Showing posts with label AkbarBirbalKathalu. Show all posts
Showing posts with label AkbarBirbalKathalu. Show all posts

Tuesday, December 31, 2019

బీర్బల్ కాకి లెక్కలు -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 66

ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.

సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగారు.

బీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పరు.

ఆష్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?” అని అడిగారు.

“అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.
“ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్

“అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్.

ఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! మీరేమంటారు?

ఎద్ధుపాలు -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 65

అక్భర్ పాదుషాకి ఒకసారి చిలిపి ఆలోచన వచ్చింది. ఏం చేసినా బీర్బల్ ఏదో ఒక విముక్తి పన్ని తప్పించుంటున్నాడు. కాబట్టి అతనికి కఠినమైన సమస్య ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. నిండు సభలో అక్బర్ బీర్బల్ ఇలా అన్నాడు. బీర్బల్ నాకు ఎద్దుపాలు కావాలి. ఎలాగైనా సరే తీసుకురా .. పిల్లలూ! ఆవులే పాలు ఇస్తాయ్ ఎద్దు అంటే మగది కదా ? మరి అవిపాలు ఇవ్వవు కదా! అందుకే బీర్బల్ ని ఇబ్బంది పెట్టడానికి అక్భర్ ఇలా అడిగాడు.

అక్బర్ అడిగిన దానికి బీర్భల్ ఫ్రభూ ఎద్దుపాలు అంతసులభంగా దొరకవు. కానీ మీరు అడిగారు. కాబట్టి తెస్తాను. నాకుమూడు, నాలుగు రోజుల సమయం ఇప్పించండి అన్నాడు బీర్బల్జ అక్భర్ సరే అన్నాడు. ఆ మర్నాడు తన రాజప్రాసాదానికి దగ్గరలో ఉన్న యమునా నది ఒడ్డున విహరించడానికి అక్బరు వెళ్లాడు. అక్కడ అక్బర్ కి ఒక దృశ్యం కనిపించింది. ఒక స్త్రీ బండెడు బట్టలు నది ఒడ్డున చెమటలు కక్కూతూ ఉతుకుతుంది. చూడడానికి ఆమె చాలా ఉన్నత కుటుంబం నుండి వచ్చిన దానిలా కనిపిస్తుంది.

అందుకని ఆశ్చర్యంగా ఇలా అడిగాడు అక్బర్. అమ్మాయి నువ్వు చూస్తే కలవారి పిల్లల ఉన్నావు. ఇన్ని బట్టలు నువ్వే స్వయంగా ఉతుకుతున్నావేంటి. ? ఒక దాసీదాన్ని పెట్టుకోలేపోయావా? దానికి ఆమె ప్రభూ మీరు ఊహించిన విధంగగా నేను అయినింటి పల్లనే, మా ఇంటి నిండా దాసీలు ఉన్నారు. కానీ మా ఆయన గర్భం దాల్చారు ఈ పనులన్నీ నేను చేయాల్సి వస్తుంది. అని సమాధానం చెప్పింది. మగవారు. ఏంటి, గర్భం ధరించడం ఏంటీ ? అని ఆశ్చర్యంగా అడిగాడు అక్బర్. దీనికింత ఆశ్చర్యం దేనికి ప్రభూ ? రోజులు మారాయి. ఈ రోజుల్లో ఎద్దులు పాలు ఇస్తాయ్. అలాగే మీ మీమగాళ్ళు గర్బం ధరించి పిల్లల్ని కూడా కంటారు. అంది ఆమె .

ఇదంతా తన చిలిపి కోరికకి సరైన సమాధానం ఇవ్వడానికి భీర్భల్ పన్నిన పన్నాగంమని అక్బర్ కి అర్థం అయిపోయింది. మర్నాడు సభలో అక్బర్ బీర్బల్ తెలివితేటలకి అతన్ని సత్కరించాడు. 

ఎవరు గ్రుడ్డివారు ? -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 64

ఒకసారి అక్బర్ దర్భారులో ఉన్నవారికి ఒక వింత ప్రశ్నవేశాడు. మన పట్టణంలో గ్రుడ్డివారు ఎక్కువ మంది ఉన్నారా లేకు మంచివారు ఎక్కువ మంది ఉన్నారా ? అని సభలోని వారంతా మంచివారే ప్రభూ అని సమాదానం ఇచ్చారు. బీర్బల్ మాత్రం మన పట్టణంలో గ్రుడ్డివారే ఎక్కువ మంది ఉన్నారు ప్రభూ. మన పట్టణమే కాదు. ఈ ప్రపంచంలో గ్రుడ్డివారు ఎక్కువ అని సమాదానం ఇచ్చాడు. అలా ఎలా చెప్పగలవు అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బర్. ఇప్పటికి ఇప్డు దీనికి నేను సమాధానం చెప్పలేను గానీ, నాకు ఒక రెండు రోజులు గడువు ఇస్తే మీకు ఋజువుతో గ్రుడ్డివారే ప్రపంచంలో ఎక్కువ అని నిరూపిస్తాను అని వినయంగా పలికాడు బీర్బల్.

 ఆ మర్నాడు బీర్బల్ ఊళ్లో జన సంచారం ఎక్కువగా ఉండే నాలుగు దారుల కూడలి దగ్గర కూర్చున్నాడు. అతని చుట్టూ పాత చెప్పులు ఉన్నాయ్. బీర్బల్ ఒక తెగిన చెప్పును చేతిలోకి తీసుకుని దాన్ని కుడుతూ కూర్చున్నాడు. ఆ దారిన పోయే ప్రతి ఒక్కరూ బీర్బల్ గారూ , అక్కడ కూర్చుని మీరే చేస్తున్నారు ? అని అడుగుతూ ఉన్నారు. అలా అడిగిన ప్రతి ఒక్కరి పేరూ, చిరునామా బీర్బల్ పక్కనే కూర్చుని, ఆయనచే నియిమించబడ్డ ఒక వ్యక్తి రాసుకుంటున్నాడు. సాయంత్రం పూట అక్బర్ వ్యాహ్యాళికి ఆ దారిన వెళ్తూ చెప్పులు కుడ్తున్న బీర్బల్ ని చూశాడు. ఏంటీ బీర్బల్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. అంటే, అక్బర్ పాదుషా పేరు కూడా పక్కన కూర్చున్న వ్యక్తి రాసుకున్నాడు.

