మనిషికి విలువలు ఇవ్వడం మరిచిన కుటుంబం అది, అహంకారంతోనో లేక డబ్బుతోనే
బ్రతికే కుటుంబం లో పుట్టిన వాడే అరుణ్. కుటుంబం మొత్తం డబ్బు ఉన్న
పొగరుతో ఉండడం వల్ల అరుణ్ కి కూడా చిన్నప్పటి నుండి పొగరుతోనే పెరిగాడు.
అరుణ్ వయస్సు 7 సంవత్సరాలు, ఊటీ లోని మంచి స్కూల్ లో చదువుకునే వాడు. అరుణ్ చిన్నప్పటి నుండి బాగా ఆటలు ఆడేవాడు, అతనకిి ఆటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండేది కాదు.
అరుణ్ ఎప్పుడు ఏదోలా ఉండేవాడు, ఎవరితో మాట్లాడే వాడు కాదు.ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడు, అరుణ్ పరిస్థితి అర్థం కాక స్కూల్ టీచర్లు హాస్టల్ వార్డెన్లు తలలు పట్టుకునేవారు. చిన్న పిల్లవాడు కదా తల్లిదండ్రులు లాలన ఉండవలసిన సమయాన హాస్టల్ లో ఉంచడం వల్ల అలా అయిపోయాడు ఏమో అని స్కూల్ ప్రిన్సిపాల్ అనుకునేవాడు.
అరుణ్ కి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇష్టం ఉండేది కాదు, ఎప్పుడు దూరంగా ఉంటూ పట్టించుకోరు అని.అరుణ్ కి కిరణ్ అనే తమ్ముడు కూడ పుట్టాడు, కిరణ్ ని చూస్తూ ఉంటే అరుణ్ లోకం మర్చిపోయేలా అయిపోయేవాడు. సెలవులు ఉన్నంత సేపు ఇంట్లో తమ్ముడితో ఉండి వాడితో ఆడుకుని హాస్టల్ కి వెళ్లిపోయేవాడు.
అరుణ్ కి 10 సంవత్సరాలు వచ్చాయి, అహంకారం తగ్గింది చదువు మీద ధ్యాస పెరిగింది, పెద్దవాళ్ళ మీద గౌరవం కూడ పెరుగుతూ వచ్చింది. అరుణ్ ఉంటున్న హాస్టల్ లో ఒక రోజు అర్ధరాత్రి 2 గంటలకు విపరీతమైన గాలులతో కూడిన వర్షం, ఉరుములు మెరుపులు శబ్దానికి అందరు ఉలిక్కిపడి లేచారు. అందరూ లేచే సమయానికి గదులు అన్ని చీకటిగా అయిపోయాయి.భయంతో పిల్లలు అందరు ఏడుస్తూ ఉన్నారు ఒక్క అరుణ్ తప్ప.
ఇంతలో ఏమి అయిందో తెలియదు కానీ అరుణ్ గది బయట మొత్తం పిల్లులు అరుస్తూ ఉన్నాయి, అరుణ్ కి అప్పుడే తెలిసింది ఏంటి అంటే చీకటిలో కూడ ప్రతీది చాల చక్కగా కనపడుతుంది. ఎందుకు ఏమి అయిందో తెలియక అలా నెమ్మదిగా నడుచుకుని వార్డెన్ దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ వార్డెన్ కొవ్వొత్తులు గురించి వెతుకుతూ ఉండగా చీకటిలో అరుణ్ వార్డెన్ వైపుగా వెళ్తున్నాడు, అంత చీకట్లో అరుణ్ కళ్ళను చూసిన వార్డెన్ వణిికిపోతున్నాడు, కళ్ళు తప్ప వార్డెన్ కి ఏమి కనపడడం లేదు. అరుణ్ వార్డెన్ దగ్గరకు వెళ్తుంటే వద్దు రావద్దు వెళ్లిపో అంటూ ఉండగా అరుణ్ వెళ్లి అక్కడ కొవ్వొత్తి తీసుకుని వెలిగించి వార్డెన్ ముందు పెట్టాడు.
