ఒకరోజు అక్బర్ సభలో రకరకాల విషయాలు చర్చకు వచ్చాయి. అంతలో హఠాత్తుగా అక్బర్ " ఎవరైనా నా మీసాలు పీకితే వారిని ఏం చేయ్యాలి? " అని అడిగాడు.
అందరూ ముందు ఆశ్చర్యపోయారు. తరువాత ఒక్కొక్కరూ లేచి, " అలా మీ మీసాలు పీకిన వాణ్ణి కారాగారంలో బంధించాలి ".
"వాణ్ణి దేశబహిష్కరణ చేయాలి ".
"వాణ్ణి ఉరితీయాలి " అని ఎవరికి తోచిన విధంగా వారు చెప్పడం మొదలుపెట్టారు.
అందరూ అయిపోయాక, బీర్బల్ కూడా లేచి " జహా(పనా! మీ మీసాలు పీకిన వాడికి మిఠాయిలు పెట్టాలి ", అన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతటితో బీర్బల్ పని అయిపోయిందనుకున్నారు.చక్రవర్తికి కోపం వచ్చి బీర్బల్‌ని కచ్చితంగా శిక్షిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.
బీర్బల్ జవాబు చక్రవర్తికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. కోపం కూడా వచ్చింది. కాని తమాయించుకుని, " ఎందుకు బీర్బల్? ఎందుకతనికి మిఠాయిలు ఇవ్వాలి? " అని అడిగాడు.
" జహాపనా! మీ సమీపంలోకి రావడమే చాలా సాహసం. అలాంటిది మీ మీసాలు పట్టుకుని వాటిని పీకే ధైర్యం ఎవరికుంటుంది? అలా పీకగలవాడు మీ మనవడు మాత్రమే. అందుకనే అతనికి మిఠాయి తినిపించమన్నాను " అని వివరించాడు బీర్బల్.
బీర్బల్ చతురతకు అక్బర్‌తో పాటు సభికులంతా ఆనందించారు.

No comments:
Post a Comment