ఆ మర్నాడు బీర్బల్ మామూలు ప్రకారం దర్బారుకి వెళ్లాడు. ప్రభూ పట్టణములోని కొంతమంది. గుడ్డివారి జాబితా నేను తయారు చేశాను చూడండి అంటూ తాను చెప్పులు కుడ్తున్నపుడు ఏం చేస్తున్నారు అని అడిగిన వారి పేర్లు జాబితాని అక్బర్ కి ఇచ్చాడు. అక్బర్ అందులోని పేర్లు చూశాడు. చివరగా తన పేరుకూడా అందులో ఉండటం చూశాడు. బీర్బల్ ఏమిటిది ? ఇందులో నా పేరు కూడా ఉందే ? అని కాస్త కోపంగా అడిగాడు. అందుకు నన్ను మీరు మన్నించాలి. నిన్న నేను పట్టణ కూడలిలో కూర్చుని చెప్పులు కుడ్డూవుంటే చూసి కూడా ఏమి చేస్తున్నారు అని అడిగారు. చివరికి మీరు కూడా నన్నీ ప్రశ్న అడిగారు. చివరికి మీరు కూడా నన్నీ ప్రశ్న అడిగారు. కాబట్టి ఆ జాబితాలోని వారందరూ గుడ్డివారే కదా ప్రభూ. నా ఉద్దేశంలో వాళ్ళంతా కళ్ళున్న గ్రుడ్డివారు ! బీర్భల్ ఋజువుతో సహా అంత తెలివిగా సమాదానం చెప్పినందుకు అక్బర్ సంతోషించి సత్కరించాడు. 

అపాయంలో ఉపాయం -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 63

ఒక రోజు అక్బర్, బీర్బల్ వనంలో విహారానికి వెళ్లారు. ఇద్దరూ కాస్సేపు వనంలో నడిచిన తర్వాత అక్బర్ పాదుషాకి ఒక సందేహం వచ్చింది. ‘‘ బీర్బల్ ! హఠాత్తుగా ఏదైనా అపాయం వచ్చిందనుకో, అప్పడు ఏ చెయ్యాలి ?’’ అని అడిగాడు.

‘‘ ఏముంది ప్రభూ! ఆ అపాయాన్న్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ‘‘ అపాయాన్ని తప్పించుకోవడానికి ఉపాయమే కావాలా ? ఆయుదం ఉంటే సరిపోదా?’’ అని అడిగాడు. అక్బర్. ‘‘ కాదు ప్రభూ! ఉపాయం ఆయుధం కంటే గొప్పది’’ అని సమాధానం చెప్పాడు బీర్బల్. బీర్బల్ చెప్పిన దాంతో అక్బర్ అంగీకరించలేదు. ఆయుదం ఉంటే ఎలాంటి అపాయం నుండైనా బయటపడొచ్చు. అని వాదించడం మొదలు పెట్టాడు.

ఇంతల వారిద్దరికీ ఎనుగు ఘీంకారం వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. ఒక మందించిన ఎనుగు వనంలోని మనషుల్ని తొండంతో విసిరేస్తూ, చెట్లని తొక్కుతూ, బీకరంగా ఘీంకారం చేస్తూ వీరివైపు వచ్చింది. అక్బర్ వెంటనే ఒరలో ఉన్న కత్తిని తీసి, దాన్ని పట్టుకుని నిలబడ్డాడు. అయినా ఏనుగుకి అది అని ఏం తెలసు? అది లెక్క చేయకుండా మీది మీదికి వచ్చేస్తుంది. ఆ చిన్న కత్తి, అంతపెద్ద ఏనుగుని ఏం చేయగలదు? దానికి తోడు అది మదించిన ఏనుగు.

జరగబోయే ప్రమాదం పసిగట్టిన అక్బర్, బీర్బల్ వెనక్కి పరుగుతీసి అక్కడ ఉన్న ఒక ఎత్తయిన అరుగని ఎక్కి ఏనుగు బారినుండి బయటపడ్డారు. ‘‘ చూశారా ప్రభూ!మీ దగ్గర కత్తి ఉన్నా మీరేమి చేయలేకపోయారు. పరిగెత్తి ఈ అరుగు ఎక్కడమన్నదే ఉపాయం! అన్నాడు బీర్బల్. ‘‘ నువ్వు చైప్పిందే సరియైనది’’ అంటూ అక్బర్ బీర్బల్ ని మెచ్చుకున్నాడు.

Saturday, December 28, 2019

రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్ -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 62

ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చిక బయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెల కాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు. ‘‘ఏమోయ్! నువ్వు గొర్రెలను సరిగ్గా మేపటం లేదు. ఇలాగయితే నీకు శిక్ష తప్పదు’’ అని గొర్రెలకాపరితో కోపంగా అన్నాడు అక్బరు.

కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూశాడు.బీర్బల్ కల్పించుకుని ‘‘ప్రభూ! మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు. అక్బరు కోపం రెట్టింపయ్యింది. ‘‘నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు, గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపునిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుందో లేదో’’ అన్నాడు.

గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించ ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు. అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసివెళ్లిపోయేవాడు.

బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నియమించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండటమే. కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి ఒంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తరువాత అక్బరు వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు. ‘‘నువ్వు చెప్పింది నిజమే బీర్బల్.

కానీ... నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘ఏమీ లేదు ప్రభూ, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం’’ అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు. అక్బరు మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు.   

నలుగురు మూర్ఖులు -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 61

ఒకసారి అక్బర్ సభలోని వారినుద్దేశించి ఇలా ప్రకటన ఇచ్చాడు. ‘‘ సభికులారా మీలో ఎవరైతే నాకు నలుగురు మూర్ఖులను తెచ్చి చూపిస్తారో వారికి మంచి బహుమానం ఇస్తాను.’’ అక్బర్ చేసిన ఈ ప్రకటన విని సభలోని వారంతా అక్బరు దగ్గరికి మూర్ఖులను తెచ్చి వాళ్లు చేసే తెలివి తక్కువ పనుల గురించి వివరించడం మొదలుపెట్టారు.

