఇంటికి వచ్చాక పాద పూజ చేసుకుంట మా మంచి అమ్మ కదా అని ఫోన్ పెట్టేసింది.
అరేయ్ ప్రవీణ్ దున్నపోతులా ఎంత సేపు నిద్రపోతావురా, ఇప్పటికే టైం 8 అవుతుంది. లేచి కాలేజీకి తగలడు వెధవ, మనిషివి అయితే పెరిగావు కాని బుద్ది మాత్రం పెరగలేదు అని ప్రవీణ్ నాన్న తిడుతూ ఉండగా బద్దకంతో లేచి స్నానం చేసి కాలేజీకి రెడి అయ్యి వెళ్తున్నాడు.
కాలేజీకి వెళ్లే రోడ్ లో లిఫ్ట్ లిఫ్ట్ అని హర్షిణి చేయి పెట్టి ఆపింది. వెంటనే ప్రవీణ్ ఎవరక్కా నువ్వు ఏమి కావాలి అన్నాడు. ఏమి లేదు తమ్ముడు లిఫ్ట్ కావాలి, మొహం ఏమి మాడ్చకు ఒక పది రూపాయలు ఇస్తాను లిఫ్ట్ ఇస్తే అన్నది. ఆ పదికి ఇంకో పది రూపాయలు కలుపు మొత్తం 20 రూపాయలు అవుతాయి, ఎలాగో ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టలేదు మధ్యాహ్నం తినవచ్చు హాయిగా అంటే ప్రవీణ్. హర్షిణి నవ్వుకుని బండి ఎక్కింది, బండి ఎక్కాక ప్రవీణ్ హర్షిణితో మీరు ఏ కాలేజి అంటే గీతం కాలేజి అన్నది. వెంటనే ప్రవీణ్ ఓరి దేనెమ్మ జీవితం అది కాలేజి కాదు నరక కూపం. నాది అదే కాలేజి అనగానే హో అని హర్షిణి అన్నది. కాలేజి దగ్గరకు రాగానే హర్షిణి బండి దిగి 20 రూపాయలు ఇస్తూ ఉంటే, ఏదో సరదాగా అన్నాను అండి అమ్మాయిలు కదా అందుకే కొంచెం కొంటిగా మాట్లాడ అని వెళ్ళిపోయాడు.
ఇంతలో హర్షిణి వెనక నుండి సతీష్ వచ్చి బౌ అన్నాడు. ఉలిక్కిపడి హర్షిణి నీకు బుద్ది రాదా వెధవ ఇలా నా చుట్టూ తిరగకుండా లైబ్రరీ చుట్టూ తిరిగి పుస్తకాలు చదువు అంటూ ఉండగా.ఈ చదువులు చదివేసా హర్షిణి ఎం, నీతో కొత్తగా చదువుదామని హర్షిణి అనగానే.చూడు చూడు వెధవ నాకు బూతులు రావు వచ్చి ఉంటే నేను తిట్టే తిట్లుకు చచ్చిపోదువు మురికి వెధవ అని తిట్టుకుని పోయింది.
ఇది అంత దూరం నుంచి చూస్తున్న ప్రవీణ్ సతీష్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి నా ఫ్రెండ్, ఇంకోసారి నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగావు అనుకో నీతో తీన్ మార్ డాన్స్ వెయిస్తా. సతీష్ ప్రవీణ్ తో నేను ఎవరో తెలుసా నేను నీకు సీనియర్ ని అని కాలర్ పట్టుకుని మాట్లాడుతూ ఉండగా. అసలు నేను ఎవరినో తెలుసా అని కొడుతూనే ఉన్నాడు సతీష్ ని ప్రవీణ్. వెంటనే సతీష్ నువ్వు ఎవడివిరా చెప్పు అని అంటూ ఉండగా నువ్వు నాకు సీనియర్ వి అయితే నేను నీకు జూనియర్ అవుతాను కదరా జఫ్ఫా అని కొడుతూనే ఉన్నాడు.కాలేజీలో గొడవ పడినందుకు సతీష్ ప్రవీణ్ ని 5 రోజులు సస్పెండ్ చేశారు.