అరుణ్ కళ్ళ వెలుగును చూసి వార్డెన్ మూర్చబోయాడు, అరుణ్ వెళ్ళి వార్డెన్ మెహం మీద నీళ్లు కొట్టి లేపాడు. వార్డెన్ వణికిపోతు అరుణ్ నువ్వేనా ఏంటి నీ కళ్ళు అలా అయిపోయాయి అనగానే, ఏమో సర్ నాకు ఏమి తెలియడం లేదు టైం చూస్తే అర్ధరాత్రి రెండు అయింది, కరెంట్ పోయింది అయిన చీకటిలో ప్రతిదీ కనపడుతుంది అనగానే వార్డెన్ మళ్ళీ పడిపోయాడు.
ఇంతలో కరెంట్ వచ్చింది, అరుణ్ వచ్చి తన గదిలో పడుకున్నాడు. తెల్లవారుజాము అవగానే అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అరుణ్ దగ్గరకు అరుణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి. అరుణ్ వాళ్ళ తమ్ముడు కిరణ్ కూడ వచ్చాడు, ఇద్దరు ఆడుకున్నారు కొద్దీసేపు.అరుణ్ తన తల్లితో తమ్ముడితో కలిసి స్కూల్ మొత్తం తిరుగుతున్నాడు.
అరుణ్ వాళ్ళ నాన్న వార్డెన్ని కలవడానికి వెళ్ళాడు.అరుణ్ వాళ్ళ నాన్నకి వార్డెన్ భయంతో అరుణ్ కళ్ళ గురించి చెప్పాడు. అరుణ్ వాళ్ళ నాన్న వార్డెన్ తో బయపడకండి మీరు ఏదో చూసుకుని పొరపాటు పడ్డట్టు ఉన్నారు, ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోండి అని అరుణ్ ని కలిసి వెళ్లిపోయారు.
అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన స్వీట్స్ క్లాస్ లో పిల్లలందరికీ అందరికి పంచి బుద్దిగా కూర్చుని పాఠాలు వింటున్నాడు. ఇంతలో స్కూల్ పి.టి వచ్చి గేమ్స్ లో ఉత్సహం ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వండి అని చెప్పగానే, అందరితో పాటు అరుణ్ కూడ పేరు ఇచ్చాడు.అలా ఆటలలో మునిగి తేలుతూ పిల్లలతో అరుణ్ ఆడుకుంటూ పరుగు పందెంలో తనికి గుర్తింపు తెచ్చుకున్నాడు. పరుగు పందెంలో వేగంగా పరిగెత్తి ఎన్నో పతకాలు సాధించాడు. జాతీయ స్థాయిలో కూడ రన్నింగ్ అకాడమీలో కూడ చోటు సంపాదించాడు.
అరుణ్ స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్ కూడ అయిపోయి వాళ్ళ ఇంటికి వచ్చేసాడు,మెడికల్ సీటు కోసం చూస్తూ ఉన్నాడు. అరుణ్ కి స్నేహ మరియు కళ్యాణ్ కొత్తగా పరిచయం అయ్యారు. సంపన్నుల కుటుంబం అయిన సాదాసీదాగా బ్రతకడానికి అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులని కూడ చాలా మార్చాడు.
అరుణ్ ఎంత చేసిన తనకి చీకటిలో కనపడే జబ్బు మాత్రం పోవడం లేదు. పగలు తేడా లేకుండా అంత ఒకలా ఉన్నది అని ఇప్పటి నుండో ఉన్న బాధని తన స్నేహితులకు చెప్పాడు. కళ్యాణ్ అరుణ్ తో ఎవరికి చెప్తున్నావు కహానీలు అరుణ్ చీకటిలో కనపడడం ఏంటి అనగా, ఇంతలో స్నేహ వచ్చి నువ్వు ఆగు కళ్యాణ్ అరుణ్ అబద్దం చెప్పడు అని అరుణ్ ని ఓదార్చుతూ ఏమి కాదు నీకు అని అన్నది.
మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు ముగ్గురు, కాలేజి మొదటి రోజు నుండి అంత గజిబిజిగా ఉంది అరుణ్ కి. ఒక నాలుగు రోజులు అవగానే అందరిని మార్చురీ గదిలోకి తీసుకుని వెళ్ళారు శవాల మీద అధ్యయనం చేయడానికి.
శవాలను చూడగానే స్నేహ కళ్ళు తిరిగి పడిపోయింది, స్నేహతో పాటు చాలా మంది అక్కడ నుండి పారిపోయారు. కళ్యాణ్ మాట్లాడుతూ ఇవి శవాలు కాదురా మనకి ఫ్యూచర్ లో డబ్బులు పెట్టె మార్గాలు రండి వచ్చి తలా ఒక చేయి వేయండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నవ్వుకున్నారు.