కానీ ఎవరూ అక్బర్ ని సంతృప్తి పరచలేకపోయారు. చివరికి బీర్బల్ ఒకనాడు సభలోకి ఇద్దరు మూర్ఖులను తీసుకొచ్చాడు. ‘‘ ఈ ఇద్దరూ ఎవరూ ? ’’ అని అక్బర్ బీర్బల్ ని ప్రశ్నించాడు. ‘‘ వీళ్ళు పరమ మూర్ఖలు ప్రభూ!’’ అని చెప్పాడు బీర్బల్ ‘‘ సరే, అలాగయిత వీళ్లేం తెలివి తక్కువ పనులు చేశారో చెప్పు’’ అని అడిగాడి అక్బర్.

మొదటి మూర్ఖుడిని చూపించి బీర్బల్ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘ ప్రభూ! వీడు ఒక గేదె వీపు మీద ఎక్కి తన నెత్తిన గడ్డిమోపుని మోస్తూ వెళ్తున్నాడు. నీ నెత్తిన గడ్డిని ఎందుకలా పెట్టుకున్నావ్ అని నేను అడిగాను. దానికి వీడు నా గేదె అసలే బక్క చిక్కి చాలా నీర్సంగా ఉంది కాబట్టి అది గడ్డి మోపును మోయలేదని నేనే దాన్ని నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నాను అని అన్నాడు ప్రభూ! అది విని సభలోని వారందరూ పగలబడి నవ్వారు.

 రెండో మూర్ఖుడు చెట్టుమీద తాను కూర్చున్న చెట్టు కొమ్మనే గొడ్డలితో నరుకుతున్నాడు. నువ్వు కూర్చున్న కొమ్మనే నరుకుతున్నావు అలా చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా ? అని నేను అడిగాను ప్రభూ! దానికి వాడు, ఎందుకు తెలీదు, కొమ్మని నరకగానే కొమ్మతో పాటు నేను కూడా కిందకి వచ్చేస్తాను కదా! చక్కగా నేను చెట్టు దిగే అవసరం లేదు అని చెప్పాడు.’’ సభలోని వారంతా మళ్లీ గట్టిగా నవ్వారు. ‘‘

నువ్వు చెప్పినట్టుగా నిజంగానే వీళ్ళిద్దరూ పరమ మూర్కులే. కానీ నేను తీసుకురమ్మన్నది నలుగురు మూర్ఖుల్ని కదా! అన్నాడు అక్బర్. ‘‘ మరో ఇద్దరు మూర్ఖులు ఇక్కడే ఉన్నారు ప్రభూ! అని సమాధానం చెప్పాడు బీర్బల్. ‘‘ ఇక్కడే ఉన్నారా? ఎవరు వాళ్ళు?’’ అంటూ ఆశ్ఛర్యంగా అడిగాడు అక్బర్.

 ‘‘ ఎంతో విలువైన నా సమయాన్ని ఎలాంటి పనికిరాని పనికి ఉపయోగించిన నేను ఒక మూర్ఖుడిని ప్రభూ, ఇలాంటి పనికి నన్ను ఉపయోగించిన మీరూ...’’ అంటూ ఆగాడు. అది అక్బర్ పాదుషాకి కోపం తెప్పించే సమాధానం అయినా బీర్బల్ మాటల్లో నిజాన్ని గ్రహించడం వల్ల అక్బర్ తన కోపాన్ని దిగమింగి, ఇచ్చిన మాట ప్రకారం బీర్బల్ కి బహుమాన ఇచ్చాడు.  

మీసాలు లాగేవాడు -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 60

ఒకరోజు దర్బారులో అందరూ కూర్చుని ఉన్నారు. అందరూ అక్బర్ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో అక్బర్ రానే వచ్చాడు. రాగానే తన సింహసనంలో కూర్చుంటూ సభలోని వారిని ఇలా అడిగాడు. ‘నిన్న ఒకరు నా మీసాలు లాగి, గడ్డం పట్టుకుని పీకాడు. వాడిని ఏం చేయాలి ? అది వినగానే సభలోని వారంతా ‘‘ హవ్వా హవ్వా! ఎంత అపచారం? అన్నారు.

‘‘ వాడిని దేశం నుండి బహిష్కరించండి’’ అని ఒకడు అన్నాడు. ‘‘ వాడిని జీవితాంతం ఖైదులో ఉంచండి.’’ అని మరొకరు అన్నాడు ఇలా ఆవేశంగా తలోక శిక్ష వెయ్యమని అందరూ అరవసాగారు. బీర్బల్ మాత్రం లేచి నలబడి ‘‘ ప్రభూ! మీతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు తినిపించండి. వాడికి మీ ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వండి’’ అన్నాడు వినయంగా.

‘‘ బీర్బల్ గారూ! ప్రభువుతో అలా ప్రవర్తించిన వాడికి మిఠాయిలు పంచి ఆస్తి రాసివ్వాలా, మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా?’’ అని సభలోని కొందరు బీర్బల్ మాటలకి అభ్యంతరాన్ని తెలియజేశారు. అప్పడు బీర్బల్ చిరునవ్వుతో పాదుషా వారితో అలా ప్రవర్తించే చనువు కేవలం మనవడికి లేదా మనవారిలికి మాత్రమే ఉంటుంది. అందుకే అలా అన్నాను’’ అన్నాడు.

‘నిజమే! నన్ను నా మీసాలు లాగి నా గడ్డాన్ని పీకింది నా మనవడే!’’ అని నవ్వుతూ పలికాడు అక్బర్. బీర్బల్ తెలివితేటల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు అక్బర్. 

మంత్రి పదవి కోరిన దిలవార్ -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 59

అక్బర్ బావమరిది ఉన్నాడు. అతని పేరు దిలావర్! దిలావర్ చాలా కాలంగా ఒక కోరిక ఉంది. అదేమటంటే తనకి మంత్రి పదవి దక్కడం. అందుచేత బీర్బల్ ని మంత్రి పదవి నుండి తప్పించి తనకి ఆ పదవిని ఇవ్వమని బావగారైన అక్బరైని చాలాసార్లు కోరాడు. కానీ ఎంతో తెలివి తేటలు ఉన్న బీర్బల్ ని మంత్రి పదవినుండి తొలగించి అసమర్థుడైన దిలావర్ కి ఆ పదవిని ఎలా ఇస్తాడు ? అందుకే అక్బర్ దిలావర్ కోరికని పట్టించుకోకుండా ఊరుకున్నాడు.