స్వాతి వచ్చి హర్షిణి తో నీ వల్ల ఇద్దరు కొట్టుకున్నారు అంట, ప్రిన్సిపాల్ వాళ్ళని సస్పెండ్ చేసాడు, అందులో ఒకడు సతీష్ ఇంకొకడు ప్రవీణ్ అంటే అని చెప్పగానే. హర్షిణి ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నది స్వాతిని. సతీష్ ని కొట్టిన ప్రవీణ్ ఎక్కడ ఉంటాడే అని అడగగానే నాకు ఏమి తెలుసు నువ్వు బలే అడుగుతున్నావే అని స్వాతి వెళ్ళిపోయింది.
ఒక రెండు రోజులు గడిచాక హర్షిణి వెనకాల ప్రవీణ్ నడుచుకుని వచ్చి ఏంటండి బాగున్నారా అన్నాడు. హర్షిణి వెంటనే ప్రవీణ్ కాలర్ పట్టుకుని నిన్ను ఎవడు కొట్టమన్నాడు సతీష్ ని అని అనగానే. ప్రవీణ్ హర్షిణి తో నేను ఇష్ట పడిన దాని జోలికి ఎవరు పోటీ పడకూడదు అండి అందుకే చితకోట్టేసాను వెధవను అని అనగానే.హర్షిణి ప్రవీణ్ తో నీకు ఏమన్నా పైత్యం చేసిందా చూడగానే నచ్చడం ఏంట్రా వెధవ. పోయి చదువులు చదువుకోండిరా అనగానే.
అందుకే నీకోసం బాగా అన్ని పుస్తకాలు చదివి ప్రేమ పుస్తకం నుండి ఈ ప్రేమలేఖ రాసాను హర్షిణి.హర్షిణి వెంటనే అరేయ్ ప్రవీణ్ గా కొడితే జంతర్ మంతర్ కి పోతావు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నాకు ఈ ప్రేమలు దోమలు తెలియవు పొరా నా దగ్గర నుండి అనగానే.
ప్రవీణ్ హర్షిణి తో నాకు ప్రేమలో ఓనమాలు కూడ తెలియవు హర్షిణి.నిన్ను చూసాక అచ్చులు హల్లులు గుణింతాలు ఒత్తులు అన్ని వచ్చేసాయి హర్షిణి. నేను రాసిన ఈ ప్రేమలేఖలో ఉన్న అక్షరాలను నువ్వు కాదని శిక్షించకు. వర్ణమాల లో ఉన్న వర్ణాలు అన్ని కలగలిపి నాకు వచ్చిన తెలుగులో రాసాను హర్షిణి. ప్రేమిస్తే నీతో కలకాలం ఉంటాను, నువ్వు కాదు అన్న నీ కలలలోనే బ్రతుకుతాను హర్షిణి. ప్రేమలో పడడానికి సెకనులో వందో వంతు చాలు అని నిన్ను చూసాక తెలిసింది హర్షిణి.ఈ పిచ్చి వాడి ప్రేమలేఖ తీసుకో అని హర్షిణి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రవీణ్.
హర్షిణి వెళ్తున్న ప్రవీణ్ తో, అరేయ్ ప్రవీణ్ గా నేను చిన్నప్పుడు తెలుగులో ఏమి చదివానో నాకు తెలియదు కాని, నీ తెలుగు నచ్చింది ముద్దు ముద్దుగా. కానీ ఈ విషయం మా అమ్మకి తెలిసింది అనుకో నన్ను ముద్ద పప్పును పప్పు గుత్తుతో నొక్కినట్టు నొక్కి చంపేస్తాది. నీకోసం చచ్చిపోవదానికి నేను సిద్ధం ప్రవీణ్ అని నవ్వుకుంటు వెళ్ళిపోయింది.
ప్రేమ ప్రయాణంలో కలిసి వెళ్తున్న ఇద్దరు నవ్వులు కేరింతలుతో సరదాగా సాగిస్తున్న సంతోషంలో ఒకరికి ఒకరు శ్వాసగా బ్రతికేస్తున్నారు. ఆ రోజు హొలీ హర్షిణి ప్రవీణ్ రంగులు పూసుకుని వెళ్తున్నారు నడుచుకుంటూ. ప్రవీణ్ హర్షిణి తో నీ వెనకాల పిచ్చుకలు వస్తున్నాయి నీ పిచ్చిక గూడి లాంటి జడ చూసి అందులో తలదాచుకోవడానికి హర్షిణి అని జడ పట్టుకుని లాగగానే హర్షిణి ప్రవీణ్ కాలర్ పట్టుకుని కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉండగా. ప్రవీణ్ వాళ్ళ నాన్న అదే సమయంలో అటు వైపు వచ్చి ఏంటి ఇది ప్రవీణ్ అనగానే.
