జీవితం అంటేనే అలుపు సొలుపు లేని ప్రయాణం అయిపోయింది జీవన్, హాయిగా ఒక
వారం ఎక్కడికి అయిన పోదాం ప్రకృతిని ఆస్వాదించడానికి.ఈ ఉద్యోగాలు ఎలాగూ
మనకి మానసిక ప్రశాంతత ఇవ్వవు అని జీవన్ కి కుమార్ చెప్తున్నాడు. నేను
సిద్ధం కుమార్ జాబ్ లో జాయిన్ అయిన నుండి ప్రశాంతత లేదు పోదాం మనం ఇద్దరం
హాయిగా, ఈ జాబ్ లో ఉన్న టెన్షన్ నా వల్ల కాదు అని జీవన్ అన్నాడు.
అరేయ్ జీవన్ మనం ఇద్దరమే కాదు మా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు కూడ వస్తారు. సరదాగా ఒక వారం వెళ్లి వద్దాము సిమ్లా కి అని కుమార్ అన్నాడు. సిమ్లా అని చిన్నగా అంటున్నావు ఏంట్రా పెద్దగా అరిచి చెప్పు అని జీవన్ అన్నాడు.
ప్రయాణం అంత పెద్దది ఏమి కాదురా జీవన్. నువ్వు నేను మా ఫ్రెండ్ రవి కలిసి వెల్దాము ఇక్కడ నుండి మధ్యలో ఇంకో ఫ్రెండ్ శేఖర్ మధ్యలో కలుస్తాడు.అసలే చలి కాలం అక్కడ విపరీతమైన మంచు కురుస్తాది. ఆ చలికి సరిపడ దుస్తులు స్వేటర్స్ తెచ్చుకోరా జీవన్ అని కుమార్ చెప్తున్నాడు.
ప్రయాణం మొదలు అయింది, జీవన్,కుమార్ మరియు రవి కలిపి ఒక కారులో విజయవాడ నుండి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి బయలు దేరారు.
జీవన్ కార్ నడుపుతూ ఉండగా, కుమార్ శేఖర్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు నువ్వు మేము విజయవాడ నుండి బయలదేరాము అనగా. నేను సూర్యాపేట లో ఉన్నాను కుమార్ మీకోసం ఇక్కడ ఎదురుచూస్తూ ఉన్నాను. తొందరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేసాడు శేఖర్.
దారి పొడవునా వర్షం పడుతుంది, ఇంతలో శేఖర్ నుండి ఫోన్ వచ్చింది కుమార్ కి. నేను ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాను, నన్ను ఎవరో వెంటాడుతున్నారురా కుమార్, నేను హైదరాబాద్ వెళ్తున్న ఔటర్ రింగ్ రోడ్డు కి ఒక కిలోమీటర్ దగ్గర నేను ఉంటాను. ఇక్కడ ఉంటే ఎదో తెలియని భయంగా ఉంది అని శేఖర్ అంటూ ఉండగా. నువ్వు ఏమి బయపడకు శేఖర్ మేము వస్తున్నాం, రవి కార్ వేగం పెంచు, శేఖర్ ఎదో ప్రమాదంలో ఉన్నాడు అని అనగా. అందరి మొహంలో ఒకటే టెన్షన్ వచ్చింది. జీవన్ వెంటనే ఏంట్రా ఇది అసలు శేఖర్ ఎవడు, ఈ గజిబిజి గోల ఏంటిరా అని కుమార్ తో అంటూ ఉండగా, నువ్వు ముసుకో కొద్దిసేపు రవి కార్ వేగంగా పోని అని వెళ్తున్నారు.
ఇంతలో జీవన్ కి ఒక వాట్స్ అప్ మెసేజ్ వచ్చింది. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, వీలు అయితే తప్పించుకో తొందరగా లేదంటే చస్తావు. నీ పక్కన ఉన్న అపాయం నీకు తెలియడం లేదు అని.
వెంటనే జీవన్ ఏమి తెలియనట్టు, తన పోలీస్ డిపార్ట్మెంట్ కు మెసేజ్ పెట్టాడు. నేను ఇప్పుడు సూర్యాపేట దగ్గరలో ఉన్నాను. మీకు ఒక ఫోటో పంపుతున్నాను, వీళ్లకి సంబందించి నాకు సమాచారం కావాలి అని అక్కడ ఉన్న ఎస్సై కి పంపాడు.