అక్కడ ఉన్న ప్రొఫెసర్ స్టూడెంట్స్ కి చెప్తున్నాడు మీ అధ్యయనం వీటి మీద చేయండి, శరీరంలో ఎక్కడ ఎక్కడ పార్ట్స్ ఉన్నాయో పట్టుకుని చూడండి అన్నాడు.
అరుణ్ వెళ్ళి ఒక శవాన్ని పట్టుకున్నాడు, అంతలోనే ఎంత మార్పు అరుణ్ లో ఒక్కసారిగా కళ్ళు ఎరుపెక్కాయి చనిపోయిన శవం ఎలా చనిపోయిందో వివరించి అందరికి చెప్తున్నాడు. ఈ శవం పేరు శ్రీను వీడిని వాళ్ళ భార్య పడుకున్నపుడు ఊపిరి ఆడకుండా దిండు పెట్టి వేరే వ్యక్తితో కలిపి చంపేసింది. శ్రీనుకు న్యాయం జరగాలి అని చూస్తున్నాడు, తప్పు చేసింది ఎవరు అయిన శిక్ష పడాలి అని చెప్తూ ఉండగా కళ్యాణ్ వచ్చి అరుణ్ చేయిని శవం మీద నుండి లాగేసాడు.
ప్రొఫెసర్ తో పాటు అక్కడ ఉన్న మిగతా వాళ్ళు భయపడి పోయారు అరుణ్ అలా చెప్తూ ఉంటే, అరుణ్ కి ఏమి అర్థం కాలేదు అసలు. ప్రొఫెసర్ కి ఆ శవం మీద అనుమానం వచ్చి పోలీస్ వాళ్ళకి అరుణ్ చెప్పిన వివరాలు అన్ని చెప్పాడు. పోలీస్ వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే నిజం అని తేలింది. ప్రొఫెసర్ కి వణుకు మొదలు అయింది, అరుణ్ కి టెన్షన్ మొదలు అయింది.
అరుణ్ కళ్యాణ్ తో నేను స్కూల్ లో ఉన్నపుడు చీకటిలో ఏమి కనపడక పోయిన నన్ను నిద్ర లేపి మరి తీసుకుని వెళ్లి వెతికి పెట్టమనేవారు, నిత్యం నరకం అనుభవించేవాడిని ఇప్పుడు ఏమి అయిద్దో చూడాలి అని అన్నాడు కళ్యాణ్ తో. అరుణ్ చెప్పింది నిజం అయింది పోలీస్ వాళ్ళు అరుణ్ ఎక్కడ ఉన్నా కాలి దొరికితే అనుమానాస్పదంగా ఉన్న శవాల దగ్గరకు తీసుకు వెళ్లి వాటి జాతకం చెప్పమని వచ్చేవారు. అరుణ్ కి చిరాకు వచ్చి వాళ్ళ నాన్నతో వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇప్పించాడు పోలీస్ వాళ్లకి, ఎంత అయిన సంపన్న కుటుంబం కదా.
అరుణ్ స్నేహ ల మధ్య స్నేహం చాలా అందంగా తయారు అయింది. చదువు కూడ సాఫీగా సాగిపోతుంది, ఎంత చదివిన అర్థం కాని జీవితం ఏది అయిన ఉంది అంటే అది మెడికో జీవితం. పుస్తకాలు పుష్కలంగా చదివిన తెల్ల కోటు ఉతికి ఎన్ని సార్లు వేసుకున్న మనం మానసికంగా బలంగా లేకపోతే ఈ చదువు చడవలేము వైద్యం చేయలేము స్నేహ అంటూ ఉండగా. స్నేహ ఇక ఈ ప్రవచనాలు ఆపేసి, నువ్వు రన్నింగ్ లో జాతీయ స్థాయి ఆట గాడివి కదా ఇంతకీ ఎక్కడ దాక వచ్చింది నీ ప్రాక్టీస్ అంటే బానే సాగుతుంది అలా అలా అంటూ ఉండగా ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు.
కాలంలో రెండు సంవత్సరాలు కలిసిపోయాయి, అరుణ్ కళ్యాణ్ స్నేహ అందరూ లాంగ్ రైడ్ కి వెళ్లారు. సమయం రాత్రి 11:45 అయింది, ఒక చోట కళ్యాణ్ కార్ ఆపాడు,అందరూ కార్ దిగారు.