ఒక్కసారిగా ప్రవీణ్ హర్షిణి షాక్ కి గురి అయ్యారు. ప్రవీణ్ వాళ్ళ నాన్నతో ఇద్దరం ఫ్రెండ్స్ నాన్న కంటిలో రంగు పడితే ఊదుతుంది నాన్న అనగానే.హర్షిణి వెంటనే మేము ఫ్రెండ్స్ కాదు అంకుల్ ఇద్దరం లవర్స్ మి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అని హర్షిణి వెళ్లిపోయింది అక్కడనుండి.ప్రవీణ్ వాళ్ళ నాన్నతో అవును నాన్న నాకు ఇష్టం హర్షిణి అనగానే ముందు ఇంటికి పద అని అన్నాడు.
హర్షిణి కి ప్రవీణ్ కి ఈ గొడవలో మనస్పర్థలు వచ్చాయి, హర్షిణి ప్రవీణ్ తో ఎలాగో కాలేజీ అయిపోయింది ఇద్దరికి.నేను మా ఇంటికి పోతున్న ఇష్టం ఉంటే మా ఇంటికి మీ అమ్మానాన్న లని తీసుకు వచ్చి మాట్లాడు అని వెళ్ళిపోయింది.
హర్షిణి వెళ్ళాక బాధతో ప్రవీణ్ హర్షిణికి ఎన్ని ఫోన్లు మెసేజ్ లు చేసిన సమాధానం రావడం లేదు.దూరం అయ్యావు అని మరిచిపోలేను.దగ్గర లేవు అని బాధపడను,ప్రేమలో ఉన్న బంధాన్ని చూసాను,ఆ క్షణాలతోనే ఈ జీవిత ప్రయాణాన్ని లెక్కిస్తాను హర్షిణి.
నెల రోజులు అయిన కొడుకు మానసిక పరిస్థితి బాలేదు అని తెలిసిన ప్రవీణ్ వాళ్ళ తల్లిదండ్రులు. ప్రవీణ్ వాళ్ళ తల్లిదండ్రులు కలిసి హర్షిణి వాళ్ళ ఊరు బయలు దేరారు.
హర్షిణి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే హర్షి వెడ్స్ సందీప్ అని ఉంది.ఇంట్లోకి వెళ్ళి ప్రవీణ్ హర్షిణి నన్ను వదిలేసి వెళ్లిపోయావ, నేను ఏమి పాపం చేసానే. క్షమిస్తావు అనుకుంటే కనికరం లేకుండా పెళ్లి చేసుకుని వెళ్లిపోయావు అని ఏడుస్తుంటే ప్రవీణ్ ని వాళ్ళ తల్లిదండ్రులు ఓదారుస్తున్నారు.
ఇంతలో లోపల నుండి హర్షిణి వచ్చింది, లోపలకి రండి అని అనగానే నీకు పెళ్లి అయిపోయింది కదే నువ్వే పోవే అని ప్రవీణ్ అనగా. హర్షిణి వచ్చి లాగిపెట్టి ఒకటి పీకి పెళ్లి అయింది మా అక్క హర్షిత కి. మేము ఇద్దరం కవల పిల్లలము, ఒకలాగే ఉంటాము వెధవ, మా అక్క పెళ్లి హడావిడిలో ఉండి నీకు ఫోన్ చేయలేదు.అయిన నిన్ను ఎలా వదులుకుంటారా ప్రవీణ్ నువ్వు నేను ఒకే శ్వాస అయినపుడు, రండి అంకుల్ ఆంటి అని ప్రవీణ్ తో పాటు తీసుకుని వెళ్లి వాళ్ళ పెళ్లి గురించి హర్షిణి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడించడం అయిపోయింది.

No comments:

Post a Comment