జీవన్ ఇక ఆలోచించడం మొదలు పెట్టాడు అసలు ఏమి అయింది అని. జీవన్ ఒక ఐపీస్ ఆఫీసర్, చాలా తెలివైన వాడు. కుమార్ చిన్నప్పటి నుండి స్నేహితుడు, కాని రవి శేఖర్ గురించి మాత్రం తెలియదు జీవన్ కి. పొద్దున్న కూడ శంషాబాద్ విమానాశ్రయంకి ప్రభుత్వం ఇచ్చిన కార్ తీసుకుని రమ్మన్నారు. అంటే ఏదో జరుగుతుంది, ఇందాక ఫోన్ చేసిన వాడు కూడ ఏదో ప్రమాదంలో ఉన్నాడు అని వీళ్ళు కంగారు పడుతున్నారు. ఒక నెల రోజుల క్రితం పురాతన పంచలోహ విగ్రహాలు అపహరణకు గురి అయ్యాయి. ఆ కేస్ ని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దగ్గర నుండి కుమార్ నా పక్కనే ఎక్కువ ఉంటున్నాడు. ఎప్పుడు లేనిది కొత్తగా టూర్ అన్నాడు, అది నాకు ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అదే చెప్పాడు. నేను తప్పక వస్తాను అని, అంటే కుమార్ కి పంచలోహ విగ్రహాలకి ఏదో సంబంధం ఉంది. తెలుసుకోవాలి ఏమి తెలియనట్టు, చట్టం దృష్టిలో తప్పు ఎవరు చేసిన శిక్షార్హులు కాబట్టి.ఎవరిని వదిలేది లేదు అని నిర్ణయించుకున్నాడు.
జీవన్ ఏమి తెలియనట్టు ఎందుకురా అంత టెన్షన్ చెప్పు, ఇప్పుడు ఏమి అయింది అని. శేఖర్ ఎమన్నా పెద్ద దొంగా, టెర్రరిస్టు ఆ ఏంటి ఎవరు అన్న వెనకాల పడడానికి. చెప్పు ఎమన్నా సహాయం కావాలి అంటే కుమార్ అని జీవన్ అని అన్నాడు.
అలా ఏమీ లేదురా జీవన్, కంగారుగా ఫోన్ చేసాడు కదా, ఏమి అయిందో అని అంతేరా అని తడబడుతున్నాడు. ఇంతలో వేగంతో పక్కన నుండి వాహనాలు వెళ్తున్నాయి, అన్ని నలుపు రంగులో ఉన్న వాహనాలు.
వాహనాలలో నుండి కాల్పులు మొదలు అయ్యాయి జీవన్ ఉన్న కార్ వైపు, బుల్లెట్ ప్రూఫ్ కార్ కాబట్టి ఎవరికి ఏమి అవడం లేదు.ఇంతలో జీవన్ కార్ బ్రేక్ వేయి అన్నాడు రవిని, కార్ ఆపేశారు.వచ్చిన నల్ల వాహనాలు వెనక వైపు తిరిగి జీవన్ కార్ వైపు వస్తున్నాయి.
జీవన్ వెంటనే కుమార్ కి రవికి మీరు ఎవరు కార్ దిగకండి, అలాగే ఉండండి అని తన ఫిస్టల్ తీసి కిందకి దిగాడు. నల్ల వాహనాలు దగ్గరకి రాగానే ఆ వాహనాలు చుట్టు పోలీస్ కార్లు చుట్టుముట్టాయి.
రెండు వైపులా నుండి బీభత్సంగా కాల్పులు జరుగుతున్నాయి. అవతల వైపు నల్ల వాహనాలలో టైర్స్ పేల్చి వేశారు పోలీస్ వాళ్ళు. వాళ్ళ అంతు చూస్తున్నారు ఒక్కరిది,ఇంతలో కిరణ్ అనే ఎస్సై వచ్చి సెల్యూట్ చేసి మేము చేసుకుంటాము సర్ ఇక్కడ,మీరు కార్ లోకి వెళ్ళండి అని చెప్పాడు.
జీవన్ కార్లోకి వెళ్ళగానే గన్ తీసి కుమార్ వైపు పెట్టి, అసలు ఏమి అయింది మొత్తం చెప్పు లేదంటే చస్తావు. ఎస్సై కిరణ్ ని పిలిచి రవిని తీసుకుని నీ దగ్గర కస్టడీ లో ఉంచు అని చెప్పాడు.