కార్ లోపల నుండి స్నేహ కళ్యాణ్ బయటకి వచ్చి కేక్ తీసుకుని కళ్యాణ్ ముందు పెట్టి కాండెల్స్ వెలిగిస్తూ ఉంది, అమ్మని నా పుట్టిన రోజు నాకే గుర్తు లేదు ఇలా చేస్తారు అనుకోలేదు అని అంటూ ఉండగా 20 సంవత్సరాల బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి కేక్ మొత్తం ముగ్గురు పూసుకున్నారు. దారిలోనే డిన్నర్ చేసేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు.
పుట్టినరోజు అయిన రెండు రోజులకు స్నేహ కి కళ్యాణ్ కి ఒక మాట చెప్పాడు, నేను స్నేహ ని ప్రేమిస్తున్నా కళ్యాణ్ నీకు ఇష్టం అయితే చెప్పు నేను తనని ప్రేమిస్తాను ఎందుకు అంటే ఇన్నాళ్లు ముగ్గురం కలిసి ఉన్నాము ఒకే మాట మీద ఉందాం అని మాట ఇచ్చా కదా మీ అందరికి అనగానే. అరేయ్ శవాల స్పందన పిచోడ మాకు తెలుసు స్నేహ కూడా అదే చెప్పింది,కానీ నువ్వే లేట్ గా చెప్పావు చీకటిలో బూచోడ అని నవ్వుకున్నాడు. అలా స్నేహం ప్రేమలతో అందరూ సంతోషంగా ఉన్నారు.
అరుణ్ చాలా రోజులు తర్వాత రన్నింగ్ ప్రాక్టీసు చేయడానికి వెళ్తున్నాడు ఉదయాన్నే కళ్యాణ్ తో కలిసి. షూ వేసుకుని ట్రాక్ వేసుకుని వ్యాయామం చేస్తూ ఉండగా కళ్యాణ్ నువు కూడ రా రా అంటుంటే అసలే నిద్ర మత్తులో ఉన్నాను, నన్ను చంపకు నువ్వు వెల్లురా నేను ఇక్కడ నుండి చూస్తా అంటూ ఉండగా.
అరుణ్ చాలా రోజులు తర్వాత రన్నింగ్ చేస్తున్నాడు కదా, మెల్లగా నడుస్తూ పరిగెత్తుతున్నాడు, కళ్యాణ్ అలా కళ్ళు తెరిచి అరుణ్ వైపు చూస్తూ ఉండగా అరుణ్ పరుగు వేగం పెరిగే కొద్ది కొంచెం కొంచెం మాయం అవుతున్నాడు, వెంటనే కళ్యాణ్ ఫోన్ తీసి రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అరుణ్ వేగం 5kms/h ఉండగా కాళ్ళు మాయం అవుతున్నాయి, 10kms/h ఉండగా నడుం మాయం అవుతుంది అలాగే 25 kms/h ఉండగా మొత్తం అరుణ్ మాయం అవుతున్నాడు ఇలా రికార్డ్ చేస్తూనే కళ్యాణ్ వణికిపోతున్నాడు.
అరుణ్ కళ్యాణ్ దగ్గరకు రాగానే నీ అమ్మ నీ జీవితం మొత్తం అందరిని బయపెట్టడం ఏంటిరా, నీ పక్కన ఉంటే తడిచి పోయేలా ఉంది. ఇలా పరిగెత్తి ఎంత మందిని గుండె పోటుతో చంపుదాము అనుకుంటున్నావురా అంటూ ఉండగా రికార్డింగ్ వీడియో చూపించాడు.
అరుణ్ కి చిరాకు దొబ్బి కొత్తగా మళ్ళీ ఇది ఒకటా నాకు, ఇక నా జీవితం మొత్తం మిస్టరీనా కళ్యాణ్, పరిగేడితే మాయం అవడం ఏంటిరా నా జీవితం తలకిందుల అయిపోయింది కదరా. కళ్యాణ్ అరుణ్ తో కొత్తగా తమరికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు మాయగాడు అని, ఇక నుండి తమరు అడుగులో అడుగు వేసి నెమ్మదిగా నడవాలి గుర్తు పెట్టుకోండి అరుణ్ బాబు అని ఏడిపిస్తూ ఉన్నాడు.