 కానీ దిలావర్ పదే పదే మంత్రి పదవవి గురించి విసిగిస్తూ ఉంటే అక్బర్ చివరికి అతన్ని ఇలా అడిగాడు. ‘‘ చూడు దిలావర్. మంత్రి కావాలనుకున్న వాడికి ఎంతో పదునైన ఆలోచనా శక్తి, హాస్య చతురత, సమయస్ఫూర్తి ఇవన్నీ ఉండాలి! మరి అవన్నీ నీకు ఉన్నాయా ? ‘‘ ఓ! ఉన్నాయ్’’ అన్నాడు దిలావర్. ‘‘ ఉన్నాయంటే సరిపోదు. రేపు సభలో నిన్ను ఒక ప్రశ్న అడుగుతా. దానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే నీకు మంత్రి పదవి ఇస్తాను!’’ అన్నాడు.

 అక్బర్ దిలావర్ సరేనన్నాడు. మర్నాడు సభలో ‘‘ దిలావర్! ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఈ సమయంలో వారివారి మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పు!’’ దానికి దిలావర్ ‘‘ ఎంటీ ? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా ? నేనే కాదు. దీనికి ఈ దేవుడే తప్ప ఇంకెవ్వరూ సమాధానం చెప్పలేరు.!’’ అన్నాడు. అక్బర్ చిరునవ్వు నవ్వి బీర్బల్ వైపు తిరిగి ‘‘ బీర్బల్ పోనీ నువ్వు చెప్తావా?’’ అని అడిగాడు.

‘ ఓ, ఇంత అతి మామూలు ప్రశ్నకి నేనెందుకు సమాధానం చెప్పలేను ప్రభూ! అన్నాడు బీర్బల్. అది వినగానే దిలావర్ కి చాలా కోపం వచ్చింది. ‘‘ ఏంటీ? ’’ అక్బర్ పాదుషా అడిగింది అతి మామూలు ప్రశ్న ? అంటే పాదుషా వారి తెలివి తేటల్ని తమరు తక్కువగా అంచనా వేస్తున్నారా? అయితే మరి ఇక్కడివారు ప్రస్తుతం అక్బర్ పాదుషా గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి మరి! అన్నాడు రోషంగా.

‘‘ చెప్పు బీర్బల్!’’ అన్నాడు అక్బర్. ‘‘ ప్రభూ! ఇక్కడ ఉన్నవారంతా మీ పరిపాలనతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉన్నారని అనుకుంటున్నారు. అంతేకాదు పాదుషా వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని ఆ అల్లాని వేడుకుంటున్నారు’’ అని సమాధానం ఇచ్చాడు. అక్బర్ ‘‘ చిరునవ్వుతో సభలోని వారందర్నీ చూశాడు. వారంతా ‘‘అవును, మే అలానే అనుకుంటున్నాం’’ అని ముక్త కంఠంతో అన్నారు.

 అక్బర్ చూశావా బీర్బల్ గొప్పదనం అని అర్థం వచ్చేలా దిలావర్ ని చూశాడు. దిలావర్ సిగ్గుతో తల దించుకున్నాడు. అక్బర్ బీర్బల్ ను ఘనంగా సత్కరించాడు.  

ఉత్తమమైన ఆయుధం ఏది? -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 58

అక్బర్‌ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్థుడై, "అహా! భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా!'' అన్నాడు. "అవును, ప్రభూ! మీరన్నది అక్షర సత్యం,'' అన్నారు వెనక నడుస్తూన్న ప్రముఖులు, ఒక్క బీర్బల్‌ తప్ప. అక్బర్‌ బీర్బల్‌ కేసి తిరిగి చూశాడు. అతడు దేన్నో అదేపనిగా వెతుకుతూ కనిపించాడు. "బీర్బల్‌, భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదేనని నేను అన్నాను. దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి,'' అన్నాడు అక్బర్‌. "ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది. అందులో సందేహం లేదు. అయినా,'' అంటూ ఆగాడు బీర్బల్‌. "అంటే నువు్వ నా అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్న మాట! అయినా, ఏమిటి అయినా...'' అన్నాడు అక్బర్‌ తీవ్రస్వరంతో.

"అందం ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా,'' అన్నాడు బీర్బల్‌. ``ప్రమాదమా! గూలాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌."ముళ్ళు, గులాబీ పూలకు సహజ కవచాలు. నేను వాటిని గురించి చెప్పడం లేదు,'' అన్నాడు బీర్బల్‌. "మరి గడ్డిలో దాగి వుండే పాముల గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. "మనుషుల అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి. ప్రాణ రక్షణకు మాత్రమే కాటేస్తాయి,'' అన్నాడు బీర్బల్‌. "మరి ప్రమాదం దేనివల్లో కాస్త స్పష్టంగా చెప్పు,'' అన్నాడు అక్బర్‌. ``శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయడానికి కాచుకుని ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానో, అసూయ వల్లనో ఎలాగైనా పడ గొట్టాలని చూస్తూంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండడం చాలా అవసరం,'' అన్నాడు బీర్బల్‌. ఆ మాటతో అక్బర్‌ ఆలోచనలో పడ్డాడు

మౌనంగా వెనుదిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బర్‌, "హఠాత్తుగా ఆపద ముంచుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది?'' అని సభాసదులనుద్దేశించి అడిగాడు. "పదునైన ఖడ్గం,'' అన్నాడు ఒక సభికుడు. "కత్తి పట్టిన వాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది,'' అన్నాడు బీర్బల్‌. "దూరం నుంచే శత్రువు మీదికి ప్రయోగించవచ్చుగనక, ఈటె ఉత్తమమైన ఆయుధం,'' అన్నాడు ఇంకొక ముఖ్యుడు. "ఈటె తన మీదికి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా?'' అన్నాడు బీర్బల్‌. "ఫిరంగి!'' అన్నాడు మరొక సభికుడు. "దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగిని వెతుక్కోవడం సులభం కాదు కదా?'' అన్నాడు బీర్బల్‌. "ఖడ్గమూ కాదు. ఈటే కాదు. ఫిరంగీ కాదు. మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏది బీర్బల్‌?'' అని అడిగాడు అక్బర్‌. "పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం!'' అన్నాడు బీర్బల్‌. "ఫలానా ఆయుధం అని చెప్పలేవు, అంతే కదా?'' అన్నాడు బీర్బల్‌ కాస్త కటువుగా.