కుమార్ జీవన్ తో తప్పు అయిపోయిందిరా నా మేన కోడలు, శేఖర్ కూతురిని కిడ్నాప్ చేశారురా.వాళ్ళు చెప్పింది చేయకపోతే ఆ చిన్న పిల్లల్ని చంపేస్తాము అన్నారు.ఏమి చేయాలో తెలియక వాళ్ళ కోసం ఒప్పుకున్నా. ఆ పంచలోహ విగ్రహాలు కేస్ నువ్వు తీసుకున్న దగ్గర నుండి ఆ ముఠా నాయకుడికి భయం పట్టుకుంది. వాటి విలువ కొన్ని వందల కోట్లు, వాటిని విజయవాడ నుండి హైదరాబాద్ తరలించాలి. నువ్వు మామూలుగా రమ్మంటే రావు కదా, అందుకే ట్రిప్కి వెళ్దాం అని చెప్పాను, ఐపీస్ కార్ అయితే ఎవరికి అనుమానం రాదు ఎవరు చెకింగ్ చేయరు కదా అని. శేఖర్ నా ఫ్రెండ్ ఏ విగ్రహానికి ఎంత విలువ ఉంటాదో చెప్పే వ్యక్తి, ఎవరో మా గురించి నీ గురించి బాగా తెలిసిన వాళ్లే ఈ పని చేసారు జీవన్. ఏమి చేయలేని పరిస్థితి మా పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారు అంటే.మరి ఈ రవి ఎవడు, వాడికి ఏమి పని ఇక్కడ అని జీవన్ కుమార్ ని అడగగా. వాడికి ఏమి తెలియదు సరదాగా వచ్చాడు అని చెప్పాడు.
అయితే ఒక పని చేయి,రవి వస్తాడు ముగ్గురం కలిసి వెల్దాము. దారి మధ్యలో శేఖర్ ని ఎక్కించుకుందాం అని రవిని పిలిపించి కార్ హైదరాబాద్ వైపు మల్లించాడు. కార్ వెళ్తూ ఉండగా మధ్యలో శేఖర్ ని కార్ ఎక్కించుకున్నారు. ఎవరు ఏమి తెలియనట్టు ఉండండి అని చెప్పాడు.
కార్ శంషాబాద్ విమానాశ్రయంకి వెళ్లే దగ్గర ఒక దాబా ఉంటాది జీవన్. అక్కడ కార్ ఆపేసి లోపలకి వెళ్లాలి, అప్పుడు కార్ లో ఉన్న విగ్రహాలు వేరే వాళ్ళు తీసుకుని వెళ్లారు కార్ లాక్ తీసి ఉంచాలి. అనుకున్న దాబా రానే వచ్చింది, అందరు లోపలికి వెళ్లారు. బయట కార్ లో ఉన్న పంచలోహ విగ్రహము ఎవరో రెండు కార్లులో వచ్చి తీసుకుని వెళ్లిపోయారు.
ఏమి తెలియనట్టుగా అందరూ అక్కడ దాబా లో తినేసి, విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.కుమార్ కి జీవన్ కి ఒక నెంబర్ నుండి ఫోన్లు వచ్చాయి, మీ పిల్లలను ఇంట్లో దింపేసాము, సిమ్లా ట్రిప్ ఎంజాయ్ చేయండి అని. జీవన్ కుమార్ ఇంటికి ఫోన్ చేస్తే పిల్లలు ఇంటికి వచ్చేసారు అని చెప్పారు.
అందరూ విమానాశ్రయం లోపలకి వెళ్ళాక కుమార్, శేఖర్, రవి మీరు ముగ్గురు సిమ్లా వెళ్ళండి. మీతో పాటు నలుగురు పోలీస్ వాళ్ళు తెలియకుండా ఫాలో అవుతారు మిమ్మల్ని అని వాళ్ళని విమానం ఎక్కించి పంపించేసాడు.
విమానాశ్రయం లోపల ఒక సెక్యురిటి రూంలో ఒక అమ్మాయి వచ్చింది జీవన్ కలవడానికి. సర్ నేను యామిని నేను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లో పని చేస్తున్నాను, మీకు వాట్స్ అప్ లో మెసేజ్ చేసింది నేనే. మిమ్మల్ని ఎటాక్ చేసింది రాణా ముఠా వాళ్ళు, మీ కార్ లో ఉన్న పంచలోహ విగ్రహం కోసం. పంచలోహ విగ్రహాన్ని కొట్టేసింది మాత్రం మంగళూరుకు చెందిన ఖాన్ ముఠా వాళ్ళు సర్ అనగానే.