అరుణ్ ఒకసారి తన తమ్ముడు కిరణ్ కలిసి ఇంట్లో తన తాత గారి గదిలోకి వెళ్లారు. ఆ గదిలోకి పని మనిషి వెళ్లి శుభ్రం చేసి రావడం తప్ప ఎవరు ఉండేవారు కాదు అసలు. గది మెత్తం వెతుకుతున్నారు, ఆ గదిలో మంచం క్రింద ఒక అల్మారా ఉంది అది ఉన్నట్టు ఎవరికి తెలియదు, ఆ అల్మారాని అరుణ్ కలిపెట్టాడు అందులో ఒక అయిదు పేజీల కాగితం ఉంది పక్కన ఒక రాగి చెంబు మొత్తం ఒక గుడ్డతో కట్టేసి ఉంది.ఇంతలో అరుణ్ వాళ్ళ నాన్న గారు వచ్చారు, వెంటనే అవి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు అక్కడ నుండి.
అరుణ్ కి చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో నువ్వు చెన్నైకి 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న మదురై లో ఉన్న మధుర మీనాక్షి గుడికి వెళ్ళు, అక్కడ నువ్వు గుడి బయట నల్లని వస్త్రాలు ధరించి గుడి మెట్ల దగ్గర 3 వ మెట్టు మీద కూర్చో, నీ సమస్యలకు పరిస్కారం వస్తాది అది నీకు 21 సంవత్సరాలు నిండే లోపే చేయాలి. లేదంటే తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని ఒక సాధువు హెచ్చరించి వెళ్లిన మాటలు గుర్తుకు వచ్చాయి.
ఇక వెంటనే మధుర మీనాక్షి గుడికి బయలుదేరాడు,ఇంట్లో ఎవరికీ ఏమి చెప్పకుండా. కళ్యాణ్ ఒక్కడికి కాల్ చేసి నేను పని మీద బయటకి వెళ్తున్న అమ్మ వాళ్ళు అడిగితే ఒక వారం రోజులు విశ్రాంతి కావాలి సరదాగా హాలిడే ట్రిప్ కి వెళ్ళాను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
మదురై చేరాక నల్లని వస్త్రాలు ధరించుకొని గుడి దగ్గర 3 వ మెట్టు మీద కూర్చుని ఉన్నాడు. రెండు రోజులు అలాగే కూర్చుని ఉన్న ఎవరు రాలేదు తన దగ్గరకు అక్కడే అమ్మ వారి ప్రసాదం తింటూ ఎవరు అయిన వస్తారు ఏమో అని చూస్తు ఉన్నాడు. మూడవ రోజు పూర్తి అయింది అప్పుడే తనకి ఆ రోజున చెప్పిన సాధువు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.
అరుణ్ బాబు బాగున్నావ, నీ రాక కోసం చూస్తూ ఉన్నాను. నీ మనసులో ఉన్న భయాలు అన్ని నేను తీరుస్తాను. ఈ నల్లటి బట్టలతో వెళ్లి లోపల ఉన్న కోనేరు లో మూడు సార్లు మునుగు, తడి బట్టలతో వచ్చి దేవతమూర్తి అయిన మీనాక్షి తల్లికి పూజ చేయి అని తనతో అంత నిష్ఠగా పూజలు చేయించి బయటకు రమ్మన్నాడు సాధువు.
అలా చేసి వచ్చిన అరుణ్ ని ఒక చోటుకు తీసుకు వెళ్ళాడు, అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది ఇది మీ తాత గారు కట్టిన ఫ్యాక్టరీ, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏమి చేయడం లేదు అంత ఖాళీగా ఉంది. మీ తాత గారికి అహంకారం ఎక్కువ ఎవరి మాట వినేవారు కాదు, ఈ స్థలంలో పూర్వం ఒక గుడి ఉండేది. దాన్ని పడగొట్టి మీ తాత గారు ఈ ఫ్యాక్టరీ కట్టారు జనాలు వద్దు అని చెప్పిన. ఇక్కడ ఒక కలశం ఉండేది దాన్ని అందరూ పూజిస్తూ ఉండేవారు దానితో పాటు ఒక అయిదు పేజీల పుస్తకం ఉండేది. దాన్ని మీ తాత గారు తీసుకు వెళ్లిన వారం రోజులు తర్వాత చనిపోయారు. అప్పుడు మీ నాన్న గారు చిన్న పిల్లలు. మీ తాత గారికి శాపం ఇచ్చింది మా గురువు గారు, ఆ శాపం ఏంటి అంటే నీ వారసత్వంలో పుట్టిన ఎవరు అయితే నీ పేరు పెట్టుకుంటారో వాళ్లే తిరిగి వచ్చి పున నిర్మాణం చేపడతారు. నీకు మాత్రం మరణం తధ్యం అని చెప్పాడు.