"సమయస్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనాసరే ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది, ప్రభూ,'' అన్నాడు బీర్బల్‌ నెమ్మదిగా. "అసంబద్ధం!'' అన్నాడు అక్బర్‌ ఆగ్రహంతో. సభికులు లోలోపల నవు్వకున్నారు. "సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభూ!'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. మరునాడు ఉదయం అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వాహ్యాళికి బయలుదేరాడు. వాళ్లు నదీ తీరాన్ని సమీపిస్తూండగా హాహాకారాలు చేస్తూ, కొందరు అటుకేసి రావడం కనిపించింది. వాళ్లు చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఒకణ్ణి ఆపి కారణం అడిగితే, "రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకుని నానా బీభత్సం సృష్టిస్తున్నది. అది ఇటువైవే వస్తున్నది. పారిపొండి. పారిపొండి!'' అంటూ వాడు వెళ్ళిపోయాడు.

వాడు అటు వెళ్ళగానే ఏనుగు గంటలనాదం, ఘీంకారం వినిపించాయి. అక్బర్‌ చేయి, మొలలో వేలాడుతూన్న కత్తి పిడి మీదికి వెళ్ళింది. తక్కినవారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు. అయినా, మదపుటేనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు. అక్కడి నుంచి పారిపోవడం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్‌ కేసి చూశారు. అయితే, బీర్బల్‌ ఏనుగు వస్తూన్న దిక్కు కేసి కూడా చూడడం లేదు. అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకుని పడుకుని వున్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్‌ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి పిల్లి ప్రయత్నించింది.

అయినా, అంతలో ఏనుగు సమీపించడంతో, పిల్లిని ఏనుగు వీపుమీద పడేలా గురి చూసి విసిరాడు. పిల్లి తల్లకిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగు వీపుపై నాలుగు కాళ్ళ మీద దభీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్ళతో గిచ్చసాగింది. ఏనుగు అక్కడే నిలబడి, కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే కిందికి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంట బడి తరుముకుంటూ పరిగెత్తింది. అయినా పిల్లి దానికి చిక్కకుండా, దాపులనున్న పొదలలోకి వెళ్ళిపోయింది. గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. "బీర్బల్‌, నీ సమయస్ఫూర్తికి జోహార్లు! మదపుటేనుగును తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం! ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను,'' అన్నాడు అక్బర్‌ చక్రవర్తి మందహాసంతో. 

ఎవరు తిండిపోతు ? -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 57

ఒక సారి బీర్బల్ బజారు వెంటవెళ్తూ ఉంటే దారిలో రేగుపళ్లు అమ్మేవాడు కనిపించాడు. నిగనిగలాడుతున్న ఆ రేగుపళ్లని చూడగే బీర్బల్ కి తినాలనిపించింది. తీరా ఆ రుగుపళ్లని కొన్నాక అంతటి మంచి రేగుపళ్లని అక్బర్ పాదుషాకి కూడా తినిపించాలని అనిపించింది. వెంటనే రేగుపళ్లు తీసుకుని వెళ్లాడు.

 ఏంటీ బీర్బల్, హఠాత్తుగా ఇలా వచ్చావ్ ? అని అడిగాడు అక్బర్. మీరు తింటారని మంచి రేగుపళ్లు తెచ్చాను ప్రభూ అని అన్నాడు బీర్బల్. ఓ రేగుపళ్లా ? మా రాణిగారికి రేగుపళ్లంటే చాలా ఇష్టం. మన ముగ్గురం రేగుపళ్లు తిందా?! అని రాణి గార్ని కూడా అక్బర్ అక్కడికి పిలిపించాడు. ఒక పెద్ద పళ్ళెంలో రేగుపళ్లు పోసి ముగ్గురూ దాని చుట్టూ కూర్చుని రేగుపళ్లు తినడం మొదలుపెట్టారు. రేగుపళ్లు చాలా రుచిగా ఉన్నాయ్. ముగ్గురికీ అవి ఎంతోగానో నచ్చాయ్.

 అక్బర్ పాదుషాకైతే మరిమరీ నచ్చాయ్. అవి తింటున్నపుడు అక్బర్ కి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. రాణిగారిని ఒక తిండిపోతుగా చిత్రించి సర్దాగా ఆట పట్టిద్దాం అని అనుకున్నాడు. అందుచేత తాను తిన్న రేగుపళ్లు గింజలను రాణిగారివైపు ఆమె గమనించకుండా మెల్లగా చెయ్యసాగాడు. కానీ అక్బర్ చేస్తున్న పనిని గమనిస్తూనే ఉన్నాడు. అక్బర్ మనసులో ఏముందో గ్రహించిన బీర్బల్ నవ్వుకున్నాడు. ముగ్గురు రేగుపళ్లు తినేశారు. అక్బర్ పక్కన కేవలం అయిదారు రేగు గింజలు మాత్రం ఉన్నాయ్.

బీర్బల్ పక్కన కొన్ని గింజలు ఉన్నాయ్. కానీ రాణిగారి పక్కన బోలెడన్ని గింజలు ఉన్నాయ్ అవును మరి, వాటిలో సగానికి పైగా అక్బర్ పాదుషా తిన్న రేగుపళ్లగింజలే. రాణి వైపు ఉన్న గింజల్ని చూపిస్తూ.. చూశావా బీర్బల్! మీ మహారాణి ఎంత తిండిపోతో? ఆ గింజల్ని చూస్తేనే తెలుస్తుంది ఆమె ఎన్ని రేగుపళ్లు తినిందో ? అన్నాడు అక్బర్ నవ్వుతూ.

 అందుకు బీర్బల్ ‘‘ కాని రాణివారికంటే ప్రభువులే ఎక్కువ తిండిపోతని నా అభిప్రాయం ఎందుకంటే రాణివారు పళ్లతిని, గింజల్ని వదిలేశారు. తమరు ఆ గింజల్ని కూడా వదలకుండా తినేశారు’. అన్నాడు బీర్బల్ కొంటెగా. బీర్బల్ తన పక్షాన మాట్లాడినందుకు మహారాణి ఎంతో సంతోషించింది. అక్బర్ మాత్రం ‘‘ అబ్బో, ఈ బీర్బల్ ఉండగా తన ఆటలు సాగవు’’ అనుకుంటూ సిగ్గుతో తలవంచుకున్నాడు. 

బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్ -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 56

ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువు దీర్చి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూసాడు. అక్బర్ పాదుషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో ఖంగుమని వినిపించింది.

 "సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను రెండు మూడు పదాల్లో ఎవరైనా చెప్పగలరా?" సభలోని వారెవ్వరూ పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమి సమాధానం చెప్తే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరేత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంత సేపు గడిచిన పిదప అక్బర్, బీర్బల్ వైపు చూశాడు. అదేసమయానికి పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనల్లో వెదుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ కనిపించాడు.

అక్బర్ : బీర్బల్ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు
బీర్బల్ : చిత్తం ప్రభూ! సత్యం-అసత్యాల మధ్య చేతికున్న నాలుగు వేళ్లే అంతరం జహపనా! అక్బర్‌తో పాటు సభలోనివారందరికీ బీర్బల్ సమాధానం వెనుక అంతరార్ధం బోధపడలేదు.
అక్బర్ : బీర్బల్ నీ సమాధానాన్ని మరింతగా వివరిస్తావా?
బీర్బల్ : తప్పకుండా ప్రభూ! మహారాజా కంటికి, చెవికి మధ్య దూరం నాలుగు వేళ్లేనన్నది అందరికి తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది.

బీర్బల్ వివరణకు అక్బర్‌తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్, అతనిని వేయి బంగారు నాణేలతో సత్కరించాడు. 

Wednesday, October 23, 2019

బీర్బల్ తెలివి -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 55

ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చికబయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెలకాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు.

‘‘ఏమోయ్! నువ్వు గొర్రెలను సరిగ్గా మేపటం లేదు. ఇలాగయితే నీకు శిక్ష తప్పదు’’ అని గొర్రెలకాపరితో కోపంగా అన్నాడు అక్బరు.

కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూశాడు.
బీర్బల్ కల్పించుకుని ‘‘ప్రభూ! మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు.

అక్బరు కోపం రెట్టింపయ్యింది. ‘‘నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు, గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపునిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుందో లేదో’’ అన్నాడు.

గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు.

అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసివెళ్లిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నియమించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండటమే.

కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి ఒంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తరువాత అక్బరు వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు.
‘‘నువ్వు చెప్పింది నిజమే బీర్బల్. కానీ... నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?’’ అని అడిగాడు.

‘‘ఏమీ లేదు ప్రభూ, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం’’ అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు.

అక్బరు మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు.

Sunday, October 20, 2019

విశ్వాసం -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 54

ఒకరోజు అక్బర్‌ చక్రవర్తికి ఒక సందేహం వచ్చింది. " ప్రపంచంలో అతి విశ్వాసపాత్రమైన జంతువు, అసలైన విశ్వాసఘాతుకమైన జంతువు ఏమిటి?" అనేదే ఆయన సందేహం. అదేమాట బీర్బల్‌కు చెప్పి తన సందేహం తీర్చుకోవాలనుకున్నాడు అక్బర్‌. "ప్రభూ! నేను రెండు రోజుల్లో మీ దగ్గర ఆ రెండు జంతువులను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పాడు బీర్బల్.

రెండు రోజుల తర్వాత, బీర్బల్‌ అక్బర్‌ చక్రవర్తికి దర్బార్‌లోకి ఒక కుక్కను, తన సొంత అల్లుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. బీర్బల్‌ అక్బర్‌కు వివరిస్తూ "ప్రభూ! మీరు కోరినట్లుగానే మీ ముందు ఆ రెండు జంతువులలో ప్రపంచంలో అత్యంత విశ్వాసమైన జంతువు కుక్క. అది మనం ఏది పడేసిన తిని బతికేస్తుంది. కుక్కను తన యజమాని ఎంతగా కొట్టినా అతని ఇంటిని మాత్రం విడిచివెళ్లదు. అది జీవితాంతం యజమానికి విశ్వాసపాత్రమైనదిగా బతుకుతుంది" అని చెప్పాడు.

ఆ తరువాత ఎవరి గురించి చెబుతాడా అని కుతూహలంగా ఎదురు చూస్తుండగా, బీర్బల్‌ "మహరాజా! దీనికి పూర్తి వ్యతిరేకంగా, అల్లుడు అత్యంత విశ్వాస ఘాతకుడు. చేయించుకున్న సహాయాన్ని తెలివిగా, తక్కువ సమయంలో మరిచిపోతాడు. తన మామ ప్రపంచంలోని సంపదనంతా చేతిలో పెట్టినా అతనికి సరిపోదు. మామకు సంబంధించిన సంపద అంతా తనదేననట్లు భావిస్తుంటాడు అల్లుడు" అన్నాడు.

బీర్బల్‌ వివరణ ఆలకించిన అక్బర్‌ చక్రవర్తి అతడి చాతుర్యానికి, లోకజ్ణానానికి, తెలివితేటలను మెచ్చుకుంటూ, "నిజమే బీర్బల్! నువ్వు చెప్పింది అక్షరాలా సత్యం. మనమంతా ఎవరో ఒకరికి అల్లుళ్లమే కాని మన మామలు చేసిన సహాయం, త్యాగం, మరేదైనా కాని, దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఈ ఒక్క నిరూపణ చాలు ఒక అల్లుడే ప్రపంచంలో అతి పెద్ద విశ్వాసఘాతకుడు, కృతజ్ణత లేనివాడు అని చెప్పడానికి" అన్నాడు అక్బర్‌.

Wednesday, October 16, 2019

రూపాయల పళ్ళెం -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 53

ఒకరోజు దర్బారులొ అతిముఖ్యమైన పనులు ఏమీ లేకపొవడంతో అక్బర్ చక్రవర్తి చాలా కులాసాగా ఉన్నాడు. ఎవరూ చడీచప్పుడూ చేయకుండా అక్బరు ఏదైన మాట్లాడితే జవాబు ఇవ్వాలనుకుని ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. అక్బరుకు ఆరోజు, సభ చాలా చప్పగా జీవం లేనట్లు అనిపించింది. అందుకే ఆయన కొంచెం సేపు ఆలోచించి, భటుల చేత ఒక తివాచీ, ఒక రూపాయల పళ్ళెం తెప్పించాడు. ఒక ప్రక్క రూపాయల పళ్ళెం ఉంచి దాని ముందు తివాచీ పరచమని ఆజ్ఞాపించాడు. తరువాత అందరినీ కలియజూస్తూ ఈ రూపాయల పళ్ళెం మీ కోసమే తెప్పించాను. ఐతే ఎవరు తెలివిగా, యుక్తిగా ఆలోచించగలరో వారికి ఈ పళ్ళెం బహుమానంగా దొరుకుతుంది. ఈ తివాచీని తొక్కకుండ, అటు ప్రక్కలకి వెల్లకుండా ఆ పళ్ళెంని తెచ్చుకొండి. మీరు వెళ్ళాల్సిన దారి తివాచీ పరచిన వైపే" అని చెప్పాడు.