జీవన్ యామినితో ఓకె యామిని ఇప్పుడు నువ్వు చేయవల్సింది ఒకటి ఉంది, విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ లో వీళ్లకి సహకరించిన మన పోలీస్ వాళ్ళను వెళ్లి కస్టడీలోకి తీసుకో. రాణా ముఠా మొత్తాన్ని అదుపులోకి తీసుకో లొంగకపోతే కాల్చిపడెయి. నేను నా స్పెషల్ టీం మంగళూరు వెళ్తాము.
ఇందాక విగ్రహం ఉన్న బాక్స్ కి జిపిస్ నావిగేషన్ చిప్ పెట్టాను. దానితో పాటు ఒక కార్ ని వెనకాల పెట్టాను. నాకు ఒక బ్లాక్ కమాండో డ్రెస్ తెప్పించండి అని లోపల హెలిప్యాడ్ దగ్గరకు డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాడు జీవన్.
జీవన్ పక్కన నలుగురు యువ ఆఫీసర్స్ ఉన్నారు. నలుగురు సెల్యూట్ చేసి ఈ ఆపరేషన్ లో మీతో పాలు పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళతో ఇలాంటి ఆపేరేషన్ లో పాల్గొనడం మా అదృష్టం అని అందరు హెలికాప్టర్ లో బయలుదేరారు.
జీవన్ జిపిస్ నావిగేషన్ చూస్తూ ఉండగా, పక్కన యువ ఆఫీసర్ ఎందుకు సర్ వాళ్ళకి ఏమి వచ్చింది దేవునితో ఆటలు అంటూ ఉండగా. వెంటనే జీవన్ మైండ్ లో ఆ పంచలోహ విగ్రహం శ్రీ మహావిష్ణువుది, సముద్రానికి 10 కిలోమీటర్లు దగ్గరలోకి వెళ్తే సముద్రం పోటెత్తుతుంది అని చాలా మంది చెప్పారు.కలియుగంలో సముద్రంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం వెళ్ళిపోతాడు అని అక్కడ ఉన్న ధర్మాలు చెప్తున్నాయి. ఇక వెంటనే ఆ విగ్రహాన్ని ఫాలో అవుతున్న కార్ లో వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఫాలో అవుతున్న కార్ ని వెంటనే ఆపేయండి లోకల్ పోలీస్ సపోర్టుతో అంటే.
సర్ మేము ఫాలో అవుతున్న కార్ టైప్ మొత్తం 20 ఉన్నాయి సర్ అనగానే. వెంటనే జిపిస్ చూడగానే అది గోవా అని ఉంది.అంటే వాళ్ళు కూడా హెలికాప్టర్ వాడారు అనుకుంట.
పైలెట్ నువ్వు అర్జెంట్ గా గోవా పోనివ్వు, వచ్చే ప్రళయాన్ని మనం ఆపాలి పద తొందరగా అన్నాడు జీవన్. గోవా పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడ ప్రకృతిలో ఏదో తెలియని అలజడి. జీవన్ తనతో ఉన్న ఆఫీసర్స్ కలిసి ఖాన్ ముఠాని పట్టుకున్నారు. విగ్రహం ఏది అని అడగగానే సముద్రంలో వేరే చోటుకు తరలిస్తున్నాము అనగానే. ఏమి మాట్లాడకుండా జీవన్ అలా చూస్తూ ఉన్నాడు. విగ్రహం ఉన్న నౌక సముద్రానికి 15 నాటికన్ మైళ్ళ దూరంలో సుడిగుండంలో చిక్కుకుని మునిగి పోయింది అని వార్త వచ్చింది. జీవన్ వెంటనే పాపపు ప్రపంచంలో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు ఆ శ్రీ మహావిష్ణువు అని చెప్పి. విగ్రహాన్ని దొంగిలించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేసి, విగ్రహం పూర్తి కథ తెలుసుకోవడానికి తన గమనం నిర్దేశించుకున్నాడు జీవన్...

No comments:
Post a Comment