అందుకే నీకు తెలియకుండానే నీకు 10 సంవత్సరాల వయసులో పగలకు రాత్రికి తేడా తెలియకుండా అయిపోయింది,శవాల స్పందన తెలిసింది, నీ నడక వేగంలో మాయం అయింది లోక కళ్యాణము కోసమే అని ఫ్యాక్టరీ లోపలికి తీసుకుని వెళ్ళాడు.
అక్కడ ఒక చోట పసుపు కుంకుమ చల్లి ఒక రాయి ఉంది, అక్కడ ఒక ఎముకల గుడు ఉంది బయట అది మా గురువు గారిది ఒక సారి ఆయన్ని పట్టుకో అనగానే, అరుణ్ వెళ్లి ఆ ఎముకల గుడును పట్టుకున్నాడు.
పట్టుకున్న వెంటనే అరుణ్ వచ్చావ మా కోసం, ఇక్కడ ఉన్న రాయి మీద మీ తాత గారు పట్టుకుని వెళ్లిన కలశం ఇక్కడ పెట్టి ఆ పుస్తకంలో ఉన్నది మొత్తం చదవాలి ప్రదక్షణ చేస్తూ ఎవరికి కనపడకుండా అర్థరాత్రి 1.30 గంటలకు. అందుకే నీకు మూడు శక్తులు ఇచ్చింది, ఇది అంత అయిపోయాక ఇక్కడ ఉన్న పరిసరాలని శుద్ధి చేసి ఆలయ నిర్మాణ పనులు చెప్పట్టి అన్నదానం నిత్యం చేస్తూ ఉండండి, ఇక నన్ను ఊరికి దూరంగా కాల్చి వేయండి అని ఆ ఎముకల గుడు చెప్తూ ఉంటే బాధతో నన్ను ఆశీర్వదించండి తాత గారు అనగానే నేను పోయిన నా రక్షణ ఎప్పుడు నీతోనే ఉంటాది అని ఆ ఎముకల గుడుకు చేయవలసిన కార్యక్రమాలు చేసేసారు.
అరుణ్ తన ఇంటికి వెళ్లి తన తండ్రితో మొత్తం చెప్పి మదురై బయలుదేరాడు, అర్ధరాత్రి ఆ ఫ్యాక్టరీ లోకి అడుగుపెట్టగానే అక్కడ ఎదో తెలియని అలజడి మొదలు అయింది. ఎవరికి కనపడకుండా వేగంగా వెళ్లి కలశం అక్కడ పెట్టాడు, ఎవరికి కనపడకుండా కలశం చుట్టూ వేగంగా తిరుగుతూ చీకటిలో తన కళ్లతో ఆ పుస్తకంలో ఉన్న మొత్తం చదివాడు ఎవరికి కనపడకుండా. మొత్తం చదవడం అయిపోయాక అక్కడ ఉన్న కలశం దగ్గర ఒక తులసి మొక్క వెలిసింది, తులసి దేవత గుడి అని అర్థం అయింది. దేవతకి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని కళ్ళు తెరవగా లాంతరు పట్టుకుని సాధువు వచ్చాడు, నీకు ఉన్న శాపాలు కూడ పోయాయి అరుణ్ అనగానే నవ్వుకుని ఇక అంత మంచే జరుగుతుంది అని ఆ ఆలయ పరిసరాలను శుభ్రం శుద్ధి చేసి వాళ్ళ నాన్న గారితో గుడి కట్టించి నిత్య అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది సాధువు గారి సమక్షంలో.
అరుణ్ కూడ మంచిగా చదివి డాక్టర్ అయి పేదలకు ఉచిత వైద్యం చేస్తూ, తనకి ఇష్టమైన స్నేహాని పెళ్లి చేసుకుని అందరికి ఒక మాట చెప్తున్నాడు "ఇతిహసంలో ఉన్న పురాణాలు గురుంచి తెలుసుకోవాలి తప్ప పురాణాలతో ఆటలు ఆడకూడదని"...

No comments:
Post a Comment