'ఎటూ వెళ్ళకూడదట. తివాచీని తొక్కకుండా దాటాలిట. ఇది సాధ్యం అయ్యే పనేనా?' అన్న సందేహంతో ఎవరూ ముందుకు రాలేదు.

"ఏం బీర్బల్ నీకు కూడా ఈ పని సాధ్యం కాదా?" నవ్వుతూ ప్రశ్నించాడు అక్బరు.

"ఎందుకు కాదు ప్రభూ! ఇక్కడున్న వారికి అవకాశం ఇవ్వాలని ఆగాను. వెంటనే ఆ పని చేస్తే ఎవరికో వచ్చే బహుమతి నేను కొట్టేసినట్టవుతుంది. ఇప్పుడు మీరు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి తెచ్చుకుంటాను" అని అన్నాడు వినయంగా బీర్బలు.

"ఆలస్యం ఎందుకు? వెళ్ళితీసుకో"అనుమతి ఇచ్చాడు అక్బర్. బీర్బల్ వెంటనే తీవాచీని చుట్టుకుంటూ వెళ్ళి, రుపాయలపళ్ళెం తీసుకున్నాడు.తిరిగి తివాచీని పరుచుకుంటూ వెనక్కివచ్చాడు.బీర్బల్ యుక్తిని అక్బరు చక్రవర్తే కాదు,ఆయనంటే ఆసూయపడే రాజోద్యోగులు కూడ మెచ్చుకున్నారు.

Friday, October 4, 2019

మాట్లాడే గాడిద -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 52

ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమే గాక గాడిదతో పుస్తకం కూడ చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కధనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం.

సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు.

అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ "మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. "అన్నాడు.

అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. "అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!" అని అడిగాడు మహారాజు

"అవును మహారాజా" అన్నాడు బీర్బల్

"మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!" అని అడిగాడు అక్బర్.

మళ్ళీ 'అవునని' చెప్పాడు బీర్బల్

వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.

బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? " అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.

బీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. "అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను" అన్నాడు బీర్బల్.

రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు.

రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు.

"ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?"

ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?"

"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?"

"బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు.."

"ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు" అని మరొక వర్గం వారు.

ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.

ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు.

"బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?" కుతూహలంగా అడిగాడు అక్బర్.

"చిత్తం మహారాజా" అన్నాడు బీర్బల్.

బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు.

"గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!"

"ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు" "బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు."

ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు.

"బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది.

ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.

"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు.

బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు.

"అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?" అని అడిగాడు మహారాజు

"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!" అన్నాడు బీర్బల్.

అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. "సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?" అని అడిగాడు అక్బర్.

అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు "మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు." అన్నాడు బీర్బల్.

అక్బర్ అందుకు అంగీకరించాడు.

"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.

అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు.

ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు.

బహుమానం -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 51

బీర్బల్‌ శాకాహారి. మద్యమూ, మాంసమూ ముట్టుకోడు. ఒకరోజు అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌కు ఒక కోడిని బహుమతినివ్వాలన్న కోరిక కలిగింది. ఆ రోజు దర్బార్‌లో అందరి ముందు " బీర్బల్‌ నీకు ఒక బహుమతి ఇస్తాను. అది తినదగినదే. మరి నీవు తింటావా? " అని అడిగాడు.

'చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి వుంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు ' అని ఒక్కక్షణం ఆలోచించి బీర్బల్‌ " ప్రభువుల వారు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం " అన్నాడు. " తీసుకోవడం కాదయ్యా. తింటావా, లేదా? బాగా ఆలోచించి చెప్పు. తరువాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా! " అన్నాడు అక్బర్‌.

"అన్నమాట మీదే నిలబడతాను ప్రభూ! మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను " బదులిచ్చాడు బీర్బల్‌. అక్బర్‌ వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. " ఈ కోడిని నువ్వు తింటావా? "బీర్బల్‌ని అడిగాడు అక్బర్‌. తప్పకుండా ప్రభూ! మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని " అన్నాడు బీర్బల్‌. అక్బర్‌తో పాటు సభలో వున్న వారంతా ఆశ్చర్యపోయారు. " నువ్వు శాకాహారివి కదా!కోడినెలా తింటావు? " అన్నాడు అక్బర్‌.

"అవును ప్రభూ నేను శాకాహారినే. నేను కోడిని కోసుకుని తినను, అమ్ముకుని తింటాను. ముందే చెప్పాను కదు ప్రభూ ఎలాగైనా తింటానని " ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్‌.ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు. 

ప్రియమైన వస్తువు -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 50

ఒకరోజు అక్బరు చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన రాణిని అంత:పురం విడిచి పుట్టింటికి వెళ్ళిపొమ్మని, ఇంకెప్పూడూ తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. రాణి అక్బరు కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధేయపడింది. కాని, ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు. ఏం చేయాలో పాలుపోక రాణి బీర్బలు కు కబురు పంపింది. బీర్బల్‌ వచ్చాక జరిగినదంతా చెప్పి ఆ సంకటంలోంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది. బీర్బల్‌ ఆమెను ఓదార్చి, కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విన్న రాణి మనసు కొంత కుదుటపడింది.

వెంటనే రాణి కోపంగా ఉన్న అక్బరు దగ్గరకి వెళ్ళి "ప్రభూ, మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెడుతున్నాను. ప్రభువుల వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను." అని వినయంగా చెప్పింది.

"ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు" అని జవాబిచ్చాడు అక్బరు. ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధం అయ్యింది. అప్పుడు బీర్బల్‌ అక్బర్‌ దగ్గరకు వెళ్ళి "ప్రభూ, రాణీగారు కోటను వదిలి వెళ్ళి పోవాలనుకుంటున్నారు కాని వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని, అది లేనిదే వెళ్ళలేనని అంటున్నారు." అని చెప్పాడు.

"తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడుంచి వెళ్ళిపోమని చెప్పు."

"అలాగే జహాపనా. ఆవిషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు"

సరే రమ్మని చెప్పు" అని ఆదేశించాదు అక్బరు.

రాణి సరాసరి అక్బరు ముందు నిలబడి "ప్రభూ మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు. మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. మీకంటే ప్రియమైనది ఈ ప్రంపంచంలో నాకు ఇంకొకటి లేదు," అంది రాణి వణికే కంఠంతో.

రాణి మాటలు వినగానే అక్బరులోని కోపం ఒక్కసారిగా చల్లారింది. రాణి తనను ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించాడు. ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బరుకు తెలుసు. అందుకే నవ్వుతూ బీర్బల్‌ వైపు చూశాడు.

Monday, September 30, 2019

నేరమూ-శిక్ష -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 49


ఒకసారి మాంసం వ్యాపారికి , చ‌మురు వ్యాపారికి మ‌ధ్య చాల పెద్ద గొడవ జ‌రిగింది. త‌మ తగువు తీర్చమని ఇద్ద‌రూ అక్బ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. వెంట‌నే అక్బ‌ర్ బీర్బల్ కు ఈ స‌మ‌స్య‌ను అప్ప‌గించి ప‌రిష్క‌రించ‌మ‌ని చెప్పాడు.

బీర్బ‌ల్ అస‌లేం జ‌రిగింది అని అడ‌గ‌గా మాంసం వ్యాపారి "నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు.

చమురు వ్యాపారి “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్క‌ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్నిసార్లు అడిగినా ఇద్ద‌రి నుండి ఇదే స‌మాధానం. దీంతో బీర్బ‌ల్ నీటితో నిండిన పాత్రను తెప్పించాడు. సంచిలో ఉన్న నాణాలన్నీ అ నీటి లో ప‌డేశాడు…అప్పుడు ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది. దీంతో ఆ నాణాలు చ‌మురు వ్యాపారివే అని నిర్ధారించాడు.. మాంసం వ్యాపారిని క‌ఠినంగా శిక్షించాడు.

చిలుక పలుకులు -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 48


అక్బర్ చక్రవర్తికి వేటాడ్డం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్‌ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్‌ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు అక్బర్‌ తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్‌ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే తోవలో వారు ఒక చిలుకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. అక్బర్‌ బీర్బల్‌తో "బీర్బల్‌! నువ్వు పక్షుల భాషను అర్ధం చేసుకుంటానని చెప్పావుగా, ఆ చిలుకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా?" అని అడిగాడు.

బీర్బల్‌ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, "రాజా! ఈ చిలుకలు పెళ్ళి పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్ల వాడి తండ్రి ఏ పక్షులూ, జంతువులూ లేని ఐదు అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లికూతురు తండ్రి ఇదేం కర్మ, పది ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు" అని చెప్పాడు.

ఇంకా ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బర్‌, "మరి పెళ్లికొడుకు తండ్రి ఏమంటున్నాడు?" అని అడిగాడు.

బదులుగా బీర్బల్‌ "మహారాజా! పెళ్లికొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలవని పెళ్లికూతురు తండ్రిని అడగగా, పెళ్లికూతురు తండ్రి ఈ రాజ్యపు చక్రవర్తికి వేటాడటం సరదా. ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో మరికొన్నింటిని కూడా పక్షులు, జంతువులు లేని అడవులుగా మారుస్తాడని చెబుతున్నాడు"
అని చిలుకల సహాయంతో బీర్బల్ తను చెప్పాలనుకున్న మాటలను తెలివిగా అక్భర్‌కు చెప్పేశాడు.

తన సరదా అడవులకు ఎంతటి దుర్గతి తీసుకువచ్చిందో గ్రహించిన అక్బర్ వెంటనే దానికి కళ్ళెం వేశాడు.

మనవడి శక్తి: -- అక్బర్-బీర్బల్ కథలు(Akbar-Birbal Kathalu) - 47

ఒకరోజు అక్బర్‌ సభలో రకరకాల విషయాలు చర్చకు వచ్చాయి. అంతలో హఠాత్తుగా అక్బర్‌ " ఎవరైనా నా మీసాలు పీకితే వారిని ఏం చేయ్యాలి? " అని అడిగాడు.

అందరూ ముందు ఆశ్చర్యపోయారు. తరువాత ఒక్కొక్కరూ లేచి, " అలా మీ మీసాలు పీకిన వాణ్ణి కారాగారంలో బంధించాలి ".

"వాణ్ణి దేశబహిష్కరణ చేయాలి ".

"వాణ్ణి ఉరితీయాలి " అని ఎవరికి తోచిన విధంగా వారు చెప్పడం మొదలుపెట్టారు.

అందరూ అయిపోయాక, బీర్బల్‌ కూడా లేచి " జహా(పనా! మీ మీసాలు పీకిన వాడికి మిఠాయిలు పెట్టాలి ", అన్నాడు.

అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతటితో బీర్బల్‌ పని అయిపోయిందనుకున్నారు.చక్రవర్తికి కోపం వచ్చి బీర్బల్‌ని కచ్చితంగా శిక్షిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.

బీర్బల్‌ జవాబు చక్రవర్తికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. కోపం కూడా వచ్చింది. కాని తమాయించుకుని, " ఎందుకు బీర్బల్‌? ఎందుకతనికి మిఠాయిలు ఇవ్వాలి? " అని అడిగాడు.

" జహాపనా! మీ సమీపంలోకి రావడమే చాలా సాహసం. అలాంటిది మీ మీసాలు పట్టుకుని వాటిని పీకే ధైర్యం ఎవరికుంటుంది? అలా పీకగలవాడు మీ మనవడు మాత్రమే. అందుకనే అతనికి మిఠాయి తినిపించమన్నాను " అని వివరించాడు బీర్బల్‌.

బీర్బల్‌ చతురతకు అక్బర్‌తో పాటు సభికులంతా ఆనందించారు.